Friday, March 9, 2012

జ్యోతిష్యం నమ్మకమా లేక సాయిన్సా లేక కళా?

నమ్మకం
సాయిన్సు
కళ
ఈ మూడు మూడు విధాలు
నమ్మితే సాయిన్సు అక్కరలే
సాయిన్సు అనుకుంటే - నమ్మకాల పని లేదు
కళ - మనోల్లాసం
ఇంతకీ ఈ అంతు పట్టని జ్యోతిష్యం లెక్కల గారిడీయా లేక సాయిన్సా లేక కళా లేక నమ్మకమా?


చేసుకున్న వారికి చేసుకున్నన్త !
నమ్మకం ఉంటె ఫలితం !
శాంతి అన్నిటికి ఉండనే ఉంది !
ఉపశాంతి కూడా ఉంది !
కిటుకు ఎక్కడ ఉంది?
మన ఆలోచనా విధానం లో నా?
కర్మ సిద్ధాంతం లో నా?

లేక - ఈ మధ్య బడా బడా దేశాలు - చేసే తుక్కు టమారం చెత్త చెదారం డంప్ చేస్తున్నట్టు
పాతకాలం లో అర కొర - లెక్కల జ్యోతిష్యం - మన దేశం లో ఇంకా అలాగే నిలిచి పోయిందా?

ఈ జ్యోతిష్యం కూడా బతుకుతోందా కాలం తీరి - దాని కథా కమామీషు ఎవరికీ అర్థం కాక ఏదో నేనూ జాదూగర్ లా ఉన్నా  అన్నట్టు పడి ఉందా మన దేశం లో?

చర్వితచర్వణం!


జిలేబి.

70 comments:

  1. కందిరీగల తుట్ట కదిపేరు.

    ReplyDelete
  2. శర్మ గారు,

    When its Hot its Really Cool ™


    cheers
    zilebi.

    ReplyDelete
  3. మీకు ప్రీడిటర్మినిజమ్ము (కొండొకచో ఫాటలిజమ్ము) ఇష్టమా లేక ఫ్రీవిల్లు ఇష్టమా?
    మీరే దేవుడైనట్లైతే, గిరీశం ప్రశ్నకి సమాధానమేంచెబుతారు?

    :D

    ReplyDelete
  4. మన పూర్వికులకి ఆ నక్షత్రాల పేర్లు మాత్రమే తెలుసు కానీ వాటి డైమెన్సన్స్ ఎంతో వాళ్ళకి తెలియదు. జ్యోతిష్యాన్ని వాళ్ళు కేవలం ఊహించి వ్రాసారనడానికి అంత కంటే ఆధారం ఏమి కావాలి?

    ReplyDelete
  5. జ్యోతిషం గురించి అనంతకాలం చర్చించుకోవచ్చు. కావలసినంత కాలక్షేపం. కాని అటువంటి చర్చలవలన యేమీ ఉపయోగం ఉండదు. నమ్మేవాళ్ళూ నమ్మనివాళ్ళూ కూడా చెప్పనలవికానంత అజ్ఞానంతో వాదిస్తారు.

    చాలాకాలం క్రిందట విజయవాడ నుండి ప్రచురించబడిన ఒక చిన్న పుస్తకం (జ్యోతిషం యెవరికి యెందుకూ అని గుర్తు. కాక పోవచ్చు)లో హేతువాదిగారు అంటారూ, 9 గ్రహాలని 12 గళ్ళలో (రాసులన్న మాట) ఉంచటానికి పరిమిత సంఖ్యలోనే అమరికలు కుదురుతాయి కదా, ప్రపంచంలోని మంది సంఖ్య కన్నా ఇది తక్కువేగదా అని. అజ్ఞానం.

    సంశయాత్మకమైన పంచాంగాల, గణనపథ్థతులు ఆధారంగానూ, తరచుగా వేర్వేరు జాతక పథ్థతుల ద్వారానూ పరస్పరం పొంతనలేని విశ్లేషణలు చేస్తారు దైవజ్ఞులు. వారిలో చాలామందికి నిజంగా శాస్త్రజ్ఞానం శూన్యం కూడా. వారు చేసే విశ్లేషణలు కూడా చాలా సందిగ్ధంగానూ, చాలా సార్లు అసందర్భంగానూ ఉంటాయి. వాటికి వారి సమర్థింపులూ అంతే అజ్ఞానంతో కూడి ఉంటాయి.

    శాస్త్రం సవ్యమైనదే కావచ్చును. విప్రతిపత్తి లేదు. పొట్టకూటి జ్యోతిష్కులూ, కార్పొరేట్ జోస్యులూ కూడా ఫ్రాడ్స్. అలాగే జ్యోతిషాన్ని విమర్శించే వీరహేతువాదులూ విషయపరిజ్ఞానంలేక వారుకూడా ఫ్రాడ్స్.

    ReplyDelete
  6. నక్షత్రాల డైమెన్సన్స్ తెలియని రోజుల్లో నక్షత్రాల ప్రభావాల గురించి తెలిసింది అంటే నమ్మాలా? నమ్మడానికి చెవుల్లో పువ్వులు ఉండాలి కానీ.

    ReplyDelete
  7. "మన పూర్వికులకి ఆ నక్షత్రాల పేర్లు మాత్రమే తెలుసు కానీ వాటి డైమెన్సన్స్ ఎంతో వాళ్ళకి తెలియదు" - ఈ సంగతి మీకెలా తెలిసిందబ్బా???

    ReplyDelete
  8. ఇన్నయ్య గారు చెప్పారు. నక్షత్రాల గురించి ఏమీ తెలియని రోజుల్లో నక్షత్రాల ప్రభావం ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని మన పూర్వికులకి తెలుసు అంటే నమ్మాలా? చిన్నప్పటి నుంచి ఇన్నయ్య గారి వ్యాసాలు చదువుతున్నాను. నాకు ఈ విషయాలు తెలియవా?

    ReplyDelete
    Replies
    1. అద్భుతం.

      ఐతే, ఇంకొంచెం ముందుకు వెళ్ళి, "ఈ సంగతి ఆయనకెలా తెలిసిందబ్బా" అని ఆశ్చరపోతాన్లేండి.

      Delete
  9. ఈ ప్రశ్నను సాధారణంగా అందరూ empirical approach లో చూస్తుంటారు. ఉ. గ్రహాలెన్ని? భూమి గుండ్రంగా ఉందన్న విషయం పూర్వకాలం వారికి తెలియదు కదా? అప్పటి పరికరాల కొలతలు నమ్మదగినివా?

    అంతకంటే ముందు శాస్త్రీయ పరిశీలన చేయాలి. గ్రహాల కదలిక వల్ల మనుషుల మీద ప్రభావం ఎందుకు ఉండాలి? ఒకవేళ ఉంటె దాని కారణాలు ఏమిటి? ఆ ప్రభావం ఖచ్చితమయినదా (deterministic) లేదా సూచనాత్మకా (probablistic)?

    Cause-and-effect ఆధారంగానే శాస్త్రం ఉంటుంది. అది చూపించలేనప్పుడు సయిన్సు అనలేము, ఎంత empirical evidence ఉందని కొందరు దబాయించినా.

    జ్యోతిష్యం ముమ్మాటికీ (మూఢ) నమ్మకమే.

    ReplyDelete
  10. జ్యోతిషం మనుషులకు మాత్రమేనా? జంతువులకు, చెట్లకి, నిర్జీవ పదార్తాలకు వర్తించదా? ఉ. ఒక మనిషిని పాము కాటేస్తుందని అనుకుంటే ఈ విషయం మనిషి జాతకంతో పాటు పాము జాతకంలో కూడా ఉంటుందా?

    పూర్వీకుల పరికరాల మరియు పరిజ్యాన పరిమితి మాత్రమె కాదు, వారి ఆలోచనా స్రవంతి ఎల్లలు (thought boundaries) కూడా వారి "శాస్తం" లో ఉన్నాయి.

