Monday, November 17, 2014

ప్రవీణ్ లా పేషంట్ ఫర్ కామెంట్ గల కామెంటర్లు తెలుగు బ్లాగ్ లోకానికి ఎంతైనా అవసరం !


ప్రవీణ్ లా పేషంట్ ఫర్ కామెంట్ గల కామెంటర్లు తెలుగు బ్లాగ్ లోకానికి ఎంతైనా అవసరం !
(ఇది చాలా సీరియస్ టపా)

కామెంటడం ఒక కళ .

తెలుగు బ్లాగ్ లోకం లో ఒక కాలం లో ది స్పిరిట్ ఆఫ్ తూచ్ తూచ్ ల తో బాటు కామెంట్ల కోలాహలం , కామెంట్ల గార్బా, కామెంట్ల దాండియా, కామెంటర్ల దర్పం, డాంబికం, నువ్వంటే నువ్వేంటి అన్న వాదం, ప్రతి వాదం, పిడివాదం, మిత వాదం, అమిత వాదం, వ్యర్థ వాదం, చెణుక్కుల చమక్కులు, రేపొర్టాయిరీలు, ముసుగుల్లో ముషాయిరీలు , టై పాటుల్లో కత్తులు కటారులు, రాతల్లో వీరం, శౌర్యం , భయానకం, మేధ, కవితల్లో కారుణ్యం, విరుపులు, వివేకం లో విచారం, విచారం లో వివేకం, పద కేళీ లలో సరిగమ పద నిసలు ....

ఇలా రాసు కుంటూ పోతోంటే ఇవి, అవి, అన్నీ కలగలసి ఓ తెలుగు పీటం లా జిగేలు మనేది !

ప్చ్,ప్చ్ ఇప్పుడు కాలం మారి పోయింది .

ఆయ్ అంటే ఓయ్ అని కామెంటర్ల ని వాళ్ళ ధోరణి ని దబాయించి నోరు మూయించే వారే ఎక్కువై పోయేరు !!

ఆ కాలపు బ్లాగర్లారా ! కామెంటర్లారా ! ఏమై పోయేరు మీరంతా ! ?? తెలుగు రౌడీ లు, రౌడీ రాణులు వీళ్ళంతా ఎక్కడ కళ తప్పి పోయేరు ??

సో కాల్డ్ సీనియర్ బ్లాగర్లు వార్షికోత్సవానికి ఒక్క మారు టపా పెట్టి ఇది నా ఆరో వార్షికోత్సవం అంటూ టపా పెట్టె స్థాయి కి వచ్చేసింది !

కామెంట్లలో ఎక్కువగా ఉన్న కామెంట్ల బ్లాగుల్ని వేరే గా పెట్టేయమన్న ఆర్త నాదాలతో వెలుగొందు తోంది ! ఇది ఏమి సబబు ?? (రాబ్ పాల్ తో పే ది పీటర్!)

పాపం ఈ అబ్బాయి ప్రవీణు డొక్కడే కుస్తీ పడుతున్నాడు ఏటికి ఎదురీదు తున్నాడు .

బ్లాగ్ లోకానికి మరిన్ని ప్రవీణ్లు రావాలి !

ఇదియే జిలేబి విన్నపం - బ్లాగర్లారా, కామెంట్లల్ని తుంచ కండి . కామెంటర్ల ని వెలి వేయకండి . కామెంట్లు లేని టపాలు దీపం లేని ఇండ్లు . 

కామెంట్ల పరిధి ఇంతే ఉండాలన్న రూళ్ళ కర్ర ల తో దబాయింపులు, రుమాళ్ళ తో నోటి కి మూతలు తాళాలు పెట్టడం భావ్యమా ? ఇది అవసరమా ??

తెలుగు బ్లాగ్ లోకమా ! కళ్ళు తెరు !


