ఈ మధ్య నేను మరీ బ్లాగులు ఎక్కువ రాసేస్తున్నని - ఇంటి పని వంట పని గమనించడం లేదని అసలు వీటికన్నిటికి కారణం ఎ భూతమో పిశాచామో జిలేబి ని పట్టి పీడించడమే కారణమని మా ఇంట్లో వారు తీర్మానించేసుకుని ఓ బ్లాగ్వాదిని పిలిపించి మంత్రం వేయించేరు - ఆ బ్లాగ్మంత్రవాది ఇలా మంత్రోచ్చార ణతో మొదలెట్టగానే -
హాం ఫట్
హ్రీం ఫట్
హాం హ్రీం క్రీం
డాకిని
శాకిని
బ్లాగిని
పో పో వదిలిపెట్టు పారిపో -
జిలేబి ని వదిలి పెట్టి పో -
హాం హ్రీం క్రీం - డాకిని బ్లాగిని శాకిని హాం ఫట్ - హ్రీం ఫట్- క్రీం ఫట్
అనటం తరువాయి నేను మూర్చ పోయాను.
మా వాళ్లకి భయమేసి - ఆ బ్లాగ్మంత్ర వాడిని పంపించేసి ఆ పై నన్ను మూర్చ నించి లేపడం తరువాయి వెంటనే నేను ఈ టపాలు వ్రాసే తీరుతానని శపథం పట్టటం తో - ఇదేమి పొయ్యే గాలం రా భగవంతుడా- డోలు పోయి ధమరుకం వచ్చే అని మా వారు తలపట్టుకుని కూర్చూంటే - ఈ టపాలు ముగించెయ్యడం జరిగింది. అయిన కుక్క తోలు వంచడం ఎవరి తరం? - నలుగురు నవ్వి తే నేమి - మా బ్లాగ్ పిచ్చి మాదే - ఎవరి పిచ్చి వారికి ఆనందం కాదా మరి? మా వారు మాత్రం ఆ ఈనాడో లేకుంటే హిందూ నో తలక్రిందుల చదవగా లేనిది మేము బ్లాగ్ వ్రాస్తే వచ్చిందా తంటా- జిందాబాద్ బ్లాగినీ సమాజం -
చీర్స్
జిలేబి.
సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
12 hours ago
LOL :))
ReplyDeleteఆ బ్లాగ్మంత్రవాది ఎవరో చెప్పారు కాదు!
ReplyDeleteబాగుందండీ. కుక్క తోలు కాదేమో కుక్క తోక ఏమో లేదా ఎలుక తోలు తెల్లన చేయటం అని వాడాలేమో. :-)
ReplyDeleteThat's the spirit of jilebi. Not that spirit, I meant spirit,that spirit :-)
ReplyDeletegood one.
:) :)
ReplyDeleteమాదీ ఇదే సమస్యే! :)
ReplyDeleteసేం పించ్....
ReplyDeleteఅదేవిట్రా గుడ్లప్పగించుకుని అలా ఆ దిక్కుమాలిన కంపూటర్కేసి అలా చూస్తూ వుండిపోతుందీ ! పోనీ చూద్దామంటే ఓ ఆటారాదు ఓ పాటారాదు . ఎందుకయినా మంచిది ఓ తాయెత్తు కట్టిస్తేనో అని మా ఆయనా , మా అత్తగారూ నా మీద కుట్ర పన్నారు తెలుసా
baagundi...
ReplyDeleteనాదీ అదే డవిలాగు....ఇలాటిదే ఏదో మా ఇంట్లో కూడా జరుగుతుందేమో అని భయంగా ఉంది :D
ReplyDeleteఅయినా నేను తగ్గను.....మిమ్మల్నే ఆదర్శంగా తీసుకుంటాను..ఇదే నా ప్రతిఙ్ఞ :D