Tuesday, October 25, 2011

ఓ "ఫన్ ఆర్ట్" విత్ జే కే - ముఖాముఖి విత్ బులుసు సుబ్రహ్మణ్యం !

బ్లాగ్ లోకానికి దీపావళి శుభాకాంక్షలతో - మీ జిలేబి సమర్పించు

ఓ "ఫన్ ఆర్ట్" విత్ జే కే

బ్లాగ్ముఖి  

ముఖాముఖి విత్ బ్లాగర్ 'బులుసు సుబ్రహ్మణ్యం'
(నవ్వితే నవ్వండి - వారి బ్లాగ్)


నమస్కారంబులు సుబాల సుబ్రహ్మణ్యం గారూ!


హతోస్మి ! నా పేరుకి మరో కలికి తురాయి !


మీ పరిచయం ?


హిహిహి నేనే.
రీజినల్ రీసెర్చి లెబోరేటరీ, జోర్హాట్ లో సైంటిస్ట్ గా పనిచేసాను. ఇప్పుడు 'Retyred'!


మీ పేరు కి మరో కలికి తురాయి అన్నారు ఎందుకు ?

వీరి వీరి గుమ్మడి ప౦డు వీరి పేరేమి ? పేరులో  ఏము౦ది అని తీసిపారే్సేవారు చాలామ౦ది అయితే, పేరులోనే పెన్నిధి ఉ౦ది అని నమ్మేవాళ్ళలో నేనొకడిని. సుబ్రహ్మణ్య౦ అని స రి గ్గా నోరారా ఎవరైనా పిలిస్తే పలకాలని ఒకకోరిక..

ఇ౦ట్లో సాధారణ౦గా ఒరేయ్ సుబ్బిగాఅని, ఎప్పుడైనా కొ౦చె౦ ప్రేమగా సుబ్బయ్యా అనో పిలిచేవారు.

ఆనర్సు చివరి స౦వత్సర౦లో ఒక చైనీయుడు ఇ౦గ్లీషులో పి.జి. చెయ్యడానికి వచ్చాడు.వాడు ఇ౦గ్లీషు ప్రొనౌన్సియేషన్ కి నానా త౦టాలు పడే వాడు.మహా దుర్మార్గుడైన మా మిత్రుడొకడు వాడికో సలహా పాడేసాడు. నాపేరు స్పష్ట౦గా పలకగలిగితే ఏ భాషనైనా సరిగ్గా ఉచ్చరి౦చ వచ్చును అని.

ఓ సాయ౦కాలము సమావేశ౦ ఏర్పాటు చేసాడు.వాడు ఉత్సాహ౦గా నా నామస్మరణ మొదలు పెట్టేడు. ’సు’ ని ’శు’ ని ఒకదాని మీద ఒకటి పెట్టి, ’శు’ కి౦ది మెలికని, ’సు’ పైకొమ్ముని ’జు’ తో లాగుతూ కుడికాలుని మడిచి ఎడ౦చేతితో ఒక పెదవిని పైకి లాగుతూ కుడి చేతివేళ్ళతో స్వర పేటిక నొక్కుకు౦టూ ఒక్కమాటుగా నోట్లో౦చి, ముక్కులో౦చి గాలి వదిలాడు.

అస్సా౦లో ఉద్యోగ౦లో ఉన్నప్పుడు నన్ను వివిధ రీతులలో పిలిచేవారు. ఒక మణిపూర్ ఆయన సుభ్ రామ్ అనే వాడు. ఓ బె౦గాలీ బాబు, సుబ్బొరోమొనియామ్ తో మొదలుపెట్టి సుబ్బొరోమ్ కి కత్తిరి౦చేసాడు.

ఇ౦కో కన్నడ సోదరీమణి సుభరమన్య౦ అనేది. బర్ అని, భర్ అని, బొర్ అని ’బ్ర’ ని పెట్టిన పాట్లు ఆహా చెప్పనలవి కాదు. ’హ్మ’ అనే అక్షర౦ నా పేరులో ఉ౦దని నేనే మరచిపోయాను.

చిత్రమైన విషయం ఏమిటంటే సంస్కృతం వచ్చిన త్రిపాఠి లు, చతుర్వేది లు కూడా నా పేరు ముక్కలు చేసేవారు.

బులుసు మాష్టారి అబ్బాయి గా అవతరి౦చి, శ్రీలక్షమ్మగారి భరతగా ఎదిగి, సిరి కా పాపా గా పరిణామ౦ చె౦ది, చివరకు స౦జన తాతగారి లా మిగిలిపోయాను.

ఒక బ్లాగరైతే ఏకం గా నన్ను - "ప్రియమైన సఉబరహమణయమఉ గారికి సాదర ప్రణామములు" అన్నాడు !


 

మీ వయసు ?


చాలా  పురాతనమైన వాడిని.నా వయసు ఇంకా అరవై ఆరే.

 

రిటైర్ అయ్యాక మీరేమి చేస్తున్నారు ?


గత మూడేళ్ళుగా రిటైరయ్యి ఇంట్లో కూర్చున్నప్పటినించీ నేను జ్ఞాని నయిపోతున్నా ఈ మధ్యన తెగ జ్ఞానం సంపాదించేస్తున్నానేమోనని అనుమానం డౌటు కలిగింది. ఎడా పెడా, కుడీ ఎడమా, రెండు చేతుల తోటీ జ్ఞానం అర్జించేస్తున్నానని నమ్మకం కూడా కలిగిపోతోంది.

ఇంత జ్ఞానం ఇల్లా సంపాయించేస్తుంటే బ్రహ్మజ్ఞానిని అయిపోతున్నానేమోనని అనుమానం వచ్చేస్తోంది.

 మొన్నోకల కూడా వచ్చింది. బాసింపట్టు వేసుకొని, కళ్ళు తెరిచి నేను తపస్సు చేసుకుంటున్నాను. రెండు కళ్ళకి ఎదురుగా రెండు టీ.వీ లు, చెరోపక్కా రెండు చెవులకి ఇంకో రెండు టీ.వీ లు (చెవులకి టీవీ లు ఎందుకు? రేడియో చాలదా అని ప్రశ్నలు వేయకండి.నా కల, నా ఇష్టం)


 

మీ శ్రీమతి గురించి .... ?

కొంతమందికి ఊత పదాలుంటాయి. కాని మాఆవిడకి ఊతవాక్యాలే ఉన్నాయి. నో పదమ్సు, ఓన్లీ వాక్యమ్స్ అన్నమాట.

పెళ్ళికి ముందు మాఆవిడ నాఫొటో చూసింది కాని నాకు ఆభాగ్యం కూడా కలుగలేదు.నో పెళ్ళిచూపులు. మారేజి లుక్స్ పెళ్ళిలో తెరతీసిన తర్వాతే నన్నమాట.

“ మీ మొహం, మీకేం తెలుసండి” అని. ఇవి మాఆవిడ నాతో మాట్లాడిన మొదటి మాటలు, ప్రేమ సంభాషణ, తొలి పలుకులు, లవ్ నతింగ్స్, మొహబ్బతికి బాతేం.

“మీర జాల గలడా నాయానతి సతీ ద్రౌపదీ పాక మహిమన్” అని పాడు కుంటూ పొద్దుటి నించి నన్ను తిండి పోతు ని చేసి నీరసం వచ్చేలా చేసిందంటే నమ్మండి !

భరించువాడు భర్త అంటారు. కాబట్టి ఆవిడ ఏమన్నా భరించక తప్పుతుందా. పెళ్ళైన తర్వాత ఆడువారికి జ్ఞానం పెరుగును, మగవారికి తరుగును అని ఓ సన్యాసి నాకు  చెప్పాడు.


