అరవిందుని ఒక మండల డిల్లీ దర్బారు గురివింద గింజ మేళం అయి పోయింది !
కేజ్రివాలు క్రేజీ వాల్ అని ఆ మధ్య మన కష్టే ఫలే వారు కామేంటి తే , శర్మ గారు కూడా 'పద' జాలాల తో భలే ఆడు కుంటారు సుమీ అనుకున్నా
ఇప్పుడు డిల్లీ దర్బారు మూత పడి పోవడం తుగ్లక్ దర్బారు ని తలపిస్తోంది !
సరే దేశ రాజకీయం లో ఏదైనా జరగొచ్చు !
మీదేశం పిజ్జా కి పాపులర్ అయితే డానికి కావాల్సిన పెప్పర్ మా దేశం దోయ్ అని మన వారు నిరూపించేరు లోక్ సభ లో !
పిజ్జా పై టాపింగ్ గా పెప్పర్ బాగుంటుంది కాని కంట్లో పెప్పర్ టాపింగ్ చేస్తే ఎట్లా అని దేశం గగ్గోలు !
మధ్య లో అంబాని వర్సస్ అరవిందుని కేసులు కూడా తయారయ్యేటట్టు ఉన్నది !
ఏమిటో మరి !
ఇవ్వాళ డిల్లీ బావ కూడా ముంబై మరదలు పిల్ల తో లుంగి డాన్స్ చేయించ బోయే దినమాయే మరి !
కాబట్టి ఇవ్వాల్టి టపా ఇంతటి తో సరిబెట్టి రాబోయే 'కాళం' కోసం ఎదురు చూస్తో -
నమో మోడీ నమో నమః !
చీర్స్
జిలేబి