Sunday, July 8, 2012

కామెంటిన కనకాంగి కోక కాకెత్తు కు పోయిందని ....

ఓ కనకాంగి కామెంటు దామని తీరిగ్గా బ్లాగు లన్నీ చదవటం మొద లెట్టింది..

ఓ లమ్మో బ్లాగులన్నీ ఏమి రాస్తారు సుమీ వీళ్ళు అని హాశ్చర్య  పోయింది..

మన తెలుగు బ్లాగు లోకం గత మూడు సంవత్సరాలు గా మారుతూ వస్తోంది.. కొత్త సరికొత్త బ్లాగరి ణీ  బ్లాగర్లు వస్తున్నారు.. సరికొత్త 'మేటరు'' తో మన బ్లాగు లోకం లో కొత్త పుంతలు తొక్కుతూ..

ఆ మధ్య రాయడానికి మేటరు ఏమీ లేక ఏమి చేద్దారి అని ఆలోచిస్తా ఉంటే,, మేటరు లేకుండా టపా 'కట్టడం'' ఎలా అని రాస్తే,, ఓ బ్లాగరు కామెంటు దారు టపా కట్టడం అంటే వేరే అర్థం వస్తుందండీ అని నాజూగ్గా చెప్పేరు.

సరే పోనీ సామేతల్లా బ్లాగ్ వితలు  రాద్దామని కొంత ప్రయత్నం చేశా.. అందులో ఈ కామెంటిన కనకాంగి కోక కాకెత్తు  కు పోయిందని రాయడం జరిగింది..

ఇతకీ ఈ మాట మళ్ళీ ఎందుకు అంటారా ?

ఇప్పుడు మళ్ళీ రాయడానికి ఏ మేటరూ లేదు మరి..

సో,, ఈ ఒక్క వాక్యం రాసి పోనీ ఏదైనా ఆలోచన వస్తే కొనసాగిస్తామని కొంత టీం పాస్ అండ్ టైం పాస్ చేద్దామని మరీ దురదస్య దురదః ఐన ఈ బ్లాగ్ టపా లోకం లో కొంత సేపు ఎంజాయ్ మాడీ  అని ఆలోచించి ఈ టపా శీర్షిక పెట్టడం...  ఆ పై రాయడానికి ఏమీ లేక బుర్ర గోక్కోవడం (సరిగ్గా ఈ విషయం మీదే బుర్ర గోక్కోవడం అన్న విషయం మీదే ఆలోచిస్తా ఉంటే,, బుర్ర గోక్కుంటే ఏమైనా ఐడియాలు వస్తాయా ఏమిటి జిలేబీ అని మా అయ్యరు  గారు కొంత 'సైడు కిక్కు'' ఇచ్చారు మరి!!)

ఇంతకీ ఈ టపా దేనికోసం కట్టా చెప్మా ? అబ్బబ్బా ఈ దురద వదలదు సుమీ ! రాత కోతలు లేకున్నా రాత కోటలు  దాటడం అంటే ఇదే నన్న మాట మరి !

దురద గొంటాకు
జిలేబి..

Friday, July 6, 2012

మహానగరం లో మంత్రవాది

 మహానగరం లో సూరీడు హర్రీ బర్రీ గా ఉదయించాడు.. తనకి నగరం లో వాళ్ళు నిద్దురోతే నప్పుదు లాగుంది,, పైకి వచ్చీ రావడం తోటే, సుర్రు  మని తీక్షణం గా నగరాన్ని చూసాడు..

బ్యాక్ప్యాకు  బకరా బాబు నిద్ర లేచి  ఆవులించాడు.. ఇంకా నిదుర మత్తు వదల్లేదు తనకి.. మరో రోజుకి స్వాగతం చెప్పాలా వద్దా అని ఆలోచించి బుర్ర వేడెక్కటం తో ఆ ఆలోచనకి ఉద్వాసన .పలికాడు

మనిషి రేతిరి నిదుర లేమి తో డీలా పడి పోయున్నాడు.. ఆ పై కరెంటు .కోత . బస్సుల వాహనాల రణ గొణ ధ్వనులు..

