ఇట్స్ టైం ఫర్ కాఫీ విత్ అయ్యర్ :)
అయ్యరు గారందించిన కాఫీ సిప్ జేస్తో 'అహా' కుంభకోణం డిగ్రీ కాఫీ బాగుందండోయ్' అంటే ,
ఏమోయ్ జిలేబి ఈ మధ్య మరీ బిజీ బిజీ అయి పోయేవ్ ? అన్నారు కుశలము విచారిస్తో !
వారు నా కుశలాన్ని విచారించే పధ్ధతి ఇదే గా మరి అనుకుంటూ
ఏముంది లెండి ! ఈ మధ్య పద్య రచనల మీద పడ్డా ! మీకు తెలుసుగా ఒక పదం కుదిరితే మరో పదం కుదరదు ! పోనీ పాదం కుదిరింది అని ఆనందం తో మీరిచ్చిన కాఫీ సిప్ జేస్తే మరో పాదం రాలె ! ఇట్లా కుస్తీ ల తో నే సరి పోతోందండోయ్ - చెప్పా !
ఓహో ! నత్త బాధ లన్న మాట ! హిందూ పేపరు లో తల బెట్టి న్యూసు చదువుతో అన్నారు !
అయ్యర్ వాళ్ ! ఈ పద్యాల గోళం లో పడి ఈ మధ్య దేశం లో ఏమి జరుగు తోందో తెలీక పోయే ! ఏమిటి దేశం ఖబుర్లు అన్నా ! అర్రెర్రే ! బడ్జెట్ సీసన్ కూడా అయిపోయే వాటి మీద కూడా జిలేబి ఏమీ కామెంటరీ వ్రాయక పోయెనే అనుకుంటూ !
ఆ ఏముంది లే జిలేబి దేశం లో ఆర్ట్ అఫ్ లివింగ్ వాడు గ్రాండ్ స్కేల్ లో కల్చరల్ ఈవెంట్ పెడితే హిందూ వాడు దాంట్లో ఎక్కువ రంద్రాన్వేషణ పెట్టాడు !
అంటే !
నెగటివ్ పాయింట్స్ అన్నీ పట్టు కొచ్చి అబ్బే ! వీళ్ళకి ఈవెంట్ మేనజ్ మెంట్ తేలీదని తేల్చి పారేసాడు !
ఓ !
అంతే కాదు ! రవిశంకర్ మొదట్లో పొలిటికల్ లీడర్ లా మాట్లాడ ప్రయత్నించి తాను ఆధ్యాత్మిక గురువు అన్న మాట గుర్తుకొచ్చిందేమో సరిదిద్దు కుని హృదయం తో మాట్లాడటం మొదలెట్టాడు !
ఓ !
అదే మీటింగు లో మోడీ వాళ్ళ కి కావలసినంత జోష్ భరీ మస్త్ భారీ స్లోగన్ లు అందించాడు కూడా ! ఏ ఓ ఎల్ అంటే ఏమిటి అంటూ వాళ్ళ కే వాళ్ళ గురించి తెలీనిది చెప్పాడు :)
ఓ ! మన మోడీ గారేం చేస్తున్నా రండీ ఇంకా !
వారా ? ఈ మధ్య ఒక సూఫీ కాన్ఫెరెన్స్ లో వాళ్ళు మస్త్ ప్యార్ భరీ ఉర్దూ లో రాగం తీస్తో మాట్లాడితే , తన ఫేవరైట్ భాష హిందీ లో జబర్దస్త్ వాయించ కుండా అరువు ఆంగ్లం లో వాళ్ళ కి మెసేజ్ ఇచ్చాడు ప్రసంగం లో !
ఏమని ?
అల్లాః హి రహ్మాన్ అవుర్ రహీం హై ! అని !
వారెవ్వా ! ఇంకా ?
ఇట్లా చెప్పుకుంటూ పోవచ్చు గాని ఏమిటి ఇవ్వాళ నా మీద పడ్డావ్ ? కాఫీ బావుందా ?
కాఫీ బ్రహ్మాండం ! ఇంతకీ అయ్యర్ వాళ్ ఈ మధ్య ఒక పద్యం వ్రాసా ! చదివి వినిపించ మంటా రా !
అయ్య బాబోయ్ ! జిలేబి ! ఎన్నై విట్టుడు ! ఎనక్కు వేండామ్ ఉన్ పద్యం !
అయ్యర్ వాళ్ మళ్ళీ గోముగా మరో మారు పిలిచా !
ఇదిగో జిలేబి నీకు పనీ పాటా లేదు ! అట్లా గాదు గా నా కైతే !
వంటా వార్పూ నా మెడ కి అంట గట్టావ్ ! ఆఫీస్ పనంటూ !
ఆఫీస్ పని ఏమి నిర్వాకం చేస్తా ఉన్నావో మన మురుగ ప్పెరుమాళ్ కే ఎరుక ! ఎప్పుడు జూసినా ఒకటి రెండూ ఒకటి అంటూ గణా లని గుణిస్తో ఉన్నావ్ తప్పించి ఆఫీసు పనీ ఏమీ చేసినట్టు దాఖలాలు లేవు ! పనీ పాటా లేక పోతే వంటా వార్పూ చెయ్య కూడదు నాకు మరి కొంత రిలీఫ్ కూడా !
అయ్యర్ వాళ్ అయం వెరీ వెరీ బిజీ ! మరో కప్పు కాఫీ బట్రాండి ! హుకూం జారీ చేసా !
హుసూరు మని హుజూర్ అని అయ్యర్ గారు మళ్ళీ వంట గది ముఖం పట్టేరు !
హమ్మయ్య! ఇట్లాంటి అయ్యరు గారు ఉన్నంత వరకు మన టైం పాస్ కి డోకా వచ్చింది ఏమీ లేదను కుంటూ మళ్ళీ భారీ శరీరాన్ని కరిగించు కోడా నికి పద్యాల తో కుస్తీ పట్టటం మొదలెట్టా
తూలికా రమణి చెప్పిన కిటుకు యిదే గా మరి ! జాలం మీద పడి బరువు తగ్గించు కో అని సరి కొత్త తెకినీకు అన్న మాట :)
చీర్స్
జిలేబి