Sunday, November 10, 2013

ది హిందూ - జిలేబీయం !

ది హిందూ - జిలేబీయం 
 
ఇవ్వాళ్టి ది హిందూ లో కన్నడ రచయిత్రుల సమ్మేళనం - జిలేబీయం !
 
Writers brainstorm on role of women in literature


 
courtesy The Hindu Web pages


చీర్స్ 
జిలేబి 

Saturday, November 9, 2013

జిలేబి నువ్వు చచ్చావా లేక బతికే ఉన్నావా ?


'జిలేబి నువ్వు చచ్చావా లేక బతికే ఉన్నావా ? ' అయ్యరు గారు అడిగేరు .

ఏమండీ మీ ముందర నిమ్మళం గా నిలబడి ఉంటె చచ్చావా అంటా రేమిటి ?

నేను కాదోయ్ మీ బ్యాంకు వారు నిన్ను రమ్మన్నారు

ఓహ్ చలో 'సేటు బేంకు' కి - 'సేటు బేంకు మీ బ్యాంకు అనబడే మా  బ్యాంకు కి వెళ్ళా .

అదిన్నూ బాతాఖానీ ఫణి బాబు గారి టపా చదివాక వెళ్ళా కాబట్టి ఎక్కువ గా ఎక్స్ పెక్టేషన్ ఏమీ లేదు !

నెక్స్ట్ అంది అక్కడ ఉన్న డెస్క్ దేవరి .

మీ పేరు ?

జిలేబి

కిసుక్కుమని నవ్వ బోయి మరీ ఆపెసుకుంది నవ్వుని ఆ కౌంటరు కనకాంగి .

వయస్సు ?

స్వాతంత్ర్యం వచ్చిన వయస్సమ్మాయ్ జెప్పా

ఇంకా బతికే ఉన్నారా ?

సోరాజ్జెం బతికే ఉందమ్మాయ్ అన్నా .

నేనడుగు తుంట మీ గురించి ఆ తుంటరి కస్సు మన్నది .

అబ్బే నీ ముందర ఉన్నా కదమ్మాయి  అన్నా .

సర్లెండి ఈ ఫారం లో సంతకం చేయండి .

సంతకం జేసా .

టాలీ కాలే ' టాట్ టాట్ అన్నది ఆ తారామణి .

ఏమిటి తల్లే టాలీ కాలే ?

సంతకం !

ఏమి జెయ్యను ?

మునుపటి సంతకం పెట్టండి

మునుపటి సంతకం ఎట్లా పెట్టడం ?

ఇదిగో అమ్మాయ్ మీరిచ్చిన ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎ టీ ఎమ్ గట్రా లతో సంతకం బెట్టి చాలా రోజులయ్యింది అసలు ఇప్పుడు ఉన్న లోకం లో చేతి తో లేఖ రాసే చాలా సంవత్సరా లయ్యింది అసలు నా చేతి వ్రాత గుండు గుండు గా ముత్యంలా ఉండేది ఈ ఈ-మెయిల్ ల పుణ్యమా అని కాస్తా జిలేబీ లా తయారయ్యింది - ఏమి చెయ్య మంటావ్ చెప్పు  అన్నా .


మీరు మీరేనా ?

అవును !

సరే మీకు తెలిసిన వాళ్ళ దగ్గిర సాక్షి సంతకం పెట్టించండి ...

జుట్టూ కలయ జూసా .

తెలిసిన ముఖం ఒక్కటీ కనబడ దేమిటి !

ప్చ్ ...

మనుషుల లోకం నించి మొబైల్, ఎసెమెస్ , ఇంటర్నెట్ బాంకింగ్ లోకానికి వచ్చేసాక అస్సలు మనుషుల ముఖమే చూడడం తక్కువై పోయే  ఇక తెలిసిన ముఖం ఎట్లా తెచ్చేది ?