    PS: This is inspired by the questions raised in "God's debris".

    ReplyDelete
  11. Empirical అంటే అనుభవపూర్వకమైన అని అర్థం. భౌతికతకి అందనిది అనుభవపూర్వకం అయ్యే అవకాశం లేదు. జ్యోతిష్యులు చెప్పిన పది పాయింట్లలో రెండు మూడు పాయింట్లు అనుకోకుండా నిజమవుతాయి. అంతమాత్రాన అది అనుభవపూర్వకమైన ఆధారం అవుతుందా?

    ReplyDelete
  12. గొట్టిముక్కలవారు "భూమి గుండ్రంగా ఉందన్న విషయం పూర్వకాలం వారికి తెలియదు కదా" అని నిర్థారణ చేసేసారు. అది సరికాదు.

    మన పూర్వీకులకు చాలా స్పష్టంగా తెలుసు. ఈ క్రింది విషయం తేజస్వి బ్లాగు పోష్టు (http://saipraveen.wordpress.com/2009/06/14/bhoomi-gundranga-undani-mana-praachinulaku-teliyada/) నుండి ఉటంకిస్తున్నాను.

    మన పాఠ్య పుస్తకాలలో కెప్లర్ కోపర్నికస్, గెలీలియోలు భూమి గుండ్రంగా ఉందని 16వ శతాబ్దంలో కనుగోన్నారని చదువుతున్నాము. మన ప్రాచీనులకు భూమి గుండ్రంగా ఉందని స్పష్టంగా తెలుసు. ఋగ్వేదంలో 1:38:8 మంత్రంలో ఆ విధంగా ఉంది. “చక్రాణాసఃపరీణాహం పృధివ్యా…………..” భూమి యొక్క వృత్తపు అంచున ఉన్నవాడు అని భావం.

    సూర్య సిధ్దాంతం అనే అతి ప్రాచీన గ్రంధంలో 12వ అధ్యాయం 32వ శ్లోకంలో “మధ్యే సమన్తా దణ్ణస్వభూగోళో‌ వ్యోమ్ని తిష్టతి“. బ్రహ్మాడం మధ్యలో భూగోళం ఆకాశంలో‌నిలచి ఉన్నది అని అర్థం.

    ఆర్యభట్టు క్రీ..శ 476 ప్రాంతం వాడు. ఈయన భూగోలఃసర్వతో వృత్తః అని ఆర్యభట్టీయం అనే గ్రంధంలో గోళపాద అనే అధ్యాయంలో 6వ శోకంలో తెల్పేను. భూమి వృత్తాకారంలో‌అన్నివైపులా ఉన్నదని అర్థం. పంచ మహాభూతమయస్తారాగణపంజరే మహీ గోళః(13-1)

    పంచసిధ్దాంతిక అనే గ్రంథంలో కీ..శ 505 సంవత్సరానికి చెందిన వరాహమిహురుడు “పంచభూతాత్మికమైన గుండ్రని భూమి, పంజమురలో వేలాడే ఇనుప బంతిలాగా, ఖగోళంలో‌ఉన్నది” అని వ్రాసారు.

    లీలావతి అడిగిన ప్రశ్నకు – భాస్కరాచార్యుడు అనే ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు నీవు చూసేదంతా నిజం కాదు. భూమి చదరంగా లేదు, ఎందుకంటే నీవు పెద్ద వృత్తం(circle) గీసి అందులోని నాల్గవ భాగం చూస్తే అది మనకు సరళరేఖ(straight line) లాగ కనిపిస్తున్నది. కాని అది నిజానికి వృత్తమే. అలాగే భూమి కూడా గుండ్రంగానే ఉన్నది అని ఆమెకు వివరించాడు.(లీలావతి అనే గ్రంథంలో‌ కలదు)

    “ఛాదయతి శశీ సూర్యం శశినం మహతీ నభూచ్ఛాయా” సూర్యుడిని చంద్రుడు కప్పినప్పుడు నీడా భూమి మీదకు సూర్యగ్రహణంగాను, చంద్రుడు భూమిని కప్పినప్పుడు చంద్రగ్రహణంగాను కనిపిస్తుందని ఆర్యభట్టీయంలోని 37 శ్లోకంలో ఆర్యభట్టు వివరించాడు. భూమి తన కక్ష్యలో‌తన చుట్టూ తాను తిరుగుటకు 23 గంటల 56 నిమిషాల 4.1 సెకన్లు అని ఆర్యభట్టు స్పష్టంగా వ్రాసారు.

    ReplyDelete
  13. భూమి గుండ్రంగా ఉందని పైథాగొరాస్ శిష్యులకి కూడా తెలుసు. కానీ అప్పటి గ్రీక్ ప్రజలు ఆ సూత్రీకరణని నమ్మలేదు. ఆర్యభట్టుకి భూమి గుండ్రంగా ఉందని తెలిసినా అప్పట్లో భారతీయ ప్రజలు దాన్ని నమ్మారా, లేదా అనేదే ముఖ్యం. ఎందుకంటే రోమన్ కాథొలిక్ చర్చ్‌వాళ్ళు 1830 వరకు భూమి గుండ్రంగా ఉందని అంగీకరించలేదు. జ్యోతిష్యులు ఎంత పచ్చిగా అబద్దాలు చెపుతారో నాకు తెలుసు. ఒక టివి చానెల్‌వాళ్ళు ఇన్నయ్య గారికి ఇద్దరు జ్యోతిష్యులతో చర్చా కార్యక్రమం పెట్టారు. భూమి సూర్యుని చుట్టు తిరుగుతుండగా జ్యోతిష్యులు ఇప్పటికీ సూర్యుడు భూమి చుట్టే తిరుగుతున్నట్టు ఎందుకు చెపుతున్నారు అని ఇన్నయ్య గారు అడిగితే ఒక జ్యోతిష్యుడు ఇలా వాదించాడు "భూమి సూర్యుని చుట్టు తిరుగుతోందని జ్యోతిష్యులకి తెలుసు, మేము కేవలం నమూనా కోసం సూర్యుడు భూమి చుట్టు తిరుగుతున్నాడని చెపుతున్నాము" అని. ఆ జ్యోతిష్యుడు అలాంటి వాదనలే చేసి ఇన్నయ్య గారిని ఓడించడానికి ప్రయత్నించాదు. నమూనా కోసం యాపిల్‌ని అరటి పండు అని అనరు కానీ భూకేంద్రక సిద్ధాంతాన్ని సూర్యకేంద్రక సిద్ధాంతం అని అంటారా? ఈ విషయంలో ఆ జ్యోతిష్యుడు చెప్పినది నమ్మశక్యమేనా?

    ReplyDelete
    Replies
    1. Praveen, the correct answer is that coordinates of a body with respect to my position is important. As long as the mathematical model can accurately predict (x, y, z) values, the method used is not important.

      Delete
  14. బాపురే ! ప్రశ్నల జిలేబి , తీపి బదులు
    కారమును పాఠకులకు ముఖాన పులిమె ,
    జ్యోతిషపు కాగడా వెలుగు జూపునా ? ము
    ఖాలు మాడునా ? భేద భావాలు పెరిగి

    ReplyDelete
  15. BTW, వితండవాదం చెయ్యడం నేర్చుకుంటే జ్యోతిష్యుల దగ్గర మాత్రమే నేర్చుకోవాలి. వాళ్ళ కంటే బాగా వితండవాదం ఎవరూ చెయ్యలేరు. టివిలో జ్యోతిష్యులతో జరిగిన చర్చలు చూసిన అనుభవంతో చెపుతున్నాను.

