Thursday, December 4, 2014

ఈ స్వామీజీ గురించి మీకెవరి కైనా తెలుసునా ?


ఈ స్వామీజీ గురించి మీకెవరి కైనా తెలుసునా ?

ఈ క్రింది ఫోటో ఆంధ్ర పత్రిక 1948 వ సవత్సరం ఫోటో; ఇందులో స్వామీజీ పేరు శ్రీ రామ లేఖానంద వారు . ఎంత గూగుల్ సెర్చ్ చేసినా ఈ విషయం మీద (అంటే ఈ స్వామీజీ సజీవ సమాధి తరువాయి మళ్ళీ జీవించారా గట్రా విశేషాలు ) దొరక లేదు !

మీ కేవరి కైనా తెలుసునా ??


From Andhra Patrkia 1948 February 25, ; A photo of Swami Rama Lekhananda (Hrishekesh) who went into samadhi under the ground for around 12 hours at Madras (present Chennai) and having been taken out from samadhi being given massage with ice cubes to bring back to life !

Does any one know who is this Swami Rama Lekhananda of Hrishekesh?

Interesting episode but I cannot find any relative google search on this incident;

Probably 1948 news papers would have carried some story about this event.

Some archive of news papers fellow journalists any that you can share ?


cheers
zilebi  

Tuesday, December 2, 2014

రావి శాస్త్రి వారి - నల్ల మేక - జూలు విదిలించిన జిలేబి 'సింగం' !!


రావి శాస్త్రి వారి - నల్ల మేక - జూలు విదిలించిన జిలేబి 'సింగం' !!

కౌరవ సైన్యాన్ని చూసిన ఉత్తర కుమారుడు రథం మీంచి గభీ మని గెంతి నట్టుగా, జీవహింస చేయాలనే కృత నిశ్చయం తో వస్తోన్న తోటమాలీ ని దగ్గరగా రానిచ్చి గోడమీంచి చెంగున రోడ్డు మీదికి ఉరికింది నల్లటి కుర్ర మేక.

తోట గల ఆసామీ తోట చుట్టూ దిట్టంగా ఎత్తుగా గోడ కట్టుకున్నాడు. కాని ఆ గోడకి ఒక చోట ఒక వార మునిసిపల్ చెత్త డబ్బా ఉంది . సరిగ్గా అక్కడే ఆ గోడకి ఒక ఇటిక జారింది . ఈ రెండు భోగట్టాలూ తోట గల ఆసామీ గమనించ లేదు .

నల్ల మేక గమనించింది.

నిచ్చన వేసుకొని స్వర్గానికి వెళ్ళినట్టుగా, చెత్త డబ్బానీ, ఇటిక జారిన సందుని ఆధారం చేసుకుని తోట గోడ ఎక్కింది నల్ల మేక .

పేరుకి పిట్ట గోడే కాని, నిజానికి ఆ గోడ చాలా ఎత్తుగా ఉంది. లోనికి గెంతుతే మళ్ళీ పైకి రాడానికి అటు వైపు చెత్త డబ్బాలూ, జారిన ఇటుకలూ లేవు. అందు చేత గోడ మీదనే నిల్చొని ,

"ఈ మనుష్యులు గడుసు వెధవలు " అనుకొంది నల్ల మేక.

నల్ల మేకం భారతం చదవలేదు. హరికథ లైనా వినలేదు. అందుచేత అది ఎరుగదు, గడుసు తనం లేని కుర్రవాడు అభిమన్యుడని ఒకడుండేవాడని .

మేకల్లో అభిమన్యుడి వంటి ది కా దీ మేక .

పద్మ వ్యూహం లా ఉండే ఆ తోటలో ప్రవేశిస్తే మళ్ళీ బైటికి రావడం కష్టమని గుర్తించిన నల్ల మేక , గోడ మీదనే నిల్చొని పస్తాయించి చూసింది


పూర్తి గా ....



చీర్స్
జిలేబి

Monday, December 1, 2014

నకలు జిలేబీలకు మోస పోవద్దు !!

నకలు జిలేబీలకు మోస పోవద్దు !!
 
పనికి మాలిన నకలు బీడీలకు మోస పోవద్దు !!
 
ఖాదర్ వారి తాజ్మహల్ బీడీ లనే వాడండి!!!
 
(ఇది బులుసు వారి కోసం స్పెషల్ !)
 
(మొన్న మధు మక్కీయం అంటే వారికి పాత రోజులు గుర్తు కోచ్చేయి!)

 
(ఆంధ్ర పత్రిక 1949 ఫిబ్రవరీ 16)

చీర్స్
జిలేబి 

Sunday, November 30, 2014

మధు మక్కీయ అస్సాము జిలేబీయం !

మధు మక్కీయ అస్సాము జిలేబీయం !

అస్సాము తో పరిచయం నిన్నటిదా మొన్నటిదా !
 
దరిదాపుల్లో ఇరవై ఐదు సంవత్సరాల మునుపు ఉద్భవించిన పరిచయం !
 
