Tuesday, December 30, 2014

పక్కింటాయన వర్సెస్ ఎదురింటావిడ !

పక్కింటాయన వర్సెస్ ఎదురింటావిడ !


ఇదిగో పక్కింటాయన గారు , మీకో విషయం తెలుసా ??

ఏమిటండి ??

పన్లేక మీ గురించి చాలా చాలా విషయాలు రాస్తున్నారట !

పొగుడు తున్నారా తెగుడు తున్నారా !

అబ్బే ! మనవాళ్ళు పొగడ్తల కి ఎప్పుడైనా పేరు పోయేరా !

అంటే తెగడ్తేనా ??

ఏమండీ ఎదురింటి ఆవిడ గారు , మీకో విషయం తెలుసా ??

ఏవిటో ??

కబుర్లాడ టానికి మీరే దొరికారన్న మాట పన్లేని వాళ్లకి !

ఆ ! ఎవరా బడుద్దాయిలు ?? ఏమన్నారు ??

పక్కింటా యన వర్సెస్ ఎదురింటి ఆవిడ వెరసి ....

ఆపెసారేం మధ్యలో !

ఇద్దరూ కూడ బలుక్కుని పై పైకి  వచ్చేరు మాడు పగుల గొట్ట టానికి !!

అబ్బే , నన్న న మా కండి ! నే నారదా య నమః అంటున్నా అంతే !!

ఎవరక్కడ ! ఆ పన్లేని వాళ్ళని తోలుకు రండి !

హుజూర్ ! జహాంపనా!

హుజూర్ మేం సాహిబా !!!

సందిట్లో సడే మియా జిలేబి పరార్! !

చీర్స్
జిలేబి

Saturday, December 27, 2014

జిలేబి కి బ్లాగ్ రత్న అవార్డు !


జిలేబి కి బ్లాగ్ రత్న అవార్డు !

రాబోయే కాలం లో బ్లాగ్ 'రత్తాలు', బ్లాగ్ 'v' భో షా ణా లు , బ్లాగ్ భో షా ణా లు, బ్లాగ్ శ్రీ లు రావచ్చు.

ఆ కాలం లో పొస్తమస్ గా నా కేవ్వరైనా బ్లాగ్ శ్రీ లాంటివి, బ్లాగ్ 'భో షా ణం '  ఇస్తే గిస్తే బ్లాగ్ లోకం లో అప్పుడున్న బ్లాగ్ మణులు, మాన్యులు 'జిలేబీ కి  శ్రీ తగదు, 'భో షా ణం ' తక్కువ అని టపాలు కట్టి, జిలేబీ ని వాయ గొట్ట వచ్చు!

అందుకే పకడ్బందీ గా ఇప్పుడే ప్రకటించు కుంటున్నా !

అప్పుడు నాకు వారికి సై అనడా నీకో, వారి మన్ననలు పొంద డానికో అవకాశం ఉండదు కదా!

పై నించి చూసి, మా నాన్నే, మా బంగారమే, నేను బ్లాగులు రాస్తున్న సమయం లో మీరంతా 'బుడతలు', బుడ్డీ లు రా ! నా గురించి ఇంత గా మీరు కొట్లా డొ ద్దు అని ఊరట జెప్పే అవకాశమూ ఉండదు !

ఏమి మీ అపార మైన ప్రేమ జిలేబీ మీద అని 'అనాధ' భాష్పాలు చిందించినా వారికి తెలిసే అవకాశం లేదు గా మరి.

అంతే గాక, ఆ రాబోవు కాలం లో మీరు నాకు 'భోషాణం' ఇస్తే,  ఛ ,ఛ , నా కిది వద్దు పో ఇది చాలా తక్కువ అని నే జెప్పలేను కూడా .

పోస్తు మస్సు గా ఇస్తే, భోషాణం వద్దంటుంది ఈ జిలేబీ అని మీరు ఆవేశ పడి పోయి మళ్ళీ మరో వంద టపాలు, కామెంట్లు బర బర , గిర గిర  టప టప  లాడిస్తారు . ఎందుకు ఇన్ని భేషజాలు చెప్పండి?

అందుకే, ఇప్పుడే మీ కందరికీ చెబ్తా ఉండా , జిలేబీ కి 'బలాగు' రత్తాలు' అని ఇప్పుడే ప్రకటించు కుంటున్నా !

జిలేబి కి ఆ రాబోయే  కాలం లో 'భళా'గు రత్న ఇస్తే, ఆయ్, జిలేబి సమకాలీకులు బ్లాగు జ్యోతులు , పని లేని వాళ్ళు, కష్ట పడిన వాళ్ళు,  అర్పితలు,బ్లాగాడించిన వాళ్ళు, సుబ్బరం గా రాసిన వాళ్ళు, రోజుల తరబడి పద్యాలల్లిన వాళ్ళు, ఎంత మంది లేదు ? వాళ్లకు  ఇచ్చి ఉండవచ్చు గా అంటూ జిలేబి ని తుస్సు మని  వాళ్ళు వాయ గొడతారు !- అందుకే ఇప్పటికిప్పుడే నాకు నేనే 'బలాగు' రత్నం అని ప్రకటించు కుంటూం డా !

ఓ మారు జిలేబీ 'బాలా' గు బ్లాగ్ 'రత్తాలు' కి జే  జే కొట్టుడీ మరి ! జై ;బాలా, (గు) రత్నా ! జిలేబీ !


ఇట్లు
మీ అనుంగు
 బలాగు రత్నం
'సహీ' రత్న'
జిలేబి.

Friday, December 26, 2014

ఓం స్వామి- జ్ఞాపకాలు - కార్పోరేట్ జీవనం నించి -హిమవత్ శృంగం వైపు !

ఓం స్వామి- జ్ఞాపకాలు - కార్పోరేట్ జీవనం నించి -హిమవత్ శృంగం వైపు !
 
If Truth Be Told
 
A Monk's Memoir

http://omswami.com/2014/10/if-truth-be-told.html
 

Wednesday, December 24, 2014

ఇచ్చట మతములు అమ్మకానికి గలవు ! - ఆలశించిన ఆశా భంగం !

 
ఇచ్చట మతములు అమ్మకానికి గలవు ! - ఆలశించిన ఆశా భంగం !
 
భలే మంచి చౌక బేరము !
 
ఇచ్చట మతములు అమ్మకానికి గలవు ! -
 
ఆలశించిన ఆశా భంగం ! వెంటనే త్వర పడండి !
 
ఈ స్కీము వివరాలు -
 
ఈ ఐ పీ ఓ ఆఫర్ అవకాశం డిసెంబర్ 31 2014 తారీఖు వరకు మాత్రమె !
 
ఇది క్లోజ్ ఎండెడ్ స్కీమ్ !
 
ఆ పై మతాలని కావాల్సిన వారు వాటిని ఉన్న వాళ్ళ దగ్గిరే కొనుక్కోవలసి ఉంటుంది !
 
మీ మతమును 'డీ మెట్' చేసుకొను సౌకర్యము గూడా గలదు !
 
మీరెన్ని మతములనైనాను తక్కువ ధరలో కొనుక్కోవచ్చు !
 
వాటి కి సరియైన మార్కెట్టు ధర పలికినప్పుడు వాటిని 
నిమ్మళం గా మీరు  అమ్మెయ్య వచ్చు !
 
డిసెంబర్ 31 దాకా మీరెన్నెసి మతాలని అయినా కొనుక్కోవచ్చు !
 
