Wednesday, March 3, 2010

ఉడిపి హోటలు - ఉడాలు టపాలు

ఈ టపాలు రాయడానికి చాలా ఆలోచించి రాద్దామా వద్దా అన్న సందేహం లో పడి సరే రాద్దాం అన్న ఆలోచనతో రాస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రస్తుత చిత్తూరు పరిస్తితి ని చిత్రీ కరించదు. ఈ ఉడిపి హోటలు ఓ ముప్పై ఏళ్ళ క్రితం బ్రాహ్మణ వీధిలో ఓ ఇరవై ఏళ్ళ క్రితం జండా మాను వీధిలో ఆ పై బజారు వీధిలో ఉండేది. ఆ పై ఈ హోటలు మూత పడిందో లేదో నాకు తెలీదు. కాని ఈ ఉడిపి హోటల్లు సాంబారు - అదీ తెల్లవారి ఆ హోటల్ కెళ్ళి రెండు ఇడ్లీ ఒక బకెట్ సాంబార్ తో లాగిస్తే దాని మజా వేరు ! ఆ కాలం లో ఆంద్ర పత్రిక ఎర్రయ్య గారి అంగిట్లో - వారి అంగడి దినపత్రికలు- వార పత్రికలూ అలకరించిన ఓ "పత్రికా వనం" అన్నాతక్కువే- అరువుకి చదివి - ఈ హోటల్లో రెండు ఇడ్లీ ఓ బకెట్ సాంబార్ లాగించిన రోజులు - "సాంబార్" జ్ఞాపికలు! అప్పట్లో ముదిగొండ శివ ప్రసాద్ గారి చారిత్రాత్మక సీరియల్లు ఓ త్రిల్ చదవడం. పేపర్ లో సీరియల్ - డైలీ సీరియల్ ఓ రోజు చదవక పొతే అదోలా అయిపోయేది. ఇప్పుడూ తెలుగు పత్రికలూ ఆన్ లైన్ లో చదువు తాము అనుకోండి - అయినా తెల తెల వారి - ఆ పేపర్ వాసనతో - ఆంద్ర పత్రికా కాకుంటే ఆంద్ర ప్రభ చదవడం లాంటి జ్ఞాపకాలు- వాటి తో పాటు - పిచ్చా పాటి- ఇట్లాంటివి - ఈ కాలం లో కొద్ది తక్కు వే అనిపిస్తాయి. తెల తెలవారి హారం - కూడలి లో ముఖం పెట్టేసి బర్రుమని మౌస్ ని సాగాదీయ్యడం వేరే టెక్నిక్ !

ఆంద్ర పత్రికా ఇప్పట్లో లేదు. వాళ్ళ వారపత్రిక కూడా లేదు. కాని జ్ఞాపకాలు మాత్రం ఇంకా ప్రస్ఫుటం గా ఉన్నాయ్. ఈ విషయం గురించి ఆలోచిస్తే - జ్ఞాపకాలు అన్నవి మన మెదడులో ఓ లాంటి "చిప్" లా నిబడీ కృతమై కావాల్సినప్పుడు ఫ్లాష్ లా వచ్చేలా రావడం అన్నది మనిషి జీవితం లో ముఖ్య విషయం లా అనిపిస్తుంది. ఏమంటారు?

చీర్స్
జిలేబి.

7 comments:

  1. అనడానికేముందండి..చీర్స్ అంటాము. అసలు ఇండ్లీ సాంబారు రుచేవేరు. దానికితోడు పొద్దుటాలే పేపరు వాసన చూస్తూ పక్కనోడితో కాస్త లోకాభిరామాయణం ముచ్చటిస్తూ ఒక చిక్కని టీ తాగితే..

    ఇప్పుడూ ఇలాంటి దృశ్యాలు కొద్దిగా చిన్న చిన్న ఊర్లలో కనిపిస్తుంటాయండి.

    ReplyDelete
  2. నాకెందుకో మీరు ఆడపేరు పెట్టుకున్న మగవారు అనిపిస్తోంది. మీరు ఏమంటారు?

    ReplyDelete
  3. శరత్తూ లేకపోతే మీ కొత్తటపాలో ఏంచక్కగా అగ్రస్థానమిచ్చేవారేమో కదా :-)

    ReplyDelete
  4. నాకైతే నిజ్జం గా ఆరోజులు రావని అనిపిస్తుంది.
    నాకు రేపు తెల్లవారన చిత్తూరుకి వెళ్ళి మరీ ఇడ్లి , సాంబార్ (ఒక బకెట్టు) లాగించాలని ఉంది.
    ఎప్పుడు చిత్తూరు బజారు వీధికి వెల్లిన ఉడుపి హొటెలే గుర్తుకి వస్తుంది మరి !
    కాని ఇప్పుడు దొరకదాయె. మీరెమో మల్లి జ్ఞ్ణాపకానికి తెస్తిరి.

    ఇంతకీ మీకు కృతజ్ఞతలు తెలపాలా వద్దా అని నాకు తెలియడం లేదు !

    ReplyDelete
  5. అయ్యా శరత్ గారు-
    వ్రాసే వారు అయ్యగారైన అమ్మగారైన రాసినవస్తువు మారదనుకుంటాను. మనం వ్రాసేదంతా మనం చూసింది కూడా కావచ్చు. అన్ని అనుభవాలు - నావే కావడానికి ఆస్కారం లేదు. ఈ పై అనుభవం- జ్ఞాపిక నా మావయ్య గారిని చూసి నేను అర్థం చేసుకున్నది. అయినా నేను అవునంటాననుకోండి- మీరు వెంటనే - అవునంటే కాదనిలే కాదంటే అవునని లే - అని అంటారేమో? శరత్ శారద అవ్వొచ్చు కదా?(బ్లాగు టైటిల్ లో నే ఉడాలు అన్న పదం ఉన్నది మరి)

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  6. హలో భారారే గారు-
    ధన్యవాదాలు చీర్స్ కి . ఇడ్లి గిడ్లి- సాంబార్ గీమ్బార్ కి ఇది సీక్వెల్. ఇంతకీ ఇడ్లీ అన్న ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఇడురికా అన్న పదం కన్నడ పదం. ఇడురిక అంటే- "ఇడ డం " - ఇడ డం అంటే - వార్చడం అన్న అర్థం అరవం లో. సో ఇడ డం - ఇడురిక - ఇడ్లి.

    మధు జే రావు గారు- మీ సంతకం బ్లాగ్లోకం లో మొదటి సారి చూడడం నేను. ఆహ్వానం. ఈ టపాలు చదివి నా మిత్రులు ఒకరు చిత్తూరు వాస్తవ్యులు ఫోన్ చేసి- అంతలా కష్ట పెట్టుకోకు- ఉడిపి వాళ్ళు ఇంకా హోటల్ మూయకుండా కొత్త బస్సు స్టాండ్ దగ్గిర హోటల్ నడుపుతున్నారు అన్నారు. కాబట్టి వెంటనే మీ వీలుని అవకాసం గా మలచుకోండి

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete