Tuesday, July 3, 2012

గురు పూర్ణిమ - గుండు సున్నా

ఇవ్వాళ గురు పూర్ణిమ.

గురువు లేక ఎటువంటి గుణికి తెలియదని త్యాగరాజ స్వామీ వారి ఉవాచ.

అందరికీ ప్రస్తుత జమానా లో గురువు ఉండి ఉండ క పోవచ్చు.

అంటే, గురువు దొరకాలంటే దానికీ పెట్టి పుట్టి ఉండా లంటారు. నేను చెబుతున్నది సద్గురువు ల గురించి.

మన కర్మ కొద్దీ మనకు గుండు సున్నా గురువు లూ తగలవచ్చు.

గుండు సున్నా ఆహా ఏమి అమోఘం అని మనం వారి సున్నా లో భాగమై పోయి సుడి గాలి లోని నావలా కొట్టుకు పోవచ్చు.

కాబట్టి గురువు ని గురించి సదవగాహన కలిగి ఉండటం అన్నది మన ఈ కాలానికి కావలిసిన కనీస అవసరం. లేకుంటే గుండు సున్నా మనకి కలిగే అవకాశం ఉన్నది

కాషాయం కట్టిన వాడంతా గురువై పోతే మనం గుండు సున్నా లయి పోవడం ఖాయం.

ఓ ఫ్రిడ్జ్ కొనాలంటే మార్కెట్ లో కెళ్ళి వంద మార్లు విచారణ మొదలెడతాం. కాని స్వామీ వారల కొచ్చే సరికీ మన ఈ విచక్షణ హుష్ కాకీ అన్న మాట. !

ఇంతకీ గురు పూర్ణిమ అని ఇట్లాంటి సంభాషణ రాస్తున్నారేమిటి మీరూ ఏమైనా గుండు సున్నా గురువు లయి పోయారా అంటారా,మరి జిలేబీ రౌండు గా గుండు సున్నా లా నే కదండీ ఉండేది.?

అందరికీ శుభాకాంక్షల తో,

శ్రీ కృష్ణం వందే జగద్గురుం.

జిలేబి.

2 comments:

  1. guru poornima subhakankshalandi,
    manchi guruvvu ni vethukkovadam chaala kastamenandi, thank you.
    33 cheers

    ReplyDelete
  2. జిలేబీగారూ
    నిజమే ఈ నాటి పరిస్థితి మనని దొంగగురువుల బారిన పడవేస్తున్నది.
    చిక్కల్లా యెక్కడ వస్తున్నదంటె మనమే మన గురువును నిర్ణయించుకోవాలని చూస్తూ ఉండటం వల్లనే. అంత ప్రతిభావంతులమే అయితే మనకి గురువు అవసరం యేమీ లేదు గదా. అది తెలుసుకోము. సత్య మేమిటంటే, ఒకరు అర్హులైన శిష్యులైతే, వారిని గురువే స్వయంగా చేరదీస్తాడు. గురువు పట్టుకోవాలి శిష్యుని తద్విలోమంగా కాదు. మనం తలక్రిందులు పనులు చేస్తే తలక్రిందులు చేసే గురుబ్రువులే తారసపడి దోస్తారు!
    చూడండి: ( http://syamaliyam.blogspot.in/2012/07/blog-post.html ) గురుతు పట్ట లేరు నిన్ను గురుడవని మూఢజనులు

    ReplyDelete