Friday, July 5, 2013

Man-Gaal-సూత్రం !


Man
 
Gaal
 
అనుసంధాన 
 
సూత్రం !
 
మంగళ సూత్రం !
 
శుభోదయం 
 
చీర్స్ 
జిలేబి 

Wednesday, July 3, 2013

మనవాళ్ళుట్టి వెధవాయిలోయ్ !


మనవాళ్ళుట్టి వెధవాయిలోయ్ !
ఎవరన్నారండీ ఈ మాట ! 
గిరీశం గారితో చెప్పించింది  ఎవరు ? 
ఎందుకు చెప్పించేరు ?
చెప్పేరు కదా అని మనం గిట్లా మన పేరుని సార్థకం చేసేసు కుంటున్నా మంటే మనం ఎంత గోప్పోళ్ళం ! అర్థం చేసుకోరూ మరీను !

అబ్బా కాలాతీతం గా ఈ మాట చారిత్రాత్మక మైన సత్యమై పోయింది ! 

హేవలాక్ బ్రిడ్జీ కట్టినా బ్రిటీషోడు  వెళ్లి అరవై ఏళ్ళు దాటినా గురజాడ వారు మనం ఉట్టి వెధవాయిలోయ్ అని జెప్పి ఆ సోరాజ్జెం  వచ్చిన కాలం దాటి పోయినా  ఇంత నిర్ద్వ్హంధం గా మనం మనల్ని గురించి న ఈ మాట తప్పు కాకుండా , చెక్కు చెదర కుండా మనకున్న ఈ క్వాలిటీ ని పరిరక్షించు కుంటూ వస్తున్నా మంటే మనం ఎంత గోప్పోళ్ళం ! అర్థం చేసుకోరూ మరీను !

పిండా కూడు పోయి ఆ ఉత్తర దిక్కున మనవాళ్ళు ప్రాణాలు అరచేతిలో టావుల్ దప్పి ఉంటే మనం ఒకరి నొకరం ఆడి  పోసుకుంటూ ఆయ్ నువ్వొట్టి వెధవాయోయ్ అని ఎగస్పార్టీ వాణ్ని కాలరాచేస్తూ దినపత్రికలలో టాప్ మేటరై పోయా మంటే మనం ఎంత గోప్పోళ్ళం ! అర్థం చేసుకోరూ మరీను !

దేశాన్ని ఉద్దరించే స్తామన్న ప్రతి వెర్రోడికీ సై అని పట్టం కట్టి మనల్ని మనం శేబాష్ అని తట్టేసు కున్న వాళ్ళ మాయె అంటే మనం ఎంత గోప్పోళ్ళం ! అర్థం చేసుకోరూ మరీను ! 


చీర్స్
జిలేబి 



Sunday, June 16, 2013

గుడి - లోన దేవుడు - బయట బికారి !

గుడి - లోన దేవుడు - బయట బికారి

మూసిన గుడి తలుపుల వెనుక
లోన దేవుడు శయన మై ఉన్నాడు

బయట మానవుడు బికారియై దేబరిస్తున్నాడు

హృదయేషు లక్ష్మి వాసం నివాసం
అయినా ఎందుకో ఈ మానవునికి ఈ బికారి తనం

ప్చ్ గుడి తలుపులు  తెరవ వోయి ,
నీ తలపుల లో ఆతనిని నింప వోయి

ఆశాంతం ఆతనిని నీవై చేసు కోవోయి
ఇక లక్ష్మీ రమణుడు నీ  వాడే నోయి

జిలేబి


Friday, June 14, 2013

అయ్యరు గారు ఊరెళితే !

'
ఇదిగో జిలేబీ ఈ సారి నేను నిన్ను విడిచి ఊరెళ్ళి రావలసి వస్తోంది , నువ్వెట్లా మేనేజ్ చేస్తావేమో మరి '  మా అయ్యరు గారు ఊరు వెళుతూ విచారం గా ముఖం పెట్టేరు .

'ఆ మీరు ఊరు వెళ్లి రండి నాకేం, బ్రహ్మాండం గా ఉంటా ' అన్నానే గాని, లోపల బిక్కు బిక్కు మంటోంది .

