సరదా మాటలు :)
బ్లాగు అగ్రిగేటర్ లో ప్రముఖం గా కనిపించేవి టపా హెడ్ లైన్లు !
అప్పుడప్పుడు వేగం గా హెడ్ లైన్లు మాత్రమే చదివేస్తూం టాం .
ఆ ఫ్లో లో పక్క పక్క నున్న కొన్ని బ్లాగు హెడ్ లైన్లను కలిపి చదివేస్తూండటం కూడా కద్దు.
అట్లాంటి సమయాల్లో కొన్ని టపా ల హెడ్ లైన్లు కలబోత గా నవ్వు ని తెప్పించేస్తూం టాయి. ఇట్లాంటి వి కొన్ని ఇంతకు మునుపు రాసినట్టు గుర్తు.
అట్లాగే ఇవ్వాళ కనబడినవి కొన్ని :) ఎన్జాయ్ :)
వనజవనమాలి : గోదావరిలో రాయికి నోరొస్తే ..
చిత్రకవితా ప్రపంచం : చచ్చిన దానికి కడుపొచ్చింది
గోదావరిలో రాయికి నోరొస్తే .. చచ్చిన దానికి కడుపొచ్చింది
పాటతో నేను : అబ్బనీ తియ్యనీ దెబ్బ...
Eco Ganesh : మధర్ సూక్తి
అబ్బనీ తియ్యనీ దెబ్బ... మధర్ సూక్తి
కష్టేఫలి : కలిగినవారింటి దిష్టిబొమ్మ
ఒక్కమాట : యశస్వి||దిశ మొలతో తిరిగే వాడికి సిగ్గేసినప్పుడు..||
కలిగినవారింటి దిష్టిబొమ్మ -- దిశ మొలతో తిరిగే వాడికి సిగ్గేసినప్పుడు
Sakshyam Magazine : రావణ లంక దొరికింది.. సీతను దాచిపెట్టిన లంక దొర
ఆపాత మధురాలు : చల్లని చిరుగాలీ నీకొక సంగతి తెలుపాలీ
రావణ లంక దొరికింది.. సీతను దాచిపెట్టిన లంక దొరికింది - చల్లని చిరుగాలీ నీకొక సంగతి తెలుపాలీ
Sakshyam Magazine : రావణ లంక దొరికింది.. సీతను దాచిపెట్టిన లంక దొర
ఆపాత మధురాలు : చల్లని చిరుగాలీ నీకొక సంగతి తెలుపాలీ
శ్యామలీయం : దేవుడు రాముడు దేహాలయమున జీవుడు రాముని పూజారి
DATHA RAMESH : రజనీకాంత్ సినిమాలలోని టైటిల్ కార్డ్స్ !
దేవుడు రాముడు దేహాలయమున జీవుడు రాముని పూజారి - రజనీకాంత్ సినిమాలలోని టైటిల్ కార్డ్స్
చీర్స్
మీకూ ఇట్లాంటివి కనిపిస్తే కామింటండి :)
జిలేబి