చైనా డమాల్ - గ్లోబల్ జాటర్ డమాల్ :)
చీని చీనాంబరాలు ధరించి అని ఆ కాలం లో గొప్ప గా చెప్పే వాళ్ళం. ఈ మధ్య గ్లోబలైజేషన్ గోల లో చీని చీనాంబరాలు ఎక్కడ చూసినా అక్కడ .
పాపం చీనా వాడు కొంత ఇల్లు సర్దు కుంటామని ఇల్లు కొంత సర్ది తే , ఆ సేతు హిమాచల పర్యంతం అన్నట్టు అటు జప్పాను వాడి నించి ఇటు అమెరికా వాడి దాకా అందరి జాటర్ డమాల్
కొందరు మానిక్ మండే అంటే , మరి కొందరు బ్లాక్ మండే అని గీతాలాపన చేసేరు .
బ్లడ్ బాత్ ఆన్ దలాల్ స్ట్రీట్ అంటూ మా హిందూ 'వార్' చెప్పేరు .
ఒక్క రోజులో వెయ్యిన్ని ఆరు వందల పాయింట్లు జాటర్ డమాల్ అవడం ప్రపధమం . ( అంటే, ఇకమీదట ఎప్పుడైనా జాటర్ డమాల్ అయితే దీనికి పై బడే అన్నీ పడతాయని అనుకోవాలేమో మరి :) బెంచ్ మార్క్ ?)
ఏడు లక్షల కోట్ల రూపాయలు ఒక్క రోజులో హుళు హుళు క్కి అయి పోయిందట :) ఇంతకీ ఈ దస్కం ఎవరి జేబులో కెళ్ళి ఉంటాయి ? అమెరికా వాడి ఇంటికి మళ్ళీ చేరి పోయి ఉంటాయా ? సమాధానం లేని ప్రశ్న :)
సరే మన జైట్లీ వారేమో అబ్బే , మన దేశం సర్దేసు కుంటుంది అని వాక్రుచ్చేరు .
మా ఆర్ బీ ఐ రాజన్ గారేమో జిలేబి చీర్సు చెబితే చెప్పును గాని నేను మాత్రం చీర్స్ చెప్పనే చెప్పను అనేసేరు - రీజేర్వ్ బ్యాంక్ చీర్ లీడర్ కాదోయ్ అంటూ .
సందులో సడే మియా అంటూ వడ్డీ రేటు మార్పు కి కొంత కామా పెట్టేరు .
ఈ స్టాకు మార్కెట్టు గోలలో మామూలు విషయమై పోయిన ది - కమాడిటీ మార్కెట్ - పదహారు సంవత్సరాల ప్రాయం కోల్పోయింది :) (పదినారు వయదినిలే అంటూ ఇక మనం పాట పాడేసు కోవచ్చు )
మధ్య లో రూపాయి భేతాళుడు నాదారి ఎడారి నా పేరు బికారి అంటూ మళ్ళీ మొదలెట్టేడు !
వీటన్నిటికి కారణం గ్రహ పరిస్థితులే అని నొక్కి వక్కాణిస్తూ న్నారు బ్లాగ్ జ్యోతిష్యులు :)
రాబోయే సెప్టెంబర్ 'మహీ'నా లో 'మహీ' మీద గామా రేస్ విపరీతం గా వస్తున్నాయంటా ; దానికి ముందస్తు గా ఇవన్నీ 'శుభ' సూచకాలు కని పిస్తున్నాయ్ (అట :)
జిలేబి మొన్న స్వామీ వారితో సెల్ఫీ మేళ మాడేవు కదా దాని పర్వ్యసానమే ఇది అని మరి కొందరు 'మెట్టియల్' విరిచేరు కూడన్నూ :)
జిలేబి ఇప్పుడు కూడా చీర్సేనా అంటే ఏమి చెప్పడం
జాటర్ డమాల్ అయినా చీర్సు చీర్సే :) జిలేబి జిలేబి యే !
చీర్స్
జిలేబి