 

మీ ఆవిడ చేసే తప్పులకి మీరెలా స్పందిస్తారు ?

 

సాధారణంగా మాఆవిడ చేసే తప్పులు రోజుకి నాల్గైదు అయితే క్షమించేస్తాను. అంతకు మించితే ఆగ్రహిస్తాను. ఆగ్రహించి చేసేదేమీ లేదు కనక ఇల్లాంటి రోజులు నాలుగు లెఖ్ఖ పెట్టుతాను. మరుసటి రోజున మౌన నిరసన వ్రతం చేస్తాను. ఎదో విదంగా మరి నా అసమ్మతి తెలియచెయ్యాలి గదా. ఉద్యమిస్తే పోయేది భార్య కాదు. ఆమె చేతిలో మన మానప్రాణాలు!

 

ఆహా భార్యావిధేయుడనని చెప్పుకుంటూ, ఆవిడ మీద వ్యంగ టపాలు రాస్తారని పురుషహంకార ఆభిజాత్య కుట్రలు.?

 

ప్లీజ్ మాఅత్తగారికి, మాఆవిడకి అసలు చెప్పకండి. పెద్దవాడిని ఉపవాసాలు ఉండలేను.



మీ పక్కింటి పంకజాక్షి గురించి నాలుగు ముక్కలు ... ?

 

రిటైర్ అయిన మరుసటి రోజు నేను మృదు మధుర శాంత స్వనంతో మా ఆవిడని ఉద్దేశించి “ దేవీ శ్రీదేవి, ఆర్యపుత్రీ, ఓ కప్పు కాఫీ కావాలి” అని దీనంగా అభ్యర్ధించాను.

 మాఆవిడ విందో లేదో నాకు తెలియదు కాని మా పక్కింటి పంకజాక్షి వినేసింది.

ఆవిడ కు ఉన్న ఏకైక పని మాఇంట్లో దూరదర్శన్, దూరశ్రవణ్ ప్రసారాలను monitor చేసి పున:ప్రసారం చేయడం. నామాట వినడం, వాటికి ఇంకో రెండు విశేషణాలు జోడించి, వాటిని తన మొబైల్ లో SMS చేసెయ్యడం జరిగిపోయింది.

అదేదో వల పని(Net working) ట ఒక నొక్కుతో పాతిక మందికి పంపవచ్చుట.

ఈవిడ మూడు నాలుగు నొక్కులు నొక్కిందనుకుంటాను. అంతేకాదు లాండ్ లైను, మొబైలు ఉపయోగించి ఇంకో అంతమంది కి ’అడక్కుండానే సమాచారం మీచెవిలో’ స్కీము లో ప్రసారం చేసేసింది.

ఒక పావు గంటలో ’ఆల్ నెట్ వర్క్స్ ఆర్ బిజి’ అయిపోయాయి. మా ఆవిడ మొబైలు వెరీబిజి. SMS లు శరవేగంతో వచ్చేసాయి. నా పాట్లు ఇంకా చెప్పాలంటారా ?

 

బుద్ధి, జ్ఞానం మీద మీరు రిసెర్చ్ చేసారట ?

 

బుద్ధి, జ్ఞా న౦ మీద మాస్నేహితుల౦దర౦ చాలా తీవ్ర౦గా పరిశోధనలు చేసా౦.

ఎదురి౦టిలో పరికిణి, జాకెట్టు వేసుకుని తిరిగేది అమ్మాయి అని తెలుసుకోవడ౦ బుద్ధిఅని, ఆఅమ్మాయి జోలికి వెళ్తే పళ్ళు రాలతాయని తెలుసుకోవడ౦ జ్ఞా న౦ అని.

ఆ తర్వాత ఈవిషయ౦లో నేను సమగ్ర పరిశోధన చేసి, యూనివర్సిటి వదిలేటప్పటికి వెధవ పనులు ఎలా చేయడమో్ తెలుసుకోవడ౦ బుధ్దిఅని, ఆపై తిట్లు, తన్నులు తప్పి౦చుకోవడ౦ జ్ఞా న౦ అని కనిపెట్టాను.

ఉద్యోగ౦లో చేరి౦తర్వాత పని చేయకు౦డా తప్పి౦చు కోవడ౦ బుద్ధి అని, అ౦తా మనమే చేసినట్టు కనిపి౦చడ౦
జ్ఞా న౦ అని నిర్ధారణకు వచ్చేసాను.

ఏమీ తెలియకపోయినా అ౦తా తెలిసినట్లు ఎదుటివారిని నమ్మి౦చడ౦ జ్ఞానానికి పరాకాష్ట అని గ్రహి౦చాను.


 

మీకు జ్యోతిష్యం మీద నోబెల్ బహుమతి వస్తోందటగా?

 

జ్యోతిషం మీద కాక పోయినా, బొందాక్సైడ్ మీద చచ్చేటట్టు పరిశోధనలు చేసినందుకు, నోబులు బహుమతి వచ్చేస్తోంది.

 

తెలుగు మీద, మీ మాస్టర్ల మీద మీ అభిప్రాయం ?

 

తెలుగుమీద ఇప్పుడు బోలెడు అభిమానం ఉన్నా, చిన్నప్పుడు తెలుగంటే నాకు చాలా భయం ఉండేది. మా మాష్టార్లు, ఒకరిద్దరు తప్పితే, మాకు టిఫిన్లు బాగా పెట్టేవారు. పెసరట్టు, మినపరోస్ట్ వీపుమీద, కొంచెం లైట్ గాపడితే పెసరట్టు, అరచేతి ముద్రలు కూడా ముద్రిస్తే మినపరోస్ట్ అని అర్ధం. తొడమీద గిల్లితే పకోడి అనీ, మెలిపెట్టి గిల్లితే పునుకులు అనీ, బుగ్గమీద పొంగిస్తే బూరెలు అనీ, అరచేయి వెనక్కి తిప్పి ముణుకులు వాయగొడ్తే కజ్జికాయలు, మైసూర్ పాక్ అనీ అనేవాళ్ళం.

క్లాసులో అందరూ ఐన్ స్టీన్ లే ఉండరు. నాలాంటి మిడతంభొట్లుగాళ్ళు కూడా ఉంటారు. మాగురువులు అంటే మాకు అభిమానం, గౌరవం. మాగురువులు మాకు పాఠాలు. నేర్పారు, I repeat, నేర్పారు , అవసరమైతే ఓ దెబ్బవేసి. చదువు దాని ప్రాముఖ్యత గురించి, మా తల్లి తండ్రుల కన్నా మాగురువుగార్లే ఎక్కువగా చెప్పారు. బహుశా వాళ్ళు మామీద అంత శ్రద్ధ తీసుకోక పోతే, ఈనాడు ఈమాత్రమైనా మేము ఎది్గేవారం కాదు..


 

మీది ఒంగోలా? అయితే ఒంగోలు శీను తెలుసా ?

 

నాకు ఒంగోలు గిత్త తెలుసు. దానిపేరు చీను అని తెలియదు,శీను గారి గురించి నాబ్లాగులో ఎందుకు వెతుకుతున్నారో నాకు అర్ధం కావటంలేదు. వారు మీకు త్వరలో దర్శనమివ్వాలని కోరుకుంటున్నాను.

 

మీ జీవితం లో ముఖ్యమైన రెండో మనిషి ?

