Wednesday, November 25, 2015

"బావా" నీ వెక్కడ ?


బావా నా లో వంట జ్ఞానమే  కొరవడెనని
వడ్డింపు  వాస్తేదో అంతగా లేనే లేదని
 అల్లం  దోశ లతో  సాంబారు లాగించ మంటే 
బావా, నేను  మూగనై  నీ బందీ నై పోయా !
 
ఆలోచనలకి రూపమీయ జిలేబి గుండు అని
 తటిల్లత లా  జిలేబి పాకం నీరు కారి పోయే
లేని పెసరట్ల  తో తెలుగు వంట చేయ మంటే 
 ఆలోచనలు అవాక్కై ఆముదాన్ని తాగె !
 
వ్యంగ్య వ్యాఖ్యల కారప్పూసల తో వడ్డించి
 టిఫిను ఖాళీ  ప్లేటు పెట్టి  తినమంటే
 అల్లం మిర్చీ గా  మారి కాలుతుంటే
 మజ్జిగెరుగని మదికన్నీరే బ్లాగ్కాలువాయే !
 
అల్లంమొరబ్బా ని అభిమానిస్తే అదేదో నేరమని
 నా తలపుల కే రంకుగట్టి బావలతో సరసమని
 పదాలే వేరుగా పలికి పోపు పొడి వేయిస్తూంటే 
 విస్తరాకుల  విజ్ఞానమిదేనని వినమ్రత గా నవ్వుతా !
బావా నీ వెక్కడ ! నా ఈ చిక్కుల్లో చిక్కావ్ :)

చీర్స్
జిలేబి
 
 

Friday, November 20, 2015

'గరిక' పాటి చేయని సత్యానికి ఎందుకంత విలువ ?

'గరిక' పాటి చేయని సత్యానికి ఎందుకంత విలువ ?

ఎరక్క పోయి వచ్చాను ఇరుక్కు పోయాను అని సినీ కవి పాట . !

నిజంగానే అట్లా అయ్యింది జిలేబి పరిస్థతి !

మొన్న శర్కరి వారు సత్యనారాయణ వ్రతం గురించి గరికపాటి వారి ప్రసంగం వీడియో పెట్టి మనకు తెలిసిన సత్య నారాయణ వ్రతం కోరికలను ఈడేర్చేది . మరి గరిక పాటి వారేమో సత్యం గురించి మాట్లాడు తున్నారు మరి అంటే , అబ్బే మగరాయుళ్ళ కి ఆండోళ్ళ కి తెలిసినంత గా వీటి గురించి తెలీదండీ అని వ్రాయటం తో మొదలెట్టి ఆ పై గరిపాటి చేయని సత్యాని కి ఇంత విలువా ! ఇంత బిల్డ్ అప్ కూడానా అని వ్రాస్తే విన్న కోట వారు ఆయ్ మీరు గరిక పాటి వారి పాండిత్యాన్ని గరిక పోచ తో పోల్చడం సుతరామూ బావోలేదు సుమీ అని ధక్కా ఇచ్చారు ! శ్యామలీయం వారేమో పొరపాటు మాటన్నారు జిలేబిగారు అన్నారు !

అదిరి పడ్డా ! ఎరక్క పోయి కామేంటాను ఇరుక్కు పోయాను అనుకున్నా ! మరీ శర్కరి వారి కామింటు బాక్సు నింపడం కన్నా మనకు ఒక టపా వ్రాసేందుకు ('టపా' కట్టేందుకు ) అవకాశం దొరికింది సుమీ  అని సంతోష పడి పోయా !

సత్యాన్వేషణ అన్నది కాలా కాలం గా ప్రతి జమానా లో నూ జరుగుతున్నదే.

అయితే ఏది సత్యం అన్నది , ఇదే సత్యం అన్నది నిర్ధారణ గా , చెప్పలేనిది. ఇదే సత్యం అంటే అప్పటికి అదే సత్యం కాని దాని ఆవల మరో సత్యం ఉన్నది అన్నదే  న ఇతి !  ఈ క్షణం సత్యం అనుకుంటే ఈ క్షణం మాత్రమె సత్యం ఆ పై క్షణం సత్య దూరం. మార్పు చెందనిది సత్యం అనుకుంటే మార్పు లేనిదే ఈ విష్ణు మాయ లేదు.

గరిక సత్యం పాటి అవ్వొచ్చు నెమో గాని సత్యం గరిక పాటి కాలేదు. అది అయితే ఇక సత్యం వేరే ఉన్నట్టే లెక్ఖ .

గరిక పాటి వారు చెప్పినది 'సత్యమైన' మాట - సత్య వ్రతం చెయ్య మనడం . సత్య మేవ జయతే అనటం తో ఋక్కు ఆగలేదు - మరో తోక తగిలించు కున్నది నానృతం అని కూడాను.

ఋతగుం సత్యం పరం బ్రహ్మ అంటుంది ఋక్కు  . ఇందులో సత్యానికి మరో తోక కూడా ను "ఋ" త  ఎందుకా తోక ? ఇప్పటి దాకా నాకైతే అనుభవైక వేద్యం కాలేదు ( పుస్తక జ్ఞానం కాకుండా)  !

నారాయణ సూక్తం  'నీవారశూకవత్తన్వీ పీతా భాస్వత్యణూపమా' అంటుంది ఆ 'పరం బ్రహ్మ' గురించి చెబుతూ ఎండిపోయిన గరిక మొనన ఉన్న పీత వర్ణ రంగులో అణు మాత్రమై అంటూ .

క్వాంటం ఫిసిక్స్ గాడ్ పార్టికల్ వైపు పరుగెడు తోంది .

ఇట్లాంటి నేపధ్యం లో ఒక్క వాక్యం లో వ్రాసినది ఆ వాక్యం . ఆ గరిక పాటి అన్నది బాగా అక్కడ కుదురుకున్న మాట అయి పోయింది !

సత్యం గరిక పాటి చేయదు. చేస్తే అది సత్యం కాదు. మరి ఏ పాటి చేస్తుంది ? తెలీదు ; ఈ పాటి చేస్తుంది అని తెలిస్తే అది సత్యదూరం.

జిలేబి
(హమ్మయ్య ! నేటికి ఒక టపా కట్టేసా:)

Tuesday, November 17, 2015

ఇచ్చట సెకండ్ హ్యాండు (Pre-Owned) అవార్డులు అద్దె కివ్వ బడును !

ఇచ్చట సెకండ్ హ్యాండు (Pre-Owned) అవార్డులు అద్దె కివ్వ బడును !

"సురేంద్ర మోడీ భాయి !"

నమో నమో భాయి కేంచో ?

భాయ్ ! రాం రాం !

దేశం లో చాలా మంది మండి పోయి తమ తమ అవార్డులను వెనక్కిచ్చేస్తున్నార్ భాయ్ !

రైల్వే ప్లాట్ ఫార్మ్ మీద సెకండ్ సేల్ క్రింద వాటిని అమ్మకానికి పెట్టేయవోయ్ :)

క్యా బాత్ హై !

సెకండ్ హ్యాండ్ అనే పేరు బాగా లేదు అనుకుంటే , Pre-Owned అని పెట్టి అమ్మేయ వోయ్ ! లేకుంటే అద్దెకు పెట్టేయ్య వోయ్ !

****

కొంత కాలం తరువాయి

****

కేంచో ? సేల్స్ ఎట్లా ఉన్నాయ్ ?

దేశం లో ఎవ్వరూ కొన లేదు భాయ్ !

ఎందుకోయ్ ?

వాటి మీదున్న పేర్లు జనాలకి నచ్చలేదూ భాయ్ !

క్యా బాత్ హై !

పేర్లు పీకేయించి అమ్మి చూడ వోయ్ !

***

కొంత కాలం తరువాయ్

***

సేల్స్ ఎట్లా ఉన్నాయ్ ? భాలో ?

భాయ్ ! నన్నొదిలెయ్ ! ఎవ్వడూ కొన నంటున్నాడు - మా కేమన్నా ఖర్మ నా "Pre-Owned" వారిలా "కొని" పెట్టేసు కోడానికి అంటున్నార్ సారూ :)

తగలేడేయ్ ! ఆ మోడీ మస్తాన్ అని తుక్కు సామాన్లు కొనుక్కునేవాడు వస్తాడు వాడు కిలో కి ఎంత ఖర్జూర్ ఇస్తాడో అది తీసేస్కుని అమ్మెయ్ ! పీడా వదిలే !

