So you see, we are nearing the option expiry next Thursday 31st Oct for Oct2013 futures and options market!
Can the NIFTY touch a good 6300 giving good lights and sounds show for Deewaali ?
The market is always a mystery so we see how well the upcoming week goes for the Muhurut trading.
Can there be an options strategy for this last week?
Let us see how it can work;
Bank of Baroda is trading currently around 590. Writing a put options at 560 and call option at 640 at the same time gives a total premium collection of about 11 Rs which equates to Rs.5500/- for one lot of BOB which is 500 stocks.
Exactly on next Tuesday this trade should be wound up for loss or gain. Gain could be roughly 2500 to 3000/- for an outlay of 4 sessions.
cheers zilebi (Zilebi are you sleeping? We cant make head or tail out of the above!)
Brahmasri T S Balakrishna Sastrigal, the harikatha legend, is explaining here the similarity between the musical instrument veena and the human body. He also informs that music is present in all human bodies. It is up to us to dig it out. This is part of the CD titled GURU GUHA JAYATHI on Saint Muthuswamy Dhikshathar marketed by Swathi Sanskriti Series.
This is a rough translation listening the audio of Brahmasri T S Balakrishna Sastrigal. The audio link is given below as well courtesy youtube.
బ్రహ్మశ్రీ టి ఎస్ బాలకృష్ణ శాస్త్రి గారి ఆడియో కి స్వేచ్చాను వాదం ...
... ఆ గంగా నది లో స్నానం చేయడానికి దిగి నప్పడు గమనించాడు .. ఆ నది లో ఏదో తేలియాడుతూ వస్తోంది. గంగా నది లో తేలియాడుతూ వచ్చేవేన్నెన్నో ! స్నానం చేసే వాళ్ళు జాగ్రత్త తో ఉండడం అవసరం .
గంగానది లో తేలియాడుతూ వస్తోన్న దాన్ని గమనించారట ఆయన .. అది 'అందులో రామా అన్న పదం కనిపిస్తోంది . అది దగ్గిర వస్తోన్న కొద్ది స్ప్రష్టమై కని పిస్తోంది ... మనుష్య ఆకారం పోలి ఉన్నట్టు .
మానవుడు యోగాసనా తిష్టుడై ఉంటే ఎట్లా ఉంటాడో అట్లా కనిపిస్తోంది అది .
ఆ కనిపిస్తోన్నదే అదే వీణ !
వీణ ఎట్లా ఉంటుంది ? మానవుడు పద్మాసనం లో యోగాసనం లో కూర్చుని ఉంటే ఎట్లా ఉంటుందో ఆ రూపాన్ని పోలి ఉంటుంది .
పద్మాసనం లో కూర్చున్నవారి రూపం ఎట్లా ఉంటుంది ? క్రింది భాగం వీణ యొక్క క్రింది భాగం పోలి ఉంటుంది ఆ వీణా మధ్య భాగం మానవుడి వెన్నెముక . దాని శిరోభాగం మనుజుడి శిరస్సుని పోలిక !
పూరకం కుంభకం రేచకం ; స్వాదిష్టానం మణి పూరకం బ్రహ్మ రంధ్రం మొదలైనవి దాని భాగాలు .
ఇడా పింగళ నాడులే దాని తంత్రులు . తంబురాలో అగుపించే సారణ అనుసారణ తంత్రుల లా ఇడా పింగళ నాడులు .
మన శరీరం లో ఇడా పింగళ నాడులు ఉన్నాయి. అట్లా మన శరీరమే ఒక వీణ .
ఈ శరీరమన్న ఒక వీణ సాయం తో మనం పాడ గలుగు తున్నాం.
వాద్యం నించి ఎట్లా శబ్దం జనిస్తుందో మన శరీరమనే ఈ వాద్యం నించి శబ్దం జనిస్తొంది .
మన శరీరం లో ని నాభి , హృదయం , కంటం, నాశిక ద్వారా ఈ శబ్దం వెలువడు తోంది .