 

నాజీవితంలో ముఖ్యమైన రెండో మనిషి, ఎప్పుడూ నన్ను విమర్శించే మా బాసు గారు, ఏపనీ సరిగ్గా చేయవేమోయి శంభులింగం అనీ, అసలు నీకు చేతనైన పని ఏదైనా ఉందా శంకరనారాయణా అనీ, నాకు అధికారాలు లేవుకానీ, ఉంటే నీకెప్పుడో ఉద్వాసన చెప్పేసేవాడిని సింహాచలం అనీ, అనేవాడు. నా ప్రమోషను కాగితం పట్టుకొని, పదిహేనేళ్ళు ఒకే సీట్లో కూర్చున్నవాళ్ళందరికి ఇవ్వాలని రూలుండబట్టి నీకు ఇవ్వాల్సివచ్చింది భజగోవిందం అని విచారించాడు. నన్ను ఎవరూ ఆదర్శంగా తీసుకోకూడదని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్ధించి, రెండు నిముషాలు మౌనం పాటించి మరీ ప్రమోషను ఆర్డరు చేతికి ఇచ్చాడు.

మీరు ఎప్పుడు బ్లాగటం మొదలెట్టారు ?


జూన్ 12, 2010 న బ్లాగు మొదలు పెట్టాను. 14 న మొదటి టపా వేశాను. సంకలినులు ఉన్నాయని అప్పుడు తెలియదు. రెండు టపాలు వేసిం తరువాత  జూలై 1 న కూడలి లో చేర్చాను.  ఆ తరువాత మాలిక, జల్లెడ లలో చేర్చాను  15-20  రోజుల  తరువాత. హారం లో నా బ్లాగు లేటు గా చేర్చాను.  8  టపాల తరువాత అనుకుంటాను.  అన్ని సంకలినుల నిర్వాహకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.  నా బ్లాగులో మొదటి కామెంటు    శ్రీలలిత గారు  పెట్టారు. 21 టపాలకీ సుమారు గా 570 కామెంట్లు వచ్చాయి.  శ్రీలలిత  గార్కి  హృదయ పూర్వక  ధన్యవాదాలు చెప్పుతున్నాను.  నా మొదటి టపాకు  ఒకే ఒక్క కామెంటు  తార గారిది.  మొదట్లో  బ్లాగుల గురించి అంతో ఇంతో నేను తెలుసుకున్నది తార గారి ద్వారానే. వారికి నా కృతజ్ఙతా పూర్వక ధన్యవాదాలు.  కామెంట్లు పెట్టిన వారందరికి హృదయపూర్వక కృతజ్ఙతాభి వందనములు.


అదేమీ పేరు బ్లాగుకి - నవ్వితే నవ్వండి అని ?

మీరంతా నవ్వుతారా, నవ్వి పోతారా, ముత్యాలు దొర్లిస్తారా, లేదా అనే నా  ఆదుర్దా నాది. నా హాస్య చతురత సామాన్యమే. మీ అందరి అభిమానమే నాకు శ్రీరామ రక్ష.



మిమ్మల్ని లేపెస్తామన్నవాళ్ళూ, కిడ్నేప్ చేస్తామన్న వాళ్ళూ ఉన్నారంట ?

నన్ను లేపేస్తానన్నవారు ముగ్గురు నలుగురు ఉన్నారు. గీతాంజలి లో లాగైనా లే...చి..పో..దా..మా. అన్న వారూ ఉన్నారూ  సంతోషం, అల్లాగే తప్పకుండా. కానీ ఒక చిన్న చిక్కు ఉంది. నాది కొంచెం భారీ శరీరం. దాన్ని లేపాలంటే ఓ crane కావాలి. అది పట్టుకొచ్చారంటే నన్ను లేపుకుపోవచ్చు.

అయినా నన్ను కిడ్నాప్ చెయ్యడానికి ముఠాలు, ప్రణాళికలు, అనవసర హైరానా ఎందుకు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేనే వచ్చేస్తాను. కానీ మళ్ళీ నన్ను వదుల్చుకోవాలంటే కొన్ని లక్షలు ఖర్చు అవుతాయి మరి. జాగ్రత్త.


మీ టపాలు చదివి మలక్పేట్ రౌడీ లాంటి వాళ్ళే భయపడ్డారట !?

 

ఎంత పోరినా, హత్యలు చేసినా, ఎంత రౌడీ అయినా, భార్యా బాధితుడే కదండీ మరీ !

 

మీరు పరభాషా చిత్రాలు చూస్తారా ?

 

నేను జోర్హాట్ లో ఉద్యోగంలో చేరిన కొత్తలో ఓ ఆదివారం, తెల్లవారు జామున అంటే సుమారు 8.30గం మా సమరేంద్ర నాధ్ సేన్ గారు భళ్ళున తలుపు తోసుకొని వచ్చి నన్ను కంగారు పెట్టేసాడు. లే లే ఇంకా పడుకున్నావా. టైము అయిపోతోంది అంటూ. విషయం అర్ధం కాకపోయినా నేను తయారయి రాగానే నన్ను సైకిలు మీద ముందు కూర్చోపెట్టి రయ్ రయ్ మని రొప్పుతూ రోజుతూ తొక్కేస్తున్నాడు.

నేను ఎక్కడికి అనగానే ముయ్ నోరు అన్నాడు. నేను నోటితో పాటు కళ్ళు కూడా మూసుకొన్నాను. కళ్ళు తెరిచి చూసేటప్పటికి నేనో సినిమా హాల్లో సుఖాసీనుడనై ఉన్నాను. సరిగ్గా టైము కి వచ్చామని సేను గారు ఆనం దించి నన్ను కూడా దించమన్నాడు.

తెర మీద మనకి అర్ధం కాని భాషలో, అక్షరాలో, అంకెలో కూడా తెలియకుండా వచ్చేసి, సినీమా మొదలై పోయింది. ఏమీ అర్ధం కావటం లేదు. అయినా అల్లాగే చూస్తున్నాను

ఓపది నిముషాల తర్వాత సినిమాలో ఓ కాకి వచ్చింది. కావ్, కావ్, కావ్, కావ్ మని నాలుగు మార్లు కావుమంది. మా సేనుడు వహ్వా, వహ్వా అన్నాడు. ఇంకో కొంతమంది కూడా వహ్వా, శభాష్, బ్యూటిఫుల్, అని ఆనంద పడిపోయారు. నేను కూడా కొంచెం ఆలోచించి లేచి నుంచుని వహ్వా అనబోతుండగా సేన్ గారు నా చేయిపట్టి లాగి కూర్చోపెట్టాడు.

తెరమీద సీను మారిపోయింది. ఇప్పుడు ఒకాయన ఓ పంచను రాతి కేసి కొట్టేస్తున్నాడు. ఉతుకుతున్నాడన్నమాట. మా సేను కళ్ళలో విషాద నీరు. నాకు కోపం వచ్చేసింది. ఏంజరుగుతోంది, ఆ కాకి ఎందుకు కావ్ మంది అని అడిగాను.

 కాకి కావ్ మనక భౌ భౌ అంటుందా అని కోప్పడ్డాడు సేను గారు. అపుడు నాకేమీ అర్ధం కాక, పూర్తిగా అయో మయావస్థలో, బెంగాలీ సినీమాల్లో అందులో సత్యజిత్ రే సినీమాలో, కాకులు ఎందుకు భౌ భౌ మన వని పెట్టిన కొచ్చెను మార్కు మొహం..

 

పెళ్ళికి మునుపటికి తరువాయి కి వ్యత్యాసం ?

 

అప్పటి కింకా పెళ్ళి కాలేదు. ’అయినా’ నాకు ముగ్గురు బాసులుండే వారు." పెళ్ళైతే ఒకే ఒక్క బాసు అని పెళ్ళైతే కానీ తెలియలేదు.

 

మీరు యోగా నేర్చుకున్నారటగా ?

 

ఆత్మ ప్రభోధానుసారం, యోగా నేర్చుకుందామని అనుకున్నవాడనై, మా కాలనీలో యోగా నేర్పువారి కోసమై గాలించితిని. మా కాలనీలో ముగ్గురు యోగా గురువులు ఉన్నారని తెలిసింది.

