Sunday, May 27, 2012

జిలేబి మీట్స్ జగన్ !

రెండు రోజులల్నించి మా మనవడు జగన్ బాబుని వాళ్ళెవరో సి బీ ఐ వాళ్ళు నానా ప్రశ్న ల తో వేధిస్తా ఉంటే, పోనీ లే మనవాడి తో కొంత సేపు మాట్లాడి ఊరట కలగ నిస్తాం అనుకున్నా,

పాపం ఎంత గా 'కలవర' పడి పోయి ఉన్నాడో తండ్రి ని పోగుట్టు కున్న తనయుడు, ప్చ్, అయ్య పోయినప్పటి నించి అబ్బాయికి ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయో అని బాధ పడి పోయా.

ఒరే అబ్బీ నీ కెన్ని కష్టాలు వచ్చి పడ్డాయిరా అన్నా ఇంటికివెళ్లి.

అప్పుడే ఏడు గంటల పై బడి అదేదో క్లారిఫికేషన్ సెషన్ అట, సి బీ ఐ వాళ్ళ తో అది ముగించుకుని వచ్చి ఉన్నాడు. మధ్య లో టీవీ లో కూడా చూసానే బాబు మరీ కలత గా వున్నాడని టీవీ వాడు హోరు మని చెబ్తున్నాడు కూడాను.

జగన్ బాబు తేలిగ్గా నవ్వేసి, బామ్మా, ఏమిటి కష్టాలు అన్నాడు.

అదేమిరా అబ్బీ అట్లా ఏడు గంటల సేపు నిన్ను నిఖార్సుగా ప్రశ్న ల మీద ప్రశ్నలు వేశారట గా అన్నా.

బామ్మోయ్, చిన్నప్పుడు నాన్న ని నేను కూడా చాలా ప్రశ్న ల తో పరేషాన్ చేశా. అవన్నీ ఆయన పట్టించు కున్నా డంటావా ? అన్నాడు.

ఏమంటావురా అబ్బీ అన్నా

అదేలే, వాళ్ళేదో వాళ్ళ స్టైల్ లో ప్రశ్నలడుగు తారు, అమావాశ్య కీ అబ్దుల్ కాదర్ కీ సంబంద్ క్యా హాయ్ అని. మనం మన సమాధానా లేవో చెప్పు కుంటాం. అంతే అన్నాడు..

అదేట్లారా అబ్బీ , నువ్వు చాలా 'కలవల' పడి పోయావని టీవీ వాడు హోరెత్తు తుంటే, ఇలా నిమ్మళం గా ఉండావు !

వాళ్లకి ఇంటర్వ్యు ఇచ్చేటప్పుడు అలాగే పోస్ పెట్టా బామ్మా.

ఎందుకురా అబ్బీ.

ప్రజలకి తెలియాలిగా తమ ప్రియతమ నాయకునికి ఎన్ని కష్టాలో అని మరి.

అంతే అంటావా ?

అంతే.

మరి రేపటి మాటలో ?

వాళ్ళు క్లారిఫికేషన్ అడుగుతారు. నేను కూడా క్లారిఫికేషన్ ఇస్తా. వాళ్ళు దానికి క్లారిఫై చెయ్యి అంటారు. నేను దానికి క్లారిఫై అని మళ్ళీ చెబ్తా. ఇట్లా...

సో, మొత్తం మీద, క్లారిఫీ కేషన్ సెషన్ అని టైం పాస్ అండ్ టీం పాస్ కాలక్షేపం బటాణీ లన్న మాట!

చీర్స్
జిలేబి.