రిషభం గాంధారం మధ్యమం దైవత నిషాదం ఈ స్వరముల సంచారం ఈ దేహమే ఒక ఆలయం
రిషభం లో మూడు , గాంధారం లో మూడు, మధ్యమం లో రెండు దైవతం లో రెండు నిషాదం లో మూడు
వీటికన్నిటి కి అతీతం గా నిశ్చలం గా ఉన్నది ష అన్న షడ్యం - షడ్యమం అని చెబుతాము .
ఇది ఆరవ స్థానం లో జనిస్తుంది. ఆ ఆరవ స్థానమే షణ్ముఖు ని స్థలం. ఆయన పేరే 'షణ్ముఖ' ఆరవ స్థానం నించి జనించిన వాడు. షడ్యం షణ్ముఖ .. అది ఎక్కడ ఉన్నది? ఈశ్వరుని దగ్గిర ఉన్నది అని అంటారు త్యాగరాజ స్వామి వారు . ఈ శరీరమే ఆ పరతత్వ స్వరూపం.
వేదముల నించి గ్రహించి బ్రహ్మ ఈ సంగీతాన్ని మన కందించాడు .
ఈ సంగీతం మన దగ్గిర ఎల్లప్పుడూ ఉన్నదే. ఇది మనం సృష్టి , వృద్ధి చేసినది కాదు.
కొందరు పాడ గలుగు తున్నారు. మరి కొందరు పాడ లేక పోతున్నారు .
పాడ లేక పోతున్న వారికి ఇది లేదని అర్థం కాదు. మన లోన ఉన్నది. దానిని బయటకు తీయాలి. లోపల ఉన్నదానిని త్రవ్వి తీయాలి.
భూగర్భం లో ఉన్న నీటి లా ఉన్నది. భూమిని తవ్వి నీటి ఊటని బయటకు తీయడం లా ఈ సంగీతాన్ని లో నిండి తీయ గలగాలి ... మన అందరి లో ఉన్నది. .. అదే ఈశ్వరుడు అని అంటారు స్వామి త్యాగరాజ వారు ...
Photo caricature by Keshav - The famed cartoonist of The Hindu ---> From his blog
"ఈ మధ్య మరీ భారీ అయి పోతున్నా ఏదైనా చేసి ఓ ఐదు నించి పది కిలోల బరువు తగ్గాలి అనుకుంటూ ఉన్నా ' చెప్పా " మా అయ్యరు గారి తో .
'ఇదిగో జిలేబి ఏదైనా చేసి ఎందుకు ? ఈ మధ్య దేశం లో ఎన్నో ప్రాబ్లెమ్స్ ఉన్నాయి . ఏదో ఒక డానికి నిరాహార దీక్ష మొదలెట్టు ఓ వారం లో ఐదు కిలో లేమి ఖర్మ, వీలయితే శాల్తీ శాల్తీ యే కరిగి పోవచ్చు కూడాను " అయ్యరు గారు రిటార్టు ఇచ్చారు .
ఆ హా ఇదేదో మంచి సలహా గా ఉన్నదని నిరాహార దీక్ష డిల్లీ లో నే మొదలెట్టే సా . నా తోడు అన్ని పార్టీల నేతలు నేత్రి లు , కూడా నిరాహార దీక్ష మొదలెట్టడం చూసి నాకు కూడా ముచ్చటేసింది !
అబ్బా, ఈ రాజకీయ నాయకులు ఎట్లా ఎట్లా బరువు ఖర్చు చేసు కుంటారు సుమీ అని వార్ని మేచ్చేసు కున్నా మనసులో .
సో , బ్లాగు చదువరులారా, చదువరీ మణు లారా ! ఇదే మీకు జిలేబి అందించు 'నిరాహార దీక్షా ఆహ్వానం ! మీరు బరువు తగ్గాలను కుంటు న్నారా ! వెంటనే నాతొ బాటు డిల్లీ కి వచ్చి నిరాహార దీక్ష మొద లెట్టే య్యండి !
