Wednesday, September 6, 2017

ఒక అద్భుతమైన ఆలోచన !


 
ఒక అద్భుతమైన ఆలోచన !
 
ఒక
అద్భుతమైన
ఆలోచన
వచన కవిత లో
వయ్యారాలు పోతా వుంటే ,
ఛందం లో చచ్చి సగమై
బిక్క మొగమేసి
నిలబడుతోంది !
 
 
శుభోదయం
జిలేబి

Monday, September 4, 2017

బుచికో యమ్మ బుచికీ :)



బుచికో యమ్మ బుచికీ !
 
వచన కవితలకూ
కాలం చెల్లిందా !
అబ్బ! తెలుగదేల యన్న !
 
ఏది రాసినా
ఈ అనాని ముచ్చు లకు
నచ్చక బోయెనే
 
బుచికో యమ్మ బుచికీ !
 
తెలుగు బ్లాగ్ లోకమా వర్ధిల్లు (తావా?) :)
 
 
బుచికోయమ్మ బుచికియా !
మచర్చిక కవిత లనానిమసు వెగచుటయా !
వచనమ్ములకును సుదతీ
కిచకిచ యను నరులు వచ్చి కీసర యనిరే !
 
చీర్స్
శుభోదయం
జిలేబి

Friday, September 1, 2017

జిలేబి వారి జాంగ్రీ :)


జిలేబి వారి జాంగ్రీ :)
(కాపీ పేష్టస్య కాపీ పేష్టుహు)
చాలా కాలం గా అదేమి ఈ పేరు జిలేబి . వీరికి జిలేబి అంటే అంత ఇష్టమా జిలేబి అని పేరెట్టు కున్నారు అని అనుకున్న వారూ ఉన్నారు !

సరే , జిలేబి వారు జాంగ్రీ వేస్తే ఎట్లా ఉంటుందో మరి !?

జాంగ్రీ కి జిలేబీ కి వ్యత్యాసం ఉందంటారా ? రెండూ స్వీట్లే !  . ఎక్కువైతే వెగటే . జిలేబి + జాంగ్రీ ఒక్కరే వేస్తే , అదే బాణలి లో వేసారను కొండి అప్పుడు ఇది జిలేబి యా జాంగ్రీ యా అన్న సందేహం కూడా రాక పోదు మరి .

జాంగ్రీ కొంత మంద పాటి . జిలేబి సన్నపాటి . ఇదీ ఒక వ్యత్యాసమేనా ? నాలుగైదు జిలేబి లను కలిపేస్తే ఇక జాంగ్రీ అయిపోదూ ? ఆ పాటి దానికి స్పెషల్ గా జాంగ్రీ వేయాలా అన్న మాటా రాక మానదు !

పూర్వ జమానాలో రాయచోటి లో పని జేసే టప్పుడు ఓ సాయిబు వేసే జాంగ్రీ అంటే పడి చచ్చి కొని తినే వాళ్ళం . ఈ జాంగ్రీ ని ఆ సాయెబు కోవా జాంగ్రీ అని అమ్మే వాడు . అప్పటికే అతను అరవై సంవత్సరాల పై బడి ఉన్న వాడు . ఇప్పుడు వారి సంతతి ఏమైనా ఆ కోవా జాంగ్రీ ని వేస్తున్నారేమో మరి .

ఇంతకీ ఇట్లా తాడూ బొంగరం లేకుండా టపా పెడితే అది జాంగ్రీ అవుతుందా ? లేక జిలేబి అవుతుందా ?

ఇక జిలేబి వారి జాంగ్రీ ఏమిటి అంటారా ?

అసలు జాంగ్రీ వేద్దామా జిలేబి వేద్దామా అన్న సందేహం లో కొట్టు మిట్టాడి మా అయ్యరు గారి ని అడిగా ఏమండీ అయ్యరు గారు ఇట్లా జాంగ్రీ జిలేబి అంటారు గా ? ఇవన్నీ మన భారద్దేశ పిండి వంట లేనా ? లేక 'ఫారెను' వంట లా అని ?