సరిగ్గా అప్పుడే ఓ మంత్ర వాది మంత్రం వేస్తా నని రోడ్డు మీదికి వచ్చాడు..

బకరా బాబు ఇంటి ముందట నిలబడి కేక పెట్టాడు.. 'అయ్యా,, బాబు,, మీ అన్ని సమస్య లకి మంత్రం వేస్తా తలుపు తీయండి అని..

బకరా బాబు తలుపు తీసాడు..

'ఏమోయ్ మా మేనేజరిణి  కి ఏదైనా మంత్రం వేయి రాదూ.... పొద్దస్తమానం పనీ పనీ అని తెగ హైరానా పడి పోతూం టూంది అన్నాడు వాడు..

మంత్ర వాది బెరుకు పడ్దేడు .

అయ్యా మేనేజరి ణి  జిలేబీ గారేనా ? అడిగాడు వాడు..

అవునోయ్ నీకెట్లా తెలుసు ? చెప్పాడు బకరా బాబు..

అయ్యా ! ఆవిడ తలనొప్పి భరించ లేకనే కదా నే ఇట్లా మంత్ర వాది వేషం మొదలెట్టాను.. అన్నాడు మంత్ర వాది..

అప్పుడే ఆ వైపు ఓ టాటా సుమో గాడి దూసు కెళ్ళింది..

మంత్ర వాది వెంటనే వేషం మార్చి సీదా సాదా మానవుడు గా మారేడు..

సాదా సీదా మానవుడు సలాము కొట్టేడు టాటా సుమో గాడికి..

సలాం ముంబై !

(ముంబై కర్ లకి వారి ఓర్పు కి జోహార్లతో )

చీర్స్
జిలేబి..

Tuesday, July 3, 2012

గురు పూర్ణిమ - గుండు సున్నా

ఇవ్వాళ గురు పూర్ణిమ.

గురువు లేక ఎటువంటి గుణికి తెలియదని త్యాగరాజ స్వామీ వారి ఉవాచ.

అందరికీ ప్రస్తుత జమానా లో గురువు ఉండి ఉండ క పోవచ్చు.

అంటే, గురువు దొరకాలంటే దానికీ పెట్టి పుట్టి ఉండా లంటారు. నేను చెబుతున్నది సద్గురువు ల గురించి.

మన కర్మ కొద్దీ మనకు గుండు సున్నా గురువు లూ తగలవచ్చు.

గుండు సున్నా ఆహా ఏమి అమోఘం అని మనం వారి సున్నా లో భాగమై పోయి సుడి గాలి లోని నావలా కొట్టుకు పోవచ్చు.

కాబట్టి గురువు ని గురించి సదవగాహన కలిగి ఉండటం అన్నది మన ఈ కాలానికి కావలిసిన కనీస అవసరం. లేకుంటే గుండు సున్నా మనకి కలిగే అవకాశం ఉన్నది

కాషాయం కట్టిన వాడంతా గురువై పోతే మనం గుండు సున్నా లయి పోవడం ఖాయం.

ఓ ఫ్రిడ్జ్ కొనాలంటే మార్కెట్ లో కెళ్ళి వంద మార్లు విచారణ మొదలెడతాం. కాని స్వామీ వారల కొచ్చే సరికీ మన ఈ విచక్షణ హుష్ కాకీ అన్న మాట. !

ఇంతకీ గురు పూర్ణిమ అని ఇట్లాంటి సంభాషణ రాస్తున్నారేమిటి మీరూ ఏమైనా గుండు సున్నా గురువు లయి పోయారా అంటారా,మరి జిలేబీ రౌండు గా గుండు సున్నా లా నే కదండీ ఉండేది.?

అందరికీ శుభాకాంక్షల తో,

శ్రీ కృష్ణం వందే జగద్గురుం.

జిలేబి.

Friday, June 29, 2012

మహా నగరం లో బాక్ పాక్ బకరా బాబు!

బాక్ పాక్ మానవుడు రోడ్డున పడ్డాడు. తల తిరుగు తోంది ట్రాఫిక్కు వేగం తో రణగొణ  ధ్వనులతో .

మానవుడి కళ్ళు ఎర్ర బడి ఉన్నాయి.

రేతిరి ఇంటికి చేర డానికి తెల్లారే. మళ్ళీ తెల్లారి పరుగు మొదలెట్టాడు.

చాలా కాలం మునుపు తట్టా తపేలా లు భుజాన వేసుకుని పనికి వెళ్ళే వాడు. కూలీ చేసుకునే వాడు. కూసింత గంజి తాగే వాడు.

ఇప్పుడు భుజాన బాక్ పాక్ వేసుకున్నాడు. ఇప్పుడూ కూలీ చేస్తూనే ఉన్నాడు. కూసింత తిండి సమయం లో కూడా ' luncheon meeting' 'let us lunch-workout meet' లో పాపం తిండి తినడం సగం మాట్లాడడం సగం వెరసి ఏదీ పూర్తిగా జరగని 'కాలాతీత' స్టేజీ లో నిమగ్న మై ఉన్నాడు.

అదిగో అతడి అడుగు జాడలు. భారీ గా నడిచిన అతడి అడుగు జాడలు. ఆ ఆడుగు జాడలలో అతని బరువైన జీవనం అతని ఎండ మావి జీవనం ప్రతి ఫలిస్తోంది.

మహా నగరం లో బాక్ పాక్ బకరా బాబు మరో రోజుకి స్వాగతం పలికాడు.

నగరం తన మానాన నదీ ప్రవాహాన్ని మించి జన ప్రవాహం తో పరుగులు పెట్టింది.

జిలేబి.



Wednesday, June 27, 2012

మహా నగరం లో వెర్రి మానవుడు

రాత్రి పన్నెండు అవుతోందండీ , ఇక ఇంటికి వెళ్ళాలి అన్నాడు మానవుడు.

వాడి ప్రాజెక్టు మేనేజరి  ణి (ఈ ప్రాజెక్టు మేనేజర్లంతా జిలేబీలు ఎందుకు అవుతారు చెప్మా?)  చిరాగ్గా చూసింది.

అయితే ఏమిటి ?

'ఇంటికి వెళ్ళి  కాసింత సేపు పిల్లలతో క్వాలిటీ టైం స్పెండ్ చేద్దామని ' నసిగాడు వెర్రి మానవుడు.

'ఏం  మాకు పిల్లా జెల్లా లేరా ? మేం ఆఫీసు లో వున్నాం కదా ఇంకా ? ' ప్రాజెక్టు మేనేజరి ణి గదమాయించి ఓ తీవ్రమైన లుక్కు ఇచ్చింది.

बेचारा మానవుడు ఉసూరు మని సీట్లో తగల బడ్డాడు మళ్ళీ - ముందు మానిటరు వెక్కిరించింది- నన్ను వదలి నీవు పో లేవులే, అదీ నిజములే అని.


మానవుడు లాగిన్ అయి ఓ మెయిలు చూసాడు. మళ్ళీ పని లోకం లో పడ్డాడు.

మహా నగరం లో వెర్రి మానవుడు పాపం జిలేబీ లకి बकरा  అయి పోయేడు.


నో చీర్స్
జిలేబి.

Saturday, June 23, 2012

మూడో మారు జిలేబీ కోరితే ఖబడ్దార్ పెళ్లి కాన్సిల్ !

ఈ మధ్య అరవ దేశం వెళ్ళా.

మా మనవరాలు అరవ పేపరు ఇచ్చి బామ్మా మిర్చీ ఖబుర్లు (శర్మ గారి, ఫణి బాబు గారి ఖబుర్ల లా అన్న మాట !) చదువు, టైం పాస్స్ అవుతుంది అసలే మద్రాసులో వేడి ఎక్కువ కాస్త ఊరట పడతావు అంది.

అరవం మనకి అంత గా చదవడం రాదు. అక్షరాలు కూడా బలుక్కుంటూ చదివా,

మద్రాసు లో ఓ పెళ్లి లో , ఓ పెద్దాయన జిహ్వ చాపల్యం కొద్దీ , గులాబ్ జామూను మూడో మారు వెయ్య మన్నాడు వడ్డించే వాడితో.

వడ్డించే వాడు కాంట్రాక్టరు , కుదరదు పో,  అన్నాడు. ఎందుకోయ్ అని గొడవ పడ్డాడు ఆ పెద్దాయన.

ఆకుకి ఒక్క స్వీటే కాంట్రాక్టు లో వేస్తాం అన్నాడు వడ్డించే వాడు.

మాటా మాటా పెరిగే. జుట్లూ జుట్లూ జగడా లాడే! వీడు వాణ్ని తన్నే. వాడు వీడి బుర్ర రామకీర్తన గావించే. పెళ్లి పెటాకులయ్యే  స్టేజీ కి వస్తే పోలీసొడు మధ్యస్థం చేసి పెళ్లి ఆగి పోకుండా చేసేడు.

అదీ కథ !

సో, మీరు ఏ పెళ్లి కయినా వెళితే ఒక్క పారి మించి జిలేబీ వడ్డించ మని అడగ మాకండీ!

బ్లాగ్ లోకం లో జిలేబీ  లంటారా, అన్లిమిటెడ్ ఎడిషన్ మరి !

ఎంజాయ్ మాడి !

'క్షీరస'
జిలేబి.

Saturday, June 16, 2012

ఒన్స్ అగైన్ త్రీ జీ (ఈ మారు నో స్కాం - ఓన్లీ స్పాం !)

దేశానికి జీ కీ రుణాను బంధం ఎక్కువ.

'జీ' లంటే మనకి మరే మరీ మరీ 'లైకింగు!

ఈ మారు బెనర్జీ కలాం కావాలంటే, సోనియా జీ ముఖర్జీ కి జై పలికే !

కలాం జీ - ఈ పేరులో జీ సరిగ్గా కలవదు.

కాబట్టి కలాం మరో కాలం ఉమర్ ఖయ్యాం రాయడానికి రైసినా హిల్ కి అర్హుడు కాడు.

మరి ముఖర్జీ ప్రెసిడెంట్ అయితే, మరి రాబోయే ప్రధాని రాజీవ తనయ రాహుల వారా ?

మా మనమోహనుల వారిని తప్పించి ఆ ప్రదేశం లో మరోక్కర్ని పరదాన మంత్రి గా చూడలేం అని అనుకున్న వారికి
ఇదే సంకేతం.

రాబోయే తరానికి రాజీవ తనయుని పట్టాభిషేకానికి నాందీ వాచకం కి సంకేతం - 'ప్రణవ' నాదం - ప్రణ బా నందుడు ఒక సమిధ.


చీర్స్
జిలేబి.

Thursday, June 14, 2012

సరోజ - సకల రోగ జంజాటం

సరోజ - సకల రోగ జంజాటం !

మాలిని - మానసిక లిప్తకాల నిస్త్రాణ

కౌముది - కౌమారంలో ముదిత దివాలా


ఏమండీ ఇవంటారా ?

రోగాల లిస్టులు సరదాగా ఇట్లా పెరేట్టా .

ఇంకా చాలా ఇట్లాంటివి పెట్టు కోవచ్చు .

మీరూ ప్రయత్నిం చండి .

నామీద కొడతరామో  నని ముందస్తే నా పేరూ జోడిం చేసా !


జిలేబి  - జివ్వున లెగ్గు బిగువు !

ఎందు కండీ ఇవన్నీ అంటారా ?

మన దేశం లో , ఈ భూగోళ మండలం లో - రోగాలు రోష్టులు ఎక్కువై పోతున్నాయి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గి పోతుంది అని డాక్ట రుల గోల మరి !


చీర్స్
జిలేబి.

Sunday, June 10, 2012

శబ్దం నిశ్శబ్దం

రెండు పదాల మధ్య నిశ్శబ్దం
వాటి  అర్థాన్ని చెబుతోంది


రెండు హృదయాల మధ్య
నిశ్శబ్దం వాటి అర్థాన్ని చెబుతోంది.


రెండు పదాల మధ్య
శూన్యత లోపిస్తే
వాటికి అర్థాలు లేవు.


ప్రభూ, నీకూ నాకూ మధ్య
శూన్యత లోపిస్తే
నా ఉనికి కి అర్థం లేదు.

జిలేబి.

Saturday, June 9, 2012

మేం వయసు కొచ్చేసాం!

మేం వయసు కొచ్చేసాం!

అదేమిటండీ, ఏ స్వీట్ సిక్స్టీన్ లోనో, కాకుంటే, టీన్ అటారః లో నో చెప్పాల్సిన మాట ఇట్లా రిటైర్మెంటు ఏజు లో చెబ్తున్నారు ?

అవునండీ, మరి, వయసు కొచ్చాం అంటే, ఏ వయసుకు అని అడగకుండా, మీరే అట్లా ఊహించు కుంటే ఎలా మరి !

ఇంతకీ ఏ వయసు కొచ్చారు?

మతిమరపు వయసు కొచ్చామండీ మరి !

అదేమిటండీ ??

అంతే కదండీ మరి, నిన్న మా జంబునాధన్ అయ్యరు గారి తో బజారు కెళ్ళి వారిని మధ్య దారిలో మరిచి ఇంటికి వచ్చాక,

'అయ్యోరామా, అయ్యరు గారు ఏమయ్యారు చెప్మా బామ్మా అంటే,

'ఔరా, వీర్ని మరిచి పోయామే ఎట్లా మరి అని వయసు కోచ్చేసాం అని తీర్మానించు కునేసా ! అదన్న మాట విషయం.

'జాంబజారు జగ్గు నా సైదా పెట్టై కొక్కు ' అని అరవం లో ఒక (మా) పాత కాలపు పాట ఉందండోయ్ !

అదేమిటండీ, పాత కాలపు పాటల్ని గుర్తుకు పెట్టుకున్నారు.

 (ఈ మాట అంటే, శ్యామలీయం వారు, అదీ సరిగ్గా గుర్తుకు పెట్టు కోలేదు సుమీ అంటారేమో మరి !- రుస రుస బుస బుస గుండమ్మ కథ లోనిది అని చెప్పినట్టు!) ,

మరి మీ ఈ కాలపు అయ్యరు గారిని మరిచి పోయారు సుమీ అంటారా ?

మరి ఈ 'మతిమరుపు' వయసు కొచ్చాం కాబట్టి, ఈ వయసు జాడ్యం కూడా ఇది మరి, పాతవన్నీ టపీ టపీ మని గుర్తు కోచ్చేస్తాయ్,

ప్రతి దానికీ, 'మా చిన్నప్పు డండీ అని మొదలెడతాం చూడండీ ,

కాకుంటే, మేం చదువుకునే రోజులల్లో అంటూ కథలు చెప్పడం మొదలెడతాం చూడండీ అప్పుడే తెలిసి పోతుంది మరి, మేం వయసు కొచ్చేసామని !

మా కాలం లో నండీ మరి ......

మిస్సమ్మ అనే చిత్రం లో 'పల్లెకు పోదాం, పారు ని చూద్దాం' అని ఓ బ్రహ్మాండమైన హిట్ సాంగ్ వుండే దండీ! ....


చీర్స్
జీరింగ్లీ జిలేబి.