రోజూ అయ్యరు  గారు చేసే బ్రహ్మాండమైన భోజనం గావించేస్తూ , వారి మీద రాజ్యం ఏలుతూ, వారిని ఆదమాయిస్తూ  గడిపేస్తూ ఉండటం గుర్తుకొచ్చి ఊఫ్ , ఇక వంట మనమే చేసుకోవాలా మరి అని నిట్టూర్చా .

ఫోటో లో మా బామ్మ నవ్వుతూ చూస్తోంది . మా బామ్మ ని మొట్టేయ్యాలని అని పించింది . ఆ వంటా వార్పూ మా అమ్మ నేర్చుకోవే అంటే, బామ్మ, నిఖార్సుగా చెప్పింది అప్పట్లో, 'ఆయ్ , జిలేబీ వంటా వార్పూ నేర్చుకోవడ మేమిటి ? వచ్చే ఆ ఏబ్రాసి గాడెవడో వాడే వండి పెడతాడు లే అని గదమాయించి వంటా వార్పూ నించి విముక్తి కలిగించడం తో అప్పట్లో అబ్బా మా బామ్మ మంచి బామ్మ అనుకున్నా . అట్లే పట్టుబట్టి, వంటా వార్పూ తెలిసిన అయ్యరు గారిని నాకు కట్ట బెట్టేయ్యడం కూడా ఆవిడ చలవే !

ఇన్నేసి సంవత్సరాలు కాలు మీద కాలు వేసుకుని దర్జా గా బతికిన జిలేబి ఇక వంటా వార్పూ చేసుకుంటూ బతకాలా ? చట్ , జాన్తా నాయ్ , ఎ హోటల్ కో వెళ్లి భోజనం కానిచ్చేద్దాం అనుకున్నా .

నా ఆలోచన పసికట్టేరు లా ఉన్నారు మా అయ్యరు  గారు ' ఇదిగో జిలేబీ, హోటలూ  గట్రా వెళ్లి ఆరోగ్యం పాడు జేసుకో మాక , ఫ్రిడ్జ్ లో దోస వేసుకోవడానికి పిండి వగైరా గట్రా పెట్టి ఉన్నా. అట్లాగే మంచి నీ కిష్ట మైన సబ్జీ పెట్టి ఉన్నా . కుకర్ లో రైజ్ పడేసు కో ! ఆ సబ్జీ కి చింత పండు నీరు కలిపి ఉడకబెట్టేయి , నీకు హాంఫట్ సాంబార్ తయార్ '
అన్నారు

సర్లెండి, సర్లెండి అన్నా ఇప్పుడు ఈయన గారిని కాదంటే ఇంకా పెద్ద లెక్చరు పీకుతారేమో అని భయమేసి !

'నీ ఆరోగ్యం జాగ్రత్తే' అంటూ మరో మారు విచారం కనబరచేరు

తట్ , మీరు వెళ్ళేది ఓ వారం రోజులు దానికి ఇంత సీన్ బిల్డ్ అప్ ఇవ్వాలా ? మా బ్లాగు లోకం వాళ్ళు నా గురించి ఏమని అనుకుంటారు మరి ? ఓస్ , ఈవిడకి ఈ పాటి పని కూడా తెలీదా అని తీసి పారేయ్యరూ మరి ? ' అన్నా

సర్లేవే, నీ బ్లాగు గొడవల్లో , భోజనం గట్రా మరిచి పోయేవు జాగ్రత్త అని మరో మారు జాగ్రత్తలు జెప్పి వెళ్ళేరు

ఆయన అట్లా వెళ్ళిన అర్ధ గంట లో యధాతధం  గా , 'అయ్యరు వాళ్ ' కాఫీ అని కేకేసా బ్లాగులు చదువుతూ .

నిశ్శబ్దం ! ఊప్చ్ , ఇక మనమే కాఫీ గట్రా పెట్టేసు కోవాలా ! ఓహ్ వద్దులే కాఫీ మానేద్దాం అని తీర్మానించేసి  హ్యాపీ అయి పోయా

మరో అర్ధ గంటలో కడుపులో ఆకలి కసామిస అన్నది !

