Tuesday, January 31, 2012

జిలేబీ శతకం - 1

జిలేబీ శతకం

శతక కర్త - శ్రీ తాడిగడప శ్యామల రావు గారు

బ్లాగ్ లోకం లో వీరు 'శ్యామలీయ' మై
బుజ్జి పండు తెలుగు చదువు లో దర్శన మిచ్చి న వారు


గమనిక: ఈ రచన సర్వ  హక్కులు శ్రీ తాడిగడప శ్యామల రావు గారివి.
జిలేబీ టపా , కామెంటు చెండులు వీటికి ఉత్ప్రేరకాలు మాత్రమే!

***

ఆనీదవాతగ్ స్వదయా తదేకం

అన్నన్నా నువు మాయలు
పన్నే మొనగాణ్ణి పట్టి బంధిస్తావా
నిన్నే బంధించాడా
నన్నూ అట్లాగె పట్టినాడు జిలేబీ


పోనీలే అది బంధం
ఐనా బాగుంది నాకు అది అట్లాగే
కానీ కబుర్లు చెబుతూ
పోనీ మన చేత బడక పోడు జిలేబీ

బంధాలెరుగని వాడిని
బంధించాలని దురాశ పడితే చాలా
బంధించ భక్తి పాశం
సంధించే యొడుపు ఉన్న చాలు జిలేబీ


అది సాధించే విద్యను
పది జన్మలనుండి యెంత బాగా రోజూ
వదలక నే అభ్యాసం
కుదురుగ చేస్తుంటి నమ్మ కూర్మి జిలేబీ

నేనెరిగనంతవరకును
మానక సద్భక్తి గొలుచు మనుజుల వద్దన్
తానే తప్పక బందీ
గానుండును ప్రభువు నిజము గాను జిలేబీ

స్నేహమేరా జీవితం

చక్కని స్నేహం బొక్కటి
 దక్కినచో జీవితంబు ధన్యము గాదా
 పెక్కురు సామాన్యులతో
 చిక్కిన అది బ్రతుకు తీపి చెరచు జిలేబీ


కొంచెము గానైనను తగు
 మంచి తనము గతము నందు మన కగుపించెన్
 మంచికి రోజులు కావివి
 ముంచే స్నేహాలు పెద్ద ముప్పు జిలేబీ

గొబ్బిళ్ళ ఉగాది

కం. ఏడాది పొడవు నావులు
దూడలునుం గడ్డి తినవె దుందుడు కొప్పన్
పేడను వేయవె గొబ్బి
ళ్ళాడుట కేమొచ్చె దోష మనగ జిలేబీ

కామెంటు చెండులు

కం. విపరీతంగా చదవా
లపుడప్పుడు తోచినట్లు వ్యాఖ్యానించా
లపుడప్పుడు మౌనాన్నీ
ఉపయోగించాలి తెలివి యొప్ప జిలేబీ.

పద్మ అవార్డులు

కం. అరవై మూడేళ్ళాయెను
దొరలిచ్చే గౌరవాలు దూరందూరం
జరుగుతు ఆంధ్రావని అం
దరనీ కడు చిన్నబుచ్చుతాయి జిలేబీ

కం. ఏటేటా పందేరం
కోటాపద్మాలు మనకు కుదరని బేరం
నూటికి కోటికి ఒకటి గి
రాటెస్తే సంబరాలు రావు జిలేబీ

కం. దొంగలు పంచేసుకునే
రంగుల పద్మాలు మనకు రాకుంటేనేం
నింగిని ముట్టే వెలుగు త
రంగాలకు చిన్నతనము రాదు జిలేబీ


అపుత్రస్య .....