ఇద్దరు మగ గురువులు, ఒక ఆడ గురువు. సహజ ప్రకృతి దోష ప్రభావమున, పరస్పర అయస్కాంతాధారిత విజ్ఞాన సూత్రాదేశముల వలనను, మొదటగా రెండవ వారి దగ్గర నేర్చుకొనవలనను ఉత్సుకత కలిగినది.

ఓ శుభ సాయం సమయమున, పిల్లలు ట్యూషనుకు వెళ్ళు వేళ, ఆటో వాళ్ళు మీటరు మీద పది రూపాయలు అడుగు వేళ, గృహంబునకు అరుగు దెంచు శ్రీపతులకు, శ్రీమతులు ఆలూబొండాలు, బజ్జీలు వేయు వేళ, సువాసనలను ఆఘ్రాణించుచూ ఆడగురువు గారి గృహాంగణమున అడుగు పెట్టినవాడనైతిని.

నా రాకను మాగురువుగారి పుత్రశ్రీ ఇంటిలో సమాచారము ఇచ్చినవాడయ్యెను. ఒక పది నిముషములు అతి భారముగా గడిచిన పిమ్మట, ఓ మధ్య వయస్కుడు, సుమారుగా నలభై ఏళ్ళ వయసు గలవాడు నా ఎదుట ప్రత్యక్షమైనాడు. "I am Sailajaa naath, What can I do for you ?"అన్నాడు.!


నా కాలి క్రింద భూమి కంపించెను. ఆకాశమున ఫెళ ఫెళా రావము లతో ఉరుములు, మెరుపులు గర్జించెను, మెరిసెను. సముద్రమున అలలు ఆకాశమున కెగసెను. పర్వతములు బద్దలయ్యెను.

 

మా ఏడుకొండలవాడి గురించి మీ అభిప్రాయం ?
 

శ్రీవెంకటేశ్వర స్వామి ఒక విధమైన నిద్ర మత్తు లో ఉంటున్నారు రాత్రి 12.30 గం నిద్రపుచ్చి నట్లే పుచ్చి, 1.30 గం లకు సుప్రభాతం పాడుతున్నారు. వారికి విశ్రాంతి, నిద్ర రెండు నూ లేవు. వారి వంటిమీద, వారి ఖజానాలోనూ యున్న ఆభరణములు మాయమైననూ వారికి తెలియ లేదు. బ్రహ్మ, శివ, దేవేంద్రాది దేవతలు పెద్ద పెద్ద గొంతుకలతో స్తోత్రము చేసిననూ వారికి వినిపించుట లేదు. నేనెంత, నాగొంతు కెంత, నా అభిప్రాయాలకి విలువెంతంటారు జేకే గారూ ?



మీ 'నేను ఎందుకు రాస్తున్నాను " టపా మీద చెలరేగిన దుమారం, విమర్శకి లోనయ్యిందని వినికడి ?



ఈనాటె బ్లాగు పోకడల గురించి సరదాగా, నవ్వుకోవడం కోసం వ్యంగంగా రాసిన వ్యాఖ్యానం “నే నెందుకు వ్రాస్తున్నాను” అన్న నా రచన. ఇందు కోసం అలనాటి పురాణ రచయితలని, కధలు చెప్పిన వారిని , గురించి కొంచెం సరదాగా, హాస్యం కోసం రాయడం జరిగింది. అంతే తప్ప వారిని, తద్వారా పురాణాలని కించపరచడం నాఉద్దేశ్యం కాదు. ఒక వేళ ఎవరైనా అల్లా అభిప్రాయపడితే వారికి నా క్షమార్పణలు చెప్పుతున్నాను.
పురాణాల గురించి, మతం గురించి కాని చర్చించే టంతటి జ్ఞానం నాకు లేదు. అది ఈ బ్లాగులో నా ఉద్దేశ్యం కాదు. సహృదయంతో అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను.

నేను పురాణాలు ఆట్టే చదవలేదు. కాబట్టి వాటి గురించి చెప్పే అర్హత నాకు లేదు. ఏపురాణమైనా, మతమైనా మనిషి ని సన్మార్గంలో నడిపించడానికి, సత్ప్రవర్తన అలవర్చుకోవాలని బోధిస్తాయి. అది అందరూ చెపుతున్నారు. మళ్ళీ ఈ విషయం మీద నాబ్లాగులో చెప్పాల్సిన అవసరమూ లేదు.

 

ఉజ్వల భట్టాచార్య తో మీ  అఫైర్ ?


నావలో కూర్చుని “లాహిడ్ లాహిడ్ లాహిడ్ లూల్ జంగమే హుయాళా హుయలా” అని పాడేస్తోంది అనుకున్న నాకు షాక్- ఉ.కృ.నా.మీ అయితే రెండు రోజులు తేరుకోలేదు.

మరి ఇలియానా మాటో ?

  
ఎవరూ, రంగమ్మ గారా?  లిఫ్ట్ లోకి అడ్డంగా కానీ వెళ్లలేని ఆవిడా ? చాలా కాస్ట్లీ అఫైర్ అది. జేబు చిల్లు పడింది ఎక్కువ. చమురు వదిలిందీ ఎక్కువే ! చమురు ఎంత వదిలినా ఆరోగ్యమే మహా భాగ్యము కదా.
ఎప్పుడు అవకాశం వస్తుందా అపార్ధం చేసుకోవటానికి అని ఎదురు చూస్తున్నారా మీరు. దొరికి పోయానా ? 

ఈ విషయం అమ్మగారికి చెప్పమంటారా ? 


ప్రతిదీ అమ్మగారి దగ్గరికి తీసుకెళ్లతానంటారు. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారా ఏమిటీ?

మీరు కొత్త ఫిట్టింగ్ లు ఏమి పెట్టకండి. ప్రభావతి గారు ఎప్పుడూ దుర్గాదేవి లాగా కళకళ లాడుతూ కనిపిస్తుంది ప్రద్యుమ్నుడికి.  

మీకు  బ్లాగ్ లోకం లో  జంధ్యాలగా,  ముళ్ళపూడి గా  గుర్తింపు ?

 

ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి. ఏమిటోనండి సీరియస్ గా గంభీరంగా రాద్దామనే ప్రయత్నిస్తాను. మరి అందులో కూడా హాస్యం చూసే సహృదయులు మీరు.

ఒక బ్లాగరి  జంధ్యాలగారి లా అన్నారు. కొందరి కి పానుగంటి వారిలా రాసాని అనిపించింది. మరి కొందరికి చిలకమర్తి జ్ఞాపకాని కొచ్చారు . (ఎవరూ బులుసు లా రాసేరాని మేచ్చుకోరేమిటి చెప్మా? )

వారి స్థాయిలో కనీసం ఓ 10-15% అందుకున్నా ధన్యుడిని అయినట్టే అనుకుంటాను. దానికే నా జీవిత కాలం సరిపోతుందా అని అనుమానం. కానీ వీరిద్దరి కన్నా నేను ముళ్ళపూడి గారిని అబిమానిస్తాను. వారు చేసే మాటల గారడీ మరెవరు చేయలేరనిపిస్తుంది నాకు. థాంక్యూ.

 

మీ బ్లాగుకి వచ్చిన వందలాది కామెంట్లు చదివి మీరెలా ఫీల్ అయ్యారు ?

 

కామెంట్లు రాసిన వారందరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, థాంక్యూ.
మావుల గుంపులందు మధుమాసములన్
వికసించు కోకిలారావము వోలె (వేదుల)
వినిపించాయి మీ సుమధుర వ్యాఖ్యలు!

మీ బ్లాగు దర్శకులకి మీ ఆహ్వానం ?


