Friday, July 6, 2012

మహానగరం లో మంత్రవాది

 మహానగరం లో సూరీడు హర్రీ బర్రీ గా ఉదయించాడు.. తనకి నగరం లో వాళ్ళు నిద్దురోతే నప్పుదు లాగుంది,, పైకి వచ్చీ రావడం తోటే, సుర్రు  మని తీక్షణం గా నగరాన్ని చూసాడు..

బ్యాక్ప్యాకు  బకరా బాబు నిద్ర లేచి  ఆవులించాడు.. ఇంకా నిదుర మత్తు వదల్లేదు తనకి.. మరో రోజుకి స్వాగతం చెప్పాలా వద్దా అని ఆలోచించి బుర్ర వేడెక్కటం తో ఆ ఆలోచనకి ఉద్వాసన .పలికాడు

మనిషి రేతిరి నిదుర లేమి తో డీలా పడి పోయున్నాడు.. ఆ పై కరెంటు .కోత . బస్సుల వాహనాల రణ గొణ ధ్వనులు..

సరిగ్గా అప్పుడే ఓ మంత్ర వాది మంత్రం వేస్తా నని రోడ్డు మీదికి వచ్చాడు..

బకరా బాబు ఇంటి ముందట నిలబడి కేక పెట్టాడు.. 'అయ్యా,, బాబు,, మీ అన్ని సమస్య లకి మంత్రం వేస్తా తలుపు తీయండి అని..

బకరా బాబు తలుపు తీసాడు..

'ఏమోయ్ మా మేనేజరిణి  కి ఏదైనా మంత్రం వేయి రాదూ.... పొద్దస్తమానం పనీ పనీ అని తెగ హైరానా పడి పోతూం టూంది అన్నాడు వాడు..

మంత్ర వాది బెరుకు పడ్దేడు .

అయ్యా మేనేజరి ణి  జిలేబీ గారేనా ? అడిగాడు వాడు..

అవునోయ్ నీకెట్లా తెలుసు ? చెప్పాడు బకరా బాబు..

అయ్యా ! ఆవిడ తలనొప్పి భరించ లేకనే కదా నే ఇట్లా మంత్ర వాది వేషం మొదలెట్టాను.. అన్నాడు మంత్ర వాది..

అప్పుడే ఆ వైపు ఓ టాటా సుమో గాడి దూసు కెళ్ళింది..

మంత్ర వాది వెంటనే వేషం మార్చి సీదా సాదా మానవుడు గా మారేడు..

సాదా సీదా మానవుడు సలాము కొట్టేడు టాటా సుమో గాడికి..

సలాం ముంబై !

(ముంబై కర్ లకి వారి ఓర్పు కి జోహార్లతో )

చీర్స్
జిలేబి..

2 comments:

  1. ఏడ్చేవాళ్ళని బలే నవ్విస్తారు.

    ReplyDelete
  2. ఏమిటో ..కష్టాలకి అతీతంగా బ్రతికేస్తున్నాం, ఓదార్పు చేపుతారనుకుంటే..ఏమిటండీ..ఇలా?
    పోనీలెండి..ఇలా అయినా ఓ..పోస్ట్ పడింది.:)

    ReplyDelete