Wednesday, January 25, 2012

బందీ అను బంధం

హే ప్రభూ,
అక్కడ నువ్వు ఒంటరి గా వున్నావని
తెలిసి నిన్ను బందీ చేయాలని చూస్తున్నా
కానీ నువ్వు చేసే మాయ ఏమిటో తెలియదు
ఇక్కడ నేనే బందీ అయి పోయాను

ఈ బందీ బంధము నీదే అని
అనుకున్నా  అదేమిటో
ఆకలేస్తే చిన్న పాప నోట్లో చెయ్యేసుకుని
చప్పరించే వైనం లా వుంది

ఈ పై నున్న బందా , ఎప్పుడు బందీ అగునో ?

తేరీ సహీ నాహీ అయిన
జిలేబి.

(శ్రీ శర్మ గారి 'అనుబంధం' ప్రశ్న కి జవాబు )

8 comments:

  1. ఇక్కడబందీ అయిపోతే కుదరదు. అక్కడబందీ కావాలి. బందా అయినా బాధలేదు

    ReplyDelete
  2. బందీ ఏమిటో బంధం ఏమిటో అంత మీ మిధ్య..

    ReplyDelete
  3. అన్నన్నా నువు మాయలు
    పన్నే మొనగాణ్ణి పట్టి బంధిస్తావా
    నిన్నే బంధించాడా
    నన్నూ అట్లాగె పట్టినాడు జిలేబీ

    పోనీలే అది బంధం
    ఐనా బాగుంది నాకు అది అట్లాగే
    కానీ కబుర్లు చెబుతూ
    పోనీ మన చేత బడక పోడు జిలేబీ

    బంధాలెరుగని వాడిని
    బంధించాలని దురాశ పడితే చాలా
    బంధించ భక్తి పాశం
    సంధించే యొడుపు ఉన్న చాలు జిలేబీ

    అది సాధించే విద్యను
    పది జన్మలనుండి యెంత బాగా రోజూ
    వదలక నే అభ్యాసం
    కుదురుగ చేస్తుంటి నమ్మ కూర్మి జిలేబీ

    నేనెరిగనంతవరకును
    మానక సద్భక్తి గొలుచు మనుజుల వద్దన్
    తానే తప్పక బందీ
    గానుండును ప్రభువు నిజము గాను జిలేబీ
    ..................(జిలేబీ శతకం నుండి)

    ReplyDelete
  4. కష్టే ఫలే మాష్టారు,

    మీరు అడిగినదానికి నాకు తెలిసిన జవాబు చెప్పాను!
    బందా'స్ బాండ్ ఈజ్ బాంధవ్యం !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  5. తెలుగు పాటలు గారు,

    ఇవి మిధ్యా పాటలు , పాట్లు !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  6. శ్యామలీయం మాష్టారు,

    నమో నమః !

    ఈ వేగాన జిలేబి శతకం ఒక్కవారం లోనే పూర్తి అయి పోతుందను కుంటాను!! నెనర్లు.

    బందీ అవక పోతాడా ఆ పై వాడు ?

    అదీ చూస్తాను ఎన్ని జన్మలు తిప్పిస్తాడో !


    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  7. "జిలేబీ" లాంటి మధురమయిన దానికి ఎవరయినా "బందీ"కాకతప్పదు.

    ReplyDelete
  8. DSR Murthy గారు,

    సరిగ్గా చెప్పారు !

    ఆ పైనున్న జిలేబీ, బీలేజీ పరంధాముడు ! మనమే కొంత ప్రయత్నం చేయాలి బందీ అవడానికి!!


    చీర్స్
    జిలేబి.

    ReplyDelete