కం. పొరబా టిరు వైపులనుం
 తరచుగ గలుగుటను జేసి తలిదండ్రులు దు
 ర్భరమగు సంకటములకుం
 గురియగు దృశ్యములు గుండె కోయు జిలేబీ

సిరి సిరి  

కం. సిరి నెన్నెడు మానవులను
 కరుణించడు విష్ణుమూర్తి కమలాలయయున్
 హరిభక్తు లైన వారల
 పరికింప దటండ్రు విబుధవరులు జిలేబీ

కం. హరి బాయదు సిరియందురు
 హరియును సిరి నురము మీద నాభరణముగా
 ధరియించు నందు రిలపై
 నిరువురు నొకచోట నుండ రేల జిలేబీ!

కం. సిరి తనవశమై యుండగ
 నరుడడుగుట తప్పుగాదె నారాయణునిన్
 మరచునదియు చెడునదియును
 ధరాజనులె హరిది లేదు తప్పు జిలేబీ

కం. హరిభక్తుడైనవానికి
 హరిభక్తియె సిరియు గాన నతని కితరముల్
 సిరులేల గాన లోకము
 పరమదరిద్రునిగజూడ వచ్చు జిలేబీ

కం. హరిసిరులిర్వురునొకచో
 ధరనుండమి వెఱ్ఱమాట తగ మోక్ష శ్రీ
 కరుణించదె హరిభక్తుని
 నరునకు నింకేమి వలయు నమ్మ జిలేబీ

గీత మీద పేరడీ

కం. గీతల మీదే పేరడి
 రాతలు మెరిపించు నేర్పు రాదు సులువుగా
 ఐతే రసవద్గీతల
 చేతులు కల మంచి రామ చిలక జిలేబీ!

చీనా బంగారం
కం. బంగారమందు చైనా
బంగారం వేరు జాతి బంగార మసల్
బంగారం కన్నా యీ
బంగారం కారుచవక బాంగుందమ్మా

టపాకీకరణం
జిలేబి.

आसमान से तारे नाही ....

जम्बू,

आसमान से तारे नाही

मार्केट से प्याज ले आवो

दो जान नहीं

हर दिन दो प्यार !


चीर्स
जिलेबी.

Monday, January 30, 2012

పరుగు ఆపడం ఒక కళ

మానేజ్మెంట్ గురువులు, మానసిక శాస్త్ర నిపుణులు చెప్పే సులువైన మాట - పరుగు ఆపడం ఒక కళ.

అసలు పరుగు లో వున్న వాడు పరుగు ఆప గలడా అని ?

పరుగంటేనే డైన మిజం. అంటే ఎల్ల వేళలా పరిణితి. అట్లాంటి నాన్-స్టాటిక్ డై మేన్షన్ లో వున్న వాడు పరుగు ఆపాడంటే వాడు స్టాటిక్ స్టేట్ కి రావాలి.

స్టాటిక్ కరెంట్ షాక్  మనం అప్పుడప్పుడు చవి చూస్తూంటాం. సో, స్టాటిక్ స్టేట్ లోనూ కొంత పాటి డై న మిజం వుంది. అంటే సకల చరమూ ఆచరమైనా అందులో రవ్వంత చరత్వం ఉంటుందను కుంటాను.

సో, చరాచర సృష్టి అన్నది ఆచరత్వం, చరత్వం కాని దాని నించి వచ్చిందని చెప్పటం లో కొంత సూక్ష్మం  వున్నట్టు ఉంది.

ఆచరమైనంత మాత్రాన చరం గొప్పదని కాదు. అట్లాగే చరమైనంత మాత్రాన అచరం గొప్పదని కాదు.

దీంట్లో ని మర్మ మెరిగి, చర అచర లో దేనిని ఎ పద్ధతి లో ఉపయోగించు కోవాలో అన్న దానిని గ్రహిస్తే ఓ మోస్తరు జీవితం సాఫీ అని భావిస్తాను.

కాకబొతే ఈ చర అచర ల లో ఏది ఎప్పుడు ఉపయోగించాలి అన్నది మాత్రం ప్రతి ఒక్కరి అనుభూతి కి , వారి వారి ప్రయత్నాలకి లోబడి ఉంటుందను కుంటాను.

అచర స్థితి లో ఉండి చర మార్గాన్ని కర్మ సిద్దాంతం గా చేసి చూపించిన ఓ మరిచి పోతూన్న 'గాంధీ' కి నివాళు లతో !

జిలేబి.

Saturday, January 28, 2012

వినా మనమోహనం !!

వినా మనమోహనం ననా ధో ననా ధః 

సదా మనమోహనం స్మరామి స్మరామి

హరే మనమోహనం ప్రసీద ప్రసీద

ప్రియం మనమోహనం  ప్రయచ్ఛ ప్రయచ్ఛ !



చీర్స్

జిలేబి.

Friday, January 27, 2012

మీరేం చేస్తున్టారండీ ?

మీరేం చేస్తున్టారండీ అన్నా రా మధ్య ఒకరు.

వంట చేస్తున్టానండీ అన్నా.

అది సరేలే నండీ , అది తప్పించి వేరే ఏమైనా వ్యాపకం ఉందా అన్నారు వారు.

వుందండీ, పనిలేక కాలక్షేపం ఖబుర్లు లాంటివి చదువుతూ ఉంటా నండీ అన్నా.

ఎక్కడండీ సాక్షి లో నా జ్యోతి లో నా అడిగారు వారు.

అబ్బే బ్లాగ్ లోకం నండీ అన్నా.

అంటే అడిగారు వారు.

అదండీ అంతర్జాలం అని ఒకటి వుందండీ అందులో చాలా బాగ రాస్తున్టారండీ అందరూ అవన్నీ అప్పుడప్పుడు చదువుతూ ఉంటా అన్నా

చదివి ఎం చేస్తారండీ ? అడిగారావిడ.

చదివి నచ్చితే కామెంటు కొడ తా నండీ అన్నా.

అదేమిటండీ నచ్చితే కొడత నంటారు అని అడిగారు వారు.

నచ్చక పోయినా కొడుతూ వుంటారండీ అన్నా.

అయ్య బాబోయ్ రాసేవాడు చదివే వాడికి లోకువని చెప్పండి అట్లయితే అన్నారావిడ.

అవునేమో కదా ఇక్కడ బక్కెట్టు బోర్లా పడిందే చెప్మా అనుకున్నా !


చీర్స్
జిలేబి.

పద్మార్పిత !

సంవత్సారినికో మారు
జరిగే సంబరం
గణ తంత్రోత్సవ
'పద్మా'ర్పితల లిస్టు

కొన్ని గత కాలపు  శ్రీ ల  
పునరుజ్జీవన  భూషితం  

కొన్ని జీవించి ఉన్న ఉత్తేజాలు
ఇప్పటికి నిస్తేజాలు
కాల గతిన కలిస్తే
అవుతాయేమో విభూష ణాలు

సంవత్సరానికో సారి
జరిగే సంబరం లో
మరో మారు అంబారీ ఎక్కిన
పద్మార్పిత !



చీర్స్
జిలేబి.

Wednesday, January 25, 2012

బందీ అను బంధం

హే ప్రభూ,
అక్కడ నువ్వు ఒంటరి గా వున్నావని
తెలిసి నిన్ను బందీ చేయాలని చూస్తున్నా
కానీ నువ్వు చేసే మాయ ఏమిటో తెలియదు
ఇక్కడ నేనే బందీ అయి పోయాను

ఈ బందీ బంధము నీదే అని
అనుకున్నా  అదేమిటో
ఆకలేస్తే చిన్న పాప నోట్లో చెయ్యేసుకుని
చప్పరించే వైనం లా వుంది

ఈ పై నున్న బందా , ఎప్పుడు బందీ అగునో ?

తేరీ సహీ నాహీ అయిన
జిలేబి.

(శ్రీ శర్మ గారి 'అనుబంధం' ప్రశ్న కి జవాబు )

Tuesday, January 24, 2012

బాలయ్య vs జిలేబి !బాపురే రమణీయం !

బాపురే రమణీయం !

బెష్టు మట్టి బుర్ర !