ప్చ్ , ఈ మారు ఎట్లా ఒట్టి  నీళ్ళు తాగి ఊరుకుంటే సరి పోతుందేమో అనుకుని , ఏదో అయ్యరు గారు చెప్పేరు గదా ఫ్రిడ్జ్ లో ఏదో పెట్టేరని అది చూద్దాం అనుకుని చూసా .

దోసకి కావాల్సిన పిండి ఉన్నది . సబ్జీ వేపుడు ఉన్నది !

హమ్మయ్య దోసెలు వేసుకోవచ్చు అనుకున్నా .

ప్చ్, హ్యాపీ గా టపాల  జిలేబీ లు వేసుకునే స్థాయి నించి దిగబడి ఇట్లా దోసెలు వేసుకునే స్థాయి కి పడి  పోయామే అనుకున్నా !

సరే ఇక దోసెలు వేసుకుని ఆ సబ్జీ మళ్ళీ ఉడక బెట్టి అబ్బా 'this is too complicated process, there should be some simplified process of CMMI (Complete Meal Maker Integration!) ' అనుకుని ,ఏమి చేద్దామబ్బా అని ఆలోచించి , ఆలోచించి (దాంతో టే  మళ్ళీ ఆకలి నక నక ఇంకా ఎక్కువై పోయింది !) ఒక నిర్ణయానికి వచ్చి ,
ఆ సబ్జీ ని దోసె పిండీ ని కలిపా 'This stuff became too compact, there should be some 'free flow' for the dosa to come properly' అనుకుని కొంత నీళ్ళు కలిపి పాన్ మీద దోసెలు వెయ్యడం మొదలెట్టా !

మొదటి దోసె హాంఫట్ అని తుస్సు మన్నది . సరే పోనీ లే అని పాన్ ని ఇంకా గరం కానిస్తే  రెండో దోస నించి  సరిగ్గా దోసె క్రిస్పీ గా రావడం మొదలెట్టింది !

వావ్, ఐ హావ్ మేడ్ ఎ కంప్లీట్ మీల్  టుడే ! అనుకుని 'Mixed Vegetable Dosa' చెయ్యడం నేర్చేసుకున్నా అని బహు సంతోష పడి  పోయా !

మా ఆఫీసులో వాళ్ళు మేమ్  సాహిబా, అయ్యరు  గారు ఊరు  వెళ్ళేరు కదా, మీకు భోజనం ప్రాబ్లెమ్ అయి పోయి ఉంటుందే అంటే, 'No, no, you see, I have made Mixed Vegetable Dosa'  అని  గొప్ప గా చూపించా టిఫన్ బాక్స్ ఓపెన్ జేసి . 

'మేమ్  సాహెబ్, మీరు ఏ  విషయం లో నైనా ఘటికులే మరి '  ఓ కాంప్లిమెంట్ ఇచ్చేసి వెళ్లి పోయేరు కొలీగ్స్ .

జిలేబీ యా మజాకా ! ఇదిగో బలాగు బలాదూరు భామా మణులు , మీరేమీ వర్రీ అవకండి మనకు తెలియని విషయం అంటూ ఏమీ లేదు ! అంతా కొంత బుర్ర ఉపయోగిస్తే చాలు అంతే !

ముదితల్ నేర్వగరాని విద్య గలదె, ముద్దార నేర్పించినన్ అని ఊరికే అన్నారా మరి ? ముద్దార  ఎవ్వరూ నేర్పక పోయినా ముదితలికి 'నేర్పు' అన్నది 'స్వయం' భాసితం !


శుభోదయం
చీర్స్
జిలేబి


 

Wednesday, June 12, 2013

V.I.P - ఏడు కొండల పెరుమాళ్ళు !

కొండ దేవర ఉలిక్కి పడ్డాడు !