అమ్మాయి , మీ బ్యాంకు వారి ఆన్లైన్ బ్యాంకు లో లాగిన్ అయి జూపిస్తా అప్పుడైనా ఒప్పేసు కుంటా వా నేను నేనే నని  ?

ఆ అమ్మాయి కాస్తా సందిగ్ధం లో పడ్డది .

అట్లాంటి వెరిఫికేషన్ పద్ధతి లేదండీ !


పోనీ అమ్మాయ్, మీ సాఫ్టు వేరు నించి ఒక ఎసెమెస్ నా మొబైల్ కి కొట్టు . మీ ముందరే ఆ ఎసెమెస్ కి నేను రిప్లై కొడతా ! చాలెంజ్ చేశా ..

ప్చ్ అట్లాంటి వెరిఫికేషన్ లేదండీ !

పోనీ మీరంతా ఎలెక్ట్రా నిక్ లోకం లోకి మారి పోయేరు కదా ఇప్పుడు మరీ పాపులర్ గా ఉన్న ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ ఉపయోగించ రాదూ నేను నేనే నా బతికి ఉన్నా నా ఒక్క క్షణం లో తెలిస్ పోయేది అన్నా ఘాటు గా

ఇంకా అట్లాంటి టెక్నాలజీ రాలేదండీ మాకు !
హూం మరీ త్రిశంకు స్వర్గమే ఇది ...

మరో క్షణం లో రూపం మార్చేసా ..  సూరే కాంత మయి పోయా ...

పిండా కూడు, బ్యాంకింగు పద్ధతులు మారేయి గాని వెరిఫికేషన్ పధ్ధతి మార లేదేంటి మరి !! అంటూ ఇంతెత్తు కి ఎగిరా ... గయ్యాళి ఐ పోయా మరో నిమిషం లో .... లేడీస్ కి రెస్పెక్ట్ మీ బ్యాంకు లో లేదని ఆ మేనేజర్ ముందే ధర్నా చేశా ...

వెంటనే

సర్లెండి మీరు మీరే ! కాళ్ళ బేరానికి ఒచ్చేసేరు ...

హమ్మయ్య ఏ వెరిఫికేషన్ లు కొత్త పద్దతులు వచ్చినా ఇంకా సూరే కాంతం పధ్ధతి అట్లీస్ట్ మా ఆండోళ్ళ కి పనికి వస్తోన్నందుకు సూరేకాంతానికి నమో వాకాలు తెలియ జేసేసు కున్నా !!


జిలేబి 

Thursday, November 7, 2013

జిలేబి కవితా గోల !


హమ్మయ్య అనుకుని ఈ వాల్టికి ఏదైనా రాసి బ్లాగు పోష్టు ముఖం లో పడేసి ఎంచక్కా ముసుగు తన్ని నిదుర పోతే, పోష్టు లు చదివే వాళ్ళు వాళ్ళ తంటా వాళ్ళు పడతారని ఓ నాలుగు వాక్యాలని కత్తిరించి నిలువుగా నాలుగు పదాలు గా పేర్చేసి వావ్ వావ్ నా ఇవ్వాళ్టి కవిత తయారై పోయిందోచ్ అని బుగ్గ న వేలు పెట్టేసుకుని మహదానంద పడి పోయా , నా పద కవిత ని నేనే మెచ్చేసు కుంటూ మళ్ళీ మళ్ళీ చదివేసు కుంటూ !

వెనుక నించి అయ్యరు గారు డ్రాఫ్ట్ పేడ్ లో తలబెట్టి , ఏమోయ్ జిలేబి ఏమి రాస్తున్నావ్ అన్నారు !

ఆయ్ ఇవ్వాళ్టి నా కవిత ! అసలే మీకు తెలుగు అర్థం కాదు . మరి ఇది చదివి ఏమి అర్థమవుతుంది మీకు లెండి అన్నా కొంత వీరిని గీచి చూద్డా మని పించి . అయ్యరు గారిని గోకితే గాని రత్నాలు రాలవాయే మరి జిలేబి కి !