క్యా బాత్ హై భాయ్ ! సమజ్ అయ్యిందీ భాయ్ :)


చీర్స్
జిలేబి
(తేట గీతి వారి నీ అవార్డులు నువ్వే తీసు కోరా చదివేక సరదాగా :)

Friday, November 13, 2015

ఫ్లాష్ ! ఫ్లాష్ ! ఫ్లాష్ ! అతి త్వరలో వ్యాసుల వారి తో జిలేబి బ్లాగ్ ముఖీయం !

 
 
 
 
 
ఫ్లాష్ ! ఫ్లాష్ ! ఫ్లాష్ !
 
అతి త్వరలో వ్యాసుల వారి తో జిలేబి బ్లాగ్ ముఖీయం !
 
చాలాకాలం తరువాయి జిలేబి బ్లాగ్ముఖీయం తో వస్తోంది 
 
ఇది ఒక  A B N - ఆంధ్రా జిలేబి  సహ సమర్పణ !
 
వెండి తెర పై వేచి చూడుడు !


చీర్స్
జిలేబి
 

Tuesday, November 10, 2015

దీపావళీ జిలేబీయం ! - హే కృష్ణా - కాపీ రైటా ఇల్లవా ?

దీపావళీ జిలేబీయం ! - హే కృష్ణా - కాపీ రైటా ఇల్లవా ?

కృష్ణా జీ హౌ ఆర్ యు ? అడిగింది సత్య !

భామ వైపు చూసేరు శ్రీ కృష్ణుల వారు .

ఈ సత్య అప్పుడెప్పుడో కాలం లో నరకాసురుడి ని సంహారం గావించి సత్యాన్ని నిలబెడితే జన వాహిని దీపావళీ తో ఆనంద పడి పోయేరు !

అప్పటి నించి జనవాహిని ప్రతి ఏటా ఈ దినాన్ని కాపీ కొట్టేసు కుంటూ దీపావళీ జరిపేసు కుంటోంది .

ఈ కలియుగం లో అగర్వాల్ భాయీ లు , శ్రేష్ఠులు కలిసి దీపావళీ సమయాన్ని బిలియన్ డాలర్ మార్కెట్ గావించే సేరు కూడాను !

కాపీ కి ఇంత మహాత్మ్యం ఉంది !

అందరూ శ్రీ కృష్ణా రామా నీ లా నన్ను చేయ వయ్యా అని దండాల మీద దండాలు పెట్టేసు కుంటున్నారాయే !

ఈ జమానా లో అంతా కాపీ మాయం మయం !

కాపీ లేని జీవితం ఎట్లా ఉంటుంది స్మీ :)

దీపావళీ భళీ 'జిలేబీయం !

అందరికీ దీపావళీ 'కాఫీ' కాంక్షల తో !

చీర్స్
జిలేబి

Thursday, November 5, 2015

బ్లాగ్ గాంధీ శ్రీ కాలక్షేపం కబుర్ల శర్మ గారి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు !

బ్లాగ్ గాంధీ శ్రీ కాలక్షేపం కబుర్ల శర్మ గారి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు !

 
శుభాకాంక్షల తో 
జిలేబి 
 

Monday, November 2, 2015

ఈ జమానాలో జనాలకి కాలక్షేపం కబుర్లు, బాతాఖానీ బటానీ కబుర్లే ఎందుకు కావాలి ?

ఈ జమానాలో జనాలకి కాలక్షేపం కబుర్లు, బాతాఖానీ బటానీలు ఎందుకు కావాలి ?