పంచ దశ లోకం లో శ్యామలీయం అనే భక్తుడొకాయన ఎవరో  V.I.P లకి V.I.P లడ్డులు వేరు గా ఇవ్వాలా అని ప్రశ్నిస్తే, టాం  అని వీరు 'ఆయ్  వేరే లడ్డూలు మాత్రమేమిటి  ఖర్మ వాళ్ళ కోసం V.I.P ఏడుకొండల దేవర దేవాలయం కట్టించ మని సలహా ఇచ్చేరు .

ఆ, ఇదేదో సలహా మరీ బాగుందే , అవునుస్మీ , మనకు ఈ అవిడియా  ఇంత దాక తట్ట లేదుసుమీ అని కొండ దేవర పాలక మండలి ముక్కు మీద వేలు వేసుకుని మరీ హాశ్చర్య పోయి, వెంటనే తీర్మానించేరు  'ఇక స్పెషల్ గా కొండ దేవరకి కొత్త గా V.I.P దేవాలయం ఒకటి కట్టి పడేసి, ఆయన్ని ఆ వచ్చీ పోయే V.I.P లకి కట్టి కుదెయ్యాలని  !

అదిగో ఆ ఆలోచనతో నే కొండ దేవర ఉలిక్కి పడ్డాడు !

పంచ భక్ష పరమాన్నం లో ఎప్పుడో ఒకప్పుడు పంటి క్రింద రాయి తగిలితే పొతే పోనీ అనుకొవచ్చు. అట్లాగే భక్త కోటి సమూహం లో అప్పుడప్పుడు వచ్చే V.I.P వాళ్ల  కష్ట నష్టాలు విని ఓస్ వీళ్ళది ఏమి బాధ , ఆ అశేష జన వాహిని బాధల కన్నా నా వీరి బాధ అని కొట్టి పారెయ్య వచ్చు !

ఇప్పుడు స్పెషల్ గా తను ఈ V.I.P ల కోసం పొద్ద స్తమాను కాళ్ళు అరిగి పోయేలా నిలబడి వేచి ఉండి  వాళ్ళు చెప్పే కష్ట నష్టాలు వింటూ ఊరుకోవలసిన దే నా !

ప్చ్ , తన కంటూ ఒక అభిప్రాయం ఉంటుందని, తన్ను కన్సల్ట్ చేసినారా ఈ కమిటీ వాళ్ళు ! ప్చ్ తాను  పేరుకి పెరుమాళ్ళు . తన మొర  వినే నాధుడు ఎవడూ లేదే మరి అని నిట్టూర్చాడు

అంత లో ఓ పరమ బికారి అంత సేపు జన వాహిని లో నిలబడి కాళ్ళు నొప్పెట్టి ఆ స్వామీ వారి ముందు వచ్చి తనకు స్వామీ వారిని చూసే ఆ ఒక్క క్షణానికి కలిగిన అదృష్టం  కలిగినందులకు  మహాదానంద భరితుడై గోవిందా గోవిందా అన్నాడు !
గోవిందుడి  ఆనంద భాష్పాలు ఆ బికారి కి తీర్థ మయ్యింది వాడు భక్తీ తో కళ్ళ కద్దుకుని మళ్ళీ గోవిందా అన్నాడు .

పొతే పోనీ లే , ఇట్లాంటి భక్తులకోసం తను మరో VIP గాడ్ అవతారం దాలిస్తే ఏముంది ! వీళ్ళు అట్లీస్ట్  సంతోష పడతారు అని తృప్తి  పడ్డాడు !

Very Intimate Perumaal కోవెల రూపు దిద్దు కో సాగింది !

కథ కంచికి మనం నిదురకి  !
గోల్ మాల్  గోవిందా !!

చీర్స్
జిలేబి
(శ్యామలీయం వారి ప్ర. జ. కామెంటు చదివాక !)

ఈ సుబ్బు, సత్తి బాబు, అయ్యరు వీళ్ళంతా ఎవరు ?


ఒకరేమో సుబ్బు ని హటాత్తు గా తెచ్చి కాఫీ మిష తో పని కలిపిస్తారు .

