గుళ్ళోని దేవుడికి ముచ్చెమటలు పోసేయి.
పూజారి అల్టిమేటం ఇచ్చేడు.
' సామీ, రేపట్నించి గుళ్ళో పూజలు నీకు తెలిసిన భాషలో ఉండవు. కొత్త మంత్రి వచ్చాడు. అంగ్రేజీ అన్ని చోటా ఉండాలట. ఇక మీదట పూజా కార్యక్రమాలన్నీ కూడా అంగ్రేజీ లో నే' చెప్పాడు పూజారి.
ఆ మధ్య అరవ దేశం లో పూజలన్నీ అరవం లో నే ఉండాలని రూలు పెట్టేడు ఓ గుడ్డోడు. వాడి ఆర్డరు తో గుళ్ళోని దేవుడికి అరవం నేర్చుకోవడానికి తంటాలు పడాల్సి వచ్చే ! అరవం అంత సులభమైన భాష గాదు సుమీ అని వాపోయాడు ఓరియంటేషన్ కోర్సు కి వెళ్లి వచ్చి న దేవుడు.
'ప్రియ సఖీ' అన్నాడు కాళ్ళ వద్ద ఉన్న లక్ష్మీ దేవిని గమనించి.
'స్వామీ' అన్నది దేవేరి.
'డబ్బులు ఏమైనా ఇస్తావా '
ఎందుకండీ
ఆ అంగ్రేజీ ఏదో కొంత నేర్చుకుని తగలడతాను. 'పూజారి చెప్పాడు, వెంటనే నేనెళ్ళి ఏదైనా ఇంగ్లీషు కోర్సులో చేరి పోవాలాట '
స్వామీ
చెప్పు దేవేరి !
ఈ వయసు బడ్డ కాలం లో కొత్త భాష నేర్చుకుని ఏమి చేస్తారు
'ఎం చేద్దామంటావు ! ఇప్పటిదాకా తెలిసిన భాషలో ఆ పూజారి ఏదో చెప్పుకుంటూ వెళ్తూంటే , కర్ణాభ్యాం భూరి విశ్రువం ' అని ఆ సంగీతం లో జోగుతూ ఉండి పోయా. ఇవ్వాళే ఆ కొత్త భాష వినిపించాడు. ఒక్క ముక్కా అర్థం కాలేదు. బెరుకు పుట్టు కుంది ' చెప్పాడు గుళ్ళో దేవుడు.
ఎట్లాగూ వీళ్ళు మనల్ని రాళ్ళలో బంధించారు గదండీ స్వామీ వారు' లక్ష్మమ్మ అన్నది.
ఆవును దేవేరి
పోనీ లేద్దురు, రెండు చెవుల్లో కూసింత పత్తి పెట్టేసుకుంటే సరి ! ఎట్లాంటి సమస్యా లేదు. 'ఉన్నావా అసలున్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా ' అని వాడెవడో ఒక కవి పాడి పోయాడు. మరో వాడు నీ చెవులు మూసుకున్నాయా అని పాడి పోతాడు అంతే గదా ' చెప్పింది ఐడియా ల రాణి హృదయేశ్వరి.
'ఆ ! ఇదీ మంచి ఆలోచనే ' స్వామీ వారు కొంత సమాధానపడి నిద్దురలోకి జారుకున్నారు.
అమ్మవారు స్వామీ వారి కాళ్ళు మెల్లిగా వత్తుతూ తానూ నిద్దురలోకి జారుకుంది.
చీర్స్
జిలేబి.

mottam meeda amgrejini desa bhaasha chesesaru.. :)
ReplyDeleteపురాణ పండ వారు,
Deleteఅంగ్రేజీ ఇప్పుడు దేశ భాష కదండీ మరి !
ఆ మధ్య బ్రిటను లో ఇంగ్లీషు వాడి పుస్తకం లో మన ఇండియన్ వారి స్టోరీస్ చదివాను మరి !
చీర్స్
జిలేబి.
ఎండాకాల మహిమో ఏమో! ఈ మధ్య జిలేబీలు మరీ గరం గరంగా ఉంటున్నాయి!
ReplyDeleteగుడ్డోడు తమిళంరాని దేవుళ్ళు తమిళనాట ఉండనక్కరలేదని అంటే, పురట్చి తళైవి ఏకంగా జైలుపాలు చేసి - ఒక మఠ ఇతిహాసంలో కనీ వినీ ఎరుగని దిక్కుమాలిన చరిత్ర సృష్టించింది. కాకపోతే ఒకటి. తెలుగువాడిగా నాకు తమిళులను చూస్తే కాస్తో కూస్తో ఈర్ష్య అనేది కలుగుతూనే ఉంటుంది. మనకంత సీను లేదని పలు విషయాలలో తేటతెల్లంగా కనిపిస్తుంటుంది.
మీరు ఎత్తిన విషయానికొక ట్విష్టుకూడా ఉన్నదండోయ్!!!
తెలుగు భావాలు గారు,
Deleteమా బాగా చెప్పేరు! ఆంధ్రులు అంధులు కారండోయ్! అందుకే అట్లాంటి చమక్కులు ఇక్కడ చెల్లవు. వాళ్ళది మూఢ భక్తీ! (ఆ భక్తీ మీద తమిళ కమెడియన్ వివేక్ చాలా కామెడీ చేసాడు కూడాను!)
జిలేబి.
ఇప్పుడన్నీ అంగ్రేజీలోనే కదండి, పాపం ఆయన మాత్రం ఏం తక్కువ... కానివ్వండి... శుభం భూయాత్
ReplyDeleteకష్టే ఫలే వారు,
Deleteఅందుకే నండీ, స్వామీ వారు ఓరియెంటేషన్ కోర్సు కి వెళతా మంటున్నారు !
జిలేబి.
ఎస్ జే గారు,
ReplyDelete:)))