Friday, November 30, 2018

దత్తపది - అల కల తల వల - అన్యార్థం లో - పాదాది లో - రామాయణార్థం లో !



అల - కల - తల - వల
పై పదాలను అన్యార్థంలో పాదాదిని ప్రయోగిస్తూ
రామాయణార్థంలో
మీకు నచ్చిన ఛందస్సులో
పద్యాన్ని వ్రాయండి.
 
*****
 

అలరింపగ రామకథ స
కల జనుల వినుడు వినుడనగ లవకుశులటన్
తలచిరి వసుగర్భసుతను
వలవల కన్నీరుగ ప్రజ వసుధాధిపుకై!


అల ముక్కుపచ్చలారని
తలకయు లేని నగుమోము దహరుడయా ! నా
వల గాములు! గాధేయుడ!

కలవరమాయె మది నేను కానకు వత్తున్!

అలవోకగ తాకగ గుణి
కలజముడి విడువడినట్టు గప్పున కూలన్
తలరారు నితండెయనుచు
వలతియు జూచి రఘుపతిని వరునిగ వలచెన్!

అలరారు నీకు సతిగా
వలపుల రాణిగ ధరణిజ పరిపూర్ణముగా
తలచె మదిని నిను పతిగా
కలహంసా!యేలుకొనుమ కళ్యాణమునన్!


అలకలకొలికి యిదియె! సీ
త! లక్ష్మి!కళ్యాణరామ! ధరిణిజ యిదిగో
వలపుల పంటగ నిల్చు స
కల గుణముల మేల్మిగా సుఖములను జేర్చున్!

అలఘుడు రఘుపతి, సిత యల
కలల్ల లాడెడు మహీజ, కల్యాణమటన్
తలతల లాడెడు చీరల
వలతులు నటునిటు తిరిగిరి వరుడిని గానన్ !


అక్కల- అయ్యో !

అలనాడిచ్చిన వరముల

తలంపునకు తెచ్చి కైక తన రాముని న
క్కల! కాననమున కంపగ
వలవల నేడ్చె దశరథుడు పరిపరి విధముల్!


అలనాటిదె నాతి వెతలు !
కలకంఠి శుభాంగి లక్ష్మి కనవచ్చెను కుం
తలమును దున్నగ! తానా
వల రాముని సతిగ వెడలె వనమున కకటా!

వలపుల జమచేసుకొనుచు
కలవర పడక పతిరాక కై నిదురను తా
నలవోకగ కౌగిలిగా
తలచెను లక్ష్మణుని సతియె తరుణి జిలేబీ!

 
తలచెన్ పో శూర్పణఖయు
కలడా రఘురామునివలె గాళకుడిలలో?
వలపుల కురుపించెద సయి
యలసిసొలసియైన పరిణయం బాడెద నే!


అల వైకుంఠములో సే
వల చేసెను కర్మ ఫలపు పరిపక్వతకై
తలచుచు నెదిరిగ విభుడిని
కలహమునకు కాలుదువ్వె కద రావణుడే!


అలరింపంగను కాలపృష్ఠమట నా యార్యున్ ప్రియత్వమ్ముతో కలపన్ దున్నగ బుట్టి నట్టి సిత, జింకన్ కోరగా వేటకై
తలసాలన్ దహరుండు లక్ష్మణుడి చేతన్బెట్టి శ్రీరాముడా
వల బోవంగ మహీజ గీత భళిరా పాయెన్గదాలంకలో !


అలకాపురిపతి మ్రొక్కుచు
తలసాలన్ గాపుగాచు ధరణిజ వినుమా
వలచితి రమ్మా లంకకు
కలడే దశకంఠుని వలె గండడిల రమా ?

కలయగ సుగ్రీవుడు నా
వల వాలిని కంధరమున ఫల్యపు మాలన్
తలచియు ధర్మము బాణం
బలవేయగ చచ్చినాడు బలవంతుడటన్ !

అలవోకగ లంఘించుచు
కలతల చేర్చి యసురులకు కార్మొగిలువలెన్,
తలచిన రీతిని తానా
వల నీవల దూకెనుగ పవన తనయుడటన్!

అల గంధమాదనమ్మున
కలహమ్ముల కల్లు త్రాగి కలకలములతో
వలకాకపు కోరికలకు
తలమీరి పనుల మరిచిరి తఱులమెకమ్ముల్!


కలవరమును జేర్చెడు కల!
అలఘుడు రఘురాముడు తను నగచరములతో
వలతి ధరణిజను కావగ
తలకన్నది లేక దునిమె దశకంఠునిటన్ !


అలసట యన్నది లేక స
కలము రఘుపతి దని తలచి కరసేవగ పో
తల యిసుకను నుడతయు తా
వలచక తెచ్చెను ప్రపత్తి పరిపక్వముగాన్ !


అలసె సొలసెనాత్మయు నా
వల తల్లియు వేచెనయ్య పట్టిని కడుపున్
కలవరపడక కలుపుకొన
తలచెద నీ మేలు రామ తరలెద పుడమిన్!

జిలేబి

Tuesday, November 20, 2018

సరదా ప్రభాకర విభావరి :)

 

సరదా ప్రభాకర "విభావరి"
 

 


 శంకరాభరణం సమస్యలు - సరదా పూరణలు
రచన - జి. ప్రభాకర శాస్త్రి
వెల - అమూల్యం
పుస్తకాన్ని సాధ్యమైనంత ఎక్కువ మందికి అందించాలని శాస్త్రి గారి ఉత్సాహం.
కావాలసినవారు క్రింది ఫోన్ నెం. నేరుగా కాని, వాట్సప్ సందేశంగా కాని సంప్రదించండి.
జి. ప్రభాకర శాస్త్రి - 9849015796
కంది శంకరయ్య - 7569822984
 
 
When an "IITian Lion" looks at life :)
 
 
 
 
 


చీర్స్
జిలేబి

Saturday, November 17, 2018

ఆకాశవాణి - సమస్యా పూరణ - కార్యక్రమం - 17th Nov 2018 - నిర్వహణ - శ్రీ బండకాడి అంజయ్య



 
 
ఆకాశవాణి సౌజన్యము -
 
దీని లో జిలేబి పద్యము చదువ బడినది 
 
ఆకాశవాణి సమస్యాపూరణ కార్యక్రమం - 17th  Nov 2018
 
నిర్వహణ - శ్రీ  బండకాడి అంజయ్య గారు
 
సౌజన్యం - ఆకాశ వాణి  హైదరాబాదు
 
నేటి సమస్యాపూరణ కార్యక్రమం లో  సమస్య
 
 
రణములె కద పండితులకు రమ్యక్రీడల్!
 
 
 
అణగారని దీపమ్మది
పణముగ మది దోచుచుండు, పరికించంగన్
క్షణమైనను విడువని పూ
రణములెకద పండితులకు రమ్యక్రీడల్!


జిలేబి

Saturday, November 10, 2018

ఆకాశవాణి - సమస్యా పూరణ - కార్యక్రమం - 10th Nov 2018 - నిర్వహణ - శ్రీ బండకాడి అంజయ్య





ఆకాశవాణి సౌజన్యము -
 
ఆకాశవాణి సమస్యాపూరణ కార్యక్రమం - 10th Nov 2018
 
నిర్వహణ - శ్రీ  బండకాడి అంజయ్య గారు
 
 
 
సౌజన్యం - ఆకాశ వాణి  హైదరాబాదు
 
నేటి సమస్యాపూరణ కార్యక్రమం లో  సమస్య
 
 
లయమే శాంతినిఁ గల్గఁ జేయును గదా రంజిల్ల సన్మార్గమై
 


జిలేబి పూరణ

భయమేలన్ సఖి! పెండ్లయెన్ గద! పతిన్! భార్యామణీ ప్రేయసీ
ప్రియుడన్! రావె శుభాంగి ! కొమ్మ! భువిలో ప్రేయస్సులన్గాంచి నా
శ్రయమున్ గోరుచు నీశుచెంత చెలిమిన్ సంపర్కమై చూడ నా
లయమే శాంతిని గల్గ జేయునుగదా రంజిల్ల‌ సన్మార్గమై


చీర్స్
జిలేబి

Saturday, November 3, 2018

ఆకాశవాణి - సమస్యా పూరణ - కార్యక్రమం - 3rd Nov 2018 - నిర్వహణ - శ్రీ బండకాడి అంజయ్య గారు



 
జిలేబి పద్యము - ఆకాశవాణి సౌజన్యము :)
 
ఆకాశవాణి సమస్యాపూరణ కార్యక్రమం - 3rd Nov 2018
 
నిర్వహణ - శ్రీ  బండకాడి అంజయ్య గారు
 
 
 
సౌజన్యం - ఆకాశ వాణి  హైదరాబాదు
 
నేటి సమస్యాపూరణ కార్యక్రమం లో జిలేబి పద్యము చదవ బడినది !
 