టోకు ధరలో కావాల్సిన వారు డైరెక్టు గా సంప్రదించిన వారికి డిస్కౌంటు కూడా కలదు 
 
ఓపెన్ డే - ఆఫర్ - ఒక మతము కొన్న మరొక మతము ఫ్రీ ( 1:1 బోనస్ ఆఫర్)
 
అంతే గాక - మన దేశం లో రాబోయే కాలం లో పుట్టే పిల్లలకి మతముల ఆవశ్యం అయినప్పుడు మీరు వాటిని వారికి ప్రీమియం ధరల పై అమ్మకం చేయ వచ్చు 
 
మీరు ఏదైనా కొత్త మతములని ఫ్లోట్ చెయ్య దలచు కున్న వాటి పేరు , ఆ మతాల గురించి పూర్ణ మైన రిలీజ్ డాకుమెంట్ తో సహా మా కందిం చిన వాటి కి కాపీ రైటు చేసే సర్వీసు కూడా కలదు !
 
ఆ పై వాటిని మీరు ఐ పీ ఓ (ఇనిషి యల్ పబ్లిక్ ఆఫర్ ) క్రింద మార్కెట్ కి రిలీజ్ చేసు కోవచ్చు .
 
 
 
భలే మంచి చౌక బేరము 
వేగిరమే త్వరపడండి !

Tuesday, December 23, 2014

బ్లాగ్ గాంధీ - కష్టే ఫలే వారి తో ముఖా ముఖీయం - జిలేబీయం !


బ్లాగ్ గాంధీ - కష్టే ఫలే వారి తో ముఖా ముఖీయం - జిలేబీయం !


పల్లెటూరిలో పుట్టి, వృత్తిరీత్యా పల్లెలలోనే గడిపి, పల్లెలోనే నివాసముంటూ తన కాలక్షేపం కబుర్లు ద్వారా ప్రపంచ వ్యాపితంగా అభిమానులను సంపాదించుకున్న కష్టే ఫలే శర్మగారు అభినందనీయులు.

పేరుకే కాలక్షేపం కబుర్లని వ్రాస్తున్నా మాయమైపోతున్న అనేక మంచి సాంప్రదాయాలను, మంచి విషయాలను ఆయన తన బ్లాగులో టపాలుగా మనకి అందించారు. 

వారి తో పల్లె ప్రపంచం వారి ముఖా ముఖీ పూర్తి గా ఇక్కడ 

శ్రీ కష్టే ఫలే బ్లాగు శర్మ గారి ఫోటో - చౌర్యం బాతా ఖానీ ఫణి బాబు గారి కైంకర్యం !



(శ్రీ శర్మ గారి ఫోటో కర్టసీ -
 (దీనిని తెలుగు లో చౌర్యం అందురు ) !-


 

Monday, December 22, 2014

An Option Strategy for Aurobindo Pharma !


An Option Strategy for Aurobindo Pharma !

After many days I am posting on this subject of Option strategy !

Currently Aurobindo Pharma is hovering around 1100+.

A proper Strategy of Option Call buy of 1100 at around 68 Rs and simultaneously selling 1140 Call at around 48 Rs (for a lot of 250) can be entered for January 29 th 2015 expiry.

This would have funds outlay of Rs.5000/- + brokerages (plus margin block on Call 1140 sell ) .

This could give a profit of Rs.5000/- max or loss of Rs.5000 max in the event of Aurobindo crossing 1140 by January 29th or touching 1100 or below by that date.

Strategy :

Buy 1100 call  at 68 Rs

Sell 1140 call   at 48 Rs.

Cash outflow 68-48 = 20 *250 = 5000/-


Cheers
Zilebi

Wednesday, December 10, 2014

రంగ నాయకమ్మ మహాభారత పరిచయం - జిలేబి వీర వాయింపు !


రంగ నాయకమ్మ మహాభారత పరిచయం - జిలేబి వీర వాయింపు !

ఈ శీర్షిక మీద టపా కట్ట కూడదను కున్నా !

