కౌసల్యా సుప్రజా రామా ....
కర్తవ్యమ్ దైవమాహ్నికం ....
సుప్రభాత వేళ మధ్యన తటాలున 'పాహి రామప్రభో ' అన్న బ్లాగార్ద్ర నాదం వినబడ్డది
శ్రీ రాముల వారు ఉలిక్కి పడి నిదుర లేచేరు. రొటీన్ గా వచ్చే సుప్రభాత సేవ శ్లోకాలకు నిదుర లేవడం స్వామి వారు ఎప్పుడో మానుకునెరు.
కొండ పైన నిదుర పుచ్చడమే చాలా లేటు ఆ పై తన కలియుగ ప్రాణాన్ని గోవిందా గోవిందా అని పెందరాళే లేపెస్తున్నారాయే.
కానీ ఈ మధ్య రెగ్యులర్ గా వచ్చే బ్లాగార్ధ్రనాదం తో స్వామీ వారు 'సుప్రభాతాన్ని' చూడ గలుగు తున్నారు తనివి తీరా.
కొంత కాలం గా సుప్రభాత సేవ తో బాటు మరో కొత్త ఆర్ద్ర నాదం విన వస్తోంది 'పాహి రామప్రభో' అంటూ .
స్వామి వారు అమ్మవారి వైపు చూసేరు - గాఢం గా నిదుర పోతోంది దేవేరి !
ప్చ్ ఈవిడికున్న సౌకర్యం మనకు లేకుండా పోయిందే అనుకుని స్వామి వారు నిదుర లేచి ల్యాపు టాపు ఓపెన్ చేసి ఆ బ్లాగార్ధ్ర నాదాన్ని గమనించేరు .
ఎవడో మానవుడు పాపం పంచ దశ లోకం నించి తన్ను రోజూ పిలుస్తున్నాడు 'పాహి రామప్రభో' అంటూ.
స్వామి వారికి ముచ్చట వేసింది . ఈ మానవుడు పాహి పాహి అంటూ తన మీద ఆధార పడి పోవడం గురించి
ఈ మధ్య కాలం లో ఎవ్వడూ స్వంతం గా తన్ను పాహి పాహి అనటం లెదు. గుళ్ళో కూడా అదేదో 'రికార్డు' లట కాకుంటే 'డిస్కు' లట వాటిల్లో సుప్రభాతాన్ని పెట్టి తన నిదుర ని చెడ గొట్టి ఈ కలియుగ మానవులు గుర్రు పెట్టి నిదుర పోతున్నారు
తనేమన్నా రికార్డు డాన్స రా రికార్డు పెడితే ఆడ టానికి ? కాకుంటే 'డిస్కో శాంతి యా డిస్కు పెడితే డాన్సా డ టా నికి ?
అట్లాంటి ఈ వెర్రి తలల కాలం లో ఈ బ్లాగ్భక్తుడు రోజూ మనః స్ఫూర్తి గా పద్య మాలికలల్లి తనని 'పాహి' పాహి' అంటు న్నాడు !
రాముల వారికి ముచ్చటే సింది . చూద్దాం ఇంకా ఎంత గాఢం గా పాహి పాహి అంటాడో ఆ పై కరుణి ద్దా మనుకుని బ్లాగు సైన్ అవుట్ అయి లాపు టాపు కట్టి బెట్టి మళ్ళీ 'ఆనీదవాతగ్ స్వదయా తదేకం' అయ్యేడు.
సీతమ్మ ముసి ముసి నవ్వులు నవ్వింది . తన్ను ఆ మానవుడు పాహి పాహి అని ఉంటే, ఈ పాటి కి స్వామి వారిని ఇట్లా నిదుర పోనిచ్చేదా ? పట్టు బట్టి స్వామి వారిని బయలుదేర దీసి పంచ దశ లోకం వెళ్లి ఆ మానవుని దీవించి రమ్మని చెప్పి ఉండదూ ?
అర్థం చేసుకోరూ !!
శుభోదయం
జిలేబి !