స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను
ఆ పరిచిన పూల మీదుగా ఇలా నడిచి రండి
ఆ సింహాసనం అధిష్టించండి
ఈ పూలగుచ్చం స్వీకరించండి
ఈ గజమాల వేయనీయండి
ఈ పట్టుశాలువా స్వీకరించండి
ఈ కానుకలు స్వీకరించండి
నేను విసురుతున్న వింజామరనుంచి
వీచే మలయమారుతాన్ని ఆస్వాదించండి
పళ్ళు ఫలహారాలు భోంచెయ్యండి
మీకోసం ప్రత్యేకం గా తయారుచేయించిన
జున్నుపాల పరమాన్నం ఆరగించండి


మీ ఇంటి లాండ్ లేన్ నెంబర్ ఇస్తారా ?


నా జీవితం తెరిచిన BSNL వారి హైదరాబాదు టెలీఫోను డైరక్టరీ. అనవసర విషయాలు ఎక్కువ, అవసర విషయాలు నిల్. చిన్న చిన్న అక్షరాలలో Dr. B. Subrahmanyam, South End Park అన్న చోట ఉండే నంబరు నాదే నాదే. మీకు లావుపాటి కళ్ళద్దాలు ఉంటే అందులోంచి చిన్న అక్షరాలు కనిపించవు ఆనుకుంటే 040 24122304 కి టెలిఫోన్ చేసి చూడండి. ఆపైన మీ అదృష్టం.

Concept by  Zilebi
జేకే - JUST KIDDING !
ABN - Active Bloggers Network 
- ఆంద్ర జిలేబి - ఇంకెవరు నేనే !

చీర్స్
జిలేబి.

64 comments:

  1. మీరు నిజంగానే ఆయనతో జరిపిన సంభాషణో లేక అలా జరిగితే వారి సమాధానాలు ఎలా ఉంటాయి అన్న మీ ఆలోచనకి రూపమో అర్ధం కాలేదు కాని చాలా చక్కగా హాస్యభరితంగా ఉంది! ఆయన గురించి కొన్ని క్రొత్త విషయాలు తెలిసాయి! ధన్యవాదాలు!

    ReplyDelete
  2. "ప్రతిదీ అమ్మగారి దగ్గరికి తీసుకెళ్లతానంటారు. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారా ఏమిటీ? "

    గురూజీ మీతోనూ ఈ మాటన్నారూ....


    మీ ఓ "ఫన్ ఆర్ట్" విత్ జే కే బావుందండీ. కాపోతే ఎక్కడా Ghrutaachi ప్రస్తావన లేకపోవడం గురూజీని అవమానించడమే.

    "మీకు బ్లాగ్ లోకం లో జ్యందాలగా, ముళ్ళపూడి గా గుర్తింపు ? "

    గురూజీ ఈ సమాధానంలో ఆయన్ని తొలిసారి "బ్లాగ్లోక ముళ్ళపూడి" అన్న నన్ను తలుచుకోలేదు. ఐ హర్టేడ్ (గురూజీ ఈ విషయం ప్రభావతి గారి దృష్టికి తీసుకెళ్లాల్సిందే :) )

    ReplyDelete
  3. చాలా బావుంది. నిజమా? కల్పితమా? బులుసు గారి జవాబులు ఆయన చెప్పినట్టే ఉన్నాయి. నిజమే కదా?

    ReplyDelete
  4. రసజ్ఞ గారు

    బులుసు గారి చమత్కారం వారికే సొంతం. ఆ ప్రశ్నలు మాత్రమే జెకె వి. హాస్యభరితం వారి బ్లాగు. దానికి ఈ బ్లాగ్ముఖి జస్ట్ ఒక విండో మాత్రమే

    @శంకర్ ఎస్ గారూ

    ఘ్రుతాచి లెని గురూజీ గారెక్కడండి. పైన చెప్పినట్లు ఇది ఒక విండో మాత్రమే! ఘ్రుతాచి గురించి వారి వివరణ వారి బ్లాగులో చదివి తరించాల్సిందే !

    @పావని గారు

    ఇది నిజమైన కల్పితం. బులుసు గారి జవాబులు వారు చెప్పినట్టే ఉండటం నిజమే కదా మరి. రాబొయే కాలం లొ మీరు బులుసు గారి లా రాస్తున్నారు సుమండీ అన్న పదజాలం తప్పక వెలుగులో కొస్తుందని నా ప్రగాఢ విస్వాసం.

    ReplyDelete
  5. ఒక ప్రశ్న అడిగి దానికి ఇంత సుదీర్ఘం గా జవాబు చెప్పించటం, అది మీరు వినటం, దాన్ని మళ్ళీ వ్రాయటం ...హుహ్... మీరేం జర్నలిస్ట్ !!
    మరీ సత్తెకాలపు చేష్టలు కాకపోతే..
    టీవీ లు చూడరా? రెండువైపులా పదునున్న లచ్చుమమ్మలు ఇంటర్వ్యూ ఎలా చేస్తారో తెలీదా.. నేర్చుకోండి..!!

    ReplyDelete
  6. ఆత్రేయ గారు

    ధన్యదములు ఆ సెటైర్ కి. చాకు పదును శక్తి వేరు, జిలేబి తియ్యదనం ఆహ్ల్లదం వేరు.

    ReplyDelete
  7. బులుసువారిని బలే అనుకరించారే

    ReplyDelete
  8. శర్మ గారు

    బులుసు గారిని అనుకరించడమా! అయ్య బాబోయ్, నా కంత సీను లెదు. ఇవి అక్షరాలా వారి అక్షరములే !

    ReplyDelete
  9. రాజెష్ గారు

    ఫార్ మోర్ ఫన్ ఎంజాయ్ రీడింగ్!

    ReplyDelete
  10. ఐతే వారిప్పుడు 'సుబ్రహ్మజ్ఞాని' అవుతున్నారన్నమాట.

    ReplyDelete
  11. Do I deserve this ?

    ఇది చదివిన తరువాత నాకు నిజం గానే కళ్ళు చెమర్చాయి. ఇంతటి అభిమానానికి నేను అర్హుడిని కాను.

    అన్నట్టు నా టెలిఫోన్ నెంబర్ మారిందండి. 08812 244494.

    (మీ అనుమతి తీసుకోకుండానే ఇది నా బజ్ లో వేసుకుంటున్నాను.)

    ReplyDelete
  12. వరూధిని గారు..!!
    వావ్... చాలా బాగుంది ఈ పోస్ట్ అండ్ మీ బ్లాగ్ ...
    మీ ఐడియా కేక... :)

    ReplyDelete
  13. You deserve a lot more than this బులుసుగారు అభినందనలు :-)
    జిలేబి గారు భలే రాశారు. మీ ఓపికకి క్రియేటివిటీకి జోహార్లు.

    ReplyDelete
  14. ఈ వీ లక్ష్మి గారు

    ధన్యవాదములు !

    ఆ క్రెడిట్ బులుసు గారికి చెందుతాయి!

    ReplyDelete
  15. నాగేస్రావ్ గారు

    నెనర్లు. మీరన్నట్టు బులుసు గారెప్పుడూ 'సుబ్రహ్మజ్ఞాని ' గారే !

    ReplyDelete
  16. బులుసు గారు

    You desrve more than this!

    మీ భాషలో చెప్పాలంటే,

    లేటాలశ్యం గా వచ్చినా మీరు 'లేటెస్ట్' గా వచ్చారు !

    బజ్జు అంటే ఎమితొ నాకు తెలీదు.

    భలేవారండీ మీరు ! అది ఎదైనా అందులో వేసుకొవడానికి నా అనుమతి ఎందుకండీ !