మరొకరేమో సత్తి బాబు పేరిట వదినా కాఫీ అంటూ వచ్చి మనకు ఖబుర్లు చెబ్తారు

మరోకావిడేమో , 'మా అయ్యరు ' అంటూ అప్పుడప్పుడు మేళ మాడు తోంటూ ఉంటుంది హాటు స్వీటు లు ఇస్తూ .

మరొకరేమో , (ఈ మధ్య ఈయన ఏమైయ్యారో అసలు కనిపించడం లేదు , వినిపించడం లేదూన్ను !) పద్మావతి ని లాక్కొచ్చి కథలు చెబ్తూంటారు  ( చెబుతుండే వారు అని గతించిన కాలము లో చెప్పవలె కాబోలు !)


ఇట్లా మన పంచ దశ లోకం లో ఇంకా కొందరు ఉండ  వచ్చు ! మీకు తెలిసన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళుంటే చెప్పగలరు !

ఇంతకీ వీళ్ళంతా ఎవరు ! ? వీళ్ళకీ ఈ టపాలు రాసే వాళ్ళకీ ఈ అవినాభావ సంబంధం ఏమిటి ?

దీని పై మీ అభిప్రాయములు తెలుప గలరు !!

చీర్స్
జిలేబి
 

Sunday, June 9, 2013

తెలుగు వీర లేవరా, తెలుగు తెగులు వదుల గొట్టురా !


ఈ టపా intentionally ఖాళీ గా వదుల బడింది . 
 
వీరులు , వీరాంగణలు ఈ టపా కంటెంటు పూర్తి చేయుదురని  
 
తద్వారా తెగులు వదులు నని ఆశిస్తూ ... 
 
 
జిలేబి ఉచితం !

 

Saturday, June 8, 2013

ఉండమ్మా బొట్టు పెడతా !


ఉండమ్మా  బొట్టు పెడతా ! అన్నా ఆ వచ్చిన అమ్మాయి తో .

ఆంటీ , ఈ బొట్టు ఇట్లాంటి వి పెట్టు కుంటే పెళ్లి అయి పోయినట్టు లెక్క . నా కింకా పెళ్లి కాలేదు కాబట్టి వద్దు లెండి ' అందా పిల్ల.

 ఆ! అన్నా

అదేమిటమ్మాయ్ , బొట్టు కాటుక ఆడవారికి అందం చందం కాదా ! అట్లా అంటా  వేమిటి ? అన్నా బుగ్గ నొక్కేసు కుంటూ .

అట్లా అని మా మనవరాలి వైపు జూసా . ఏమిటే ఈ అమ్మాయి ఇట్లా అంటోంది అన్నట్టు జూసా .

మా మనవరాలు ఇబ్బంది గా నవ్వింది .

అది కాదే , మా ఫ్రెండు కి అమెరికా వెళ్ళా లని కొరిక. అందుకే ఇప్పట్నించే దానికి తయారి '  మా మనవరాలు మాట దాటేసింది .

నాకు ముచ్చటే సింది . ఈ మనవరాలు  అచ్చు నా పోలికే మరి ! ఎట్లా ఐతే నాకు మా బామ్మ పోలికో అట్లాగే దీనికీను . నాజూకు గా ఆ అమ్మాయిని ఇబ్బంది నించి కాపాడే సింది .  లేకుంటే నేనింకా నాలుగు మాటలు ప్రశ్నలు ఎక్కువ వేసి ఉందు  నెమో మరి !

సర్లే, అమ్మాయి, ఇంతకీ అట్లా అని ఎవరు జెప్పేరే ? అడిగా ఆ అమ్మాయి తో

మమ్మీ బోలీ అంది ఆ పిల్ల.

వామ్మో, వామ్మో, ఈ మధ్య ఇంట్లో వీధిలో ఆఫీసుల్లో అన్ని చోట్లా జిలేబీ ల దే రాజ్యమాయె . అన్నీ సరికొత్త హంగులు దిద్దు కొంటోంది .

మా కాలానికి మేమే అడ్వాన్స్ ఐన వాళ్ళం అనుకున్నామ్.  ఇప్పటి ఈ అమ్మాయిల్ని చూస్తోంటే మరి మేము నిజం గా నే అడ్వాన్స్ ఐన వాళ్ళ మెనా అన్న సందేహం గబుక్కున వచ్చేసింది .