కానీ ఎవరికి  వారు మన పురాణాల మీద (సో కాల్డ్ ఈ కాలం లో సులభం గా చెప్పే ఊత పదమైన 'పుక్కిటి' పురాణా ల మీద !) తమ తమ 'వికృతాభిప్రాయములను' తెలియ బరిచే టప్పు డు జిలేబి నువ్వు మాత్రం ఎందుకు తెలియ జేయ కూడదు నీ అభిప్రాయాలని అని మనస్సులో బీ లే జీ ని వదిలి పెట్టు అన్న ఒక 'సత్' సంకల్పం కలిగింది .

(సత్ సంకల్పం అంటే మంచి ఆలోచన అని అర్థం చేసు కోవచ్చు  - ఇందులో 'హిందూ త్వం' ఏమీ లేదు - విధవా అంటే తిట్టూ, విడో అంటే పొగడ్త అనుకునే కాలం లో మనం ఉన్నాం కాబట్టి ఈ వివరణ!)

ఒక రామాయణా న్నో, ఒక మహా భార తాన్నో 'భరతం' పట్టిస్తా అని నిర్ణయిం చు కున్నప్పుడు దాని ఒరిజినల్ వెర్షన్ చదివి వీర వాయింపు చేస్తే అది స్వంతం గా ఆలోచించి స్వంతమైన అభిప్రాయాలని చెప్పినట్టు అవుతుంది .

చాలా కాలం మునుపు రామాయణ కల్ప వృక్షం వచ్చినప్పుడు దానికి రిటార్టు గా రామాయణ విష వృక్షం కూడా వచ్చింది .

ఓరీ మనావిడ, విష వృక్షం అంటోంది కదా సరే పోనీ చదివి ఏడుస్తామని నిర్ణయిం చేసు కుని చదివి ఏడిస్తే , యాక్కు అని వాంతి వచ్చే పని అయ్యింది

భూతద్దం పెట్టి మరీ ప్రతి మాట కి వికృతా ర్థం తీయాలంటే తీయ వచ్చు ! అట్లాంటి ఒక రచన గా నాకు ఈ రంగ నాయకమ్మ గారి సో కాల్డ్ వివరణ అనిపించింది .

ఆరుద్ర గారే ననుకుంటా రామాయణం రంకు, భారతం బొంకు అని అన్నట్టు గుర్తు .? ఎవరు అన్నారో కాదు గాని,  ఆ స్టేట్ మెంట్ వారి 'way' of understanding that subject' అనుకోవాలి అంతే !

అట్లాగే ఇప్పుడు ఈవిడ , ఒక ఇంగ్లీషు అనువాదాన్ని, తెలుగు అనువాదాన్ని పెట్టేసుకుని తనదైన 'వికృత' స్టైల్ లో (విలక్షణ మైన శైలి అని మీరు భాష్యం చెప్పు కోవచ్చు !) దాన్ని విశ్లేషిస్తే చదవడానికి ఉత్సుకత ఉన్నవాళ్ళు, 'లా' పాయింటు లేవదీయాలని అనుకున్నవాళ్ళు చదవొచ్చు !

అట్లాగే, అందరూ టపాలు ఈ సబ్జెక్ట్ మీద కట్టేస్తున్నారు ,న నేను కూడా ఈ 'వికృత' పుస్తకం చదివి ఓ టపా కట్టేస్తే, కూసిన్ని కామెంటు మెతుకులు నాకూ పడతాయి కదా అని ఆనంద పడి పోయి, ఆశ పడి పోయి ఈవిడ గ్రంధ రాజాన్ని (రాజాన్ని అంటే మళ్ళీ ఎం సి పీ అనొచ్చు కాబట్టి ) గ్రంధ 'రాణి' ని చదివి తుస్సు మన్న , బుస్సుమన్న కస్సుమన్న ఓ ఇట్లాంటి టపా ఒకటి కట్టేయాలునుకున్నా !