ఈ మధ్య బాపురే రమణీయం శ్రీ రామ రాజ్యం వారి అర్ధ శత (వందకి పరుగులిచ్చేందుకు కొంత పుష్ అప్ ) వేడుకలని  తీరిగ్గా 'నిల్చొని' చూసాను. నిల్చొని అనడం ఎందుకంటే , standing ovation అన్న మాట. ఒక్కింత మర్యాద.

ఈ తీరికైన వ్యాపకం లో ఆఖరున (బాలయ్య మొదటే మాట్లాడితే ఆ పై జనాలు ఎవరూ ఇక ఉండరని తను ఆఖర్లో మాట్లాడను కున్నారో, కాకుంటే, మట్టి బుర్రలు ఆఖర్న మాట్లాడడమే బెష్టు అనుకున్నారో తెలీదు గాని ) బాలయ్య మాట్లాడాడు.

స్టేజీ ని ఈ వైపు నించి ఆ వైపుకి 'జానా' పెడుతూ సింహం లా తిరుగుతూ ఒక్కింత గ్రాంధికమూ, గ్రామ్యమూ కలిపి మాట్లాడడం మొదలెట్టాడు, సామి రంగా, జిలేబి కి కాంపిటీషన్ కోచ్చేసాడే సుమా బాలయ్య కూడా అని నేను హాశ్చర్య పోయాను సుమా.

ఎందుకంటే, ఆ మధ్య మా భారారే (ఇంకా 'మా' భారారే వారే అను కుంటున్నా, !) ఆయ్ అందరూ హారం పత్రికకి సంక్రాంతి లోపే కథలూ గట్రా పంపించండి అంటే, నేనూ సై అని, భారారే , ఏప్రిల్ ఒకటో తారీకులో గా సంక్రాంతి కి ఆర్టికల్ పంపిస్తానని వాక్రుచ్చాను. వారు ఓ కోడా జాడిన్చేరు, ఆయ్ జిలేబి రమ్ము ఏమైనా తాగారా, ఏప్రిల్ లో ఏమిటి సంక్రాంతి అని !

ఇట్లాగే మా బాలయ్య కూడా, ఈ శ్రీ రామ రాజ్య అర్ధ శత మహోత్సవ వేడుకలలో, 'రాబోయే ఉగాది కి, గొబ్బిళ్ళు, నవ ధాన్యరాసులూ. అంటూ 'వాక్రుచ్చడం ' తో ముచ్చటేసి, బాలయ్యా , శభాష్, నువ్వూ జిలేబి కి సరి సమానమైన వాడవే నోయి అని నేను ముచ్చట పడి పోయా ! మొత్తం మీద, జిలేబి కి 'టెలీపతీ' ఉందండోయ్ !


బాలయ్య 'గొబ్బిళ్ళ ఉగాది' !!



say cheers to
జిలేబి !

Monday, January 23, 2012

పట్టు కొట్టు తిట్టు కాని మాట తీసి గట్టు మీద పెట్టు

ఏమోయ్ జిలేబీ, మార్కెట్టు కెళ్ళి  ఏం పట్టు కు రమ్మంటావ్ ?

ఏదో ఒకటి కొట్టు కు రండి.

అదేమిటోయ్, ఆ పరాకు,చిరాకు ?

ఉన్న మాటంటే ఉలుకెక్కువ అంటారు

సరేలే, ఆ బాస్కెట్టు గట్టు  మీద పెట్టు. ఇప్పుడే వస్తా !


చీర్స్
జిలేబి.

Saturday, January 21, 2012

'పద' తాడన కేళీ విలాసం !

రుషం లో

రువు

తాకిడి లో

మరుకం

వ్వుల పువ్వుల

కేకసలు రాదే భ

ళీ తంటా

విను వీధి

లాస్యం

సంగ్రామ కోలాటం !


జిలేబీ ఎందుకె

నీకీ వినువీధుల విహారం ?
మానుమా నీ ఈ

పద తాడన కేళీ విలాసం !


చీర్స్
జిలేబి.