'జై స్వామీ యోగి మహారాజ్ గారికి !
జై జై జై ! సభా ప్రాంగణం దద్దరిల్లింది.
స్వామీ యోగీ మహారాజా వారు వేంచేశారు. !తెల్లటి కాషాయ వస్త్రం. (కాషాయ వస్త్రం తెల్లగా ఉంటుందా ? అవును ఇది లేటెస్టు ఫేషను!) నుదిటి పైన నైస్ స్మేల్లింగ్ విభూతి పట్ట ! బవిరి గడ్డం. నిగ నిగ లాడే ఇటాలియన్ షూస్ కాలికి. చేతిలో కమండలం. కమండలం లో నీళ్ళు స్విట్జెర్లాండ్ నిండి ఫ్రెష్ గా దిగుమతి చెయ్య బడ్డది.
"ఇప్పుడు స్వామీ యోగీ మహారాజా వారు మీ ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెబుతారు. మీ ప్రశ్నల తో బాటు పదివేల ఒక్క డాలరు నోటులను స్వామీ వారీ పాదాల చెంత బెట్ట వలెను " బోస్ మైక్రో ఫోన్ నించి అనౌన్సే మెంట్ చేసాడు ఓ స్వామీజీ.
'మొదటి ప్రశ్న' లక్షా వెయ్యిన్నొక్క నూట పద హారు డాలర్ లతో మొదలవు తుంది స్వామీ యోగి మహారాజ్ వారి శిష్య స్వామీ వారని ఖండించి తానె కొత్త వరవడి చుట్టేరు !
'ఆహా ! స్వామి వారి జ్ఞాన దృష్టి ముందు మనది ఏపాటి అని ' ఆ కుర్ర శిష్య స్వామీ ఈ మారు అట్లాగే స్వామీ అని చెంపలేసుకుని, కొత్త అనౌన్సు మెంటు చెప్పాడు ప్రశ్న విలువకి !
'మొదటి ప్రశ్న, ఓ సూటూ బూటూ వేసుకున్న పెద్ద ఆసామీ నిండి వచ్చింది. శిష్య పరమాణువు వాడి వద్దకెళ్ళి మొదట లక్ష పై చిలుకు డాలరు డబ్బులు తీసుకొచ్చి స్వామీ వారి పాదాల చెంత బెట్టేరు. ! స్వామీ వారు గబుక్కున తన కాళ్ళని వెనక్కి లాగేసుకుని ' ఛీ ఛీ' మీరే ఆ పక్క పెట్టండి అన్నారు.
'ఆహా స్వామీ వారికి ఎంత వైరాగ్యం !' అని భక్త పరమాణువు మరో మారు జై జై జై అని ఘోషించింది. !
ఆ సూటూ బూటూ వాడు ప్రశ్న మొదలెట్టేడు..
'స్వామీ ! క్రితం సంవత్సరం నా వ్యాపారం నష్టాల్లోకి పోయింది. ఈ సంవత్సరం ఏమైనా గిట్టు బాటు అవుతుందా "
స్వామీ వారు విచారం గా చూసేరు తన భక్త సూటూ బూటూ బాబుని.
'ఇదిగో, సూటూ బూటూ, విచారించకు. ఆధ్యాత్మిక పరంగా నీకు ఉచ్చ స్థితి ఈ ఉగాది నందన సంవత్సరం లో జరుగు తుంది. కాబట్టి దాంతో బాటే నీ కు వ్యాపారాభి వృద్ధి కూడాను ' అని ఓదార్చేరు !
రెండో ప్రశ్న మూడు లక్షల డాలర్లకి స్వామీ యోగి మహారాజ్ వారు సంత బేరం పాడేరు
మరో సూటూ బూటూ ఆసామి లేచి ఇల్లు విడిచి పారిపోయిన కూతురి 'ఆధ్యాత్మిక' స్థితి గురించి విచారించాడు.
స్వామీ వారు గతుక్కు మన్నారు. ఆ అమ్మణ్ణి మొన్నే తన ఆశ్రం లో కి , తన ఆశ్రయంలోకి వచ్చి ఉన్నదాయె !
బవిరి గడ్డం తడివి, మరో శిష్యుడి కి సైగ చేసి ఆ అమ్మణ్ణి ని తోలుకు రమ్మన్నారు !
'అమ్మణ్ణి వచ్చింది, మొత్తం తెలుపే తెలు పు ఐన నిగ నిగ లాడే చీరలో.
కూతురిని జూసి తండ్రి ఆనంద పడేడు ! ఎట్టకేలకు కూతురు దక్కింది అని. మూడు లక్షల పై మరో లక్ష కానుక గా చెల్లించు కున్నాడు !
ఇట్లా స్వామీ యోగీ మహారాజ్ వారు ఆధ్యాత్మిక ప్రశ్నలకి సమాధానం ఇవ్వడం అలా భక్త పరమాణువులు ఆ హా ఒహో అని వంత పాడడం మొత్తం మీద అవ్వాల్టి సభ ముగిసింది.
'స్వామీ వారు రేపే స్విట్జేర్లాండు వెళుతున్నారు. కావున వారితో బాటు వెళ్లాలనుకునే వారు ఆశ్రమ ఆఫీసు ని సంప్రదించండి ' అని మరో కుర్ర సన్యాసి నోటేస్సు చెప్పేడు.
పోలో మని జన సందోహం ఆశ్రం ఆఫీసు మీద పడ్డది.
ఇంతటి తో కథ జెనీవా కి ! మనం యధా ప్రకారం మన గూటికి !!
చీర్స్
జిలేబి.
(స్విస్సులో ఓ స్వామీ వారిని కలిసిన శుభ సందర్భాన!)