    ReplyDelete
  16. బాపురే ! ప్రశ్నల జిలేబి , తీపి బదులు
    కారమును పాఠకులకు ముఖాన పులిమె ,
    జ్యోతిషపు కాగడా వెలుగు జూపునా ? ము
    ఖాలు మాడునా ? భేద భావాలు పెరిగి

    ReplyDelete
  17. కుందేలుకి మూడుకాళ్ళు ఉంటాయని చెప్పేవాళ్ళని వితండవాదులు అని అంటారు, కుందేలుకి మూడుకాళ్ళు ఉంటాయనేది కేవలం నమూనా కోసమే అని వాదించే అదో రకం వితండవాదులని జ్యోతిష్యులు అంటారు.

    ReplyDelete
  18. బాపురే ! ప్రశ్నల జిలేబి , తీపి బదులు
    కారమును పాఠకులకు ముఖాన పులిమె ,
    జ్యోతిషపు కాగడా వెలుగు జూపునా ? ము
    ఖాలు మాడునా ? భేద భావాలు పెరిగి

    ReplyDelete
    Replies
    1. లక్కాకుల వారు,

      నెనర్లు. జిలేబీ ఎప్పుడు తింటే డోకు వస్తుందని ఆ మధ్య ఒక బ్లాగరు చెణుకు విసిరారు.

      అప్పుడప్పుడు కారం (వెటకారం కాదు సుమండీ) కొంత కారప్పూస గా కలిపి జిలేబీ అందిస్తామని.....

      చీర్స్
      జిలేబి.

      Delete
  19. ఆర్యులారా,

    ఈ విషయంపైన్ ఇక్కడ విస్తారమైన చర్చ జరుగుతున్నట్లు కనిపిస్తున్నా, అధికభాగం కొందరు చేసే నిందావినోదానికే సరిపోతున్నట్లుంది. నేను వాటి జోలికి పోదలుచుకోలేదు. ఈమాట వెబ్-మాగజైన్ వారి ఈ క్రింది వ్యాసం ఆసక్తిగల వారు చదవండి. ముఖ్యంగా ఇది యెవరో జ్యోతిష్కుడు వ్రాసిన వ్యాసమనుకోకండి. అలాంటిదేమీ కాదు. మంచి జ్యోతిష పరిచయం ఉన్న జ్యోతిష్కుడు కాని వ్యక్తి వ్రాసిన చాలా విషయమున్న ౪ భాగాల దీర్ఘవ్యాసం.

    http://www.eemaata.com/em/issues/200803/1212.html

    ReplyDelete
  20. @శ్యామలీయంMar 9, 2012 03:08 AM:

    "గొట్టిముక్కలవారు "భూమి గుండ్రంగా ఉందన్న విషయం పూర్వకాలం వారికి తెలియదు కదా" అని నిర్థారణ చేసేసారు. అది సరికాదు"

    ఇది ఒక ఉదాహరణ మాత్రమే, నా వాదానికి కేంద్ర బిందువు కాదు. ఇలాంటి విషయాల పైనే తర్కవితర్కాలు ఉంటూ వచ్చాయని నా బాధ. ఇవన్నీ అసలు కారణాలను తప్పు దారి మళ్ళిస్తాయనే నా ఆవేదన మీరు అర్ధం చేసుకున్నట్టు నాకు అగుపించలేదు.

    శాస్త్రీయ పునాది లేనిదేదీ శాస్త్రం కానేరన్నది నా మనవి. మన పూర్వీకులకు భూమి గుండ్రంగా తెలుసని మీరు, తెలియదని కొందరు వాదించవచ్చు. ఒక వేళ తెలిసినా, అది గ్రహాల సంచారం మాత్రమే చెబుతుంది. గ్రహాల సంచారానికి మానవ జీవిత సంఘటనలకు మధ్య సంబంధం ఉందనే hypothesisకి రుజువు కాదు.

    ఇకపోతే జ్యోతిషం తర్కానికి, పరిశోధనకు అందే వస్తువు కాదనీ, దైవజ్యమనీ అంటారా? No problem but it can only be called a belief system, not science.

    ReplyDelete
  21. అయ్యా గొట్టిముక్కలవారు,
    నేను సూచించిన వ్యాసాన్ని చదవండి. మీ ప్రశ్నలకు అందులో కొంత శాస్త్రీయమైన చర్చతో జవాబు లభిస్తుంది.
    నేనేమీ జ్యోతిషమ్ అనేది శాస్త్రమనీ కాదనీ చెప్పటంలేదు.
    కాని యెటువైపు వాదించేవారయినా సంయమనం పాటించాలనే చెబుతున్నాను.
    పై వ్యాసం మీకు ఉపయోగపడవచ్చు.
    ఆ వ్యాసకర్త మిమ్మల్ని జ్యోతిష అభిమానిగా మార్చే ప్రయత్నం యేమీ చేయరు.

    ReplyDelete
    Replies
    1. I did not find the answer to my question. He concedes astrology is not absolute but does not provide any scientific basis for the alleged relationship.

      Delete
    2. ఆది చాలా పెద్ద వ్యాసం. మీ రప్పుడే చదివేయటమూ అందులో సరుకేమీలేదని వ్యాఖ్యానించటమూ కూడా అయిపోయింది! మీరు వ్యాసాన్ని మరింత శ్రధ్ధగా చదివియుండవలసినదేమో నాకు తెలియదు. మీ ప్రశ్నాధోరణికి దగ్గరగా చాలా విషయాలు చర్చించిన వ్యాసం మీకు సంతృప్తికరంగా లేకపోతే యింకేమి చేయగలం. చాలా విచారించవలసిన సంగతి. జ్యోతిషంకూడా తనని తాను absolute science అని వర్ణించుకోదన్న సంగతి మీకు బహుశా తెలియక పోవచ్చును. అటో ఇటో ఋజువులు వెదకటానికి జరుగుతున్న ప్రయత్నాలను ఆ వ్యాసం చక్కగా ప్రస్తావించిన విషయం మీరు గమనించే ఉంటారని ఆశిస్తున్నాను. జ్యోతిషమ్ అయేది మరొకటి అయేది నాకు నచ్చవచ్చేది నచ్చకపోయేది యేది యేమైనా నా మటుకునేను నిందలకు దిగను, నిందను హర్షించను. విజ్ఞానికి వినయం ముఖ్యం అనుకుంటే దయచేసి మీరు కూడా సంయమనం పాటించండి. అంతకంటే చెప్పలేను.

      Delete
    3. నేను అతివేగంగా పైపైకి చదివాను లెండి. జ్యోతిషానికి శాస్త్రీయ పునాది ఉందా అన్నదొక్కటే నేను చూసాను అది నాకు కన్పించలేదు.

      ఇకపోతే జ్యోతిషం అఖండిత శాస్త్రం (absolute science) కాకపోవచ్చని మీరే అన్నారు కాబట్టి అది ఒక నమ్మకం మాత్రమె అని నా తాత్పర్యం.

      నేను ఎవరినీ నిందించలేదని అనుకుంటున్నాను. తప్పయితే పెద్ద మనుసుతో మన్నించగలరు.

      Delete
    4. గొట్టీముక్కలవారూ, ఆ వ్యాసాన్ని దయచేసి కొంచెం శ్రధ్దగా పఠించండి. విషయమున్న వ్యాసమే. మీరేమీ నిందాలాపాలు చేయలేదు. అటువంటివి యేచర్చకూ శోభనూ, ప్రయోజనాన్నీ ఇవ్వవని మీకూ తెలుసును. మీ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాను.

      Delete
  22. ఈ ప్రవీణ్ మందంగి యెవరో నాకు కూడా చిరాకు తెప్పిస్తున్నారు!

    అయ్యా ప్రవీణులవారూ, మీరు జ్యోతిష్యులు అనే వాళ్ళని నిందించటం కోసం అవకాశం దొరికింది అనే ఆనందంలో ఉన్నారు. కాని చర్చకు అటువంటి నిందాలాపాల అవసరం యేమన్నా ఉందా?

    ఇకపోతే మీరు వితండవాదం అనే దానిని ప్రస్తావించారు. అసలామాట అర్థం యేమిటో శాస్త్రీయంగా తెలుసునా మీకు? వాదం జరుగుతున్నప్పుడు ప్రతివాది వాదంలో లోపం స్పష్టంగా గమనించినప్పుడు, తన వాదాన్ని ప్రతిపాదించటమో (ఒక వేళ అప్పటికే ప్రతిపాదించి ఉంటే) దానిని సమర్థించటమో చేయకుండా, ప్రతివాది వాదనలో లోపాన్ని మాత్రం ప్రస్త్తావించి పరాస్తం చేయబూనటం అనే వాదనా ప్రక్రియను 'వితండం' అంటారు. సరే మీలాంటి మహానుభావులు తమకు తెలియని వాటిపైన గూడా తెలిసినట్లు మాట్లాడుతూ మాటలను దురర్థంలో వాడేస్తూ ఈ మాటనూ భ్రష్టుపట్టించారనుకోండి. అది వేరే విషయం.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం వారు,

      ప్రవీణ్ మందంగి ఎవరని అనేస్తే ఎలా అండీ! ప్రవీణు శర్మ మీద కందం కూడా రాసారు మీరు ! మన ప్రవీణు శర్మే సుమండీ !!

      చీర్స్
      జిలేబి.

      Delete
    2. చొక్కా మార్చినట్లు ఆయన పేరు మార్చి వ్రాయటం వలన గుర్తించలేదు. ప్రవీణ్ శర్మే అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆయనతో వాదించటం మొదలు పెట్టటం మాత్రమే మన చేతిలో ఉండవచ్చును.

      Delete
    3. చొక్కా ఎందుకు మార్చవలె?

      ప్రవీణు శర్మ అనే కామెంటు 'బాకు' కనిపిస్తేనే జన వాహిని టారెత్తి కామెంటు బాక్సులు మూత పెట్టె.

      సో, మా ప్రవీణు శర్మ ఇక 'మంద' మయిన అంగీ (మందంగీ!) తో దర్శనం అనుకుంటాను !!

      చీర్స్
      జిలేబి.

      Delete
  23. @శ్యామలీయం గారు:

    ముందుగా ఈ వాదాల గురించి ఒక ప్రశ్న. వితండవాదమూ. సంవాదమూ కాకుండా ఇంకో వాదం ఉంది. దాన్ని చెప్పి పుణ్యం కట్టుకోండి. చాలా రోజుల్నుంచి ప్రయత్నిస్తున్నాను పదం దొరకడంలేదు.

    మీరిచ్చిన లంకెలోని వ్యాసాన్ని చదువుతాను. చదివి వ్యాఖ్యానిస్తాను.

    భూమి గుండ్రంగా ఉండటం గురించి: ఆర్యభట్ట మిగతావారికంటే ముందుగా భూమిగుండ్రంగా ఉందని relaize అయినట్లూ, సూర్యకేంద్ర సిధ్ధాంతాన్ని ముందుగా ప్రతిపాదించినట్లుగానూ ఆధారాలాలున్నమాట వాస్తవమే. కేవలం ఇప్పటి సైన్సుపుస్తకాలు రాసినవాళ్ళకు అది ముందుగా తెలియకపోవడంవల్ల వారిపేర్లు ప్రచారంలో లేవు.

    ఇక ఇదేవిషయంలో వేదాల్లోనూ, పురాణాల్లోనూ భిన్నవాదనలున్నాయని విన్నాను. పురాణాల్లో ఇంకోచోట ఒకరాక్షసుడు భూమిని చాపచుట్టి సముద్రంలో దాక్కున్నట్లు, ఆది వరాహం అవతారంలో విష్ణుమూర్తి ఆరాక్షసుణ్ణి వధించి భూమిని రక్షించిఉనట్లూ ఉంది అని చదివాను/విన్నాను. ఇది వేదాల్లో ఉన్నదాన్ని contradict చేస్తున్నదా లేక నేను తప్పుగా చదివానా/విన్నానా?

    ReplyDelete
    Replies
    1. అష్టాదశ మహా పురాణాలు - http://wp.me/p1gU0I-5h

      ఏ సముద్రంనుండి వరాహస్వామి భూమిని పైకేత్తారు? - http://wp.me/p1gU0I-dq

      Delete
    2. నేను విన్నదేగానీ చదివింది లేదు. ఆ చదివిందికూడా ఈ పురాణాల విషయంలోనైతే చందమామలే. కాబట్టి ఒకవేళ మీలింకులోని పురాణాలను చదివాలన్న ఆసక్తి, సమయమూ కలిగినచో ఆపనిగావించి మళ్ళీ ప్రశ్నించెదను :)

      Delete
  24. అయ్యారే!జిలేబి వారు" పని లేక పిల్లి తల గొరిగెను.." సామెత

    సూక్షదర్శినితో.. చూసిన వారికి నిజములు తెలుయును. (నాకు అసలు తెలియనందుకు విచారం) వారు ఇచ్చు వెంట్రుకల బహుమానం చూసి కడు విచారం (ఎవరికో ఏమిటో తెలియాపోయినాను..మనకే అన్వయించుకుని.)

    రోట్లో తలపెట్ట వలదు . పెద్దలు చెప్పిన మాట వినడం మంచిది అనిపిస్తుంది.

    ఇది టపాకు సంబంధం లేని వ్యాఖ్య.అయినను.. పెట్టితిని. మన్నించవలెను. .

    ReplyDelete
    Replies
    1. వనజ వనమాలీ గారు,

      అప్పుడప్పుడు తల గుండు కొట్టించు కొనవలె. తలలోని జాడ్యం వదలాలి కదండీ ! (సింబాలిజం తిరుపతి గుండు)

      ఇక వెంట్రుకల బహుమానం మాటంటారా ! మా ఏడుకొండల పెరుమాళ్ళకి రోజూ టన్నుల కొద్దీ వెంట్రుకలు 'బాహుళ్య మానం గా' సమర్పించు కొంటున్నాము ! ఆయన చిరు నవ్వుతో స్వీకరించటం లేదా మన జిడ్డు ని !
      వారికన్నా మనమేమి గొప్ప వారం కాదనటానికి !! అంతా విష్ణు మాయ !



      చీర్స్
      జిలేబి.

      Delete
  25. జిలేబి గారు
    జోతిష్యం ఒక సైన్సు
    నాకున్న మిడిమిడి జ్ఞానం తో ఒక పంచాంగం తయారు చేసాను
    http://www.sankalini.org/p/blog-page_16.html
    ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోగలరు
    మార్చ్ 10 ,2012 కి dates మార్చుకుని కుడి చేతి వైపు చూస్తె గ్రహాల స్తితులు కనపడతాయి
    రేపు అనగా మార్చ్ 11 వ తారీఖున చంద్రుడి స్థితి 182 -37 -59
    శని స్థితి 183 -4 -07 (రమారమి )
    అంటే చంద్రుడు శని దగ్గర దగ్గరగా ఉంటారు అన్నమాట
    రేపు రాత్రికి చంద్రుడిని చూస్తె ఆ ప్రక్కన కనిపించేది శని గ్రహం అన్న మాట
    దీని ని బట్టి చూస్తె జ్యోతిష్యం ఒక సైన్సు అని తెలుస్తుంది
    నేను సైన్సు అని నమ్ముతాను
    వేరే వాళ్ళ నమ్మకాలతో (అప నమ్మకాలతో) నాకు పనిలేదు

    ఈ ఎక్సెల్ షీట్ ని నేను నమ్మకాలతో తయారు చెయ్యలేదు
    ప్రతి దానికి లేక్ఖలు కట్టి చేసాను
    కనుక ఇది సైన్సు

    ReplyDelete
    Replies
    1. Sir, this is astronomy. Astrology is about predictions based on celestial movements, not the movements themselves.