    అవి మీ అక్షరాలంకారాలు ! నేను చేసింది కూర్పు మాత్రమే !

    ReplyDelete
  17. హర్షవర్ధనం గారు

    ధన్యవాదములు. ఈ తపా, ఆ కేకగా మారటానికి మూలభూతులు బులుసు గారు! ఆ కేకకి ప్రాణం వారి అక్షరాలు !

    ReplyDelete
  18. వేణూ శ్రీకాంత్ గారు

    you have aptly said!


    నెనర్లు!

    ReplyDelete
  19. సూఊఊఊఊపర్ పోస్ట్ అండీ.. కేకో. కేక

    రాజ్ కుమార్

    ReplyDelete
  20. Great post! చాలా బాగుందండీ..:)

    ReplyDelete
  21. సూపర్ డూపర్ పోస్ట్:)

    ReplyDelete
  22. బుద్ధి, జ్ఞాన౦ మీద పరిశోధనలు చేసా౦.

    ఎదురి౦టిలో పరికిణి, జాకెట్టు వేసుకుని తిరిగేది అమ్మాయి అని తెలుసుకోవడ౦ బుద్ధిఅని,
    ఆఅమ్మాయి జోలికి వెళ్తే పళ్ళు రాలతాయని తెలుసుకోవడ౦ జ్ఞా న౦ అని.

    మీ హాస్యం లో కూడా
    జ్ఞాన దృష్టి సత్య వచనం తోనికిసలాడుతుంది
    నిస్చయాత్మకంగా అంటే నిర్ణయించేది బుద్ధి
    జ్ఞానం అంటే అనుభవమే !

    ReplyDelete
  23. చాలా బాగుందండీ..... ముందు ముందు ఇలాంటివెన్నో మీరు రాయాలనీ... మేము చదవాలని ఆకాంక్షిస్తున్నాము..

    ReplyDelete
  24. comedy is a serious job. your post proves that. terribly fantastic post.

    ReplyDelete
  25. బులుసు గారా మజాకా,
    ఆయన పేరు గుర్తు రాగానే, పెదాల మీద నవ్వే కాదు, గుండెల్లో కూడా ఆహ్లాదమైన నవ్వు వస్తుంది.

    As Venu rightly said, Bulusu gaaru, you deserve a lot more than this.

    మీరు చిరకాలం నవ్వుతూ, అందర్నీ నవ్విస్తూ ఉండాలని కోరుకుంటూ
    Kumar N

    ReplyDelete
  26. వేణూ రాం గారూ

    మీకు నచ్చినందులకు 'దీపావళీ' మహదానందం!

    ReplyDelete
  27. ఫ్రౌ మధురవాణీ

    Ich bin froh zu wissen, dass!

    దీపావళీ సుభాకాంక్షలు!

    ReplyDelete
  28. పద్మార్పిత గరూ

    అది బులుసు గారి సొగసు !

    ReplyDelete
  29. ఎందుకో

    ఎమో

    గారూ

    మీరు

    చెప్పింది

    అవునెమో !

    దీపావళీ ఇవ్వాళేనేమొ ?

    ReplyDelete
  30. బులుసు గారూ ఈ వ్యాఖ్య మీ గురించె సుమా !
    మీరు నోట్ చేసుకొవాలి !

    దీపావళీ శుభకాంక్షలు Maddy!

    ReplyDelete
  31. Panyala Jagannath Das,

    Thats a good statement! Its a serious job which is effortlessly performed by Shri Bulusu !

    Happy Deevaali !

    ReplyDelete
  32. కుమార్ ఎన్

    పెదవులపై ఆహ్ల్లదమైన నవ్వు

    హృదయాలలో గుభాళింపులు

    దీపావళీ శుభాకాంక్షలు !

    ReplyDelete
  33. శ్రీ కొసురు

    ఫంటాస్టిక్ ఫెంటాస్టిక్ బులుసే టిక్ !

    దీపావళీయం!

    ReplyDelete
  34. Fantastic. జిలేబి/వరూధినిగారు, ఈ సీరిస్ ఇలాగే కంటిన్యూ చేస్తే బావుంటుంది. నెలకో బ్లాగరును రఫ్ ఆడించండి నిజంగానే... డైరెక్ట్ గా ఇంటర్యూ తీసుకోండి.. జె.కె. విత్ ...

    దివ్యదీపావళి శుభాకాంక్షలు..

    ReplyDelete
  35. జిలేబి గార్కి కృతజ్నతా పూర్వక ధన్యవాదాలు.
    నోట్ చేసుకోవాల్సినవి అన్నీ చేసుకున్నాను. ముఖ్యం గా మీ అభిమానం ప్రోత్సాహం. నా బజ్జ్ లో లింక్ కింద ఇస్తున్నాను.

    https://plus.google.com/103583048269336363549/posts/4Z9q2FiDxk5#103583048269336363549/posts/4Z9q2FiDxk5

    కామెంటిన అందరికీ ధన్యవాదాలు

    ReplyDelete
  36. excellent post. jeevitamlO haasya rasam annivELalaa avasaram. aarogyam aalochanallone untundi..ani ardhamayyETTu undi. Thank you very much..Zilebi..garu

    ReplyDelete
  37. జ్యోతి గారు

    ధన్వ్యవాదములు.

    వచ్చె బ్లాగ్ముఖి సంక్రాంతి రిలీజు ఉంటుంది తప్పక. వేచి చూడండి. తాం అగ్నివర్ణాం తపసాం జ్వలంతీం!

    ఇక డైరెక్ట్ ముఖాముఖీ అంటారా.. డానికి సాకార రూపం ఇవ్వ గలవారు నాకు తెలిసి ఒక్కరే ఉన్నారు. వారు - "ఒకప్పటి సరస్వతీ శారద గారే! " ఆలోచించండి మరి!

    ReplyDelete
  38. బులుసు గారూ

    ధన్వ్యవాదలు ఆ "బజ్జీల "

    లింకుకు ! చాలా బాగుందండి.

    మీరు ఆర్ ఆర్ ఎల్ లో 92 ఆ ప్రాంతం లో ఉండే వారా ?

    ReplyDelete
  39. వనజ వనమాలి గారు

    నెనర్లు !

    ReplyDelete
  40. ఈ తపా చదివిన అందరికీ, కామెంటిన వారందరికీ, బులుసు గారికీ, 'బులుసానంద ' ధన్యవాదాలు !


    హాస్యం రసాత్మకం , మధురం , జీవనానికి ఎల్లవెళలా అవసరమైన టానిక్కు.

    తమిళ కామెడీ రచయిత , క్రేజీ మోహన్ గారి పుణ్యమా అని మంచి హాస్యానికి (ఇతరుల నొప్పించక, తానొవ్వక) ఉన్న విలువ గమనించడం జరిగినది.

    అట్లాంటి సున్నిత సుమధుర హాస్యం, పదాలతో గారడీ, బులుసు గారి బ్లాగులో చదివినప్పుడు, ఎన్నొ మార్లు కళ్ళు చెమర్చాయి.

    సంతోషాన్ని పంచుకుంటే ద్విగుణీకృతం అవుతుంది.

    కొత్తవారికి పరిచయం చేసినట్టూ ఉంటుంది.

    వాటికి ప్రతిబింబమే ఈ తపా.

    ఇందులో నేను రాసినది తక్కువ!

    నూరు సాతం బులుసు గారి వాక్య నిర్మాణాలే అవి.

    అక్కడా ఇక్కడా కొన్ని కొన్ని కట్టింగులు, కొద్దిపాటి మార్పులూ (ఎడిటింగ్), గ్రిప్ ఉండడానికి తప్పించి నేను చేసింది ఏమీ లేదు.