మా మీ మన అందరి 'రోలు కర్ర' శ్యామలీయం బ్లాగ్ మాష్టారు ( వీరిది వృత్తి పరంగా మాష్టారు ఉద్యోగం కాదు - మేధా జీవి ) ఓ కామెంటులో - ... ఈ రోజుల్లో జనానికి వినోదం కావాలి ... కాలక్షేపం సరుకు తప్ప మరేమీ పట్టని వారి సంఖ్యాబలం కారణం గా అలా కాలక్షేపం సరుకుల్ని పంచేందుకు తాపత్రయ పడే వారే ఎక్కువ (ఎడిట్)"

ఈ వ్యాఖ్య చదివాక  - ఎందుకు ఈ కాలం లో ఎక్కువ మంది కాలక్షేపం కబుర్లు, సరదా గా సాగి పోయే విషయాలు తప్పించి కొద్ది పాటి సీరియస్ మేటర్ ని చదవటానికి ఉత్సుక చూపించడం లేదు ? అని పించింది .

మా అయ్యరు గారి తో ఈ మాటే అంటే ... జిలేబి నీ వయసు రోజుల్లో (అబ్బ వయసు రోజుల్లో అంటే నే జిలేబి కి చెక్కిళ్ళ గుబాళింపు ఎక్కువై పోతుంది మరి :)) రేడియో లో కూసింత ఏడుపు కథ లు వస్తే నే నీ కళ్ళ లో కన్నీరు జర జరా రాలి పోయేది గుర్తుందా ? అడిగేరు .

ఆలోచించా . అవును ఆ కాలం లో అన్నీ ఉమ్మడి కుటుంబాలు . కష్టాలు నష్టాలు ఎట్లా ఉన్నా గృహ వాతావరణం లో ఉత్సుకత , హిందీ లో చెప్పాలంటే ఉమంగ్ భరీ లైఫ్ ! ఉమ్మడి కుటుంబాలలో ఉన్న మజా ఆ కాలం వారికే తెలుసు నెమో !

అంతే గాక ఇప్పటి బిజీ లైఫ్ బ్యాక్ ప్యాక్ బకరా బేబీ లైఫ్ అప్పట్లో ఎక్కడ ? ఉద్యోగమో సద్యోగామో గానిస్తే ఆ తరువాయి బాతాకానీ కి ఇంటి నిండా జనాలు ఇంటి చుట్టూతా వున్నవారంతా బంధువులే బాంధవ్యాలే. జీవన గతి , సరళి   సుళువు గా సాగి పోయే రోజులు . రేడియో లలో నో మీడియా (అప్పటి కి లేదు కాబట్టి , పేపర్ల లో నో ) వినోదం  కన్నా కన్నీ టి కధ లే ఎక్కువ .  కాంట్రాస్ట్ బాగా కుదిరి పోయేది !

జీవన గతి లో కన్నా మిన్నగా కన్నీటి కథలు ఉంటె మన జీవితమే బెటరోయి అని పించే లా ఆలోచింప జేసేవి .

మరి ఇప్పటి మాట ఏమిటి ?

జీవనం హై ఫై లైఫ్ ! సిటీ వారి కథలు ఇంక వేరే చెప్పాల్సిన అవసరం లేదు. పరు గె పరుగు . నిలబడి తీరిగ్గా ఆలోచించ టైం ఎక్కడ ?

ఇట్లాంటి జీవన గతి లో  సో కాల్డ్ 'రిలేక్సేషన్ ' కోసం తపించి పోయే , విష్ణు మాయ లో పడి పోయిన మానవుడు !

ఆ ఉన్నంత కూసింత టైం వినోదానికి కాలక్షేపానికి ఏదన్నా  ఉందా అని చూస్తున్నాడు .

మా ఏడు కొండల వెంకన్న లైఫ్ ని బిజి బిజీ చేసి, గజి బిజి చేసి పారే సాడు :) (విష్ణు మాయ మా వెంకన్న దే కదా మరి :)

సో , ఇట్లా ఆలోచిస్తే ఈ కాలపు మానవుడికి, బ్లాగ్ దర్శకులకు కావల్సినిది కాలక్షేపం ఖబుర్లు, బాతా ఖానీ బటానీ లు . ( ఈ టైటిల్లో మీకు ఎవరి బ్లాగు టపా అయినా గుర్తు కొస్తే అది జిలేబి  ఊహాత్మకం గా పెట్టిన పేర్లే గాని వ్యూహాత్మకం గా పెట్టినవి కావు అని గుర్తు పెట్టు కోవాలి ! జేకే !)

