సైన్సు అన్న పదం ఇరవై శతాబ్దం లో కాకుంటే పంతొమ్మిదవ శతాబ్దం లో వచ్చిన పదం.
అంతకు మునుపు ఫిలోసోఫి.
ఉదాహరణకి - న్యూటన్ పుస్తకం ప్రిన్సిపెల్స్ అఫ్ నేచురల్ ఫిలోసఫి.
ఫిలోసఫి అర్థం తీసుకుంటే- అది లవ్ ఫర్ సం థింగ్.
ఈ అర్థం లో తీసుకుంటే జ్యోతిష్యం ఒక ఫిలోసఫి. సైన్సు. దీన్ని చదివిన వాళ్ళు, చదవడానికి ఉత్సుకత చూపే వాళ్ళు ఓ పాటి జిజ్ఞాస తో - దాని మీద "వ్యామోహం" తో కాకుంటే- సందేహం తో ప్రారంభించి ఓ లాంటి పరిణితి వచ్చిన తరువాయీ దాని వెనుక ఉన్న నిగూఢ అర్థాలని వెలికి తీయడం లో తమ ఇంట్యూషన్ ని వాడడం గమనించ వచ్చు.
జ్యోతిష్యం బాగా తెలిసిన వాళ్ళు - వాళ్ళకే సందేహం వస్తే- జవాబు వెంటనే చెప్పక , కొంత సమయం తీసుకుని వారి కాన్షేన్స్ అనుమతిస్తే - కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పడం సాధారణం గా గమనించ వచ్చు.
అంటే ఈ జ్యోతిష్యం దాని గణాంక పరిధిని దాటి - తార్కికానికి ఆవల - "దృష్టి" ని సారించి అంటే
డిఫరెంట్ డిమెన్ షన్ లో వెళ్లి కొన్నిటికి సమాధానం చెబుతుంది.
సైన్సు పోకడ ని గమనిస్తే - ఈ కాలపు రెండు శతాబ్దాలలో - చాలా మార్పులతో వేగం గా పరిణితి చెందుతూ వస్తోంది. తాము గ్రహాలని చెప్పిన వె ఇప్పుడు గ్రహం కాదని అంగీకరించడం దాక అంటే వారి "జ్ఞానం' పెరిగే కొద్దీ మన "విజ్ఞానం" కూడా పెరుగుతోందని అనుకోవచ్చు. (కాకుంటే - "అజ్ఞానం" తరుగుతోందని అని కూడా అనుకోవచ్చు)
కొన్ని శుష్క వాదనలతో సూర్యుడు గ్రహమా అని జ్యోతిష్యం ని ప్రశ్నించే "హేతవాదులని" మనం చూడడం కద్దు.
జ్యోతిష్యం డెవలప్ అయిన కాలానికి వాళ్ళు - దాన్ని గ్రహం గా సంబోధించ వచ్చు అనుకోవచ్చు గదా? మనం విజ్ఞానవంతులం అట్లా అనుకుంటే మన హేతువాదానికి ధోకా వస్తుంది కాబట్టి మనం ప్రశ్నించాల్సినదే !
క్వాంటం థియరీ పరిణితి చూస్తె- నాటి క్వాంటం మెకానిక్స్ మోడల్ నించి మొదలయ్యి -ఇపుడు క్వాంటం ఫిజిక్స్ మరియు ఆధ్యాత్మికం దాక దాని ప్రతిపాదనలు వ్యాపించి ఉన్నది. (ఈ రెండు వేల ఐదు లో అనుకుంటా ను వచ్చిన What the bleep do we know మూవీ జనావళికి క్వాంటం ఫిజిక్స్ ని పరిచయం చేసే హాలీవుడ్ చిన్ని ప్రయత్నం).
దీనికి మూల కారణం దాని మీద - ఆ సబ్జెక్ట్ మీద పరిశోధనలు మిక్కిలి గా జరగడమే కారణం. క్వాంటం థియరీ మొదలైన కాలానికి అది సో కాల్డ్ సుడో సైన్సు. ఆ కాలం లో దాన్ని సో కాల్డ్ వైజ్ఞానికుల లోకం లో నే సమర్థించిన వాళ్ళు చాల కొద్ది మంది మాత్రమె.
ఈ నేపధ్యం లో జ్యోతిష్యం తానున్న ఇప్పటి దయనీమయిన పరిస్థితి నించి బయట పడాలంటే -దాని మీద విలక్షణమైన , విశిష్టమైన , నిశితమైన పరిశోధనలు జరగాలి. అప్పుడే దాని వికాసం మనం చూడవచ్చు.
