"రావణుని చేత అపహరింప బడి ఆతని ఇంట ఇన్ని రోజులు ఉన్న సీతా, నువ్వు నాకు తగిన దానవు కావు "
చెప్పినది రామభద్రుడు .
అంతటి తో ఊరుకున్నాడా ?
"నువ్వు నాకు తగిన దానవు కావు . లకష్మణుడి నో, భరత శత్రుఘ్నుల లో ఎవరినో, మరీ కాకుంటే, సుగ్రీవు ణ్నో విభీష ణు డి నో వేరే ఎవరైనా సరే నీ ఇష్టం ఎవరినైనా నీవు కోరి వారితో వెళ్ళు ' అంటాడు .
तदद्य व्याहृतं भद्रे मयैतत् कृतबुद्धिना |
लक्ष्मणे वाथ भरते कुरु बुद्धिं यथासुखम् || ६-११५-२२
शत्रुघ्ने वाथ सुग्रीवे राक्षसे वा विभीषणे |
निवेशय मनः सीते यथा वा सुखमात्मनः || ६-११५-२३
పతియే దైవమ్. అట్లాంటి పతి రామచంద్రుడు "జనవాద భయాందోళన చెందిన వాడై " , రెండు ముక్కలైన హృదయం తో అమ్మవారి తో ఈ మాట అంటే - ఇక సీతమ్మ గజేంద్ర హస్తాభిహతేవ వల్లరీ కాక మరి ఎట్లా ఉంటుంది ?
భీత హరిణేక్షిణి అని చాలా సాధారణం గా విని ఉంటాం .
సీతమ్మ గారి ని వాల్మీకి యుద్ధ కాండ లో - రావణ సంహారం తరువాయి గజేంద్ర హస్తాభిహతేవ వల్లరీ! అని పోలుస్తాడు. గజేంద్రుని హస్తం తో అభిహత మైన వల్లరీ అని .(ఒక ఏనుగు చేత లేత కొమ్మ పెకిలించి వేయ బడితే ఎట్లా ఉంటుందో కాకుంటే ఒక ఏనుగు తొండం తో దెబ్బ తిన్న ఒక తీగ కంపనం ఎట్లా ఉంటుందో మరి చెప్పాలా ?)
సందర్భం ఏమిటి ?
స్వామి వారు రావణ సంహారం తరువాయి అమ్మవారితో మాట్లాడే సమయం . అగ్ని పరీక్ష కి మునుపు సంభాషణ .
సింపుల్ గా 'నువ్వు వేరే ఎవరితో నైనా 'సెటిల్' అయిపో , నాకు తగిన దానివి కావు ' అని ఏ మగడైనా అంటే (ఇది చాలా పచ్చి గా ఉన్నదనుకుంటే ఎవరితో నైనా లేచి పో - అన్నాడను కొండీ ) ఇక ఆ స్త్రీ హృదయం ఎట్లా ఉంటుంది ?
వాల్మీకి ఒక ముక్క , జస్ట్ ఒక ముక్క - రాసి ఉండ వచ్చు - రాముల వారు సీతమ్మ తో - నువ్వు నాకు తగిన దానివి కావు' అని అన్నాడని .
ఆ పై అట్లా పరుష మైన వాక్యాలు రామ భద్రుడు సీతమ్మ వారి తో అన్నట్టు రాసే డంటే - దీని వెనుక - ఆ కాలం లో జనవాదానికి, ప్రజల ఎద్దేవా కి ఎంత భయం ఉండేదో అని పించక మానదు .
శ్రీ రాముల వారిని ఎవరైనా ఏదైనా అంటే అది మరీ వివాదాస్పద మయి పోతుంది . కాని రామాయణం - వాల్మీకి రామాయణం లో అయోధ్యా కాండం లో ఈ సర్గ శ్లోకాలు చదివితే మనం నిజంగా ఆలోచనలో పడక మానం మరి !
ఇప్పుడు కాలం మారింది . అయినా స్త్రీ ఇంకా గజేంద్ర హస్తాభిహతేవ వల్లరీ యే ! దేశం లో ఎన్ని చట్టాలు , కోర్టులు తీర్పులు చెప్పినా గజేంద్ర హస్తాభిహతేవ వల్లరీ యే అని పించక మానదు
సీతాం ఉత్పల పత్రాక్షీమ్
నీలకుంచిత మూర్ధజాం !
జిలేబి

ततः प्रियार्हश्रवणा तदप्रियं |
प्रियादुपश्रुत्य चिरस्य मैथिली |
मुमोच बाष्पं सुभृशं प्रवेपिता |
गजेन्द्रहस्ताभिहतेव वल्लरी || ६-११५-२५