వారికి తోచింది వారు చెప్పేరు - ముసల్మాను లు భారద్దేశం పై దండ యాత్రల కు వచ్చినప్పుడు అప్పుడు ఇవన్నీ వారితో బాటు వచ్చిన వంటకాలు అయి ఉండ వచ్చు - కాల గతి లో భారద్దేశ పిండి వంటల లో కలిసి పోయి ఉండ వచ్చు అని .

ఉదాహరణ కి ఈ ముంత మామిడి పప్పు ఉంది చూసేరు - ఇది పోర్చుగీసు వారితో వచ్చింది - ఇప్పటి కాలం లో ఈ జీడి పప్పు వేయని పాకం ఏదైనా మన దేశం లో మరి ఉందా ?

ఇది కాదా మరి భారద్దేశ గొప్ప దనం ? ఆంగ్లం లో అంటారు చూడండి - మెల్టింగ్ పాట్ అని అట్లా దేశం లో కి వచ్చిన ప్రతిది దేశం లో ఇమిడి పోయి మరో సరి కొత్త రూపాన్ని సంతరించు కోవడమే కదా ఈ భరత భూమి గొప్ప దనం !

ఇస్లాము దేశ వాళీ సనాతన ధర్మం తో కలగలిసి సూఫీ - దేశవాళీ సూఫీ అవడం, ఈ రెండిటి మధ్యా ఉన్న మంచి విషయాలను గ్రహించి శిక్కు మతం ఉద్భవించ డం ఇట్లా చెప్పుకుంటూ పోవచ్చు జాంగ్రీ లు ఎన్నైనా వేయ వచ్చు !

మరో ఉదాహరణ - దేశవాళీ తనదై చేసేసు కున్న మొబైలు !

బయలు కెళ్ళినా మొబైలు పట్టు కునే వెళ్ళే వాళ్ళం అయ్యేంత దాకా వచ్చేసా మంటే ఇది మరో మెల్టింగ్ మెగా దేశం కాదూ మరి !



ఈనాటి e-జాంగ్రీ తో
చీర్స్ సహిత
జిలేబి
నేటి నారదుల వారి పని :)  (మన టపా మాలిక లో టాప్ గా ఎట్లా కనబడటం ?)
నేటి నారదీయం - బెడిసి కొట్టిన ఎక్స్పెరిమెంటు :)
మొత్తానికే మోసమొచ్చె :) మాలిక జయహో జిందాబాద్ !

Tuesday, August 29, 2017

కోయంబేడు మార్కెట్లో కూనలమ్మ :)


కోయంబేడు మార్కెట్లో కూనలమ్మ :)
 

ఏమండీ అయ్యరు వారు ఇవ్వాళ కోయంబేడు మార్కెట్ కెళ్దామా? అడిగింది జిలేబి.

అయ్యరు గారు ఓసారి ఎగాదిగా జిలేబి ని చూసారు.

మడిసార పట్టు చీర లో ధగధగ భుగభుగ లాడి పోతూ కనిపించింది జిలేబి.

ఏవిటి ? ఈ లాగే ? మడిసార లోనే ?

ఓసారి తన వైపు చూసుకుంది జిలేబి.  ఏం ఇట్లా వెళ్తే ఏమంటా ?

ఏమీ లేదు లే గొణిగారు అయ్యరు గారు.
 
అయినా జిలేబి, కోయంబేడు మార్కెట్టు కు కాస్ట్యూమ్ కూనలమ్మ మడి సార మామి వేషం బాగోదేమో ? మళ్ళీ సందేహం అయ్యరు గారికి.

వెళ్దాం పదండి - బస్సులో అంది జిలేబి 

ఏంటీ మద్రాసు బస్సులో నా ! గుండె గుభిల్లు మంది అయ్యరు గారికి ఇదేమి ప్రారబ్ధ కర్మ రా బాబోయ్ అనుకుంటూ .

అవునండీ బస్సులో నే !
హతోస్మి !
కోయంబేడు మార్కెట్ లో కూనలమ్మ  దిగబడింది.

చుట్టూతా చూసింది.

జన వాహిని ; జన వాహిని.

కు కు కూ అంది.

వెంటనే ఓ తుంటరి పిల గాడు - విజిల్ వేసి - పాప్పాత్తి అమ్మ వందిరుక్కా డా అన్నాడు .

గుర్రు గా చూసింది కూనలమ్మ !
కత్తిరిక్కా ఎవళో ?

వాడో ధర చెప్పాడు.

అమ్మి మరో ధర చెప్పింది.

మధ్య లో అయ్యరు గారు వద్దే జిలేబి ఎక్కువ బేర మాడ బాక! అన్నాడు భయ పడుతూ.

అయ్యరు గారు అనుకున్నట్టే అయింది.

ఇదో - పొమ్నాట్టీ - వాంగినా వాంగు - ఇల్లేనా .....


వాడి  పై జిలేబి గయ్యమని మళ్ళీ ఎగురుదామను కునే లోపల్నే అయ్యరు గారు డేమేజ్ కంట్రోల్ కోసం జిలేబి కో ణిసిధాత్వర్థం సమర్పించే సు కోవడం తో 

మార్కెట్ ఉలిక్కి పడింది.

పాప్పాత్తి యమ్మా ఎంగయో పోయిడిచ్చు డా అంటూ మూర్చ పోయాడా అబ్బాయి


కోయంబేడు మార్కేట్టా మజాకా :)




చీర్స్
జిలేబి

Saturday, August 26, 2017

సోయగముల నోలలాడు సొగసరి వలదే !





ఓయమ్మా! ప్రాసలకై
న్యాయమ్మా యిటుల మమ్ము నాదమ్ములతో
వేయించడము జిలేబీ !
సోయగముల నోలలాడు సొగసరి వలదే !

జిలేబి

Friday, August 25, 2017

వినాయక చవితి శుభాకంక్షల తో - స్వేచ్ఛ - స్వచ్ఛత !



అందరికి వినాయక చవితి శుభాకంక్షల తో 
 
స్వేచ్ఛ - స్వచ్ఛత !
 


 
 
 
 
Go-Green-Ganesha
Immerse into Plant Kingdom !
 
జిలేబి
 

Wednesday, August 23, 2017

ఇదేమి చోద్యమో !



 
ఇదేమి చోద్యమో !
 
ఇదేమి చోద్యమో !
రోజూ మబ్బులు సూరీడికి
బురఖా వేసేసి పోతూ ఉంటాయి .
ఒక్కరూ పట్టించు కోరు
 
ఓ రోజు రెండు నిమిషాలు
చంద్రుడు కప్పేస్తే
జనాలు ఇంత తలక్రిందుల
గా వేలాడ తారేంటో !
మరీ పిచ్చి మాలోకం !
 
అదై పోతుంది - ఇదై పోతుంది
అంటూ మరీ బుర్రల చెదలతో
మరీను :)
ఇదేమి చోద్యమో !
 
 
చీర్స్
జిలేబి

Monday, August 21, 2017

షడ్జా మడ్జ కరాడ్జ్య - గరికిపాటి వారి శైలి లో - కథా కమామీషు


షడ్జా మడ్జ కరాడ్జ్య - గరికిపాటి వారి శైలి లో - కథా కమామీషు

(వీడియో లో దరిదాపుల్లో నాల్గవ నిమిషం నించి- మొత్తం వింటే అదో కిక్కు :) )




శార్దూల విక్రీడితము.(Pochiraju kameshwara Rao gaaridi)

