Friday, April 6, 2012

కనిపించిన మేఘం


ఒక మేఘం కనిపించింది
గాలి వీచింది
మేఘం సాగి పోయింది

ఒక మేఘం కనిపించింది
సూరీడు సిగ్గు పడ్డాడు
మేఘం బోరు మన్నది

ఒక మేఘం కనిపించింది
చిన్ని పాప నవ్వింది
మేఘం రాగమయ్యింది

ఒక మేఘం కనిపించింది
తాత బోసి నవ్వు నవ్వాడు
మేఘం తుర్రు మన్నది

చీర్స్
జిలేబి.

5 comments:

  1. ఒక మేఘం కనిపించింది
    జిలేబి కవిత రాసింది
    మేఘం గర్వపడింది

    ఒక మేఘం కనిపించింది
    ఓ మనసు కలత పడింది
    మేఘం వర్షించింది....

    బాగుందండీ మీ మేఘం కవిత ;)

    ReplyDelete
  2. ఒక మేఘం కనిపించింది
    జిలేబి కవిత వ్రాశారు
    మా మనసు ఉప్పొంగిపోయింది

    ReplyDelete
  3. మీరు రాస్తూ ఉండండి...
    ఈ ఎండాకాలం అంతా చల్లగా ఉంటాం:-)

    ReplyDelete
  4. వచ్చెను వసంత మేఘము
    మెచ్చిరి జిలేబి పలుకుల మేడము గారున్
    హెచ్చగునో కుందగునో
    ముచ్చెమటలు తగ్గె ననుచు మురిసితి నేనున్

    బ్లాగు సుజన-సృజన

    ReplyDelete