10 comments:

  1. మీరు జగన్ మీట్ అయి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టడంలో ఫెయిల్డ్ అయ్యారు భామ్మగారు.
    ఇంకా ఇంకా ఏం అడిగారో,ఏం చెపుతాడో..అని ఉత్సుకత తో ఎదురు చూస్తుంటే "తుస్" మనిపించేరు. ఇంత ప్రొద్దునే నా టైం పాస్ ఇలా "డల్" గా అయిందేమిటి చెప్మా!? ప్చ్.:(

    ReplyDelete
  2. జగన్‌నే ఓదార్చాలన్న మీ ప్రయత్నం ఫలించలేదన్న మాట. :)

    ReplyDelete
  3. చాలా రోజుల క్రితం ఓ నాయకుడు చెప్పాడు. ఒక ఉన్నతాధికారిని ఏదో విషయం లో సస్పెండ్ చేశారు . ఆతను మళ్లీ ఉద్యోగం లోకి వచ్చాడు . ఎలా వచ్చావని అడిగితే
    సస్పెండ్ అయిన నాకు పని పాట లేదు నా పై ఒక విచారణ అధికారిని నియమించారు . అతను నన్ను వివరణ అడిగితే భారత రాజ్యాంగం , మానవ సంబందాలు, మనుషుల పుట్టుకతో సహా మొదటి సారి 500 పేజీల వివరణ ఇచ్చాను. అర్థం కాలేదని మళ్లీ వివరణ అడిగితే ఈ సారి వెయ్యి పేజీల వివరణ ఇచ్చాను. నాకేం పని లేదు కానీ విచారణ అధికారికి అనేక పనులు ఉంటాయి కదా . నా సమాధానం సైజు చూసి దిమ్మ తిరిగి పోయి ఈ అధికారి ఎలాంటి తప్పు చేయలేదని నివేదిక ఇచ్చాడు, నేను ఉద్యోగం లోకి వచ్చాను అని చెప్పాడట

    ReplyDelete
  4. హ హా బాగుంది బఠాణీ కాలక్షేపం అటు సి.బి.ఐ నుంచి ఇటు లైవ్ టెలికాస్టులూ, దారిపొడుగునా కెమెరాలు పట్టుకుని రెపోర్టర్ల పరుగులూ, ఆంధ్రదేశం అంతా బఠాణీలతో భలే కాలక్షేపం చేస్తున్నారు చాలా రోజులుగా...
    పాపం ఈ దెబ్బకి నిజంగా బఠాణీలు అమ్ముకునే వాళ్ళకే పొట్టకూటి తిప్పలు, వాళ్ళ బఠాణీలెవరు కొంటారు అర్ధరూపాయెట్టి...లక్షల కోట్ల బఠాణీలు అంత కమ్మగా ఉంటుంటే అందరికీ... తినేవాడికీ, చూసేవాడికీ, కవరేజ్ ఇచ్చే వాడికీ... ;)

    ReplyDelete
  5. టపాకు సంబంధం లేని ప్రశ్న

    కంసుడు బలరాముడు కృష్ణుడు మినహా దేవకి సంతానం అందరినీ చంపాడు కదా. మరి సుభద్ర ఎవరి కూతురు? ఆవిడ వీరికి చెల్లెలు ఎలా అయింది?

    మాయా బజార్ సినిమా చూస్తూ నా కూతురు అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం చెబితే ఇంట్లో నా పరువు కాపాడుకుంటాను.

    Thanks in advance.

    ReplyDelete
    Replies
    1. నేనైతే... వెధవప్రశ్నలడక్క పాప్‌కార్న్ కడతేర్చు, లేదా పొట్లం జప్తు చేయబడుతుంది అని కళ్ళెర్ర చేసేవాడిని, జైగో. :))

      Delete
  6. సుభద్ర రోహిణి కూతురు.

    ReplyDelete
  7. ఆమె వసుదేవునికి రోహిణి ద్వారా పుట్టిన కూతురు.

    ReplyDelete
  8. Praveen, thanks

    SNKR, జిలేబి అంతటివారే పిల్లల ప్రశ్నలకు విత్తరపోతే మామూలు మనుషులం మనమెంత?

    ReplyDelete