పుణ్యమూ పురుషార్థమూ అంటారు చూడండి , అట్లా మీ బరువు తగ్గ వచ్చు, దాంతో బాటు బోలడంత పేరు కూడాను !
ఇవ్వాళే రండి ! వేగిర పడండి ఆలసించిన ఆశా భంగం ! భలే మంచి చౌక బేరము !
నిరాహార !
నీకు సరిలేదు దేనికైనను !
ఇదే నీకు చీర్సు
విహంగావలోకనం - A bird's eye view - విహంగ వీక్షణం !
రామాయణం లో పుష్పక విమాన వర్ణన సుందర కాండ లో వస్తుంది. హనుమంతుల వారు పుష్పక విమానాన్ని చూడటం జరుగుతుంది .
వాల్మీకి అత్యద్భుత వర్ణన - ఈ పుష్పక విమానాన్ని గురించి సుందర కాండ లో ఏడవ సర్గ లో లో చెప్పడం జరుగుతుంది. ఆ పై ఎనిమిదవ సర్గ ఈ పుష్పక విమాన వర్ణన కి కేటాయించ బడి ఉన్నది .
ఏడవ సర్గ లో ఈ పుష్పక విమానం గురించిన వర్ణన ఒక విహంగావలోకనం లాంటి దైతే ఎనిమిదవ సర్గ లో వర్ణన 'a detailed description' లాంటిది !
పుష్పక విమానాన్ని హనుమంతుడు చూడడాన్ని వాల్మీకి వర్ణన - ఈ పుష్పక విమానం - మహా విమానం - 'best of the best! - वेश्म उत्तमानाम् अपि च उच्च मानम् |! ఉత్తమ మైన వాటిల్లో అత్యుత్తమ మైన విమానం అని !
అంటే ఆ కాలం లో ఇది ఒక్కటే విమానం కాక మరెన్నో విమానం ఉండేవని అర్థం చేసుకోవచ్చు. అట్లాంటి విమానా ల లో ఈ విమానం అత్యుత్తమ మైన విమానం !
ఇక ఈ విమానని గురించి న మరిన్ని వివరాలు ఎనివిదవ సర్గ లో మొత్తం ఏడు శ్లోకాలలో వాల్మీకి వర్ణన చేయడం జరుగుతుంది . మహద్విమానం మణి వజ్ర చిత్రితం !
महद्विमानम् मणिवज्रचित्रितम् |!
విశ్వకర్మ చేత నిర్మింప బడ్డది. అక్కడ 'వాయుపథం' లో నిలిచి ఉన్నది ! (ఈ వాయుపథం అన్నది మన కాలపు 'Run way' అనుకోవచ్చా ? ) ఆదిత్య పథ వ్యరాజవత్ !
తపోబలము చేత రావణుడు దీన్ని పొందాడు . 'ఇది మనోబలము చేత ప్రయాణిస్తుంది' అంటాడు వాల్మీకి !
అంటే ఈ విమానం ఆ కాలం లో ప్రయాణం చేయడానికి మనోబలం ఇంధనం లాంటిదన్న మాట . - मनःसमाधान विचारचारिणम् | -
ఈ మధ్య మన కాలం లో నే స్పీచ్ రెకగ్నిషన్ పరికరాలు వస్తున్నాయి . వీటి తరువాయి సాయిన్సు డెవలప్ మెంట్ ఇక మనో బలం (Thought Power) చేత పరికరాలు నడప బడే స్థాయి కి రావచ్చు అనుకుంటా .
అంటే ఆ రామాయణ కాలపు డెవెలప్ మెంట్ ఒక స్థాయి ముందర ఉన్నట్టు అనుకోవచ్చు. మనోబలం చేత నడప బడే విమానం లాంటివి ఉన్నట్టు !