షడ్జామడ్జ కరాడ్జ వీడ్జన సుధా డ్జాలంబు ధడ్జాఖరే
యధ్యః ఖడ్గ ధరే ధరే ఖణఖణే ఖర్జూర లుడ్భ్రాడ్భ్రమః
లుడ్భ్రాయాస్పద యడ్గ్ర డడ్గ్ర డడడా షడ్గ్రడ్గ్ర డడ్గ్రడ్గ్రహా
షడ్జానః పురచాతురస్సుర గణేశద్యోతి విద్యోదయః
 
Another Version -
 
షడ్జామడ్జకరాడ్జవిడ్జ వసుధజ్జాలాంఛిదజ్జాఖరే
జడ్జటకిట్కిధరఢ్గరేడ్ఘన ఘనఖడ్జోతవీడ్జట్భృమ విఢ్యా
లుఢ్భ్రమలుట్ప్రయట్రయపదా డడ్గ్రరడడ్గ్రరహ
పాదౌటేట్ప్రట టట్రయట్పుట రసప్రఖ్యాత సఖ్యోదయా
 
 
చీర్స్
జిలేబి
 

Saturday, August 19, 2017

మాలతి కథ



మాలతి పెళ్లీడుకి వచ్చింది.

తల్లి -లెక్ఖ ప్రకారం అమ్మాయి పెళ్లి వేగిరమయి పోవాలి.

ఏదో ఒక అయ్య చేతిలో దాన్ని పెడితే - దాని జీవితం సాగి పోయినట్టే లెక్ఖ.

అయ్య కి కూడా ఆతురత.

అమ్మాయి పెళ్లి ఎంత బిరీన అయి పోతే అంత మంచిది.

ఏళ్ళు పై బడే కొద్దీ అమ్మాయి పెళ్లి తను చెయ్యాలనుకున్నా అయ్యే ఖర్చులు తనని చెయ్య నివ్వవు.

సో, అమ్మాయి పెళ్లి వెంటనే అయి పోవాలి.

' అయ్యా నే పై చదవులకి వెళ్తా అన్నది మాలతి.

అమ్మ గుండె బరువయ్యింది. ఈ కాలం పిల్లలో ఇది ఎదురు చూసిందే - కాని తన మాలతి కూడా ఇలా అంటే ?

 ' పిచ్చి పిల్లా పై చదువులకి వెళ్లి ఏమి చేస్తావే ? పెళ్లి చేసేసు కో అంది.

 మాలతి పట్టు బట్టింది. గవర్నమెంటు చదువు చెప్పిస్త దయ్యా అంది. .

'ఎన్నేళ్ళు ?'

ఓ పాటి నాలుగు అంతే అంది మాలతి.

అయ్య నిట్టూర్చాడు. ఖర్చుల లెక్క ఊహించుకున్నాడు. ' గవర్నమెంటు ఇస్తాది లే అయ్యా' అంది మాలతి

నాలుగేళ్ళు తిరిగాయి. అమ్మాయి పట్నం లో ఇంజనీరింగ్ ముగించింది.

అమ్మాయ్ - ఇప్పుడు చేసేసుకోవే పెళ్లి అంది అమ్మ

'నాకు స్కాలర్షిప్ వచ్చింది అయ్యా' అంది మాలతి ' పై చదువులకి అమెరికా వెళ్తా అన్నది.


'దాని కేమి లే తల్లీ - ఆ పెళ్లి చేసేసుకుని వెళ్ళు ' అంది అమ్మ.


మాలతి నవ్వింది. అయ్య ఏమి జేప్పలేక పోయాడు.


ఎన్నేళ్ళు?

ఓ పాటి నాలుగు అంతే అంది మాలతి.

ఏళ్ళు తిరిగాయి. అమ్మి పై చదువులు అయింది.

ఆ పై చదువులకి వెళ్తా అన్నది మళ్ళీ -

ఈ పారైనా  పెళ్లి చేసుకో అంది అమ్మ.

అమ్మ తల నెరవడం గమనించింది మాలతి.

