Monday, October 19, 2009

అమ్మ ఒడి

అమ్మ ఒడి ఒక బడి
అమ్మ చెంత నిశ్చింత
అమ్మ మా అమ్మ ముగ్గురమ్మల అమ్మ
సరస్వతి లక్ష్మి పార్వతి ల సంగమం మా అమ్మ
అనురాగ రాగాల పల్లకి లో జీవితం లో మరపురాని
దినాలని మదిలో నిలపి
'అమ్మాయీ' నాదైన ఈ వారసత్వం
నీ ద్వారా ఇంకా నీ వారసత్వానికి ప్రాసాదించు!
అన్న ఆశీస్సులతో ఆశీర్వదించే అమ్మ ఒడి ఒక గుడి
సదా సిద్చిర్భవతు సర్వానాం !
జిలేబి.

Sunday, October 18, 2009

హరి సేవ

సేవ అన్నా సర్వీసు అన్నా మనకి చాల ఇష్టం
వాలంటరీ సర్వీసు స్వచ్ఛంద సేవ సంస్థల హృదయం
అది హరి సేవ అన్నా జన సేవ అన్నా
ముఖ్యమైనది హృదయం ద్వారా పని చెయ్యడం
హరి సేవలో, జన సేవలో తరించే ప్రజా లోకానికి
ఇవ్వాళ ప్రపంచ పేదరికాన్ని పోగొట్టాలన్న
అంతర్జాతీయ దినోత్సవనాన్ని గుర్తు చేస్తూ

మీ
జిలేబి.

Saturday, October 17, 2009

లీలా + మోహనం!

భామ సత్య సారథి కే రథ సారథి గా నిలచిన వేళ
'సారథి' శౌర్యం నరకాసురనుని వధించిన వేళ
చూపులలో వయ్యారాలు మాత్రమే గాదు స్త్రీ శక్తీ అనిపించిన వేళ
భామా సమేత కృష్ణుడే శక్తీ స్వరూపుడు అని నిరూపించిన వేళ
ఆ వేళ ఈ వేళ - దీపాల మేళ !
ఆ 'లీలా మొహనుల' కు నమస్సులతో !

అందరికి శుభాకాంక్షలతో!
'సత్పుర' వాసిని
జిలేబి.

హృదయ స్పందనల చిరు సవ్వడి

ఎవ్వరూ లేనప్పుడు కిటికీ దేన్ని చూస్తుంది?
ఎవ్వరూ భాజాయించనప్పుడు ధమరుకం ఏ నాదాన్ని వినిపిస్తుంది?
ఎవ్వరూ విననప్పుడు మురళీ ఏ గానాన్ని ఆలపిస్తుంది?
ఎవ్వరూ చూడనప్పుడు కళ్లు వేటిని చూస్తాయి?
హృదయ కవాటాలని తెరచి వినగలిగితే ....
స్పందనల చిరు సవ్వడి వీటన్నిటికి అతీతంగా
ఉన్న ఆ ఆంతర్యామిని సాక్షాత్కరిస్తుందా?
ఆనందో బ్రహ్మ!

దీపావళి శుభాకాంక్షలతో
జిలేబి.

Friday, October 16, 2009

నవ్వులాట

ఆహా నా నవ్వులాట
ఆహా నా నవ్వులాట
నీకు నాకు నవ్వు అంట తాం తాం తాం
నవ్వు నాలుగివిధాల ఆరోగ్యమంటా
నవ్వితే రత్నాలు రాలుతాయంట
నవ్వే నాకు శోభ యంటా
అందుకే .....
నవ్వో నమః!

ఛీర్స్
జిలేబి.

Thursday, October 15, 2009

ఆంధ్రా 'మృతం'?

ఆంధ్రుల చరితం అతిరస భరితం
ఆంధ్రుల సంస్కృతి అమోఘ కావ్యం
ఆంధ్రుల మేధస్సు వర్ణనాతీతం
ఆంధ్రుల వంటకం షడ్రసో పేతం
ఆంధ్రుల కీర్తి అతిరధ మహారధుల సమ్మేళనం
ఆంధ్రుల కావ్యం కమనీయం
ఆంధ్రుల సౌర్యం అసామాన్యం
మరి ఆంధ్రుల రాజకీయం......??????

ఛీర్స్
జిలేబి

Tuesday, October 13, 2009

ఆలోచనా తరంగాలు

తిరంగం తరంగం లా వయ్యారాలు పోతూంటే
మది మనోల్లాసంగా మురిసిపోతూంటే
పై ఎద పై పై ఎగసి పడుతూంటే
ఆలోచనా తరంగాలు చక్కిలి గింతలు పెడుతూంటే
మనసా ఎందుకే మౌనం

ఛీర్స్
జిలేబి.

Monday, October 12, 2009

భావ నిక్షిప్తం

గుండలోని మాట గొంతుకలో కొట్లాడుతుంటే
మదిలోని సవ్వడి మరువనీయ కుండా ఆరాట పెడ్తూంటే
హృదయం తనని మరవ లేక తానే తనలో మమేకం కాలేక పోతూంటే
భావం ఆర్ణవమై సంధ్యలో కరిగిపోతూ
నాతో చెలిమి చెయ్యమని
నా మనసే భావమై నాలో నిక్షిప్తం!
అంతా గుప్చుప్!

జిలేబి.

Sunday, October 11, 2009

మురళీ గానం

మురళీ గానం
మధురం
తియ్యదనం కలబోసిన దంటా
ఆ కాలం లో నే నుండి ఆ గానాన్ని
ఆలకించి ఉంటే అవునో కాదో చెప్పే దాన్ని
కాని ఆ మురళీ గానం తానెప్పుడు మధురమే
అని నిరుపించుకోవడానికి
ప్రతి కాలం లో ను ఒక్కో మానీషి లో ప్రతిధ్వనిస్తూనే ఉంది
వినడానికి మన చెవులు హృదయ ద్వారాలని తెరిచి వుంచితే!

ఛీర్స్
జిలేబి.

Saturday, October 10, 2009

కలల ప్రపంచం

కలల ప్రపంచం
నీది నాది అన్నా ఈ ప్రపంచం
అందరిది ఈ ప్రపంచం అయినప్పుడు
కలలు కనే నా నేస్తం కలల ప్రపంచం
ఎప్పుడు సాకారం ?

పిన్న పెద్ద అన్నా తమ్ముడు అక్క చెల్లి
బంధుత్వం బాదరాయణం
ఓ అరవై లేక డెబ్భై ఏళ్ళు
జీవితం
పరమం పురుషార్థం
ఆనందో బ్రహ్మ!

ఛీర్స్
జిలేబి.