ప్రవీణ్ లా పేషంట్ ఫర్ కామెంట్ గల కామెంటర్లు తెలుగు బ్లాగ్ లోకానికి ఎంతైనా అవసరం !
(ఇది చాలా సీరియస్ టపా)
కామెంటడం ఒక కళ .
తెలుగు బ్లాగ్ లోకం లో ఒక కాలం లో ది స్పిరిట్ ఆఫ్ తూచ్ తూచ్ ల తో బాటు కామెంట్ల కోలాహలం , కామెంట్ల గార్బా, కామెంట్ల దాండియా, కామెంటర్ల దర్పం, డాంబికం, నువ్వంటే నువ్వేంటి అన్న వాదం, ప్రతి వాదం, పిడివాదం, మిత వాదం, అమిత వాదం, వ్యర్థ వాదం, చెణుక్కుల చమక్కులు, రేపొర్టాయిరీలు, ముసుగుల్లో ముషాయిరీలు , టై పాటుల్లో కత్తులు కటారులు, రాతల్లో వీరం, శౌర్యం , భయానకం, మేధ, కవితల్లో కారుణ్యం, విరుపులు, వివేకం లో విచారం, విచారం లో వివేకం, పద కేళీ లలో సరిగమ పద నిసలు ....
ఇలా రాసు కుంటూ పోతోంటే ఇవి, అవి, అన్నీ కలగలసి ఓ తెలుగు పీటం లా జిగేలు మనేది !
ప్చ్,ప్చ్ ఇప్పుడు కాలం మారి పోయింది .
ఆయ్ అంటే ఓయ్ అని కామెంటర్ల ని వాళ్ళ ధోరణి ని దబాయించి నోరు మూయించే వారే ఎక్కువై పోయేరు !!
ఆ కాలపు బ్లాగర్లారా ! కామెంటర్లారా ! ఏమై పోయేరు మీరంతా ! ?? తెలుగు రౌడీ లు, రౌడీ రాణులు వీళ్ళంతా ఎక్కడ కళ తప్పి పోయేరు ??
సో కాల్డ్ సీనియర్ బ్లాగర్లు వార్షికోత్సవానికి ఒక్క మారు టపా పెట్టి ఇది నా ఆరో వార్షికోత్సవం అంటూ టపా పెట్టె స్థాయి కి వచ్చేసింది !
కామెంట్లలో ఎక్కువగా ఉన్న కామెంట్ల బ్లాగుల్ని వేరే గా పెట్టేయమన్న ఆర్త నాదాలతో వెలుగొందు తోంది ! ఇది ఏమి సబబు ?? (రాబ్ పాల్ తో పే ది పీటర్!)
పాపం ఈ అబ్బాయి ప్రవీణు డొక్కడే కుస్తీ పడుతున్నాడు ఏటికి ఎదురీదు తున్నాడు .
బ్లాగ్ లోకానికి మరిన్ని ప్రవీణ్లు రావాలి !
ఇదియే జిలేబి విన్నపం - బ్లాగర్లారా, కామెంట్లల్ని తుంచ కండి . కామెంటర్ల ని వెలి వేయకండి . కామెంట్లు లేని టపాలు దీపం లేని ఇండ్లు .
కామెంట్ల పరిధి ఇంతే ఉండాలన్న రూళ్ళ కర్ర ల తో దబాయింపులు, రుమాళ్ళ తో నోటి కి మూతలు తాళాలు పెట్టడం భావ్యమా ? ఇది అవసరమా ??
తెలుగు బ్లాగ్ లోకమా ! కళ్ళు తెరు !
జిలేబి
(ఇది చాలా సీరియస్ టపా)