'లేదే - పై చదువులకి అక్కడే ఒప్పుకున్నా' అంది మాలతి ముభావంగా.

ఇంకా ఏమి పై చదువులే అమ్మీఇట్లా చదూతూ పోతా ఉంటే,  - నీకు మొగుడు చిక్కాలంటే - నీకన్న పై చదువులు చదివినాడు కావాలి కాదే మరీ? అంది తల్లి.

అయ్యా నువ్వైనా చెప్పు అంది అమ్మ .

ఎన్నేళ్ళు ? అడిగాడు అయ్య.

ఇది పై చదువులు అయ్య- రిసెర్చ్ తో బాటు - ఫెలోషిప్ అంది మాలతి.

మాలతి చెప్పింది తనకి అర్థమైనట్టు తలూపాడు అయ్య. అంటే ఏంటో తెలీదు. కాదనడ మెందుకు ?

ఇట్లా జరిగే నాలుగేళ్ల ప్రహసనం లో - ఓ మారు మాలతి తీరిగ్గా ఓ రోజు అద్దం ముందు నిలబడి ఉంటే  - ధగ ధగ మెరిసే నెరిసిన తల వెంట్రుక గమనించింది.

ఓ మారు ఆలోచింది తన కి ఎన్ని ఏళ్ళు? అని - దాదాపు యాభై దాపుల్లో ఉండవచ్చు అనుకుంది.

ఆ రోజు - తనతో బాటు తీరిగ్గా రిసెర్చ్ చేస్తున్న జోసెఫ్ - తనకీ ఓయాభై దాపుల్లో  వయసు ఉండవచ్చేమో - తనతో ' మనమిద్దరం పార్ట్ నర్స్ - అవుదామా అంది.

తలూపేడు జోసెఫ్ కూడా- తనకీ ఓ తోడూ నీడా ఉంటే  మంచిదే అనుకున్నాడు.

ఈ మారు అయ్యని అమ్మని కలవడానికి జోసెఫ్ ని వెంటేసు కొచ్చింది మాలతి.

ఎవరే అంది అమ్మ గుస గుసలాడుతూ. నేనితన్ని పెళ్లి చేసుకోబోతున్న అంది మాలతి - లైఫ్ పార్ట్ నర్స్ ని అమ్మకి ఎలా చెప్పాలో తెలియక.

అయ్య చూసాడు - నెరిసిన జుట్టు అమ్మాయి - అంతకి మించి నెరిసిన జుట్టు అల్లుడికి - ఈడు జోడు బాగానే ఉంది కదా అనుకున్నాడు. - తండ్రి మనసు - నిట్టూర్చడానికి తావులేదు- ఇంత కాలం తరువాతైనా అమ్మాయి పెళ్లి చేసుకుంటా అన్నది కదా అనుకున్నాడు.


అమ్మ - మురిసిపోయింది. ఆవిడ బోసినవ్వు తో - గుస గుస లాడుకుంటున్న వాడ జనాల్ని గదమాయించింది- మా మాలతి కి కాబోయే మొగుడు అని చెబ్తూ.


పదహారులో క లలు కన్న స్వప్నం అరవై లో నైనా  నెరవేరిందని తల్లి హృదయం సంతోష పడింది. ఎంతైనా తల్లి హృదయం కదా మరి. !


మాలతి లాంటి మగువల చీర్సు కు
చీర్స్
జిలేబి

Wednesday, August 16, 2017

బ్రహ్మచారి మొగుడు - సన్నాసిని పెండ్లాం :)

 
బ్రహ్మచారి మొగుడు - సన్నాసిని పెండ్లాం :)
 
 
డమాలే డమాల్ !
బ్రహ్మచారి మొగుడు
సదాచార సంపన్నుడై పోతా ఉంటే
సన్నాసిని నౌత నని పెండ్లాం
గుండు కొట్టించు కుని
కొండెక్కి
పోతా నందంట :)
 
 
("నేతి" కబుర్లు )
జిలేబి