శ్రీ శ్యామలీయం వారికి శుభాకాంక్షలతో
జిలేబీ శతకం
శతక కర్త - శ్రీ తాడిగడప శ్యామల రావు గారు
బుజ్జి పండు తెలుగు చదువు లో దర్శన మిచ్చి న వారు
గమనిక: ఈ రచన సర్వ హక్కులు శ్రీ తాడిగడప శ్యామల రావు గారివి.
జిలేబీ టపా , కామెంటు చెండులు వీటికి ఉత్ప్రేరకాలు మాత్రమే!
ఇవి శ్రీ శ్యామలీయం గారు శ్రీ కష్టే ఫలే శర్మ గారి బ్లాగులోనూ,
మరి ఇతర బ్లాగుల్లోనూ కామెంటు రూపేణా ఇచ్చినవి.
***
రాబోవు కాలం
కం. మునువచ్చు చెవుల కన్నను
వెనుకనె పొడచుకొని వచ్చి పెరిగెడు కొమ్ముల్
మొనదేరి ధృడత నుండవె
మనుమలకే తెలివి హెచ్చు మహిని జిలేబీ
ఉపవాసం
కం. ఆరోగ్య మనుమతించిన
మేరకు నుపవాసదీక్ష మిగులహితంబౌ
తీరికగా నొక దినమున
శ్రీరమణుని గొలువనగును చేరి జిలేబీ.
'దండ' నాధా!
కం. దండను వేసిన చేతులు
దండంబును బెట్టినట్టి తరుణి కరంబుల్
ధండమ్మని చండికవలె
దండంబును తప్పకుండ దాల్చు జిలేబీ
దీవెనలు
కం. చాలవె యితిహాసంబులు
చాలదె మరి భాగవతము జదువగ హితమై
చాలదె పెద్దల దీవన
మేళులు చేకూర్చ మనకు వేగ జిలేబీ
జిలేబీ తెలుగు వ్యాఖ్య !
కం. నలభై పంక్తుల వ్యాసము
సులువుగ నా కర్థమాయె శోధించెడు నా
తల కెక్కక పొగరణచెను
కలనం తమ వ్యాఖ్య తెలుగు ఘనత జిలేబీ.
'టీతింగు' ట్వీటింగు !
కం. తాతకు కలిగే నకటా
టీతింగ్ ప్రోబ్లమ్స్ కొత్త త్రీజీ ఫోన్తో
యాతన పెట్టే టచ్ స్క్రీన్
చేతికి కళ్ళకును పనులు చెప్పె జిలేబీ.
కం. చిన్నప్పుడు పలకయె గద
యున్నది యని తాత మరచి యుండగ నకటా
నాన్నకు హైఫై పలకను
కొన్నాడు ప్రేమమీర కొడుకు జిలేబీ
బాపురే లవకుశ శ్రీ రామ రాజ్యం !
కం. చూడకనే పొగడుటయును
చూడకనే తెగడు టనెడు చోద్యములనగా
నేడుకదా కనిపించెను
వాడలవాడలను బాపు వలన జిలేబీ
కం. నాజూకుగ నను దిట్టిన
నా జుట్టును బట్టుకొన్న నచ్చని దానిన్
తేజోమయమని పొగడుట
నా జన్మకు వీలుపడదు నమ్ము జిలేబీ
కం. నా కేమో లవకుశ యును
మీకు శ్రీరామరాజ్యమే హితమగుచో
నా కెనిమిది వందలు పొదు
పై కనుబడు చుండె నేటి వరకు జిలేబీ
యా దేవీ సర్వ భూతేషు
కం. అమ్మాయి కథను చదివితి
నమ్మ దయాగుణము దలచి యానందముచే
చిమ్మెను కన్నుల నీరును
నిమ్మహి భగవతికి సాటి యెవరు జిలేబీ.
కం. ముత్తాతగారి ముచ్చట
లిత్తెరగున చదువుచుండ నెటనో మరి నా
చిత్తంబున విభ్రమమగు
నుత్తమమీ సౌఖ్యమనగ నొప్పి జిలేబీ.
కం. ముని మనుమరాలి ముచ్చట
మునుకొని యా మూగతల్లి ముచ్చటగా తం
డ్రిని తాతను ముత్త్తాతను చే
సిన ముచ్చట సంతసింప జేసె జిలేబీ.
కం. సంతోషంబుల నెరుగుట
సంతోషము నాకు నిట్టి సంతోషంబుల్
వింతలె యీ జన్మంబున
నింతకు ముందెరిగి యుందు నేమొ జిలేబీ.
కం. అందరు సంతోషంబున
నుందురు గా కెల్లవేళ నుల్లాసముగన్
చిందులు వేయగ శ్రీలా
నందముగా నందరిండ్ల ననెద జిలేబీ.
కాఫీ కాలం
కం. శివ శివ యనుచును కాఫీ
నెవరైనను చేయునెడల నీశ్వరకృపచే
నవలీలగ నమృతంబగు
చవితో లోకంబు లేల జాలు జిలేబీ.
కం. నీరసపడితే మంచి హు
షారిచ్చే పొగలసెగల చక్కని కాఫీ
సారందీయగ హాయిగ
ఊరికి పను లప్పగించు చుండు జిలేబీ
శతకం లెక్కలు
కం. ఇన్నని నియమము గలదా
యెన్నైనను వ్రాయవచ్చు నేదో శతకం
బన్నప్పు డధిక మైనను
మన్ననలో మార్పురాదు మహిని జిలేబీ
యెన్నైనను వ్రాయవచ్చు నేదో శతకం
బన్నప్పు డధిక మైనను
మన్ననలో మార్పురాదు మహిని జిలేబీ
వినమ్రత
కం. బందమొ ముందరి కాళ్ళకు
నందముగా భావమమర నగు పరికరమో
ఛందం బనునది దేవుం
డందించిన శక్త్తి కొలది యగును జిలేబీ.