 
దీపావళి పండు గన్జ రుప నౌఁగద పున్నమి నాటి రాతిరిన్
 
(ఛందోగోపనం)



 
 
ఆ వనజోదరుండు నరకాసురుడిన్ మడచంగ సూవె, దీ
పావళి పండు గన్జ రుప నౌఁగద!, పున్నమి నాటి రాతిరిన్
భావిని! దివ్వె లన్నిటిని బారుగ దీర్చుము కార్తికంబునన్,
కోవెల వెల్గు జేర మన కోశము లెల్ల సుదీప్తి గాంచునే !


దీపావళి
శుభాకాంక్షలతో

జిలేబి


Saturday, October 27, 2018

ఆకాశవాణి - సమస్యా పూరణ - కార్యక్రమం - 27th Oct 2018 - నిర్వహణ - శ్రీ కంది శంకరయ్య



జిలేబి పద్యము - కంది వారి గళము - ఆకాశవాణి సౌజన్యము :)
 
ఆకాశవాణి సమస్యాపూరణ కార్యక్రమం - 27th Oct 2018
 
నిర్వహణ - శ్రీ కంది శంకరయ్య గారు
 
 
సౌజన్యం - ఆకాశ వాణి  హైదరాబాదు
 
నేటి సమస్యాపూరణ కార్యక్రమం లో జిలేబి పద్యము చదవ బడినది !
 
 
ఖర పాదార్చన మొక్కటే హితముఁ గల్గం జేయు ముమ్మాటికిన్
 
 
 
అరయన్ పార్వతి, దుర్గ, శారదయు, మా యార్యాణి శర్వాణి యా
సురసన్ కర్వరి కొండచూలి గిరిజన్ శోభిల్లు మా శైలజన్,
వరమాలన్ మనువాడినట్టి శివుడా భద్రేశుడౌ చంద్ర‌శే
ఖర పాదార్చన మొక్కటే హితముఁ గల్గం జేయు ముమ్మాటికిన్!


శుభాకాంక్షలతో
 
జిలేబి

Saturday, October 20, 2018

ఆకాశవాణి - సమస్యా పూరణ - కార్యక్రమం - 20th Oct 2018 - నిర్వహణ - శ్రీ కంది శంకరయ్య



జిలేబి పద్యము - కంది వారి గళము - ఆకాశవాణి సౌజన్యము :)
 
ఆకాశవాణి సమస్యాపూరణ కార్యక్రమం - 20th Oct 2018
 
నిర్వహణ - శ్రీ కంది శంకరయ్య గారు
 
 
సౌజన్యం - ఆకాశ వాణి  హైదరాబాదు
 
నేటి సమస్యాపూరణ కార్యక్రమం లో జిలేబి పద్యము చదవ బడినది !
 
నవరాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్
 
 
 
 
జవరాలా వేడుక గా
"నవరాత్రోత్సవము" లొప్పు నాలుగు దినముల్,
తవణించగన్ దినములు న
లువది,మదిని చిలుకవలె కలుగ భావనలున్ !

జిలేబి
 

Thursday, October 18, 2018

విజయ దశమి శుభాకాంక్షలు !




విజయ దశమి శుభాకాంక్షలు !
 
 
 
 
చిత్ర సాయము - శ్రీ కేశవ్ ఆఫ్ "ది హిందూ" ఫేమ్
 
జిలేబి
 

Saturday, October 13, 2018

జిలేబి పద్యము - కంది వారి గళము - ఆకాశవాణి సౌజన్యము :)



జిలేబి పద్యము - కంది వారి గళము - ఆకాశవాణి సౌజన్యము :)
 
ఆకాశవాణి సమస్యాపూరణ కార్యక్రమం - 13th Oct 2018
 
నిర్వహణ - శ్రీ కంది శంకరయ్య గారు
 
 
సౌజన్యం - ఆకాశ వాణి  హైదరాబాదు
 
నేటి సమస్యాపూరణ కార్యక్రమం లో జిలేబి పద్యము చదవ బడినది !
 
 

Saturday, October 6, 2018

శంకరు డందు కొనె ఆకాశవాణిన్ :)





శంకరు డందు కొనె ఆకాశవాణిన్ :)


శంకరాభరణం బ్లాగ్ నిర్వాహకులు శ్రీ కంది శంకరయ్య గారివ్వాళ (6th October 2018) ఆకాశవాణి లో సమస్యా పూరణ కార్యక్రమం నిర్వహణ గావించారు.

ఆ రికార్డింగ్ ఆల్ ఇండియా రేడియో లో నిన్న జరిగిన సందర్భం గా తీసిన వారి అరుదైనఫోటో - సౌజన్యం ఆల్ ఇండియా రేడియో హైదరాబాదు.




శుభాకాంక్షలతో
 
జిలేబి