సో ప్రియ బ్లాగ్ బాంధవుల్లారా ! మీ అభిప్రాయమేమిటి ఈ విషయం మీద ?

ఫుట్ నోట్ :  జిలేబి కి అర్థం కాని విషయం  ఒకటుంది ఈ కాలం లో కూడా కన్నీటి కుండల, వైషమ్యాల టీ వీ సీరియళ్ళు ఈ జిలేబి లని ఎందుకంత మరీ టీ వీ పెట్టె ముందు బందీ చేసి పారేస్తున్నాయి  ? బ్లాగ్ లోకం లో ఉదాహరణ - వనజ వనమాలీ గారి కథలు )

చీర్స్
జిలేబి
(శ్యామలీయం వారి కామింట్ చదివాక )

Thursday, October 29, 2015

అమ్మకానికో బ్లాగిల్లు - కొనడానికో ....

అమ్మకానికో బ్లాగిల్లు - కొనడానికో ....

మొత్తం మీద మరో అగ్రిగేటర్ డమాల్ ! బ్లాగిల్లు మూట కట్టే సారు మా 'స్టారు' శ్రీనివాసు గారు.

అదేమిటో ఈ తెలుగు బ్లాగు లోకాని కొచ్చిన ఖర్మ !

ఒక్కటొక్కటే బ్లాగులు మూత పడి పోతా ఉంటె , దానితో బాటు అగ్రిగేటర్ లు కూడా మూట కట్టేయ్యటం !

బ్లాగిల్లు శ్రీనివాసు గారు ఇచ్చిన కారణం - బ్లాగిల్లు కి అంత 'రెస్పాన్స్' రావటం లేదు అని .

బ్లాగులు వ్రాసే వాళ్ళు ఎందుకు వ్రాయటం లేదు అంటే ... అబ్బే అంత 'రెస్పాన్స్' రావటం లేదండీ అని.

ఇట్లా ప్రతి ఒక్కరు చూస్తా ఉంటె మిగిలిన వాళ్ళ కోసమే వ్రాస్తా ఉన్నట్టు ఉన్నారుస్మీ ! జేకే !

(ఈ మధ్య శ్యామలీయం వారి బ్లాగులో కామెంటి జేకే అంటే - జేకే అంటే ఏమిటి అని అడిగారు శ్యామలీయం వారు - అబ్బే జేకే తెలీక పోవటమేమిటి వీరి కి అనుకున్నా ! జేకే !)

ఏమండీ బ్లాగిల్లు శ్రీనివాసు గారు, కూడలి, మాలిక గట్రా వాళ్ళు ఏమి ఆశించి ఇంకా తమ అగ్రిగేటర్ లని నిలబెట్టి ఉన్నారు ?

మరో ఆలోచన వస్తుంది - అగ్రిగేటర్ ల ని పెట్టిన వారు - అగ్రిగేటర్ ని మరీ 'పెర్సనల్' గా చూస్తూ న్నారేమో అని ! బ్లాగులోళ్ళం మేమైతే బ్లాగులకి కామింటులు వచ్చాయా లేదా అని ఆతుర పడుతుంటాం గాని అగ్రిగేటర్ లు 'క్లిక్కులు' వచ్చేయా లేవా అని రోలు కర్ర రూలు కర్ర పట్టుకుని లెక్కెయ్యడం జేసి అగ్రిగేటర్ ని మత పెట్టేస్తే  ఇక మా లాంటి బ్లాగులొళ్ళ కి వ్రాసే టపాల కి ఎక్కడ ప్రచారం ఉంటుంది ?

సో  బ్లాగిల్లు శ్రీనివాసు గారు మీరు మళ్ళీ మీ అగ్రిగేటర్ ని త్వరతిం గా నే తెరవండి .

ఆ కామింటు ల సెక్షన్ ని హారం లా తయారు చెయ్యండి (exactly like 'haram' comment section) అప్పుడు చూడండి మీ అగ్రిగేటర్ కి వచ్చే హిట్లని :)


చీర్స్
జిలేబి
 

Monday, October 19, 2015

ప్రతి తెలుగు వాడు తప్పక చదవాల్సిన పుస్తకం - ఇదండీ మహాభారతం !