"మనుషుల్ని పవిత్రులుగానూ- అపవిత్రులుగానూ  విభజించే ఏ రచన అయినా, స్త్రీలని సజీవంగా కాల్చి వెయ్యడాన్ని పవిత్రధర్మంగా చెప్పే ఏ గ్రంథం అయినా " బాడ్ అన్నది ఈవిడ వ్యాఖ్యానం !
అసలు రాజా రామ్ మోహన్ రాయ్ లేకుంటే ఈ ఆచారం దేశం లో కొనసాగి ఉండేదే మరి ? ( బ్రిటీషు వాడు రాకుండా ఉంటె అసలు రాజా రామ్ మోహన్ రాయ్ కి విశాల దృక్పధం వచ్చి ఉండేదా ?)

అంటే, సతీ సహ గమనం ఆ కాలం లో ఉన్నదని ఆ కావ్యం లో ఉంటె, ఆ కాలాన్ని రచయిత నిర్ద్వందం గా ఎట్లాంటి భేష జాలకి పోకుండా చెప్పేడు అని భావం గాని, దాన్ని చెప్పేడు కాబట్టి ఇది సో కాల్డ్  బ్యాడ్ గ్రంధం ఎట్లా అవుతుందో ఆవిడకే మరి తెలియాలి !

ఉదాహరణ కి, ఈ కాలం లో చదువులు ఎక్కువై పెళ్లి పెటాకులు ముదిరే కాలంలో చేసుకుని , టాప్ మని విడిపోయే వారి గురించి రాస్తే, అట్లాంటి ఓ పుస్తకం రాబోయే కాలం లో నిలిచి వుంటే, ఆ కాలానికి 'విడాకులు' సో కాల్డ్ అర్థం కాని విషయమై ఉంటె , అప్పుడు ఆ రాబోయే కాలం లో ఇప్పటి కాలానికి ప్రతీక గా నిలచిన గ్రంధం బ్యాడ్ ఎట్లా అవుతుంది ?

ఏదో రాసేస్తే చదివి సెహ భేష్ అనుకునే వాళ్ళు ఉంటారను కోవడం ఈవిడ గారి కి అబ్బిన విద్య !

ఓ ముప్పై ఏళ్ల మునుపు విష వృక్షం రాసినప్పుడు కాల గతులు వేరు (మన దేశం లో ). అప్పు డున్న యువత కి ఇప్పుడున్న  యు వత కి ఎంతో వ్యత్యాసం ఉన్నది . కాల గమనం లో ఇప్పుడున్న యువత ప్రపంచాన్ని చుట్టి వచ్చిన యువత . అంటే , విదేశాల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, అందులో క్యాపిటలిస్ట్ కి, కమ్యూనిస్ట్ కి మూల వ్యత్యాసం ఏమిటి, ఏ సమాజం లో అవి 'విరాట్' రూపం లో ఉన్నవో అదే సమాజం లో అవి నేల బారు ఐనవి అని కూడా తెలుసు .

అట్లా గే, మన సమాజ వ్యవస్థ లో ఎట్లాంటి మూర్ఖత్వాలున్నాయి, వాటి వెనుక నిజం గా ఏదైనా సైంటిఫిక్ టెంపర్ మెంట్ ఉందా లేక just pooh pooh' తూ తూ మంత్రా లేనా అని కూడా అర్థం చేసుకో గలిగిన ఈ తరపు యువత .

ఇట్లాంటి ఒక కాల ఘట్టం లో పురాతన స్టైల్ లో నేనూ ఒక lopsided  కుహనా విమర్శనా గ్రంధాన్ని రాస్తా , దాన్ని ఆ కాలపు విష వృక్షం లా జన సందోహం ఆదరిస్తుంది అనుకోవడం ఈవిడ గారికి కాలం చెల్లిన అభిప్రాయం మాత్రమె మరి .

ఇక ఆఖరి కామెంటు, ఈ పుస్తకం ధర సబ్సిడీ ని  (వంద రూపాయల పుస్తకం ) గమనిస్తే రెండు విషయాలు అర్థం అవుతాయి .

