Wednesday, October 12, 2011

సిగరెట్టు స్పందనల పొగ సవ్వడి

సిగరెట్టు మీద బాణం
ఎక్కుపెట్టినారే

పొగ తాగనివాడు
దున్న పోతై పుట్టునని
మాస్టారు చెప్పారే

అగ్గి పెట్ట, కుక్క పిల్ల ,సబ్బు బిళ్ళ
కాదేది కవిత కనర్హం అని
సిగరెట్టూ శ్రీ శ్రీ కలిసి
మనకి రుక్కులు అందించారే!

ఔరా , ఈ సిగరెట్టు స్పందనల్
పొగ సవ్వడుల్
కాల గతి లో కథా, కవితలతో దోబుచులాడాయే

ఏమి ఈ దుర్గతి సిగరెట్టు మిత్రమా నీకు
బులుసు గారు సిగారు తో బాణం ఎక్కు పెట్టి ఈ
బ్లాగు సిగారు లోకాన్ని కాపాడ ఓ కామిక్కు రాయ రారే


చీర్స్
జిలేబి.

5 comments:

  1. :-)

    కవిత బాగుంది కానీ జిలేబీ కారం గా వుంది ఎందుకో :-)

    ReplyDelete
  2. బులుసు గారూ, జిలేబీగారు పిలుపిచ్చారు. ఇక మీరు సటైర్స్ రాయడానికి పర్మిషన్ దొరికినట్టే. కానివ్వండి మరి.

    ReplyDelete
  3. పొగ సవ్వడి చెయ్యదు కానీ చెయ్యిస్తుంది నోటి చేత. అది దగ్గు.

    ReplyDelete
  4. భాస్కర రామి రెడ్డి గారూ .. మీరు వ్రాసే సైన్స్ అంతా శ్రద్ధగా చదువుతున్నాను. నేను ఆర్ట్ ఆఫ్ స్మోకింగ్ మీద వ్రాద్దామనుకున్నాను కానీ సిగరెట్టు అడ్వేర్టైజ్మెంట్ కిందకు వస్తుందేమో నని భయపడి ఆగిపోయాను. అందుకని మీరు కానివ్వండి. ఆ తరువాత అవసరమైతే నేను వ్రాయడానికి ఆలోచిస్తాను.

    ముళ్ళపూడి వారి జోక్ అందరికీ తెలిసినదే మళ్ళీ ఒక మాటు,

    ఒకాయన తన మిత్రుడు తో అన్నాడట "ఎక్కడ చూసినా సిగరెట్లు కాల్చడం వల్ల అనర్ధాలు, రోగాల గురించే వ్రాస్తున్నారురా. విసుగొచ్చి మానేశాను". మిత్రుడు ఆశ్చర్య పోయాడు "సిగరెట్లు మానేశావా". "లేదు చదవడం మానేశాను" అన్నాడట.
    కానీ నేను చదువుతాను.

    జిలేబి గారు.. థాంక్స్ నాకు బ్లాగోకంలో తోడు ఒకరున్నారనే ధైర్యం వచ్చింది.

    ReplyDelete
  5. బులుసు సుబ్రహ్మణ్యం గారూ, మీరు శ్రద్ధగా చదువుతున్నందుకు ఆనందంగా వుంది. పట్టు వీడకండి. ధన్యవాదాలు.

    ReplyDelete