ప్రతి తెలుగు వాడు తప్పక చదవాల్సిన పుస్తకం - ఇదండీ మహాభారతం !

తెలుగు వారి కి సులభ శైలి లో మహా భారతాన్ని రంగనాయకమ్మ గారు అందించారు.

ఇందులో కథా పరం గా , అక్కడక్కడా వారి వ్యాఖ్యానాన్ని అందిస్తూ మూల మహాభారతానికి అతి దగ్గిరగా అచ్చ తెనుగులో మహా భారతాన్ని వీరు అందించారు .

దరిదాపుల్లో నాలుగు వందల పేజీ ల లో మహా భారతాన్ని ఎట్లాంటి 'భేషజాలు' , ఉత్కృష్ట ఉపమానాలు  లేకుండా కథ ని కథావస్తువు ని యథార్థం గా అందించారు.

వారు అక్కడక్కడ కొట్టిన సెటైర్ నవ్వు తెప్పించ వచ్చు.

కొండొకచో వెటకారం గా అని పించ వచ్చు.

కూసింత వెగటు కలిగించ వచ్చు.

వీటన్నిటి ని పక్క న బెట్టి, ఒక మామూలు సాధారణ జన సమాజానికి ఈ మహా భారత కథ ఏమన్నా విలువల్ని అందిస్తాయా అని వారు ఎక్కు బెట్టిన బాణం మనల్ని ఆలోచింప జేస్తుంది.

వారి సైడు కామింటు లని పక్క న బెట్టి మహా భారతాన్ని ఆస్వాదించ వచ్చు.

సైడు కామింటుల తో సహా చదివితే తల తిరిగ వచ్చు. దానికి వారిని బాధ్యులని చేయ రాదు. 

మహా భారతాన్ని ఇట్లాంటి కోణం లో నించి కూడా చూడ వచ్చు అనడానికి రంగనాయకమ్మ గారి పుస్తకం ఒక సర్వోత్క్రుష్ట మైన ఉదాహరణ.

చదవండి . ఆలోచించండి. అన్నింటినీ యధాతధం గా (వారి 'కిక్కుల'ని కూడా) తీసు కోవాల్సిన అవసరం లేదు.


 
 
చీర్స్
జిలేబి

 

Thursday, October 15, 2015

జబ్బు పడి లేస్తే దాని హాయి యే వేరు :)

జబ్బు పడి లేస్తే దాని హాయి యే వేరు :)

ఈ మధ్య అదేమి విష్ణు మాయయో , గ్రహాల 'పాట్లో' ప్లాట్లో తెలీదు గాని సీనియర్ సిటిజెన్ అయిపోయారు గా ఇక ఇట్లాంటి జబ్బులన్నీ మామూలే అని జిలేబి కే రిటార్టు ఇచ్చె లా ప్రియ బాంధవులు తయారయ్యేరు !
 
అబ్బా ! జబ్బు పడి లేస్తే దాని మోజే వేరు !
 
ప్రశాంతత అనగా నేమి ! అని తెలియ వలె నన్న, అయ్యరు గారి తో సేవలు చేయించు కోవాలె అన్నా జబ్బు పడితే నే తెలుస్తుంది !
 
దేశం లో మళ్ళీ మొన్న వచ్చిన అమావాస్య పాట్లు గ్రహపాట్లు గురించి మళ్ళీ టపా వచ్చేసింది కూడాను మా బ్లాగ్ జ్యోతిష్ శర్మ గారి నించి . కాబట్టి నేను సరి కొత్త గా కొట్టాల్సిన టపా కూడా ఏమీ లేదు :)
 
ఇక భారద్దేశం లో చాలా మంది తమ తమ అవార్డులను (కాగితా ల ముక్కలను, పథకాలను ) తిరిగి ఇచ్చ్చేస్తున్నారు . కాబట్టి నేను కూడా నాకు బ్లాగు లో ళ్లు ఇచ్చిన పథ కాలను అన్నిటినీ తిరిగి ఇచ్చేయా లను కుంటున్నా :)
 
ఇప్పటి కి టపా కబుర్లు ఇంతేస్మీ :)
 
చీర్స్
జిలేబి