ఒకటి ధర ఎక్కువైతే దీన్ని కొని చదివే వాళ్ళు అసలు ఉండరని(కొని చదివే 'నాధు' లు)  వారి కి అనిపించి ఉండవచ్చు ,

కాలం చెల్లిన ఐడియా లకి కాణీ లు రాలవు-

కాకుంటే, ఏదైనా మత సంస్థలు దీని వెనుక ఉన్నాయి అనుకొవచ్చూ (ఈ నా ఊహ నిజం కాకూడ దని అనుకుంటా ! సర్వ విధాలా ఆశిస్తా.


కారాల మిర్యాల
జిలేబి 

Tuesday, December 9, 2014

(జిలేబి మహార్జాతక చక్రం)- శ్రీ కర్ణ గృహ గోధికా యోగము !


(జిలేబి మహార్జాతక చక్రం)- శ్రీ కర్ణ గృహ  గోధికా యోగము !



ఈ యోగ విశేష లక్షణ ములు !
 
శ్రీ = ధన ప్రాప్తి 
కర్ణ = (చెవి) దాన కర్ణ విశేషణాలు 
గృహ = ఇంటి యందే ఉండి మహార్జాతకాను గ్రహాన్ని పొంద డం 
గోధికా = బల్లి = (బల్లి యోగము!)
 
 
వెరసి = జిలేబి మహార్జాతక చక్రం లో ఈ శ్రీ కర్ణ గృహ గోధికా యోగము పట్టినది !
 
దీని వెల  అక్షారాల అమెరికను డాలరు 2 నలభై పైసలు !
 
భలే మంచి చౌక బేరము !
తక్షణమే గూగులిం చుడు !
 
మహర్జాతక యోగము మీకున్నూ దక్కును !!
 
నేటి జిలేబి జాతకావిష్కరణ ఇంతటి తో పరిపూర్తి !
 
దీనిని చదివిన వారికిన్,
(మీదు మిక్కిలి - ఉదారముగా కామేన్టిన వారికిన్ )
అన్ని శుభ శూచకములు ద్యోతకమగు ను !
 
నారదాయ నమః !
 
జిలేబి 


 

Sunday, December 7, 2014

(ఒన్స్ అగైన్) ఇచ్చట చచ్చి నో ళ్ళ జాతకం చూడబడును !

(ఒన్స్ అగైన్) ఇచ్చట చచ్చి నో ళ్ళ జాతకం చూడబడును !


ఇచ్చట టింకరింగ్ చెయ్య బడును 
ఇచ్చట కుట్టు లు, టైలరింగు చెయ్య బడును !ఇచ్చట చచ్చి నోళ్ళ జాతకం చూడబడును ఇచ్చట మొబైలు రిపైరు చెయ్య బడును
ఇచ్చట సైకిలు ట్యూబ్ కు పంక్చరు వేయ బడును

జిలేబి 

Saturday, December 6, 2014

భారత సేనలు హైదరాబాదు వెళ్ళిన 'తత్' క్షణాన !!

భారత సేనలు హైదరాబాదు వెళ్ళిన 'తత్' క్షణాన !!
 
ఆంధ్ర పత్రిక 1948 సెప్టెంబర్ 29


 
చీర్స్ 
జిలేబి 
 


 

Thursday, December 4, 2014

ఈ స్వామీజీ గురించి మీకెవరి కైనా తెలుసునా ?


ఈ స్వామీజీ గురించి మీకెవరి కైనా తెలుసునా ?

ఈ క్రింది ఫోటో ఆంధ్ర పత్రిక 1948 వ సవత్సరం ఫోటో; ఇందులో స్వామీజీ పేరు శ్రీ రామ లేఖానంద వారు . ఎంత గూగుల్ సెర్చ్ చేసినా ఈ విషయం మీద (అంటే ఈ స్వామీజీ సజీవ సమాధి తరువాయి మళ్ళీ జీవించారా గట్రా విశేషాలు ) దొరక లేదు !