కాల వాహిని లో ప్రతి తరమూ  తానె ఒక రెవల్యూషనరీ అని అనుకుంటుందేమో మరి .

మరో తరం వచ్చి మరిన్ని సరి కొత్తదనాన్ని  తెస్తే , అది మంచో చెడో దాని పర్యవసానం అప్పటికి తెలియక రాబోయే కాలం లో నే తెలుస్తుందేమో మరి !

అంతా విష్ణు మాయ కాకుంటే మరి ఏమిటి ? ఉండమ్మా  బొట్టు పెడతా అన కుండా ఇక మీదట 'హాయ్ హేవ్ గుడ్ ఫన్ ' అని దీవించ డానికి అలవాటు పడాలి మరి !


చీర్స్
Jail లేని 'Bee'

Tuesday, June 4, 2013

కామెంటిన కనకాంగి కోక కాకెత్తుకు పోయిన చందం !

కామెంటిన  కనకాంగి కోక కాకెత్తుకు పోయిన చందం ! ఓ రెండు సంవత్సరాల మునుపు రాసిన 'బ్లాగ్వెతలు  ఎంజాయ్ !!

నా కలలో పండిన ' బ్లాగ్వెతలు' !
 


కామెంటిన కనకాంగి కోక కాకి ఎత్తుకు పోయిందని ....

 
టపా టప టప టైపాడిస్తే చాలదు , కామెంట్లూ పండాలి


జగమెరిగిన బ్లాగరునికి సంకలిని ఏల ?

 
కానక కానక కామెంటు పెడితే , కరెంటు పోయిందట !

 
ఈ బ్లాగుకి ఆ బ్లాగు ఎంత దూరమో, ఆ  బ్లాగుకి ఈ బ్లాగు కూడా అంతే దూరం !

 
కొత్త బ్లాగరు 'కూడలి ' వదలడు, కొత్త బ్లాగిణి హారం వదలదు!

 
టపాలు రాసి కూడలి లో కామెంట్లకోసం దేబరించే మొహమూ నువ్వూను !

 
చీర్స్ సరిగ్గా చెప్పలేని  చెంచు లచ్చి , బ్లాగాడటానికి వచ్చిందట
 

 
చీర్స్
 జిలేబి.

Monday, June 3, 2013

Deciphering Cosmic Number - 137


ఈ మధ్య Deciphering the Cosmic Number (by Arthur I Miller ) అన్న పుస్తకం చదవటం జరిగింది . ఈ పుస్తకం కాల్ యుంగ్(సైకో అనలిస్ట్) , వోల్ఫ్ గాంగ్ పౌలి (ఫిజిసిస్ట్ - పీరయాడిక్  టేబల్ - ఎక్స్ క్లూషన్ ప్రిన్సిపల్  కి నోబల్  గ్రహీత)  మధ్య జరిగిన సంభాషణలు , పౌలి కన్న కలల డ్రీమ్ అనాలసిస్ వగైరా విషయాల తో చాలా ఆసక్తి కరం గా పుస్తకం సాగుతుంది .

ఈ పుస్తకం లో ని డ్రీమ్  అనాలసిస్ మన పనిలేక డాక్టరు రమణ బాబు గారి లాంటి వారికి చాలా ప్రయోజనకరమైన విషయం .

ఇక ఈ పుస్తకం శీర్షిక గురించి, : ఈ పుస్తకం ప్రకారం కాస్మిక్ నంబెర్ 137. 

ఈ కాస్మిక్ నెంబర్ ప్రత్యేకత ఏమిటి ? అంటే, "the weird number 137, which on the one hand describes the DNA of light and on the other is the sum of the Hebrew letters of the word “Kabbalah”

వోల్ఫ్ గాంగ్ పౌలి జ్యూయిష్ పరంపర కి చెందిన వాడు కావడం వల్ల  కొద్ది పాటి mysticism కూడా ఈ పుస్తకం లో చూడ వచ్చు.