మాత్రా సమకం లేదోయ్ అన్నారు కూడబలుక్కుని చదివేసి !

ఏమి లేదు ?

మాత్రా సమకం !

మాత్ర? బీపీ మాత్రలు ఏమైనా ఎక్కువయ్యా యా ఏమిటి మీకు ? మాత్రలు గట్రా అంటున్నారు ' అడిగా నిజంగా నే వీరం టున్నారా లేక 'గాలి' పీకుతున్నారా అని సందేహ పడి పోయా కూడాను !

అవునోయ్ మాత్రా సమకం లేదు ఖచ్చితం గా .

సరే వీరిని ఒకమారు ఆట పట్టిద్దా మని అక్షరాలని తారు మారు చేసి మళ్ళీ నా కవితా పటిమ ని చూపించా .

ప్చ్ యతి దోష ముందోయ్ అన్నారు ఈ మారు .

అదిరి పడ్డా ! ఈ యతి దోషం గట్రా మనకు తెలియ వాయె !

ఎక్కడ ?

'ఆది అంత్య రెండులో ను ' మళ్ళీ టాం అని రిటార్టు ఇచ్చేరు పరిశీలించి !

'ఇదిగో అయ్యరు గారు యతి గీతి మనకీ జానతా నాయ్ ! ఏదో పదాలని విరగ్గోడితే అదే మా కవిత '

'సరేలే జిలేబి ; నువ్వు రాసే నాలుగు ముక్కలు చదవడానికి టీం పాస్ టైం పాస్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఇట్లా బాధ పెట్టడం నీకు తగునా ? '  మళ్ళీ అయ్యరు గారు ప్రశ్నార్థకం గా ముఖం పెట్టేరు .

దీర్ఘ ఉచ్చరిక తో ఓ హ్రస్వ అక్షరం కలిపి హూమ్ అన్నా !

సరెలేవే ! నీ రాతలు కోతలు నీవే ! చెప్పే వాళ్ళు వినే వాళ్లకి లోకువ అని ...


చీర్స్
జిలేబి
 

Wednesday, November 6, 2013

'మంగళ్' ,yeah, బలం !

మంగళ కరంగా మంగళ గ్రహానికి !
 
త్రీ చీర్స్ టు ఇస్రో !
 
శుభోదయం 
జిలేబి 
 
మంగళ్ యేవ బలం!
 
జయహో భారత్!
 
(ఫోటో కర్టసీ అండ్ క్రెడిట్స్: ది హిందూ దిన పత్రిక!)



(ఫోటో కర్టసీ అండ్ క్రెడిట్స్: ది హిందూ దిన పత్రిక!)

Saturday, November 2, 2013

The 'प्यार' వళీ ! - దీపావళీ !

 
The 'प्यार' వళీ !
-
దీపావళీ !
 
పంచ దశ లోకం నించి 
 
అందరికి దీపావళీ
 
'Deep' 'ప్యార్' వళీ 
 
శుభాకాంక్షల తో 
 
స్వీట్
జిలేబి 

Friday, November 1, 2013

గంటా నాదం !

మా దేశానికి 
 
గంటా నాదం 
 
మాత్రమే తెలుసు 
 
'గన్' తో నాదం 
 

మా ఇంటావంటా లేదు !
 
జిలేబి 

Thursday, October 31, 2013

మంగళకరం గా మంగళవారం మంగళ గ్రహానికి !

 
"రోదసీ మే మంగళ్" 
 
'సనాతన' దేశం 
మంగళకరం గా
మంగళవారం
మంగళ గ్రహాన్ని 
చుట్టి రావడానికి 
ప్రయాణం 
సన్నాహాలు తయార్ 
 
ఇది కదా మరి 
'హోతారం రత్న ధాతమమ్'
 
 
శుభోదయం 
 
చీర్స్ సహిత 
మంగళ్ 'బీ' !
(Mars in the 7th House!)
(Looks like 'Muhurtam' fixed!)