    ఈలాంటి హాస్యభరిత టపా హారాలు వారు ఇంకా తేవాలని, తెస్తారని ఆశిస్తూ, నేను కూర్చినదానిలో ఏదైన తప్పులుంటే, బులుసు గారు క్షమిస్తారని ఆశిస్తూ

    నమస్సులతో,

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  41. ఒకప్పటి సరస్వతీ శారద గారే! ఎవరబ్బా???

    నాకు తోచట్లేదు కాని మీరే చెప్పేయంఢి. మళ్లీ చేయమని అడుగుదాం..

    ReplyDelete
  42. >>> బులుసు గారు క్షమిస్తారని ఆశిస్తూ .......

    ఇది చాలా పెద్దమాట. ఇటువంటి భాష ఇక ముందు ఉపయోగించ వద్దని విన్నవించుకుంటున్నాను.

    మీరు చూపుతున్న అభిమానానికి, ఇచ్చిన గౌరవానికి మనస్సు, మాట కూడా మూగబోయాయి. శతసహస్ర ధన్యవాదాలు.

    అవునండి నేను 1992 లో జోర్హట్ లోనే ఉన్నాను.95 లో వదిలేశాను. మీరెప్పుడైనా వచ్చారా? మీ ఈమైల్ అడ్రెస్స్ ఇవ్వగలరా. నాది
    srisubrahlaxmi@gmail.com

    ReplyDelete
  43. జ్యోతి గారు,

    ఇల్లలికిన ఈగ ఓసారి తనని మరిచిపోతే ఫర్లేదు గాని, మళ్ళీ తనని మరిచి పొతే కష్టమే సుమా!


    ధన్యవాదాలు బులుసు గారికి.

    92 లో జోర్హాట్ లోని ఒక రిసేర్చ్ లేబొరేటోరీ కేంపస్ లో అక్కడి డైరెక్టర్ గా ఉన్న శ్రీ అవస్తి గారింటిలో రెండు మూడు రోజులు ఉన్నాను. ఆ రిసేర్చ్ లేబ్ మీది ఒకటేన నాకు తెలీదు.


    సో మీరు రాసిన జోర్హాట్ ఎపిసొడ్, మరి కొన్ని టపాలలొ రాసిన అక్కడి విశెషాలు కళ్ళముందు ఆ నాటి అస్సాముని నిలిపింది. !

    ReplyDelete
  44. అయ్ బాబోయ్!!! నేనా??

    ఐనా బలిపశువు దొరకాలిగా.. ఉంటే చెప్పంఢి వేటు వేసేద్దాం..

    ReplyDelete
  45. జ్యోతి గారు

    వెరీ సింపుల్. మా బులుసు గారే!

    ReplyDelete
  46. ఈ పోస్ట్ నేను ఇప్పుడే చూసాను.ఎంత బావుందో చెప్పలేను.
    ఎన్నిసార్లు చదివినా మళ్ళి మళ్ళి చదవాలని అనిపిస్తోంది.

    ReplyDelete
  47. జిలేబి గారూ..

    మా లాబ్ కి శ్రీ అవస్తి అనే డైరెక్టర్ ఎవరూ ఇప్పటి దాకా రాలేదు,కనీసం నాకు తెలిసి. 92 లో ఖచ్చితంగా లేరు. బహుశా మీరు Rice Research Institute, Titabhar కానీ Tea Research institute, Cinamara కానీ వెళ్ళి ఉండవచ్చు. ఇవి రెండు కూడా 10-15 Km. దూరం లో ఉన్నాయి జోర్హట్ కి. 70 లో ఇంద్ర కుమార్ అవస్తి అనే కుర్రాడు ఉండేవాడు. అతను నాలుగు అయిదేళ్ళ తరువాత వెళ్లిపోయాడు.

    చివరికి నన్ను బలి పశువు ని కూడా చేద్దామనా ?

    ReplyDelete
  48. శైలబాల గారు

    మీ వ్యాఖ్యలకి ధన్యవాదములు ! వాటికి మూల కారణమైన వారు బులుసు గారు! ఆ క్రెడిట్ వారికే సొంతం.

    ReplyDelete
  49. బులుసు గారు

    అది టీ రిసేర్చ్ లాబ్ కేంపస్, ఇప్పుడు గుర్తుకొస్తోంది మీరు చెప్పిన పేరు విన్నాక.

    బలిపశువా ! ఎంత మాట!

    పురుష సూక్తం లో-

    దేవా యద్యజ్ఞం తన్వానాహ, అబద్నన్ పురుషం పశుం
    తం యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్, పురుషం జాతమగ్రతహ

    వాక్యం స్మరించుకోవాలి మరి!

    ReplyDelete
  50. ఈ పోస్టు వ్రాసింది వరూధిని గారు అని నేను అనుకుంటున్నాను.

    ఈ పోస్టుపై నాకు అభ్యంతరాలున్నాయి.

    మీరు బులుసు సుబ్రహ్మణ్యం గారిని ఇంటర్వ్యూ చేయకుండా బ్లాగులోని విషయాలు తెలిపారు.
    కానీ ఆయన వేరు , ప్రద్యుమ్నుడు వేరు.

    మీరు ఒక్కసారి సరిచూసుకోండి.

    మీరు ఏ సంగతీ నాకు క్లారిటీ ఇవ్వాలి, ఇచ్చితీరాలి.

    నేను ఈ పోస్టుకి అభ్యంతరం పెడుతున్నాను.

    మీరు చెప్పినట్లు అయితే ఆయన ఈ పోస్టుకి అర్హుడు కాదు.

    తాను చేస్తే "శృంగారం" ఇతరులు చేస్తే "వ్యభిచారం" అన్నట్లు ఉంటాయి అతని ఆలోచనలు.

    ఈ రచయత గురించి తెలుసుకోవాలంటే బజ్ లో చూడాల్సిందే.

    ఎవరి రంగులు ఏమిటో అక్కడే బయటపడతాయి.

    మీరు నాకు సమాధానం చెప్పితీరాలి.

    ReplyDelete
  51. ఈ పోస్టు వ్రాసింది వరూధిని గారు అని నేను అనుకుంటున్నాను.

    మంచిది. కాని ఇది రాసినది జిలేబి.

    ఈ పోస్టుపై నాకు అభ్యంతరాలున్నాయి.

    అందుకే ఈ కామెంటు మీరు రాసారు.

    మీరు బులుసు సుబ్రహ్మణ్యం గారిని ఇంటర్వ్యూ చేయకుండా బ్లాగులోని విషయాలు తెలిపారు.

    మీరు కరెక్ట్ గా కనబెట్టెసారు. (కొంత మీరు లేటాలస్యం మాత్రమే )


    కానీ ఆయన వేరు , ప్రద్యుమ్నుడు వేరు.

    మీరు కరెక్టు గా కనబెట్టేసారు.

    మీరు ఒక్కసారి సరిచూసుకోండి.

    చూడడం జరిగినది.

    మీరు ఏ సంగతీ నాకు క్లారిటీ ఇవ్వాలి, ఇచ్చితీరాలి.

    భలే వారండీ మీరు, మా నారా వారిలా అధ్యక్షా ఒక్కతే తక్కువ మీ ఈ డిమాండ్ కి

    నేను ఈ పోస్టుకి అభ్యంతరం పెడుతున్నాను.

    పెట్టెసారు కదా అల్రేడీ ?

    మీరు చెప్పినట్లు అయితే ఆయన ఈ పోస్టుకి అర్హుడు కాదు.
    అతని ఆలోచనలు.
    ఈ రచయత గురించి తెలుసుకోవాలంటే బజ్ లో చూడాల్సిందే.

