సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
16 hours ago
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
ఏమి చేయమందు ఈశ్వరా ! ఏమి చేయ వలనని నన్నే అడిగిన నేనేమి చేతును మానవా ! | |||
తెల్లవారినది మొదలు కల్లలాడు బ్రతుకాయె దానికి కారణంబెవరు ? మానవా ? నెల్లప్పుడు నా కిచట నెవరి నే మందునయా నెవరి నేమనుటకు నీకేమి అధికారము గలదు ? అనవలయు నన్న ఈశుడొక్కడే నీ కాధారంబుగాద ? అల్లకల్లోలవార్థి యైనది నా చిత్తము చల్లగా నిన్ను తలచజాలు వీలేదయా చిత్తమది నీదను మాట వదులుము మానవా ఇంకను నాచిత్తము అనిన నేనేమి చేతును ? నా నీ లు ఉండ నీవు నీవే గాదా నేనెక్కడ యిక ? | |||
ఏ వారికి హితుడనో ఎరుగరాని లోకమున నా వారని యెవ్వరిని నమ్ముకొని యుందురా ఎవరు నీవారని లోకము నకు వచ్చినాడవు ? నమ్మి ఎవరిని వచ్చినాడవు ? ఆ నమ్మకము వీడి నీ వెవ్వారిని నమ్మ వలయు ? ఈ వసుధ మీద వీర లెఱుక గల్గి యున్నారని నీ వారని యెవ్వరిని నేను తెలిసికొందురా | |||
అందరు నావారే గాదా మానవా ? నన్ను వలయు నన్న వాడివి మధ్యవర్తి నేల తెలిసి కొనవలయు ? నన్నెరుక గొనుమా ! నన్నెరుగ నేనే నువ్వు ! మస్తకము దురూహల మయమాయె విసివితిని దుస్తులవలె తనువులను త్రోసిత్రోసి విసివితిని పుస్తకముల పరమసత్యమును వెదకి విసివితిని ప్రస్తుతకర్తవ్య మేమొ బాగుగా తెలుపరా | |||
తత్పర పరాత్పరాత్పర మత్పర చిత్పరమువోలె మారుతి నాత్మన్ సత్పుర రాముని సన్నిధి తాత్పర్యము బోధపడదు తత్వజ్ఞులకున్ ! శ్రీ శ్యామలీయం వారి టపా చదివాక శివోహం ! జిలేబి |