శ్యామలీయ కందోత్పలములు
వికసిత మానసమున నెల
తుక! తత్పరుడాయె స్నేహితుడు దామ్మ! జిలే
బి కుశాగ్రబుద్ధి తో నే
య కందపద్యము గురువుల యాశయు తీరన్!
అలవోకగ సాగ పద
మ్ములు సత్పుర వాసి! వ్రాయుము పసందుగ శ్యా
మల రాయు కోరిరే నీ
కలవాటైనట్టి విద్దె కందమ్మె కదా!
చినుకులవలె కురియుచు సో
మున నుత్పల మాల పాదము వినూత్నపు రీ
తిని కంద మందు తా నొల
క నిబిడమై సొబగులీన కలమున్ గొనుమా
కలకల లాడవలెన్ మిల
మిల నుత్పతితంబు గా నిమిడి నున్ననగా
నిల కాంతులీనగావలె
జిలేబి! యర్పించుకొనవె చీర్సుల తోడై!
***
తత్పరుడాయె స్నేహితుడు దామ్మ! జిలేబి కుశాగ్రబుద్ధితో
సత్పుర వాసి, వ్రాయుము పసందుగ శ్యామల రాయు కోరిరే
నుత్పల మాల పాదము వినూత్నపు రీతిని కంద మందు తా
నుత్పతితంబు గా నిమిడి నున్ననగా నిల కాంతులీనగా
ఫ్యాక్టరీ పద్యాలు :)
జిలేబి