Wednesday, October 30, 2013

'కొమ్ము' కొమ్ము' కో సన్నాయి ! - సర్దార్ సింగ్ - మోడీ పటేల్ !


ఈ గొప్పోళ్ళు ఆ కాలం లో తప్పి పుట్టి,  'పోయేరు' !

గాంధీ తాత గుజ్జూ తాత  ! పటేలు మామయ్య గుజ్జు మామయ్య !

నిన్న రెండు కొమ్ములు పక్క పక్క తారస పడ్డేయి ! 'మన మోడీ' గారున్నూ, 'మా' 'మన' మోహనుల వారున్నూ !

ఆయ్ పటేలు మా వాడు అని మోడీ మోడితే సింగు గారు థాట్ సర్దారు గారు కాంగ్రేసోడు అని నొక్కి వక్కాణిం చేరు !
కాంగ్రేసు షురూ అయిన కాలం లో వేరే ఏదన్నా బలమైన పార్టీ ఉండి ఉంటుందా ఆ కాలం లో అన్నది సందేహమే !

అప్పట్లో వారికున్న ఒకే ఒక్క గోల్ దేశ స్వాతంత్ర్యం ! దానికో పార్టీ . - ఒక నిర్ధారిత గ్రూప్ .

మరి ఇప్పటి కాలం లో ఈ గుజ్జూ తాత, గుజ్జూ మామయ్య లు మళ్ళీ పుడితే వారే మరో పార్టీ పెట్ట కుండా ఉంటారా అన్నది నాకు చాలా కాలం నించి ఉన్న సందేహం !
ధర్మ సంస్తాపనార్థాయ సంభవామి యుగే యుగే అని శ్రీ కృష్ణుల వారు చెప్పి విలు కాని చేతి విల్లు కి బొటన వేలు అడ్డు పెట్టి  పై కెళ్ళి పోయేరు !

సో, ఈ నేపధ్యం లో కొమ్ము కొమ్ము కో సన్నాయి ! మోడీ సింగు 'లాక్' హార్న్' అంటూ మా హిందూ వారు న్యూస్ ఐటెం పెట్టేరు !


పటేలు ఫంక్షన్ లో ఈ 'పొటేలు' సంగతులు ఏమిటీ అంటారా ? మరి 'ఫోటోలు' కదా మా మీడియా వారికి మసాలా పొట్లాలు !!

 
 
ఫోటో కర్టసీ ది హిందూ దిన పత్రిక- 30 అక్టోబర్ 2013
 
 
చీర్స్ 
జిలేబి 


 

Monday, October 28, 2013

'నవ' ధాన్య స్వాతంత్ర్యం !


'నవ' ధాన్య స్వాతంత్ర్యం - జిలేబీయం !
 
Act for Seed and Food Freedom
 
An introduction to Dr. Vandana Shiva !
 
 
చీర్స్ 
జిలేబి 

Thursday, October 24, 2013

A Week before Options Expiry Strategy

So you see, we are nearing the option expiry next Thursday 31st Oct for Oct2013 futures and options market!

Can the NIFTY touch a good 6300 giving good lights and sounds show for Deewaali ?

The market is always a mystery so we see how well the upcoming week goes for the Muhurut trading.

Can there be an options strategy for this last week?

Let us see how it can work;

Bank of Baroda is trading currently around 590. Writing a put options at 560 and call option at 640 at the same time gives a total premium collection of about 11 Rs which equates to Rs.5500/-  for one lot of BOB which is 500 stocks.

Exactly on next Tuesday this trade should be wound up for loss or gain. Gain could be roughly 2500 to 3000/- for an outlay of 4 sessions.

cheers
zilebi
(Zilebi are you sleeping?
We cant make head or tail out of the above!)