    నీహారికా గారు, పువ్వులమ్మిన చొట కట్టెలమ్ముకొవాలనరా అబ్బాయీ అని మా మనవణ్ణి అడిగితే, వాడు, బ్లాగ్ ఓపెన్ చేసి ఇస్తాను జిలేబీలు అమ్మెసుకో అని ఈ బ్లాగ్ నాకు ఓపెన్ చేసి ఇచ్చాడు. ఏదొ ఒ మోస్తరులో నాకు తొచిన జిలేబీలు వేస్తున్నాను ఈ బ్లాగులో. అంత మత్రమే నాకు తెలుసు. ఇక ఈ వానప్రస్తాశ్రమం లో బజ్జీలు అమ్మే శక్తి లేదు. ఆ బజ్జీల గురించి నాకు తెలియదు.


    ఎవరి రంగులు ఏమిటో అక్కడే బయటపడతాయి.

    జీవిత మే ఒక రంగుల కల. ఒక రంగేళి.

    మీరు నాకు సమాధానం చెప్పితీరాలి.

    య ఏవం వేద.

    పీ ఎస్: మీ టపా మంత్ర పుష్పం చదివాను. చాల బాగ అనువదించారు ఆంగ్లం లోకి. నెను కూడ ఈ బ్లాగు లో ఎక్కడో ఒక చోట జల పుష్పం అన్న శీర్షిక తో భావానువాదం చేసాను. వీలు చెసుకుని చదవండి.

    మీ కామెంటులకి ధన్యవాదములు.

    ReplyDelete
  52. నేనీ రోజే చూసాను ఈ పోస్ట్ . బులుసు గారి తో ఇంటర్వ్యూ చాలా బాగా రాశారండి .

    ReplyDelete
  53. ఎప్పుడొచ్చాం అనేది కాదన్నయ్యా ప్రశ్న కమెంటు పడిందా లేదా అన్నదే సమస్య !!

    బులుసు గారే "వారు వారే ... వీరు వారు కాదు" అని సెలవిచ్చాకనే నేను గీతాంజలి లో డైలాగ్ కొట్టటం జరిగింది.ఇపుడు మీరొచ్చి బులుసు గారిని అన్నారని చెపుతుంటే ఏమని సమాధానం చెప్పాలి ?

    పోనీ ఆయనైనా అమ్మా ! నేను వారు కాదు, మీరిలా అన్నట్లు వారికి చెపుతాననో చెప్పాలి లేదా ఈ వానప్రస్థానంలో నాకు కోరిక లేదు అనో చెప్పాలి ఇదేమీ లేకుండా ఆయన రాస్తే మేము నవ్వాలి, మేము వ్రాస్తే ఆయన ఏడుస్తాను అనటం బాగుందా చెప్పండి ?

    నా బాధంతా ఆ నారా వారి గురించే, ఎన్ టీ ఆర్ ఏం తప్పు చేసాడని పార్టీ ని చీల్చావు, లక్ష్మీ పార్వతి వచ్చి వాలితే ఆయనేం చేస్తాడు, నీకంత సత్తా ఉంటే వేరే పార్టీ పెట్టుకోవలసింది కదా ,మామగారి పార్టీ యే కావలసి వచ్చిందా ?

    నువ్వు పార్టీ ని చీల్చితే ఎన్ టీ వోడు పైకెళ్ళి ఊరుకుంటాడా వానలు రాకుండా చేసి నీ కుర్చీ పీకించాడు, సరే పోనీ అని అనుకుందామనుకుంటే ఒకవైపు లక్షల కోట్లు మింగేస్తూ వై ఎస్ చిద్విలాసంగా బుగ్గన చేయి పెట్టుకుని, అసెంబ్లీలో కూర్చుని నీ మీద పదే పదే రాళ్ళేస్తుంటే, బావమరుదులు పదే పదే బెదిరిస్తుంటే , కె సి ఆర్ బెదిరిస్తుంటే ఇంకా తప్పు తెలుసుకోకుండా రెండు కళ్ళ సిద్ధాంతం వల్లె వేస్తున్నావా అని నేను ఆయనతో వాదిస్తున్న టైములో... బులుసు గారు మావిడాకులు టపా వ్రాసారు, అసలే నారా వారిమీద కోపం బులుసు వారిమీద చూపించాను.

    ఈయనేమో మెలికలు తిరిగిపోతూ హీరో ఫోజు కొట్టేయడం .మిగతా ప్రతివ్రతలు నన్ను ఆడిపోసుకోవడం.

    భర్తకి "నైమిశారణ్యం" చూపించే ఆడవాళ్ళగురించీ , భార్యలో "అయిగిరినందిని" ని చూసే మగవారి గురించి మీరు తెలుసుకోవాలి, తెలుసుకునితీరాలి. అపుడు మీరింకా బాగా జిలేబీలు అమ్ముకోగలుగుతారు.

    మీ జల పుష్పం లింక్ ఇస్తారా ??

    మనవడు ఇచ్చాడు కదా అని జిలేబీలు అదే పనిగా తినకండి, అమ్మకండి డయాబెటీస్ వస్తుంది.

    By the Way I hate Zilebi

    ReplyDelete
  54. నీహారిక గారు

    మీ కామెంట్లకి ధన్యవాదములు. చాలా నిశితం గా మీరు ఇన్-డెప్త్ అనాలిసిస్ చేసారు. బాగుంది.

    Regarding, I hate Zilebi:

    మణి

    ReplyDelete
  55. మాలా కుమార్ గారు

    మీకు నచ్చి నందులకి ధన్యవాదములు

    నీహారిక గారు

    మణి అన్నపదం రాసేటప్పుడు కర్సర్ పోస్ట్ చెయ్యి మీద పోవడం తో సగం లో ఆగి పోయింది. చెప్పవచ్చినది ఏమిటంటే , జిలేబి కి మణి పద్మేహం కి ఒక అవినాభావ సంబంధం ఉంది. దాని వివరణ హెర్మన్ హేస్సే గారి సిద్ధార్థ లో చూచాయిగా ఉంది. మరీ ఇన్ డెప్త్ కావాలంటే Former German ambassador to India vraasina An Historical Analyis of Buddha చదివి చూడండి. You may start disliking everything or liking everything!

    cheers
    zilebi.

    ps: జలపుష్పం లింకు మీరే వెతకాలి. పుష్పాపచయం స్వీయపరిశోధన !

    ReplyDelete
  56. జిలేబీ గారూ అదరగొట్టేసారు అంతే. పోస్ట్ ఎప్పుడో చదివేసినా కామెంటు రాయడానికి ఇప్పటికి కుదిరంది టైము.

    ఇంటర్వ్యూ బెమ్మాండం...మీకింత మంచి ఆలోచన వచ్చినందుకు అభినందనలు!

    ReplyDelete
  57. ఇందాక బులుసుగారికి జై అనడం మరచిపోయాను.

    సుబ్బరమణియం గారికి జై. :)

    ReplyDelete
  58. కేకపోస్ట్ జిలేబీ గారూ సూపరు..

    ReplyDelete
  59. ఆ సౌమ్య గారు

    తీరుబాటుగా అయినా వచ్చి మీ అభిప్రాయములను తెలిపి, ఓ జై కొట్టిన తెలుగోడిగా మీకు ఇదే నా పట్టా. ధన్యవాదములు.

    @వేణు రాం గారు

    నెనర్లు.

    కేక పెట్టడానికి మంచి లంగ్ పవర్ ఉండాలి. ఆ పవర్ బులుసు గారి రచనా చాతుర్యం (అది వారి రచనా మాధురీ మహిమ )

    ReplyDelete
  60. sooooooooooooooooooooooooper.....!!!

    ReplyDelete
  61. Kiran

    dooooooooooooooooooooooooooooooooooper!!!!!!!!!!!

    ReplyDelete