The fascinating dreams of Pauli and their interpretation by himself as well as Jung are really wonderful subject matter for reading for those who are interested in these subjects.

ఇక ఇట్లాంటి వాటిని చదివితే మన 'ఇండియన్స్ ' వెంటనే ఇవి   మన వాళ్లకి ఎప్పుడో తెలుసోయ్ అనటం సాధారణం  కాబట్టి నేను కూడా నాకు అనిపించిన అగు పించిన  - అంటే ఈ కాస్మిక్ నెంబర్ ఒకటి మూడు ఏడూ కి సంబంధించి రాయ దలచి ఈ టపా అన్న మాట !

137 --->

1 --- ఒకటి ---> దీని గురించి చెప్పాలా ! ఏకం సత్ !

3 --- మూడు ---> త్రిగుణాత్మకం ముక్కంటి త్రిభువనం ముమ్మూర్తులు ... సృష్టి స్థితి లయ కారకమ్  ... ఈ మూడు ప్రతి మతం లోను ప్రతి మిస్టిక్ ప్రిన్సిపల్  లో ను ఉన్నదె.

(యాదృచ్చికం గానో కాకుంటే 'కాకతాళీయం గానో ఇవ్వాళ  కష్టేఫలె శ్రీ శర్మగారు కూడా మూడు 'ముళ్ళ' గురించి టపా పెట్టేసేరు ! దీని భావ మేమి ? క్వాంటం వరల్డ్ లో ఆపరేట్ అయ్యే లాస్ , ఈ 'యాదృచ్చిక లోకం లో ఆపరేట్ అవుతున్నట్టు కదా మరి !)

7 --- ఏడు ---> సప్త సాగరం సప్త నదులు సప్త ... ఈ ఏడు గురించి ఏమి చెప్పాలి ఇంకా ! సప్తపది ! ఏడడుగుల బంధం !

వీటినన్నిటిని అనుసంధానం చేస్తూ ... పురుష సూక్తం లో ...

' సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్తః సమిధః కృతాః  '  దేవా యద్యజ్ఞం తన్వానాః  అంటూ మూడు కి ఏడుకి లంకె మన వాళ్ళు ముడి పెట్టేసేరు .

ఇక ఈ 137 బేసి సంఖ్య .

1 = 1
2 = 3-1
3 = 3
4= 3+1
5 = 7-3+1
6 = 7-1
7 = 7
8 = 7+1
9 = 7+3-1
10 = 7+3
11 = 1+3+7 !

అంటే ఒకటి నించి ఈ సంఖ్య  మొత్తం కూడిక 11 వరకు ఈ సంఖ్య నించి తెప్పించ వచ్చు !

ఈ బేసి సంఖ్య  మరో రూపం చూద్దాం .

మన పూర్వ కాలం లో అక్షౌహిణి  అన్న ది   యుద్ధం లో కూర్చే సైనిక అమరికకి పేరు .

ఈ అక్షౌహిణి  అన్నది 21,870  రథాలు , అన్నే ఏనుగులు , దానికిమూడింతలు గుర్రాలు ఐదింతలు నాలిగింతలు సైనికులు    అంటే (1+1+3+5 = 10!) * 21,870 = 218,700 .

ఈ సంఖ్యలో 2+1+8+7 = 18 = 1+8 = 9 ! తొమ్మిది కి ఉన్న ప్రాముఖ్యత చెప్పాలా మరి !

సరే, 2187 అన్న సంఖ్య లో మరో కిటుకుఉన్నది అదేమంటే ...

కనుక్కుని చెప్పండి -- ఆ సంఖ్యకి అంటే 2187 కి న్నూ 1 3 7 కి మధ్య ఒక సంబంధం ఉన్నది .

కనుక్కోగలరనే  ఆశిస్తూ ...

ఇక, ఈ సంఖ్య  మీకు కూడా మరెన్నో ఆలోచనలని రేకెత్తించ వచ్చు . వాటిని మీరు తెలిపితే ఆనంద కంద హృదయారవింద మవుతాను !!


శుభోదయం !
చీర్స్
జిలేబి