ఇక ఇది కాల్పనిక మైనదేమో అన్న సందేహం చాలా మందికి ఉండనే ఉన్నది. ఆ కాల్పనిక కథ అన్న మాటలని పక్కన బెట్టి - ఈ రామాయణ కాల ఘట్ట కాలం నాటికి వాల్మీకి సమకాలీకుడు అన్న మాటలని బట్టి ఆ కాలం లో తాను చూసినదానిని ఒక కవి వర్ణించాడు అని కూడా అనుకోవచ్చు. అట్లా అయిన పక్షం లో ఇది ఆ కాలపు ఒక విమానానికి సరియైన వర్ణన అయ్యే ఆస్కారం కూడా ఉన్నది.
ఇక దాని రూపం ఎట్లా ఉన్నది ? విచిత్ర కూటం బహుకూట మండితం ! -like a mountain with wonderful peaks adorned by many peaks!
ఇంతే గాక మనోభిరామం శరదిందు నిర్మలం ! - చంద్రుని లా నిర్మలం గా మనోభిరామం గా ఉన్నదట దాన్ని చూడడడం !
సో, ఈ విచిత్ర కూటం బహుకూట మండితం అన్నది చూస్తే దాని రూపు రేఖలు - మన కాలపు 'flyingsaucer' వర్ణన లా ఉన్నది !
ఈ వర్ణన లో అన్నిటికన్నా ముఖ్యమైనది నా కనిపించింది - ఇది మనో బలం చేత నడప బడుతుంది అన్నది . ఈ వాక్యం నిజంగా ఆలోచింప దగ్గ వాక్యం అనుకుంటా . ఎందు కంటే ఇప్పుడు మన మున్న కాలం లో thought power మీద జరుగుతున్న విశేష రీసెర్చ్ రాబోయే కాలం లో ఇట్లాంటి వనరులని మనకి తేవచ్చు కూడాను .
ఆ మధ్య ఎక్కడో చదివా ... హ్యూమన్ క్లోనింగ్ రీసెర్చ్ లో భాగం గా - ఒక బ్రెయిన్ లో జరిగే విశేష మైన లాజికల్ మేపింగ్ ని మరో బ్రెయిన్ లో కి ట్రాన్స్పోర్ట్ చేయ గలిగితే తద్వారా knowledge transfer mechanism చాలా సులభ తరమై పోతుంది అని !
సో ... ఇవ్వాల్టికి ఈ పుష్పక విమాన విహంగావ లోకనం పరి సమాప్తం !
మీకు నచ్చిందని ఆశిస్తూ ...
मनःसमाधान विचार चारिणम् |
ఎప్పట్లా చీర్స్ సహిత - మీ జిలేబి సైనింగ్ ఆఫ్ ! మనోభిరామం శరదిందు నిర్మలం !
మీ వాడే మీ పట్ల అంత విముఖమైన వ్యాఖ్య సంధిస్తే మీరు రాజీనామా చేస్తారా ?" అడిగాడు విలేకరి.
"ఏదో మనవాడు అట్లా మనలని తెగిడా డని నన్ను కుర్చీ వదల మంటే ఎట్లా? అట్లాంటి వన్ని నేను చేయ దలచు కోలేదు " చెప్పాడాయన సంతృప్తి గా కుర్చీ ని తడివి చూసుకుంటూ .
కుర్చీ కిర్రు మంది .
అబ్బా ఎన్నాళ్ల ని ఇట్లా ఒక శాల్తీ నీ భరిస్తూ ఉండడం ? కుర్చీ మరో మారు నిట్టూర్చింది .
అట్లా కాదండీ ఇది మీ ప్రేస్టిజ్ కి సంబంధించింది కదా మరి ? విలేకరి అమ్మాయి ఎగ దోసింది .
ఆ పెద్దాయన నిదానించి చూసాడు ఆ విలేకరి ని - "అమ్మాయ్ నీకు పెళ్లయ్యిందా ? పిల్లా జెల్లా ఉన్నారా ?' అడిగేడు .
ఈ ప్రశ్న కి ఆ విలేకరి కోమలాంగి తత్తర పడి 'ఒక అబ్బాయి మూడేళ్ళ వాడు ' చెప్పింది .
పెద్దాయన నవ్వేడు.