కం. ఛందములాడించునొ నను
ఛందంబుల తోడ నాడ జాలుదునో నే
నందముగా వ్రాయుదునో
యిందుకు కొరగానొ దేవు డెరుగు జిలేబీ
టపాకీకారణం
జిలేబి
ఆనంద భాష్పాలు.ఎంత బాగున్నాయి !!!! పలక,బలపం పట్టుకుని శ్యామలీయం వారి వద్ద కూర్చోవాలనిపిస్తుంది. చీర్స్..జిలేబీ!!!!!!!! .
ReplyDeleteవనజగారి మాటే నాదీనూ...
ReplyDeleteశతకసంకలనం చేసిన జిలేబీగారికి నా కృతజ్ఞతలు.
ReplyDeleteవనజావనమాలిగారికీ, జ్యోతిర్మయిగారికీ యీ పద్యాలు నచ్చినందుకు కృతజ్ఞతలు.
#వనజ వన మాలి గారు,
ReplyDeleteమీకు నచ్చినందులకు ఆనందం! ఆ క్రెడిట్ శ్రీ శ్యామలీయం వారిది!
@జ్యోతిర్మయీ గారు,
నెనర్లు. అంతా శ్రీ శ్యామలీయ చందం !
@శ్యామలీయం గారు,
మీ సశ్యశ్యామల కందం ఇలా నిరవధికం గా కొన సాగాలని ఆశిస్తూ, ధన్యవాదాలు ,శతాది 'కండసారి' కంద జిలేబీయాలకు!!
ఇక ఎందుకో ఏమో గారి ప్రయత్నం లో మీ ఈ జిలేబీ శతకం ఏలా దృశ్య రూపకం చెందుతుందో చూడాలి. !
@ఎందుకో ఏమో బ్లాగ్ లోకపు శివాజీ గారు,
ఉన్నారా ! అసలున్నారా ! ఉంటె ... ఈ విన్నపాలు వినకున్నారా !!
చీర్స్
జిలేబి.
శ్రీ జిలేబి గారూ ! మీరు చెప్పగ విని ,
ReplyDeleteపద్య మందు మీ యాసక్తి , పరుల వ్యాఖ్య ,
ఛందమున నశక్తత గాంచి , సాను నయపు
భావ మొలుకంగ జెప్పిన ‘ పద్యము ’ గని
తమ యభిప్రాయముల్ జెప్ప తగును గాని
కించ పరచె మమ్మంచు ‘ వక్రీక ’ రించి
అంత రాధ్ధాంత మొనరించ నవసరంబ ?
నాయభి ప్రాయముల్ నావి , నాకు హితవు
నేడు తొలి సారి మీబ్లాగు చూడ నయ్యె
ముందుగా ‘ ధన్యవాదము ’ లందు కొనుడు
అందరికి వలెగాక ‘ మీకైన ‘ తనర
నాపయి సదభిప్రాయ మున్నందు వలన
తెలుగు పద్య మన్న తెలియని మమకార
మంత రంగ మందు హాయి గూర్చు-
కాదు పద్య మందు , కవుల గీర్వాణమం
దదియు ‘ కాస్త ’ భేద మొదవు నాకు
అసలె చదువు వార లంతంత మాత్రంబు
లందులోను భాష యర్థమవక
‘ పద్య ’ మందు నేమి పరమార్థ మున్నదో
తెలుసు కొనుట యెట్లు ? తేలుటెట్లు?
జనులు మాటలాడు సహజ మగు పదాలు
పద్య మందు కూర్చి ప్రజలు మెచ్చ
నర్థమగు విధాన మరసి వ్రాసిన గాక
పద్య మవని మీద బ్రదుక దేమొ !
వాడుక పద వరవడిలో
‘ తాడిగడప వారు ’ వ్రాసి , తమ సంకలనన్
కూడిన ‘ జిలేబి శతకము ‘
వేడుక గల్గించె నాకు , విను తింతు మిమున్
----- వెంకట రాజారావు . లక్కాకుల
మిత్రులు రాజారావుగారికి జిలేబీ శతకం వేడుక అయినందుకు చాలా కృతజ్ఞతలు.
ReplyDeleteవిద్వత్ప్రకటనగా కవిత్వం ఉండనవుసరం లేదని మీ భావనతో యేకీభవిస్తా నెప్పుడూ. జిలేబీ పద్యాలయినా, శ్రీమద్భాగవతమాహాత్మ్యం అయినా పఠనీయతకే పెద్దపీట వేస్తాను. తమ అమూల్యాదరవచనాలకు ధన్యవాదాలు.
@లక్కాకుల వారు,
ReplyDeleteధన్యోస్మి! స్వాగతం సుస్వాగతం ! మీ పద బంధాల తో ఖుషీ ఖుషీ!
మీకు మరో విన్నపం! దయచేసి శంకరాభరణ కొలువు లో మీరు మళ్ళీ దర్శన మివ్వండి. ఆ కొలువు సొగసు లక్కాకుల వారి కవితా మాధురి తో కూడి కొనసాగనివ్వండి
చీర్స్
జిలేబి.