కొన్ని కొన్ని బ్లాగులోళ్ళ కామెంటు బాక్సు ముందర కొన్ని విచిత్రమైన గొంతెమ్మ కోరికల్లాంటి నోటీసులు కనిపిస్తాయి.
కామెంట్లు తెలుగు లో ఏడవక పోతే మీ కామెంట్లు డెలీట్ !
మీకు ప్రొఫైల్ లేదా అయితే డెలీట్
మీరు టపాకి దూరం గా కామెంటు కొట్టారా డెలీట్ !
మీ కామెంటు నాకు నచ్చ లేదా డెలీట్
మీ సెక్సు చెప్పరా ! అయితే డెలీట్ !
ఇత్యాది అన్న మాట
ఇట్లాంటి సౌకర్యాలు కామెంట్లు రాసేవారికి అస్సలు లేవు.
టపా నచ్చ లేదా ఓ డెలీట్ కొట్టే సదుపాయం అస్సలు గూగులోడు కామెంటర్ల కి ఇవ్వలే ! అట్లా ఓ పది మంది కామెంటర్లు డెలీట్ కొడితే టపా హుష్ కాకి అయి పోవాలి. ఇట్లాంటి సౌకర్యాలు కామెంటర్ల కి లేక పోయెనే !
ఎంత అసమానత్వం !
అంతా సమనానమే అంటారు. మరి కామెంటర్ల పట్ల ఎందు కింత వివక్ష !
బ్లాగులోళ్ళు వెర్సస్ కామెంటర్లు అసమానత్వం ముర్దాబాద్ !
చీర్స్
జిలేబి.
:))))
ReplyDeleteha ha
cool ...b happy...this is part of game..just play n enjoy it
ReplyDeleteజిలేబిగారు,
ReplyDeleteమీరు వచ్చారు. సంతోషం. మీరు రాకపోతే ఏదో ఏదో చెయ్యాలని చాలా చాలా అలోచించాం. ఏమయితేనేమి రండి, రండి, దయ చేయండి,తమరి రాక, మాకెంతో సంతోషంకదండీ"
కామెంట్లకి లోకో భిన్న రుచిః ఏంచేస్తాం చెప్పండి. అదంతే
కం. మీరో నేనో ఒరులో
ReplyDeleteతీరికగా బ్లాగు టపా తీర్చీ దిద్దీ
వేరెవరికొ నచ్చనిచో
మారణహోమాగ్ని వేయ మనియె జిలేబీ?
కం. నా బాగులు నా బ్లాగులు
నా బాధలు నావి కాని నా చదువరివా
నా బాసో నా బాధో
యే బుర్రకు నచ్చకున్న నేమి జిలేబీ?
కం. నచ్చిన వారికి నచ్చును
మెచ్చిన సంతోష మొకరు మెచ్చకయున్నన్
వచ్చెడు నా బ్లాగులలో
నచ్చును నా వ్రాతలన్ని నాకు జిలేబీ
కం. నిందలు కువిమర్శలతో
ముందుకు కుప్పించి దూకి మొరటు దనంతో
చిందులు తొక్కేవారల
కెందుకు తావీయ వగవ నేల జిలేబీ?
ఈ జిలేబి కొద్దిగా ఉప్పగా వున్నది :-)
ReplyDeleteమీరు చెప్పిన వాటిలో నేను ఒకే ఒక అభ్యంతరం చెప్పదలిచే విషయం ఒకటి ఉంది.
ReplyDeleteనకిలీ ID తో పనిగట్టుకుని విద్వేషాన్ని గుమ్మరించే వాళ్ళు ఉన్నారు. వారు చెప్పే విషయం లో అంత నిజాయితీ ఉంటే నకిలీ ID లతో కామెంట్ పెట్టడం ఎందుకు? అందుకే నేను వివరాలు సరిగా లేని వారి కామెంట్స్ ని డిలేట్ చేయబడతాయి అని చెప్పడం జరిగింది. .అది మినహా నాకు ఎవరిపట్ల వివక్ష లేదు జిలేబీ..గారు.
అన్నట్లు మీరు & నేను బ్లాగులోళ్లు,కామెంటర్లు కూడా కదండీ! ఇంతకీ ఈ విషయం ఎవరికి చెప్పారబ్బా!
ఓ తెకాస పెట్టేసి అధ్యక్షురాలయిపోండీ. తెకాసా అనగా తెలుగు కామెంటర్ల సంఘం. లేదా తెవ్యాస - తెలుగు వ్యాఖ్యాతల సంఘం పెట్టెయ్యొచ్చు. నిజమే. కామెంట్లెయడం మన గరుజు అయినట్లు, కామెంట్లు వెయ్యకపోతే మనకు పూట గడవనట్లు ఛీత్కరించే, అవమానపరిచే నిబంధనాలు/ నిబంధనలు నాకూ చిరాకుగా అనిపిస్తాయి. అందుకే ఆయా బ్లాగుల్లో నేను వీలయినంతవరకు వ్యాఖ్యానించను. మంచి పాయింట్ లేవనెత్తారు.
ReplyDeleteఎక్కడ, ఏమైంది?
ReplyDeleteజిలేబీ దాటలేని అడ్డుగోడలు ఎవరు కట్టారబ్బా?
ఏమైనా, కామెంటర్ల సంఘానికి నేను కూడా సపోర్ట్ ఇస్తున్నాను.
కామెంటర్ల సంఘానికి నేను కూడా సపోర్ట్ ఇస్తున్నాను.
ReplyDeleteకొంతమంది గూగుల్ ఖాతా నుండి మాత్రమే కామెంట్లు వ్రాయమంటున్నారు.
మరి వర్డ్ ప్రెస్ బ్లాగర్ల గతి ఏమిటి?