మధు మక్కీయ అస్సాము జిలేబీయం !
అస్సాము తో పరిచయం నిన్నటిదా మొన్నటిదా !
దరిదాపుల్లో ఇరవై ఐదు సంవత్సరాల మునుపు ఉద్భవించిన పరిచయం !
దానికన్నా ముందు పూర్వ జన్మ సుకృతం ఉంటె గా ని కుదరని పరిచయం !
తమకు గాని జన వాహిని తో 'some' బంధం కలగాలంటే పూర్వ జన్మ వాసన ఉండాలని చిలక జోస్యం !!
జిలేబీ మేం సాహేబ, అస్సాము వెళ్ళాలి పెట్టా బేడా సర్దు కోండి 'బిరీన' వెళ్ళాలి - హుకుము తాకీదండీ మీకు అన్నాడు వార్తా 'హరుడు' !
ఎందుకు అన్నా !
ఫోటో కర్టసీ - అస్సాం ట్రిబ్యూన్
అస్సాము ట్రిబ్యూన్ దిన పత్రిక వారు పిలిచేరు - తమ డబ్బై ఐదు సంవత్సరాల ప్లాటినం జూబిలీ సమారోహానికి - సో , మీకు తాకీదు సమారోహానికి !
జిలేబీ ల్లారా మీరంతా మధు మక్కీయ మయమై ఉండాలి అని మా మోడీ వారు అస్సాము ట్రిబ్యూన్ ప్లాటినం జూబ్లీ సమారోహం లో నొక్కి వక్కాణించేరు !
ఇదిగో జిలేబీ ల్లారా మీరంతా 'గందగీ' 'ఫైలాయించె' మక్కీ ల లా ఉండరాదు అని ఓ విరుపు వేసేరు !
మధు మక్కీయమై , తేనె 'టీ' గల్లా , (అబ్బా ఎక్కడికి పోయినా ఈ 'టీ' మాట వదలమండి మరి !) విశ్వస నీయ మైన వార్తాలాహిరిని పెంపొందించండి అని హుక్ము జారీ చేసేరు !
అట్లాగే మీ వార్తా 'తీగల్లో' , తేనెటీగ 'చుర్కుదనం' కూడా 'కొరడా' ల్లా ఉండాలని ఉవాచ !
అంటే జిలేబి ల్లా స్వీట్ స్వీట్ గా ఉంటూ నే అప్పుడప్పుడు పకోడీల్లా ఫేడేల్ ఫేడేల్ మంటూ, కొండొక చొ మిర్చీ బజ్జీల్లా కారాలు మిరియాల్లా ఉండాలని సూచించేరు !
సరే వారి మాటలకేమి గాని(వారి మాటల సమ్మోహనానికి పడి పోనీ వారు ఎవ్వారు మరి!) గువాహాటీ ఫ్రీ దర్శన్ అయ్యింది !
ఈ ఇరవై ఐదు సంవత్సరాల లో ఎంత మార్పు !
రైలు వెళుతుందా మేఘాల 'ఆలయానికి ' అనుకున్న ప్రదేశాల కి కనెక్టివిటి శుభారంభం ! శుభ సూచికం !
బార్డర్ రోడ్ టాస్క్ ఫోర్సు కి మరింత పని !
సో సైనింగ్ ఆఫ్
ఫ్రం అండ్ ఫార్(ఆఫ్!) అస్సాం
జిలేబి
అస్సాం నందు 'టీ' తోటలెక్కువగ నుండునందురు.
ReplyDeleteనరకాసురుడి దేశం వెళ్ళొచ్చారా?
ReplyDeleteఅస్సాం ట్రిబ్యూన్ తో మీ అనుబంధం గురించి కూడా కొంచెం చెప్తే తెలుసుకుని ఆనందిస్తాంగా.
మధు, అస్సాం అనగానే నోరూరింది. మధు పానం చేసిన రోజులు గుర్తుకు వచ్చాయి...దహా.
ReplyDelete