Friday, January 27, 2012

పద్మార్పిత !

సంవత్సారినికో మారు
జరిగే సంబరం
గణ తంత్రోత్సవ
'పద్మా'ర్పితల లిస్టు

కొన్ని గత కాలపు  శ్రీ ల  
పునరుజ్జీవన  భూషితం  

కొన్ని జీవించి ఉన్న ఉత్తేజాలు
ఇప్పటికి నిస్తేజాలు
కాల గతిన కలిస్తే
అవుతాయేమో విభూష ణాలు

సంవత్సరానికో సారి
జరిగే సంబరం లో
మరో మారు అంబారీ ఎక్కిన
పద్మార్పిత !



చీర్స్
జిలేబి.

6 comments:

  1. కం. అరవై మూడేళ్ళాయెను
    దొరలిచ్చే గౌరవాలు దూరందూరం
    జరుగుతు ఆంధ్రావని అం
    దరనీ కడు చిన్నబుచ్చుతాయి జిలేబీ

    కం. ఏటేటా పందేరం
    కోటాపద్మాలు మనకు కుదరని బేరం
    నూటికి కోటికి ఒకటి గి
    రాటెస్తే సంబరాలు రావు జిలేబీ

    కం. దొంగలు పంచేసుకునే
    రంగుల పద్మాలు మనకు రాకుంటేనేం
    నింగిని ముట్టే వెలుగు త
    రంగాలకు చిన్నతనము రాదు జిలేబీ
    .................. (జిలేబీ శతకం)

    ReplyDelete
  2. పద్మార్పిత అని ఒక బ్లాగర్ ఉన్నారు. ఆవిడ మంచి కవితలు రాస్తూంటారు. నేను మీరు ఆవిడ గురించి రాసేరేమోనని అనుకున్నా.

    ReplyDelete
  3. శ్యామలీయం వారు,

    మా బాగా చెప్పేరు !

    అదేమిటో పద్మ కి ఆంధ్రులంటే అంత గా నప్పుదు !
    పద్మ కి 'అర్పితలైన' తెలుగు వారికి ఆమడ దూరం.
    ఎస్పీ బాలూ కూడా, ఆ తమిళ లోకం లో వున్నాడు కాబట్టి పద్మ కొంత ముస్తాబై అయ్యింది వారికి.

    మీదు మిక్కిలి ఈ రాష్ట్ర ప్రభుత్వాల 'స్ట్రాంగ్' సిఫార్సు పద్మ పదములను నిర్ణయిస్తున్నట్టు వున్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం గట్టి సిఫార్సులు చేసే ప్రయత్నం పట్టలేదేమో !

    జిలేబి

    ReplyDelete
  4. Bhaskar గారు,

    అవునండీ, పద్మార్పిత అనే బ్లాగరి కూడా వున్నారు !
    వారి పేరుతోటే టైటిలు రావడం యాధృచ్చికం .

    అప్పుడప్పుడు వారి బ్లాగుల్లో కూడా చూస్తోండటం తో , ఈ పద్మ కి సరి పోయింది అంతే !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  5. ఆంధ్రులంటే అంతగా నప్పదు అని ఆమడదూరంలో పద్మ కి అర్పితులైన తెలుగువారిని ఉంచినా వారు...
    అచ్చంగా తెలుగు బ్లాగర్ అయిన ఈ పద్మార్పితను మాత్రం అభిమానించడం మరువకండి మీరు....:-)

    ReplyDelete
  6. పద్మార్పిత గారు,

    మిమ్మల్ని మీ బ్లాగుని మరవటమా! నెవెర్ !

    ఇప్పుడే నిద్ర లేచా మీరన్న ఆ నిదుర పోజులన్నీ ప్రయత్నించి, మొత్తం మీద నిదుర పోయి !!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete