క్రితం ఏడాది జిలేబీ కి ఉద్యోగ పర్వం నించి టాటా చెప్పెయ్యడం తో , ఏమీ పాలు పోక కాలు గాలిన పిల్లిలా ఇంట్లో తిరుగుతూ ఉంటే, జంబూ వారు, 'ఇదిగో జిలేబీ ! అలా ఊరికే కూర్చోక, కాస్తా వంటా వార్పూ చూడరాదు ?' అంటూ అన్నేళ్ళు రాజ్యమేలిన వంట గదిని జిలేబీ తల మీద ధామ్మని పడేసేరు.
చ, చ, అసలు పని లేకుంటే, అందరికీ లోకువే సుమా అనుకుని సరే పోనీ మన జంబూ వారే కదా , ఇన్నేళ్ళు వంటా వార్పు చూసేరు. ఇక ఎట్లా ఉద్యోగం retire అయిపోయాం కాబట్టి, ఈ కొత్త ఉద్యోగం లో retyre అయి పోదామని ఒప్పేసు కున్నా !
వంటా వార్పూ అంత సులభమైన విషయం కాదు సుమా అని అప్పుడే అర్థం అయ్యింది. ! చాన్నాళ్ళ బట్టి అసలు వంట గది వైపు రాక పోవడం తో , వంట ఎలా చెయ్యాలో అస్సలు మర్చి పొతే, 'పోనీ లే జిలేబీ' ఆ లాప్టాప్ పెట్టేసుకుని ఆన్ లైన్ లో నేర్చేసుకో అని అయ్యరు వారు ఓ ఉచిత సలహా పడేసేరు.
దాంతో బాటే, అప్పటి దాకా ఎప్పుడో ఒక్క మారు టపా రాసుకుంటూ ఉన్న బ్లాగ్ లోకం లో కూడా జబర్దస్తీ గా జొరబడి , టాట్, ఇక మీదట డైలీ రాయాలి సుమా అని, అలా ఓ వైపు వంట కార్య క్రమమును మరో వైపు బ్లాగ్ టపా వంట కార్య క్రమాన్ని రెండు చేతుల మీదుగా సాగించడం జరిగింది.
ఖుషీ ఖుషీ గా నవ్వుతూ, చలాకీ చలాకీ లా కామెంట్లు కొడుతూ తీరిగ్గా కాలం గడి పేస్తూంటే, ఆ మధ్య లో మన మోహనుల వారి నించి ఓ కబురందింది
'జిలేబీ , నీకు రిటైర్మెంట్ ఇవ్వడం మా బుద్ధి తక్కువ. నీ వెళ్ళాక, వనారణ్యాలకి కష్ట కాలా లోచ్చెసేయి, అదీ గాక, నీకు రిటైర్ మెంటు ఇవ్వడం, తెలుగు బ్లాగ్ లోకానికి తల నొప్పి అయి పోవడం జరిగింది, నీ రాతలతో . కాబట్టి, నీ రిటైర్ మెంటు కాన్సిల్. వెంటనే నువ్వు జాబ్ లోకి చేరి పో' అని తాకీదు వచ్చేసింది!
చ, చ, జనాలు హ్యాపీ గా ఉండ నివ్వరు సుమా ! తీరిగ్గా, టపాలు రాస్తూ కూర్చుంటాం అంటే వద్దంటారు. సరే ఉద్యోగం లో ఉంటా నంటే, నీకు ఏజ్ అయి పోయింది, యు ఆర్ డిస్మిస్' అంటారు సుమీ అనకున్నా.
'అయ్యరు గారు మీ సలహా ఏమిటీ ' అడిగా.
'ఇదిగో జిలేబీ, నీ చేతి వంట నాకు దక్కే యోగం లేదన్న మాట ఎప్పటికి ' అన్నారు వారు.
అర్థం అయి పోయింది వారికి కూడాను. సలహా ఏమిటీ అని జిలేబీ అడిగింది గాని, ఆ సలహా పాటిస్తుందా అన్నది సందేహం సుమా ఈవిడ అని !
సో, బ్లాగ్ బాంధవులారా, ఇంతటి తో మీకందరికి బాయ్ బాయ్! టాటా వీడుకోలు !
అప్పుడప్పుడు,వనారణ్యాల లోంచి బయట పడితే, గిడితే, జనారణ్యాలకి వస్తే, గిస్తే, నెట్టారణ్యాలు లభ్య మయితే, మళ్ళీ మీకు ఈ జిలేబీ టపా శిరో వేదనలు తప్పవు.
అప్పటి దాకా, బాయ్ బాయ్ టాటా వీడుకోలు.
చీర్స్
జిలేబి
(పీ ఎస్: ఇది 'తూచ్' టపా !, వీలైనప్పుడు, అప్పుడప్పుడు మళ్ళీ పునర్దర్శనం !)
చీర్స్
జిలేబి
IFS (Retyred)-Indian Fun Service Retyred!