Wednesday, July 3, 2013

మనవాళ్ళుట్టి వెధవాయిలోయ్ !


మనవాళ్ళుట్టి వెధవాయిలోయ్ !
ఎవరన్నారండీ ఈ మాట ! 
గిరీశం గారితో చెప్పించింది  ఎవరు ? 
ఎందుకు చెప్పించేరు ?
చెప్పేరు కదా అని మనం గిట్లా మన పేరుని సార్థకం చేసేసు కుంటున్నా మంటే మనం ఎంత గోప్పోళ్ళం ! అర్థం చేసుకోరూ మరీను !

అబ్బా కాలాతీతం గా ఈ మాట చారిత్రాత్మక మైన సత్యమై పోయింది ! 

హేవలాక్ బ్రిడ్జీ కట్టినా బ్రిటీషోడు  వెళ్లి అరవై ఏళ్ళు దాటినా గురజాడ వారు మనం ఉట్టి వెధవాయిలోయ్ అని జెప్పి ఆ సోరాజ్జెం  వచ్చిన కాలం దాటి పోయినా  ఇంత నిర్ద్వ్హంధం గా మనం మనల్ని గురించి న ఈ మాట తప్పు కాకుండా , చెక్కు చెదర కుండా మనకున్న ఈ క్వాలిటీ ని పరిరక్షించు కుంటూ వస్తున్నా మంటే మనం ఎంత గోప్పోళ్ళం ! అర్థం చేసుకోరూ మరీను !

పిండా కూడు పోయి ఆ ఉత్తర దిక్కున మనవాళ్ళు ప్రాణాలు అరచేతిలో టావుల్ దప్పి ఉంటే మనం ఒకరి నొకరం ఆడి  పోసుకుంటూ ఆయ్ నువ్వొట్టి వెధవాయోయ్ అని ఎగస్పార్టీ వాణ్ని కాలరాచేస్తూ దినపత్రికలలో టాప్ మేటరై పోయా మంటే మనం ఎంత గోప్పోళ్ళం ! అర్థం చేసుకోరూ మరీను !

దేశాన్ని ఉద్దరించే స్తామన్న ప్రతి వెర్రోడికీ సై అని పట్టం కట్టి మనల్ని మనం శేబాష్ అని తట్టేసు కున్న వాళ్ళ మాయె అంటే మనం ఎంత గోప్పోళ్ళం ! అర్థం చేసుకోరూ మరీను ! 


చీర్స్
జిలేబి 



4 comments:

  1. మనలో వెధవాయత్నం నిక్కచ్చిగా తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్నమనే మాట వాస్తవం!

    ReplyDelete
  2. Nijame kadaa meeru cheppindi ,manam vedavalame ,kukkalu kuda manalni chusi siggu padu tunnaayente manishi ela bratukutunnado ardham chesukovachchu ,thanks

    ReplyDelete
  3. మళ్లీ చెప్పాలా. వెధవాయిత్వాన్ని మనం పరంపరగా కొనసాగిస్తున్నాం. వెధవాయిని నేను, నీకన్నా పెద్ద వెధవాయిని నేను అని పాడుకుంటూ వెధవరత్న, వెధవభూషణకు అర్హులమని చాటుకుంటూనే ఉన్నాం కదా.. మళ్లీ చెప్పుకోవాలా ఏమ్టీ

    ReplyDelete
  4. వెధవవీరచక్ర,వెధవరత్న,వెధవవిభూషణ్,వెధవజ్ఞానపీట్,నోబెల్ వెధవ,వెధవసాహెబ్,వెధవబహదూర్,నటవెధవసామ్రాట్ బిరుదులు,బహుమానాలుకూడా ఉంటాయా కొంపదీసి!వీటికి కూడా try చేసుకోవాలా లేక అర్హతలను బట్టి ఇచ్చుకుంటారా!బయోడేటా బాగా రాయించుకుని పంపవలసి ఉంటుందా?అదేవిధంగా ఉత్తమ వెధవకవి,ఉత్తమవెధవకధకుడు,ఉత్తమవెధవనవలాకారుడు...కూడా ఉంటాయా?వెధవసభాసామ్రాట్,వెధవవ్యాఖ్యానకేసరి,ఉత్తమవెధవవక్త ....సంగతేమిటి?వెధవనామసంవత్సర ఉగాదిపురస్కారాలు కూడా ఉత్తమ వెధవసంస్థల చేత అందజేయిస్తారా?అందుకు ఎంత సమర్పించుకోవలసి ఉంటుంది?వివరాలుకూడా తెలిపినట్లయితే అర్హులయిన వెర్రివెధవతెలుగువాళ్ళం వెధవమంత్రులచేత వెంటనే రికమండేషన్ కూడా చేయించుకుంటాం!!!ఆలసించిన ఆశాభంగము మంచితరుణము మించినదొరుకదు!!!భలేమంచి చౌక బేరము!!!!త్వరపడన్డహో!!!!

    ReplyDelete