గుర్తింపు కోరిన మేఘం !
ఒక మేఘం గుర్తింపు కోరింది
మేఘ గర్జనై ధారాపాత మయ్యింది
ఒక చినుకు గుర్తింపు కోరింది
కుంభవృష్టి యై కురిసింది
ఒక కోన గుర్తింపు కోరింది
జలపాతమై తల కోన అయ్యింది
ఒక పిల్ల కాలువ గుర్తింపు కోరింది
నదియై పరవళ్ళు తొక్కి మహానది అయ్యింది
ఒక మహానది గుర్తింపు కోరింది
వరదై పెనువరదై సుడిగుండమై సాగరాన్ని చేరింది
ఒక సాగరం గుర్తింపు కోరింది
ఉవ్వెత్తున లేచి ఉప్పెనై ఆకసాన్ని ముద్దెట్టేసు కుంది
చర్విత చర్వణం !
హిరణ్యగర్భః సమవర్తతాగ్రే ....
శుభోదయం
జిలేబి
ఇంతకి కారణమైన సూర్యునికి లేదు గుర్తింపు
ReplyDelete
ReplyDeleteకష్టే ఫలే వారు,
న తత్ర సూర్యో భాతి న చంద్ర తారకం!
జిలేబి