జిలేబి
(ఇది చాలా సీరియస్ టపా)

 

11 comments:

 1. పిడివాదమా వర్ధిల్లు. నాటి బ్లాగర్లంతా వలసపోయారు, రణగుణ ధ్వనులను తట్టుకోలేక. తెనుగు బ్లాగులు కునుకుతున్నాయి, తరవాత కన్ను మూస్తాయి( కన్ను మూయడమంటే తప్పర్ధం వస్తుందా?) నిద్ర పోతాయి.బ్లాగుల్ని వదలలేనివారు కూడా వదిలేలాగానే ఉన్నాయి పరిస్థితులు. ఇంతే సంగతులు చిత్తగించవలెను.

  ReplyDelete
 2. Good one జిలేబి గారు. కామెంటడం నిజంగా ఒక 'కళ'గా వర్ధిల్లాలని 'కల'గా మిగలకూడదని కోరుకుంటున్నాను. దయచేసి ఎవరి భావాలను బలవంతంగా బంద్ చేయాలనుకోవద్దెవరూ!

  ReplyDelete
 3. కామెంట్లు ఎక్కువున్న బ్లాగులను నిరోధించాలని చూడటం తెలుగు బ్లాగు లోకాన్ని అంతమొందించడమే!

  ReplyDelete
  Replies
  1. చౌదరిగారూ,... తెలుగుబ్లాగు టపాలకు వచ్చే వ్యాఖ్యల సంఖ్యాపరమైన వృధ్ధిక్షయాలు తెలుగుబ్లాగులోకపు ఉథ్థానపతనాల్ని సూచిస్తాయన్నది పాక్షికసత్యం మాత్రమే. వ్యాఖ్యల రాశి కన్నా వాసి ముఖ్యం. ఒంటి చేతి వ్రేళ్ళపై లెక్కపెట్టగల బ్లాగులకే కుప్పలుగా వ్యాఖ్యలు వస్తున్నప్పుడు వాటి ఆధారంగా మొత్తం తెలుగుబ్లాగులోకానికి పురోభివృధ్ధి జరుగుతున్నదన్న భ్రమ ప్రమాదకరం. సగటున మిగతా బ్లాగుటపాలకు మహాఐతే ఒకటి రెండు వ్యాఖ్యలే కిట్టుబాటు కావటానికి కారణం చదువరుల అలసత్వం అన్నా కావాలి, టపాలవాసిలేమి అన్నా కావాలి. అలాగే వ్యాఖ్యలలో సింహభాగం నేను ఇంతకు మున్నే వ్య్యాఖ్యానించినట్లు రణాలూ పూరణాలూ మాత్రమే ఐనప్పుడు వాటి వల్లనే తెలుగుబ్లాగులోకం బ్రతికిపోతోందనీ అవి లేకపోతే దానికి మనుగడే లేదనీ అనుకోవటం మనని మనం మభ్యపరచుకొనేందుకే పనికివస్తుంది.

   Delete
  2. వ్రాతలలో వాసి పెరిగితే కామెంట్లు అందరికీ వస్తే అగ్రిగేటర్లలో కూడా ఒక్క బ్లాగు కామెంట్లే వరుసగా కనపడే అవకాశం లేదు. కామెంటే వారూ అవకాశం ఉన్నవారూ మంచి పోస్టులకు కూడా కామెంట్లు పెట్టడం లేదు. అందువల్ల కూడా వ్రాసేవారిలో నిర్లిప్తత ఏర్పడుతుంది. అసలు తమ పోస్టు నచ్చిందో లేదో తెలియాలంటే కామెంట్లు రావాలి కదా? చాలా బాగా వ్రాస్తున్నవారి పోస్టులకు కూడా కామెంట్లు ఉండకుండా ఉండడం కాస్త ఇబ్బందికరమే. కాబట్టి అందరూ ఆలోచించి కాస్త కామెంట్ చేసే ఓపిక పెంచుకోవాలని విజ్ఞప్తి.

   Delete
 4. మీరు మనసారగా నేడ్వనీరు నన్ను అన్నాడు కృశా అప్పుడు!
  మీరు మనసారగా కామెంటనీరు నన్ను అన్నాడు హకా ఇప్పుడు!

  ReplyDelete
  Replies
  1. :)) కృశా ఎవరు హకా?

   Delete
  2. కృశా = కృష్ణశాస్త్రి!
   హకా = హరికాలం?

   Delete