      Delete
    2. అప్పారావు స్మాష్ త్రీ గారు,

      మీరు హైటెక్ మాథ మేటిక్, ఆస్ట్రోమేటిక్ అన్న మాట !!

      చంద్రునికి దగ్గరగా మొన్న కుజుడు వున్నాడు. (పూర్ణిమ రోజున ఆకసాన ) చూస్తాం ఇవ్వాళ స్కై వైపు సాటర్న్ కోసం చంద్రుని దరిదాపుల లో.

      చీర్స్
      జిలేబి.

      Delete
  26. http://www.fourmilab.ch/cgi-bin/Yourtel
    ఈ లింక్ ఓపెన్ చేసి
    1)Right Ascension: అని ఉన్న బాక్స్ లో 0h అని ఉన్నచోట 13h లేక 14h అని కొట్టండి
    2)Moon and planets అని ఉన్న చోట టిక్ మార్క్ పెట్టండి

    3)update అని ఉన్న బటన్ నొక్కండి
    చంద్రుడు శని దగ్గర దగ్గరగా ఉండటం మీరు చూస్తారు
    ఇది సైన్సు

    నేను చేసిన పంచాంగం లో గ్రహాల స్థితులు చెప్పాను
    ఈ పై లింక్ ద్వారా చూసి తెలుసు కోవచ్చు
    లేకపోతె పదవ తారీఖు రాత్రి ఆకాశం లో చూసి తెలుసు కోవచ్చు

    నాకు జ్యోతిష్య శాస్త్రం లో పరిజ్ఞానం లేదనే వారు, నేను చేసిన పంచాంగం చూసి నా పరిజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు

    ReplyDelete
    Replies
    1. Apparao gaaru,

      I see you have done a great job!

      Generally I refer to Jyotish tools dot com Junior Jyotish of Brian Conrad, who appears to me consistent in calculations. Only for calculations part. Related to Analysis I am not that expert expect novice reading of BV Raman. No specific excellency.

      Regards
      Zilebi.

      Delete
  27. (ఆశ్చర్యకరంగా ఉన్న ఒక సంగతి. ఈ క్రింది విషయం వ్రాయవలసి వస్తుందని, ఈ ఉదయం ఒక స్ఫురణ కలిగింది.)

    జ్యోతిషం స్కందత్రయం. సిధ్ధాంత భాగమూ, జాతక పధ్దతీ, ప్రశ్న అనేవి ఆ మూడు స్కందములూ. కొందరు ముహూర్తప్రకరణాన్ని కూడా విడిగా లెక్కించి నాలుగు భాగాలుగా వ్యవహరిస్తారు.

    ఇందులో సిధ్ధాంత భాగమనేది కేవలం గణనవ్యవహారం. ఖగోళశాస్త్రసంబంధి. దీనికి మిగిలిని జ్యోతిషభాగాలతో - నిష్కర్షగా చెప్పాలంటే- యే విధమైన సంబంధమూ లేదు. సిధ్ధాంతభాగానికి సంబంధించిన చర్చ యేదీ మనముందు లేదు. సిధ్ధాంతభాగం కేవలం గణితం కాబట్టి అది సైన్సు క్రిందికే వస్తుంది. అయితే రకరకాల గ్రహగణనవిధానాలకు సంబంధించి అశాస్త్రీయమైన పధ్దతులు చాలా ఉండటం వేరే వ్యవహారం - నేను ఇక్కడ చర్చించటానికి సుముఖంగా లేను.

    చాలామందికి జ్యోతిషం అంటే దృష్టికి వచ్చేది జాతకపధ్ధతి. అసలు చర్చ అంతా ఈ జాతకపధ్ధతి శాస్త్రమా కాదా అన్నదాని మీదనే!

    ఇకపోతే ఫలానివారికి జ్యోతిషశాస్త్రపరిజ్ఞానం ఉందా, ఉంటే యేపాటి వంటివి చర్చనీయాంశాలు కానేకావు.

    ReplyDelete
  28. జ్యోతిష్యులు ఎప్పుడూ క్లైంట్‌కి సంతృప్తి కలిగించే విధంగానే మాట్లాడుతాడు. మరో నెల రోజుల్లో నీకు యమ గండం ఉంది, యమ శాంతి పూజలు చెయ్యాలంటే పది వేలు ఖర్చవుతుంది అని అంటే క్లైంట్ నమ్ముతాడా? పాజిటివ్‌గా ఆలోచించండి. నమ్మనిదాన్ని నమ్ముతున్నట్టు నటించడం ఎందుకు?

    ReplyDelete
  29. ప్రవీణ్ గారు. ఇక్కడ ఈ ప్రశ్న సంగతమా?

    డబ్బు పట్ల మానవ దౌర్బల్యం యొక్క విచిత్రవిన్యాసాలను ఇక్కడ మనం చర్చించటంలేదు. ఇటువంటి దౌర్బల్యానికి జోస్యులూ వైద్యులూ కూడా అతీతులు కారు సరే.

    వ్యర్థ ప్రసంగాలు చర్చను పక్కదారి పట్టిస్తాయి.

    ReplyDelete
  30. వ్యర్థ ప్రసంగాలు కాదు. జ్యోతిష్యులు కూడా సాధారణ మనుషులే. భావం కంటే భౌతికతే మనిషికి ఎక్కువ ప్రభావితం చేస్తుందనేది నిజమైనప్పుడు ఎవరైనా డబ్బుకి ఆ మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వడంలో విచిత్రం లేదు. నమ్మనిదాన్ని నమ్ముతున్నట్టు నటించడం ఎందుకు? అలా నటిస్తే నిజాయితీ లోపించదా? జ్యోతిష్యుడు తాను కూడా వ్యక్తిగతంగా విశ్వసించని ఒక విశ్వాసాన్ని ప్రజలు విశ్వసించాలి అని అంటే దాన్ని ప్రజలు ఎలా అంగీకరించాలి?

    ReplyDelete
  31. @Praveen Mandangi:

    At a first glance, there appears to be a thin line between astronomy (science of celestial movements) and astrology (forecasts of human life based on the above movements). The missing link is a scientific premise. Astrology probably derived from medevial man's (scientific) observations of planetary movements combined with an (irrational) "understanding" that his life is "somehow" linked to those movements.

    First century (Hijra) Arabs were great astronomers. They were motivated by the need to determine prayer times accurately. The fact that motives were based on religion should not result in disbelieving the observations.

    ReplyDelete
  32. ఆహా, ఏమి నా భాగ్యమే భాగ్యము !

    చర్చా విషయం కడు రమ్యంగా సాగుతోంది కాబట్టి జిలేబీ అవసరం ఇక్కడ లేదను కుంటాను.

    ఇండియన్ మినేర్వా గారి ప్రశ్న కు ఎవరూ సమాధానం చెప్పినట్టు లేరు.

    ఇండియన్ మినేర్వా గారు,

    మీ ప్రశ్నకి జవాబు, నేనే దేవుడి నైతే - (ప్చ్, అట్లీస్ట్ ఆలోచన లో కూడా కష్టమే అనుకుంటా దేవుడి నవ్వడం అయినా ప్రయత్నిస్తాను) -

    వెధవాయ్, నేను ప్రీడిటర్మినిజమ్ము పెట్టి వుంటే, బిగ్ బ్యాంగ్ తరువాయి ఈ సృష్టి ఇంతగా అభివృద్ధి చెంది ఉండేదా ?

    రెండో పాయింటు, ఫ్రీ విల్ (సంకల్పం?) నీది. దానిని ఎలా ఉపయోగించాలో ప్రతి యుగం లోను చెప్పాను. ఇక నీ ఇష్టం దాని ని ఉపయోగిస్తావో లేదో అన్నది.