చిన్న ఉదాహరణ - జ్యోతిష్యం లో ని గళ్ళకి అధిపతి గా సూర్యుని నించి మొదల్లయీ శని గ్రహం దాక ఇప్పడు సైన్సు చెప్పే ఆర్డర్ లో నే ఉండటం కాకతాళీయమా , లేక - వారి కాలానికి వారికి కలిగిన మేధస్సు పరిణితి యా?
జ్యోతిష్యానికంటూ - ఒక నియమం, గణితం ఉన్నది. ఆ గణితం ఒక పార్టు. దాని వెనుక దాని అనాలిసిస్ మరో పార్టు. దాని అన్వయం మరో పార్టు. ఈ అనాలిసిస్ ఎక్కడో బురడా కొట్టి కాల గతి లో వక్ర గతి పట్టి నట్టు ఉంది.
మరో ఉదాహరణ- స్టాక్ మార్కెట్ లో " Derivatives" "futures and options" ఎ ఉద్దేశం లేక ఎ మోడల్ తో future ని "predict" చేస్తూన్నారు? బ్లాక్ షోలే మోడల్ అనండి, వేరే మోడల్ అనండి, కాకుంటి probability theory అనండి - దానికంటూ ఒక అర్థం వాళ్ళు చెప్పుకున్నారు. ఓ మోడల్ కాకుంటే "predictability" ఆపాదించుకున్నారు.
రేపటికి ఏమవుతుందో తెలియని దానికి, ఒక మాడల్ తయారు చేసుకుని ఒక సమీకరణం ప్రతిపాదించడం (ఈ సమీకరణం మన కాలం లోనే ప్రశ్న గా నిలబడడం ఇక్కడ విశేషం) మన కాలానికి మనకు చెందిన మేధో పరిణితి. !
అట్లాగే జ్యోతిష్యానికి కూడా ఒక వ్యాఖ్యానం ఉంది కదా? ఈ జ్యోతిష్యం సైన్సు గా విలక్షణం గా పరిణితి చెందాల వద్దా అన్నది మానవ మేధస్సు మీద ఆధార పడి ఉన్నది. ఎ కొద్దిపాటి ఇచ్చుకత, ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకొని పరిశోధనలు చెయ్యడమో మాత్రం సరిపోదు. ఇది ఒక యజ్ఞం కాకుంటే ట్రెండ్ కావాలి.
అప్పుడే ఈ సైన్సు కాకుంటే ఫిలాసఫీ కూడా పరిణితి చెంది మన మేధస్సు కి దీటు గా వెలుగొందుతుంది. అప్పుడే దాని వికాసం. కాని ఇందులో ఓ తిరకాసు ఉంది. ఏమిటంటే - ఇందులో ఎలాంటి ధనలాభాలు లేవు.
సో, ఎంతమంది దీనికి టేకర్స్ ఉంటారు? చాల తక్కువ మంది మాత్రమె. అదే దీని ప్రస్తుత పరిస్థితి కి కారణం కూడానేమో ? ఆ కాలం లో రాజులు పోషించారు. ఈ విజ్ఞానం వికసించింది.
ఈ కాలం లో మన గవర్న మెంట్లు, వాటికి దీన్ని పోషించే కాకుంటే వికసింప చేసే ఆసక్తి ఉన్నదా అన్నది సందేహమే. అదే అమెరిక వాడు కొద్ది పాటి పరిశోధనలతో(వాడు చెయ్యాలంటే, దీంట్లో వాడికి ఏదైనా లాభం కనిపించాలి !- అది వేరే విషయం!) - పేటెంట్ చేసాడంటే - వెంటనే - బాస్మతి మాది అన్నట్టు కేసు వెయ్యడానికి వేనుకయ్యం మనం !
కా బట్టి వేచి చూడాల్సిందే !
కాకుంటే- ప్రశ్నా శాస్త్రం క్రింద మనం ప్రశ్న వేసుకోవచ్చు!
సమాధానం చెప్పగలిగే వాళ్ళు - ( ఈ టపా పోస్ట్ చెయ్యబడ్డ సమయమో- లేక మీరు ఈ టపాని చదివిన సమయో - కాకుంటే - మీరే ఓ ప్రశ్నా సమయాన్ని ఎంచుకోనో, స్థలం బ్లాగ్ లోకం లో మీ బ్లాగ్ అనుకునో!) భాష్యం చెప్పగలరేమో చూడండి!
ప్రశ్న - "జ్యోతిష్యం మరింత పరిణితి చెందుతుందా ? అవదా?
చీర్స్
జిలేబి.
(జిలేబీ why dont you have consisntency?)