దానికన్నా ముందు పూర్వ జన్మ సుకృతం ఉంటె గా ని కుదరని పరిచయం !

తమకు గాని జన వాహిని తో 'some' బంధం కలగాలంటే పూర్వ జన్మ వాసన ఉండాలని చిలక జోస్యం !!

జిలేబీ మేం సాహేబ, అస్సాము  వెళ్ళాలి పెట్టా బేడా సర్దు కోండి  'బిరీన' వెళ్ళాలి - హుకుము తాకీదండీ మీకు అన్నాడు వార్తా 'హరుడు' !

ఎందుకు అన్నా !

ఫోటో కర్టసీ - అస్సాం ట్రిబ్యూన్



అస్సాము ట్రిబ్యూన్ దిన పత్రిక వారు పిలిచేరు - తమ డబ్బై ఐదు సంవత్సరాల ప్లాటినం జూబిలీ సమారోహానికి -  సో , మీకు తాకీదు సమారోహానికి !

జిలేబీ ల్లారా మీరంతా మధు మక్కీయ మయమై ఉండాలి అని మా మోడీ వారు అస్సాము ట్రిబ్యూన్ ప్లాటినం జూబ్లీ సమారోహం లో నొక్కి వక్కాణించేరు !

ఇదిగో జిలేబీ ల్లారా  మీరంతా 'గందగీ' 'ఫైలాయించె' మక్కీ ల లా ఉండరాదు అని ఓ విరుపు వేసేరు !

మధు మక్కీయమై , తేనె 'టీ' గల్లా , (అబ్బా ఎక్కడికి పోయినా ఈ 'టీ' మాట వదలమండి మరి !) విశ్వస నీయ మైన వార్తాలాహిరిని పెంపొందించండి అని హుక్ము జారీ చేసేరు !

అట్లాగే మీ వార్తా 'తీగల్లో' , తేనెటీగ 'చుర్కుదనం' కూడా 'కొరడా' ల్లా ఉండాలని ఉవాచ !

అంటే జిలేబి ల్లా స్వీట్ స్వీట్ గా ఉంటూ నే అప్పుడప్పుడు పకోడీల్లా ఫేడేల్ ఫేడేల్ మంటూ, కొండొక చొ మిర్చీ బజ్జీల్లా కారాలు మిరియాల్లా ఉండాలని సూచించేరు !

సరే వారి మాటలకేమి గాని(వారి మాటల సమ్మోహనానికి పడి పోనీ వారు ఎవ్వారు మరి!)  గువాహాటీ ఫ్రీ దర్శన్ అయ్యింది !

ఈ ఇరవై ఐదు సంవత్సరాల లో ఎంత మార్పు !

రైలు వెళుతుందా మేఘాల 'ఆలయానికి ' అనుకున్న ప్రదేశాల కి కనెక్టివిటి శుభారంభం ! శుభ సూచికం !

బార్డర్ రోడ్ టాస్క్ ఫోర్సు కి మరింత పని !

సో సైనింగ్ ఆఫ్
ఫ్రం అండ్ ఫార్(ఆఫ్!)  అస్సాం
జిలేబి

Saturday, November 29, 2014

ఒకరి కి రెండు వాచీల కంటే ఎక్కువ పంప బడవు !


ఒకరి కి రెండు వాచీల కంటే ఎక్కువ పంప బడవు !
 
ఈ 'స్విస్సు'  గాంధీ బొమ్మ వాచీలు ఎవరి దగ్గిరైనా ఉందాం డీ ?!!!

 
చీర్స్
జిలేబి
 

Wednesday, November 26, 2014

'శంకరాభరణం పద్యాలు అంత ఓపిగ్గా ఎలా చదివే దండి !??


'శంకరాభరణం పద్యాలు అంత ఓపిగ్గా ఎలా చదివే దండి !??
 
ఆంధ్రపత్రిక 10th May 1968

 
 
చీర్స్
జిలేబి

Tuesday, November 25, 2014

అచ్చు పప్పు ! - అలవాట్లో పొరపాటు !

అచ్చు పప్పు ! -  అలవాట్లో పొరపాటు !
 
ఆంధ్ర పత్రిక 28th August 1957
 

Cheers
జిలేబి

Monday, November 24, 2014

హిరణ్యా క్షవరం !


హిరణ్యా క్షవరం !
 
ఆంధ్ర పత్రిక 29 April 1959

 

Sunday, November 23, 2014

చెవులకి గాజులు వేసుకున్న జిలేబి !


చెవులకి గాజులు వేసుకున్న జిలేబి !

 

Saturday, November 22, 2014

ఉత్తర దేశ యాత్ర ! యాభై రెండు రోజులు - మూడు వందల రూపాయలు మాత్రమె !



ఉత్తర దేశ యాత్ర ! యాభై రెండు రోజులు - మూడు వందల రూపాయలు మాత్రమె !
 
ఆంధ్ర పత్రిక 19th Jan 1955 !


చీర్స్
జిలేబి