    ఫ్రీ విల్ కి , ప్రీడిటర్మినిజమ్ము కి మధ్య లింకు మరి ఏమిటి? మినేర్వా గారు మరి ఇక్కడ ఉన్న అందరూ , ఈ సారి ఈ ప్రశ్న తిరిగి మీకందిస్తున్నాను ! ప్రయత్నించండి !!!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. మీరు ఈ టపా రాయాలని మీ జాతకంలో ఉంది కాబట్టి రాసారు. మినర్వా గారు ఆ వ్యాఖ్య రాయాలని వారి జాతకంలో ఉంది కాబట్టి వారు అలా రాసారు. ఆయన వ్యాఖ్యకు సమాధానం ఇవ్వాలని ఎవరి జాతకంలో ఉందొ మరి?

      Delete
    2. Freewill: For today, I'll take the day off and go to movie with family.

      Predetermined: A major disaster took place in the plant and hence I got to go to the office!

      Delete
    3. ఫలానా విధంగా జరుగుతుందని ఆధారం లేకుండా ముందే ఊహించడం predetermination అవుతుంది కానీ అనుకోకుండా జరిగినది predetermination అవ్వదు. ఒక సారి ఏదో జరిగిందని ప్రతి సారి అదే జరుగుతుందనుకోవడం fatalism(కర్మవాదం) కిందకి వస్తుంది. జ్యోతిష్యం కర్మవాదం(fatalism) & పుర:నియతివాదం(predeterminism) రెండిటికీ సంబంధించిన విషయం.

      Delete
    4. తెలుగు భావాలు గారు,

      finally you got go to the office, and land up in writing a comment on this post!

      A twist to the tale of predeterminism!

      Now where/what is the beginning point for the chain of events?

      cheers

      zilebi.

      Delete
    5. బిగ్గుబ్యాంగు, ఆ తరువాత జరిగినది ముందుగా నిర్దేశించబడిన పధ్ధతిలోనే జరిగిందని నేను వాదించాననుకోండీ అప్పుడు మళ్ళీ ఏమంటారు?

      రెంటికీ సంబంధమా? నో నెవ్వర్. దే ఆర్ డయామెట్రికల్లీ ఆపోజిట్. ఆరెంట్ దే?

      :D

      Delete
    6. నేననుకూవడం ఏమిటంటే ప్రాణంలేనివి(E.g. galactical clusters) predeterministic (I'm talking about the laws of motion) గానూ ప్రాణమున్నవి free willతోనూ నడుచుకుంటాయి.

      చుట్టు ఉన్న సమాజం, పెరిగిన పరిష్థితులు మనిషి ఏ choices ఉండాలి అని నిర్ణయిస్తాయి (I don't mind if one terms it as partly pre-deterministic or something like that) అలా తనకు present చెయ్యబడిన choicesలోంచి ఏది ఎంచుకోవాలి అనేది ఫ్రీవిల్ ప్రకారం జరుగుతుంది. And that's why there can't be any absolute good or absolute bad in our world. Au contraire, in an abolutely pre-deterministic world, it is not possible to have a good and/or bad at all -let alone absolute or relative. But the point is (and should be), the entire game is played by the rules physical reality.

      I don't approve of a strong version of a pre-deterministic world, which would not require one to be responsible for one's acts. I would prefer humans to be answerable to humans but not to God/karma-of-the-past-life -a mere concept/creation of humans.

      Delete
    7. ఇండియన్ మినేర్వా గారు,

      బిగ్ బ్యాంగ్ , ఆ తరువాయి ఘటనా ఘటనలు ముందుగా నిర్దేశించబడిన పధ్ధతిలోనే జరిగిందని అనుకుంటే, అంతకు ముందు ఎవరో/ఏదో వున్నట్టు లెక్కా?

      from Non-existence existence comes into being or there can be no existence without non-existence?

      cheers
      zilebi.

      Delete
    8. ఆప్రశ్న అలాంటే మీరెలా స్పందిస్తారు అని అడిగినదేగానీ, అది నా అభిప్రాయముకాదు.

      బిగ్గుబ్యాంగుకు ముదు ఏమీఉండఖ్ఖర్లేదు. దైవం స్వయంభువు అవగలిగినప్పుడు (దైవాన్ని నమ్మేవాళ్ళు దానిసృష్టిగురించి అలాగే అంటారు), విశ్వమూ స్వయంభువూ అవగలదు. The universe is a free lunch -just like God. :)

      Delete
  33. Astrology pertains to predetermination. It cannot pertain to freewill in any way.

    ReplyDelete
  34. జ్యోతిష్యం నమ్మకమా లేక సాయిన్సా లేక కళా?
    "సాయిన్సేనేమోనన్న నమ్మకం వల్ల వర్ధిలుతోన్న కళ" అయి ఉండచ్చు. ("అతడు" సిన్మా నుండి)
    అయినా నాకర్థం కాక అడుగుతున్నా..ఎవరూ ఏమనుకోకండి. జ్యోతిషం శాస్త్రీయమేనని, ఇది 4వేల ఏళ్లనాటి సైన్సనీ అత్యున్నత న్యాయస్థానమే అన్న తర్వాత ఈ చర్చలెందుకు..?

    ReplyDelete
  35. శ్యామలీయం గారు నమస్కారం అండీ
    మీ వంటి పండితోత్తములతో చర్చలు జరిపే అంత జ్ఞానిని కాదు

    సిద్ధాంత భాగం సరిగ్గా లేకుండా ఫలితాలు ఎలా చెప్పగలము ?
    గ్రహాల స్పుటలు సరిగ్గా లెక్క కట్టకుండా ఉంటె ఫలితాలు తారుమారు అవుతాయి కదా

    astronomy వేరు astrology వేరు ఎలా అవుతాయి ?
    పరాశరుడు, వరాహమిహురుడు ఎఫ్మిరీస్ వాడారా ? కంపూటర్లు వాడారా ?
    గ్రహాల స్థితి గతులు లెక్ఖ కట్టి దాని ఫలితాల ఆధారంగా జ్యోతిష్యం చెప్పారు కదా
    సూర్యుని కొంత దూరం లో ఉన్న గ్రహం వక్ర గతిని పోతుంది అని చెప్పారు కదా
    ప్రతి గ్రహం కొన్ని సంవత్సరాలకి ఒక ఆవృతి చేస్తుని అని చెప్పారు కదా
    ఇవన్నీ సైన్సు ప్రకారం కూడా నిజం అయినాయి కదా

    మొతం మీద నేను చెప్పేది ఏమిటంటే ...
    గ్రహాల స్పుటలు లెక్క కట్టకుండా జ్యోతిష్యం చెప్పలేము
    సిద్ధాంత భాగం జ్యోతిష్యం లో నుంచి విడదీయరానిది
    సాయనాంశ నుంచి నిరయన పద్ధతికి రావడానికి మనం తీసుకునే ఆయనంశ వల్ల కూడా ఫలితాలు తారుమారు అవుతాయి
    మీ చర్చను అడ్డుకున్నదుకు క్షమించండి

    ReplyDelete
    Replies
    1. మీరు పెద్దలు శ్యామలరావు గారిని అడిగిన ప్రశ్నపై నేను వ్యాఖ్యానిస్తున్నందుకు మన్నించండి.

      ఫలానా గ్రహం ఫలానా గృహంలో ఉందనడం ఖచ్చితంగా శాస్త్రమే. మీరు అన్నట్టు దీని వెనక గ్రహ స్తితిగతుల పరిజ్యానం ఉంది. ఆయా గ్రహాల సంచలనం తాలూకా థియరీలు ఉన్నాయి.