"అమ్మాయి - ఆ నీ బుడతడు నడతలు, నడకలు మాటలు నేర్పేటప్పుడు నిన్నే ఎన్ని సార్లు ఏకవచనం లో సంబోధించి ఉంటా డం టా వ్ ? ఆ బుడతడి మాటలు నువ్వు ఎన్ని మార్లు చిలిపి చిలిపి అని ఆస్వాదించి ఉండవు ? "
విలేకరి కోమలాంగి తలూపింది
ఇదీ అట్లాగే .. మా బుడతడు ఇప్పుడిప్పుడే నడతలు నడకలు నేరుస్తున్నాడు ... వాడేదో అన్నాడని నా ప్రియతమ మైన కుర్చీ ని వదలదమనడం ఎట్లా మరి ?'
మరో విలేకరి ... మరో ప్రశ్న సంధించ బోయాడు .
పెద్దాయన 'ఓకే గైస్ ... నౌ హేవ్ గుడ్ డిన్నర్' చెప్పాడు .
విలేకరులు అందరు టప్పున 'ప్లేటు ఫిరాయించి ' డిన్నరు మీద పడ్డారు ....
ఆకసాన హంస ఎగిరింది...
విలేకరి అమ్మాయి చెప్పింది మరో విలేకరి తో ... మన పీ ఎం యు నో ... హీ ఈజ్ సో లైవ్లీ "
యా యా ... దిజ్ ఈజ్ మై ఫస్ట్ డిన్నర్ ఇన్ ది స్కై .... "
మనసు--సమస్య
-
*మనసు--సమస్య*
*మనసు సమస్యను సృష్టించుకుంటుంది. సమస్య పరిష్కారం కాలేదని బాధపడుతుంది.
సమస్యను మొదటిలోనే తుంచేస్తే సమస్య లేదు. *
*ఎలా? అన్నది ప్రశ్న.*
...
శర్మ కాలక్షేపంకబుర్లు-పాలకోసం రాళ్ళుమోయడం !
-
Posted on ఏప్రిల్ 30, 2013 24 పాలకోసం రాళ్ళు మోయడం. “పాలకోసం రాళ్ళు
మోయడం”అనే నానుడి తెనుగునాట విస్తృతంగా వాడతారు. దీని అర్థం విస్తృత ప్రయోజనం
కోసం కష్టపడట...
శర్మ కాలక్షేపంకబుర్లు- పనసకాయ దొరికినప్పుడే………….
-
పనసకాయ దొరికినప్పుడే….……… పనసకాయ దొరికినప్పుడే తద్దినం పెట్టమన్నారు అని
నానుడి.. ఇదేంటో నాకు అర్ధంకాలేదు నిన్నటి దాకా. ఈ మధ్య భాగవతం మూలం చదువుతూ
పోతనగారు ...
శర్మ కాలక్షేపం కబుర్లు-1- గురు, దైవ వందనం
-
*— శర్మ కాలక్షేపం కబుర్లు—*
*Posted on సెప్టెంబర్ 23, 2011 *
*గురు, దైవ వందనం*
కన్న తల్లి తండ్రులకు సాష్టాంగ దండ ప్రణామాలు. పెంచిన తల్లి తండ్రులకు
సాష...
పెహ్లాజ్ నిహలాని సాబ్! యువార్ గ్రేట్!
-
మన్ది పవిత్ర భారద్దేశం, ఈ దేశంలో పుట్టినందుకు మనం తీవ్రంగా గర్విద్దాం (ఇలా
గర్వించడం ఇష్టం లేనివాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు). మన్దేశంలో ప్రజలే
పాలకుల...
ఒక సినిమా జ్ఞాపకం (స్వాతిముత్యం)
-
అవి మేం చదూకునే రోజులు. మాకు సినిమాలే ప్రధాన కాలక్షేపం. సినిమా
బాగుంటుందా లేదా అనేది ఎవడికీ పట్టేది కాదు, సినిమా చూడ్డమే ముఖ్యం.
అవ్విధముగా - ప్రవాహంలో ...