మీ కేవరి కైనా తెలుసునా ??


From Andhra Patrkia 1948 February 25, ; A photo of Swami Rama Lekhananda (Hrishekesh) who went into samadhi under the ground for around 12 hours at Madras (present Chennai) and having been taken out from samadhi being given massage with ice cubes to bring back to life !

Does any one know who is this Swami Rama Lekhananda of Hrishekesh?

Interesting episode but I cannot find any relative google search on this incident;

Probably 1948 news papers would have carried some story about this event.

Some archive of news papers fellow journalists any that you can share ?


cheers
zilebi  

Tuesday, December 2, 2014

రావి శాస్త్రి వారి - నల్ల మేక - జూలు విదిలించిన జిలేబి 'సింగం' !!


రావి శాస్త్రి వారి - నల్ల మేక - జూలు విదిలించిన జిలేబి 'సింగం' !!

కౌరవ సైన్యాన్ని చూసిన ఉత్తర కుమారుడు రథం మీంచి గభీ మని గెంతి నట్టుగా, జీవహింస చేయాలనే కృత నిశ్చయం తో వస్తోన్న తోటమాలీ ని దగ్గరగా రానిచ్చి గోడమీంచి చెంగున రోడ్డు మీదికి ఉరికింది నల్లటి కుర్ర మేక.

తోట గల ఆసామీ తోట చుట్టూ దిట్టంగా ఎత్తుగా గోడ కట్టుకున్నాడు. కాని ఆ గోడకి ఒక చోట ఒక వార మునిసిపల్ చెత్త డబ్బా ఉంది . సరిగ్గా అక్కడే ఆ గోడకి ఒక ఇటిక జారింది . ఈ రెండు భోగట్టాలూ తోట గల ఆసామీ గమనించ లేదు .

నల్ల మేక గమనించింది.

నిచ్చన వేసుకొని స్వర్గానికి వెళ్ళినట్టుగా, చెత్త డబ్బానీ, ఇటిక జారిన సందుని ఆధారం చేసుకుని తోట గోడ ఎక్కింది నల్ల మేక .

పేరుకి పిట్ట గోడే కాని, నిజానికి ఆ గోడ చాలా ఎత్తుగా ఉంది. లోనికి గెంతుతే మళ్ళీ పైకి రాడానికి అటు వైపు చెత్త డబ్బాలూ, జారిన ఇటుకలూ లేవు. అందు చేత గోడ మీదనే నిల్చొని ,

"ఈ మనుష్యులు గడుసు వెధవలు " అనుకొంది నల్ల మేక.

నల్ల మేకం భారతం చదవలేదు. హరికథ లైనా వినలేదు. అందుచేత అది ఎరుగదు, గడుసు తనం లేని కుర్రవాడు అభిమన్యుడని ఒకడుండేవాడని .

మేకల్లో అభిమన్యుడి వంటి ది కా దీ మేక .

పద్మ వ్యూహం లా ఉండే ఆ తోటలో ప్రవేశిస్తే మళ్ళీ బైటికి రావడం కష్టమని గుర్తించిన నల్ల మేక , గోడ మీదనే నిల్చొని పస్తాయించి చూసింది


పూర్తి గా ....



చీర్స్
జిలేబి

Monday, December 1, 2014

నకలు జిలేబీలకు మోస పోవద్దు !!

నకలు జిలేబీలకు మోస పోవద్దు !!
 
పనికి మాలిన నకలు బీడీలకు మోస పోవద్దు !!
 
ఖాదర్ వారి తాజ్మహల్ బీడీ లనే వాడండి!!!
 
(ఇది బులుసు వారి కోసం స్పెషల్ !)
 
(మొన్న మధు మక్కీయం అంటే వారికి పాత రోజులు గుర్తు కోచ్చేయి!)

 
(ఆంధ్ర పత్రిక 1949 ఫిబ్రవరీ 16)

చీర్స్
జిలేబి