      ఆ థియరీలను తర్కం ద్వారా చర్చించుకొని సరి చేసుకోవచ్చు. లెక్కలు కరెక్టా కాదా అని ప్రయోగాలు చేసి తెలుసుకోవచ్చు.

      In other words we can apply the litmus tests of scientific foundation for the theory, experimental verification & empirical evidence to astronomy.

      ఒక గ్రహం ఎక్కడ ఉండనే దానికి, నా జీవితానికి సంబంధం ఏటనే ప్రశ్నకు నాకయితే సమాధానం దొరకలేదు. అది చెప్పగలగితే తప్ప జ్యోతిషం శాస్త్రం కాజాలన్నదే నా అభిప్రాయం.

      Delete
    2. అయ్యా గొట్టిముక్కలవారు,


      http://saradaa.blogspot.in/2012/03/1.html

      Delete
  36. ..........వ్యాఖ్య టపా అయ్యేలా ఉంది. స్పందించి, క్షమించండి......
    సైన్సు సైన్సు తెగ మాట్లాడుతుంటారు చాలా మంది. అసలు మన టెక్నాలజీ ABCD, 123, +-*/ అంతకు మించి ఏమైనా ఉందా? ప్రాధమిక సూత్రాలు, గణిత ధర్మాలు నియమాలు భౌతిక, గణిత శాస్త్రాలకు అనుకూలంగా ఉంటాయి. నియమాల్ని మరిస్తే లెక్క తప్పుతుంది. లెక్క తప్పని సైన్స్ ఒక్కటే మన మనస్సు. పైన చెప్పినవి కాకుండా ఇంకొక పద్ధతిని మనం సనాతనంగా వాడి ఉండిఉంటే మన టెక్నాలజీ ఇంకోలా ఉండేది.
    అన్నిటిని మనస్సు తో అన్వయించుకునే పద్ధతిలో మన టెక్నాలజీ సాగి ఉంటె కంప్యూటర్లు, సెల్ పోన్లు లాంటివి మనకు అవసరం ఉండేవి కావనుకుంటాను. అవతార్ సినిమాలో చూపించిన నాగరికుల టెక్నాలజీ వేరు.
    ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే జోతిష్యం కూడా ఒక టెక్నాలజీనే. సరిగ్గా అధ్యయనం చేయనంతవరకూ మనకు అన్నీ పిచ్చి లెక్కల్లా కనిపిస్తాయి. డబ్బుల కోసం చేసే జ్యోతిష్యాన్ని, వారి మాయ మాటల్ని చర్చించమనడం లేదు ఇక్కడ. మనిషికి అభిప్రాయాలు తెలిపే అదికారం మాత్రమే ఉంది. నిర్ధారణలకు వచ్చే హక్కు లేదు. ఎందుకంటె ప్రకృతి ముందు అందరూ దిగదులుపే. చాలా మంది శాస్త్రవేత్తలు “నేను తెలుసుకుంది ఒక్క పర్సెంటు కూడా లేదు అని చెబుతుంటారు.” మరీ చాలా విషయాల్ని కొట్టి పడేసే వాళ్ళు ఎంత మేదావులో?
    ఎవడికి వాడే మేధావి. ప్రకృతి దృష్టిలో మేధావి అనే మాట చాలా చిన్నది. అనే విషయం గుర్తు పెట్టుకోవాలి.
    చివరగా నేను చెప్పొచ్చేదేమంటే దేన్నీ హీనంగా చూడకు. ఎప్పుడో ఒకసారి దానిముందే మనం హీనులం అయిపోతాం. అది శాస్త్రమైనా.... మరోకటైనా.................

    ReplyDelete
    Replies
    1. వినోద్ గారు,

      బ్రిలియంట్. మీరు మరో కోణాన్ని (మనసుని) ఈ చర్చ లో తీసు కొచ్చారు. చూద్దాం దీని మీద ఏమంటారో? ఎందు కంటే, మనసు, హృదయం (గుండె కాదు) వీటిని తీసుకొస్తే ఇక దాని డైమెన్షన్ వేరే డైమెన్షన్. మనకు తెలిసిన అనుభవం లో ఉన్న త్రీ డైమెన్షన్ దాటినది.

      చీర్స్
      జిలేబి.

      Delete
    2. వినోద్ గారూ..!
      బాగా చెపారు..!
      భౌతిక, గణిత శాస్త్రాలు అంటూ ఉంటే, అనుకోకుండా ఎక్కడో చదివిన విషయాలు జ్ఞాపకం వచ్చాయి.
      భారతీయులు ప్రపంచానికి గణితాన్ని అందించారు అని చెప్పుకునే మనం, దాని మూలం గురించి మర్చిపోతున్నట్టున్నాం. నాకర్థమైనంత వరకూ గణితం అభివృద్ధి చెందిందే జ్యోతిషానికి అనుబంధంగా(కనీసం మనదేశం వరకూ). గణితశాస్త్రం ఎప్పుడూ స్వతంత్రంగా అభివృద్ధి చెందలేదు. చెందదు కూడా. జ్యోతిషం లేకపోయి ఉంటే ప్రస్తుతం మనం చెప్పుకొనే భారతీయ గణిత విజయాలు ఏమీ ఉండవు. ఎందుకంటే గణితం అవసరం లేదు కాబట్టి..!

      జ్యోతిషం గురించిన మూలసూత్రాలమీద కూడా నాకేమీ అవగాహన లేదు. కానీ ఇక్కడి వ్యాఖ్యలను బట్టి నాకర్థం అయినది "సిద్ధాంతం" వేరు.. "జ్యోతిషం" వేరుగా చూస్తే "సిద్ధాంతం" ఇప్పటికే శాస్త్రీయంగా నిరూపించబడి, ఆధునిక విజ్ఞానంతో పోల్చబడుతోంది. "జ్యోతిషం" ఇంకా నమ్మకంగానే ఉండిపోయింది అని. ఇక్కడ కూడా అదే విషయం.. "జ్యోతిషం" లేకుండా "సిద్ధాంతం" అవసరం నాకైతే కనిపించడం లేదు.

      అర్యభట్టుడు, వరాహమిహిరుడు వారివారికాలాల్లోని ప్రముఖ జ్యోతిష్కులేనని నాకున్న పరిమితవనరుల్తో అనుకుంటున్న విషయం..!

      జ్యోతిషం శాస్త్రీయమా కాదా అనేది పక్కనబెట్టి, దానివల్ల మనం లాభపడ్డామా లేదా నష్టపోయామా అని ఆలోచిస్తే, లాభపడ్డామని చెప్పడమే నా ఉద్దేశ్యం.

      Delete
  37. ఎక్ష్ రే అనేది సైన్సు
    డాక్టర్ గారి రిపోర్ట్, ఆయన అనుభవం మీద , జ్ఞానం మీద ఆధార పడి ఉంటుంది
    అలాగే ...
    అస్త్రోనోమి అనేది సైన్సు
    astrology అనేది సైన్సు ఆధారం గా చెప్పే ఒక శాస్త్రం / విద్య /కళ

    ReplyDelete
  38. గొట్టిముక్కలవారు చెప్పినట్లు పరిశీలనద్వారా గ్రహగతులు సరిగా తెలుసుకో గలుగుతున్నామా అనేది నిర్ధారించబడుతుంది. గ్రహస్థితిగణనానికి ప్రస్తుతం ఉపయోగిస్తున్న (త్రిపరిమాణ త్రిజ్యామితీయ) గణితం అనేక మార్పులకు లోనయింది. ఇంకా ముందుముందు మార్పులు రావచ్చును. ఒక గ్రహం ఎక్కడ ఉండనే దానికి, మనిషి జీవితానికి సంబంధం ఏటనే ప్రశ్నకు నిజానికి ఇప్పటికీ సరయిన సమాధానం లేదు. కావలసిన సమయానికి ద్వాదశరాశి చక్రంలో గ్రహాల స్థానాలను గుర్తించి జ్యోతిషం యొక్క ఫలభాగాలు ( జాతకపధ్ధతి, ప్రశ్న, ముహూర్తమూ) ఫలితాలు చెబుతాయి. అలా చెబుతాయి కాబట్టి ఆజ్యోతిషాన్ని శాస్త్రమా అని ప్రశ్నించటం దండగ. దాన్ని విశ్వసించే వాళ్ళకు అది ఖచ్చితంగా శాస్త్రమే. ఇక విశ్వసించని వాళ్ళలో చాలామంది ఒక ప్రాధమికమైన పొరపాటు చేస్తారు. వారు జ్యోతిషాన్ని యేమాత్రం శోధించకుండానే వాదించటానికి పూనుకుంటారు. ఫలితం? ఒకవైపు విశ్వాసమేకాని శాస్త్రీయమైన అవగాహన అంటే యేమిటో తెలియని వారూ, మరొకవైపున కొంత శాస్త్రీయమైన సాధారణ అవగాహనలు ఉన్నా జ్యోతిషం అనే దాని గురించి యేమీ పరిశోధించకుండానే అది తప్పు అని మరొక విధంగా కేవల తమ విశ్వాసం ప్రాతిపదికగా వాదించే వారు. దానితో యెడతెగని వేడి వేడి చర్చలు. అనేకమైన ఇట్టి వ్యర్థచర్చలు జరిగాయి, జరుగుతున్నాయి, ముందుముందు అనేకం జరుగుతాయి. చాలా విచారించవలసిన విషయం ఇది.

    జ్యోతిషం అనేది సైన్సు ఆధారం గా చెప్పే ఒక శాస్త్రం / విద్య /కళ కావచ్చును. విప్రతిపత్తి లేదు. అయితే పరస్పరవైరుధ్యాలపుట్ట అయిన జ్యోతిషఫలభాగం కాస్తా ప్రజల నమ్మకాలను సొమ్ము చేసుకోవాలని తాపత్రయపడే పొట్టకూటి జోస్యుల కారణంగా మరింత అభాసుపాలవుతోంది. ఒక మెడికల్ రిపోర్టుని సరిగా అవగాహన చేసుకోవటం వైద్యశాస్త్రంపైనే గాక వైద్యుని ప్రతిభపైనకూడా ఆదారపడి ఉన్నట్లే, ఒక జాతకాన్ని సరిగా అర్థం చేసుకోవటం జ్యోతిషశాస్త్రపాండిత్యమూ, జోస్యుని ప్రతిభా అనే రెండిటి పైనా ఆధార పడుతుంది. చాల మంది పొట్టకూటి జ్యోతిష్కులకు ఈ రెండూ అనుమానాస్పదమే. కొంచెం పైపై పరిజ్ఞానమూ బోలెడంత మాటకారి తనమూ జోడించి నెట్టుకు వచ్చేవారే ముప్పాతికమువ్వీసం మంది. సరే, ఒకపధ్ధతిలో మంచి నైపుణ్యం ఉండి జాతకాన్ని ఒకరు ఒకలా అంచనా వేస్తే, మరొకరు మరొక పధ్దతిలో అంతే చక్కని పరిజ్ఞానం ఉండి మరొకరకంగా అంచనా వేయటం తరచూ జరుగుతూ ఉంటుంది కూడా. ఇరువురూ తమ పధ్ధతులే శాస్త్రీయమైనవీ సరైనవీ అని హోరాహోరీగా వాదించుకోవటమూ పరిపాటియే. దీనిని బట్టి జ్యోతిషం అనేది ఇంకా బాగాలోతుగా అధ్యయనం చేయవలసిన విషయం అని నాకనిపిస్తున్నది. ఇలా చక్కగా శాస్త్రీయమైన అధ్యయనాలు కొనసాగాక, దాని శాస్త్రీయమైన ప్రాతిపదికలకు ఋజువులు చూపటం సాధ్యపడుతుంది. ఒకవేళ అటువంటివి లేకపోతే ఆ విషయమే తేలుతుంది.

    ప్రస్తుత పరిస్థితులలలో కేవలం చర్చలు చేయటం ద్వారా జ్యోతిషం ఒక శాస్త్రమా కాదా అన్న ప్రశ్నకు జవాబు రాబట్టలేము.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం వారు,

      చాలా బాగా విశ్లేషించారు.

      ఈ జ్యోతిష్యం గురించిన అవగాహన (మంచి అవగాహన) గలిగిన వారు, తమ కెందుకు లె అని నిస్త్రాణం గా ఉండడం వల్లే ఇలాంటి అపోహలు కలిగిన , హాఫ్ బెక్డ్ ఐడియాస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా వున్నారేమో అనిపిస్తుంది.

      ఎలాంటి టెలిస్కోపు లేని కాలం లో ఆ పాటి శాస్త్ర జ్ఞానం తో వారు ఆ జ్యోతిష్య చక్రాన్ని గణించడం అన్నది వారి పరిశోధనా శక్తి కి మచ్చు తునక అనిపిస్తుంది.

      ఆ పరంపరకి, మధ్య లో బ్రేక్ రావడం , సంస్కృతం మరీ ప్రజల భాష నించి వేరవడం, ఆ పై ముసల్మానుల ప్రభావం, ఆ పై ఆంగ్లేయుల ప్రాభవం, ఆ పై భాషా దారిద్ర్యం ధ్య లో తోడవడం ఇవన్నీ చేరి ఈ కాలానికి ఈ జ్యోతిష్యం ఒక సూడో సైన్స్ లా అనిపిస్తుందేమో ?

      వీటన్నిటికి సరియైన సమాధానం రావాలంటే, మన గవర్నమెంటు వారు సరి ఐన మార్గ నిర్దేశకం ఈ శాస్త్రానికి ఇవ్వాలి. అప్పుడే దీని పరిపూర్ణ ప్రజ్ఞ వుందో లేదో అన్నది తెలిసి రాగాలదను కుంటాను. ఆ పై ఈ శాస్త్త్రానికి సామాజిక ఉపయోగం వుందా రాగాలదా అన్నది మరో విషయం.



      జిలేబి.

      Delete
    2. "ఒక గ్రహం ఎక్కడ ఉండనే దానికి, మనిషి జీవితానికి సంబంధం ఏటనే ప్రశ్నకు నిజానికి ఇప్పటికీ సరయిన సమాధానం లేదు"

      నిజమే, నేనంటున్నది కూడా అదే. అయితే మీకు అభ్యంతరం లేకపోతె నేను ఇంకో అడుగు ముందుకు వేస్తాను. ఈ ప్రశ్నకు సమాధానం ఆ విషయంలో ఆది నుండీ అంతర్లీనం అయినప్పుడే శాస్త్రం. తరువాత తరం వారు తమకు తెలిసీ తెలియని జ్యానంతో అతికించుకుని విశ్లేషణ చేయడం వల్ల శాస్త్రీయ పునాది రాదు సరి కదా సూడో సయిన్సు అవుతుంది.

      Delete
  39. అప్పారావుశాస్త్రిగారు http://saradaa.blogspot.in/2012/03/1.html జ్యోతిష్యం గురించి కొన్ని వాస్తవాలు - అపోహలు (పార్ట్- 1) ను యెందుకు ఇక్కడ ప్రస్తావించారో నాకు అర్థం కాలేదు. కాని అది ఒక అసందర్భమైన & ఆశాస్త్రీయమైన blog post. ఇంత కంటే ఇక్కడ చెప్పలేను. సవివరమైన నా ప్రతిస్పందన ఆ post దగ్గర మీరు చదువుకొన వచ్చును.

    ReplyDelete
  40. It's not my article but Chandru Subbarao's article that says why astrology is pseudoscience.
    http://praveensarma.in/articles-about-astrology-by-chandu-subbarao-a

    ReplyDelete