Saturday, October 17, 2009

హృదయ స్పందనల చిరు సవ్వడి

ఎవ్వరూ లేనప్పుడు కిటికీ దేన్ని చూస్తుంది?
ఎవ్వరూ భాజాయించనప్పుడు ధమరుకం ఏ నాదాన్ని వినిపిస్తుంది?
ఎవ్వరూ విననప్పుడు మురళీ ఏ గానాన్ని ఆలపిస్తుంది?
ఎవ్వరూ చూడనప్పుడు కళ్లు వేటిని చూస్తాయి?
హృదయ కవాటాలని తెరచి వినగలిగితే ....
స్పందనల చిరు సవ్వడి వీటన్నిటికి అతీతంగా
ఉన్న ఆ ఆంతర్యామిని సాక్షాత్కరిస్తుందా?
ఆనందో బ్రహ్మ!

దీపావళి శుభాకాంక్షలతో
జిలేబి.

9 comments:

  1. విన గలరా నిశ్శబ్ద శబ్ద ఘీంకారాన్ని?
    మదిలోన జనించే ఓంకార నాదాన్ని?


    దిక్కులేని దరిద్రుల ఆలాపనలనైనా
    గళం నుంచి పుట్టే ఘీంకార నినాదలైనా
    హృదయ స్పందనలో రగిలే రాగాలనైనా
    వినటానికి కావాలి నిర్మల హృదయం

    నాద స్వరాలు,ఢమరుక తరంగాలు
    వేణవు గానాలు, కోకిల గీతాలు
    నిశ్శబ్దంలో ఎపుడైనా విన్నావా?
    విన్నావా ఓంకారనాదమెపుడైనా?

    దృక్కులన్ని నల్దిక్కుల ప్రసరించి
    కన్నావా ఎపుడైనా దీనుడైన మనిషి గోలని?
    కళ్ళుమూసి రెప్పల చాటున
    చూశావా ఎపుడైనా విరిగిన జీవతాలని?

    అందులో జనించి
    మదిలో లయమై
    హృదయ లోయల్లో
    కలిగే భావమే ఓంకారం.

    ReplyDelete
  2. మీకు నా దీపావళి శుభాకాంక్షలు!

    ReplyDelete
  3. అన్నట్టు మీ కవిత చదివి దీపావళి అని మర్చిపోయాను. జిలేబి కి కూడా దీపావళి శుభాకాంక్షలు.

    ReplyDelete
  4. బాగుందండి కవిత...దీపావళి శుభాకాంక్షలు!

    ReplyDelete
  5. చిరుసవ్వడి చేసిన మీ కవిత, దానికి భాస్కర రామి రెడ్డి గారి ప్రతిధ్వని బాగున్నాయి. మీకు నా దీపావళి శుభాకాంక్షలు

    ReplyDelete
  6. హృదయ లయతో లయమై సృష్ట్యాది నుండీ ఓం కారారమైన నాదమే పరమాత్మ. ఆ అంతర్యామిని కాంచగలిగిన జీవాత్మ ధన్యజీవి.

    మీకూ దీపావళి శుభాకాంక్షలు.

    ReplyDelete
  7. మీ కుటుంబానికి కూడా దీపావళి శుభాకాంక్షలు.

    ReplyDelete
  8. మీకు, మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు, సకల శుభాలు కలగాలని కోరుతూ.....దీపావళి శుభాకాంక్షలు!

    ReplyDelete
  9. జిలేబికి దీపావళి శుభాకాంక్షలు .

    ReplyDelete