Wednesday, December 11, 2024

ఏకాదశి మోక్షద!

 

ఏకాదశి! మోక్షద! కృ

ష్ణా! కరుణామూర్తి! నినువినా లేదోయీ

సాకల్యము జీవితమున

మా కన్నయ్యవును నీవె మాకన్నియునూ!



జిలేబి.

గుండు మామి 

సర్వం గుండు మయమే.




50 comments:

  1. -
    ఏకాదశి! మోక్షద! కృ

    ష్ణా! కరుణామూర్తి! నినువినా లేదోయీ

    సాకల్యము జీవితమున

    మా కన్నయ్యవును నీవె మాకన్నియునూ!





    జిలేబి.

    గుండు మామి

    సర్వం గుండు మయమే.

    ReplyDelete
  2. -
    మార్గము భక్తి, ప్రపత్తి! సు
    దీర్ఘంబగు దారి సన్మతిని సరళమగున్
    వర్గచతుష్టయములు స
    న్మార్గమున గడింప గొలువు నలమేనిదొరన్



    ReplyDelete
  3. -

    గీతా జయంతి నేడ
    న్నా! తరియింప చదువవలె నన్నా భగవ
    ద్గీతా! శ్రీకృష్ణుడు కపి
    కేతనునికి మార్గము తెలిపె యశస్సునకై

    ReplyDelete
  4. -
    అసలేముంది సెలబ్రీ
    టిసులందు ? కరిష్మ కలదు! ట్వీట్చేస్తే వే
    లసుమములు ఫాలొ అవుతాయ్
    కిసుక్కనన్ పాటలంటు కిక్కేస్తాయ్రోయ్


    ReplyDelete
  5. -

    రామ! కమలదళనేత్రా!
    నీమమ్మై తండ్రిమాట నీ పదునాల్గేం
    డ్లామెడదలనే మాళిగ
    గా మాని వసించినావు కపిరథ! ప్రణతుల్


    ReplyDelete
  6. -

    ఎన్నో క్లాసో తెలుపం
    డన్నా హెచ్చెస్సి? ప్రక్క రాష్ట్రము వాడన్
    తిన్నగ తెలియవు వివరము
    లెన్నో భండారువారు లెస్స! వడివడిన్


    ReplyDelete
  7. -
    సామాన్యుల ప్రాణమ్ముల
    కే మాత్రము విలువలేదు! కేకల్ జైల్ఖా
    నా మన సెలబ్రిటీస్ వె
    ళ్తే మాత్రము! సీ! మనుషుల మేనా సీ! సీ!





    ReplyDelete
  8. తగ్గేదే లే :)

    లెక్కల మేష్టారొచ్చిరి
    పక్కాకాదండి లెక్క భండారని యెం
    చక్క అమెరికా విద్యల
    లెక్కల వివరించిరమ్మి లెస్సగ నేర్వన్




    ReplyDelete
  9. సూర్యోదయాత్పశ్చిమపు జ్ఞానోదయం

    అంతా నటులే!జీవిత
    మంతయు నటనే! నటించి మటుమాయమయే
    నంతయు యిదియె జిలేబీ
    వింత! నడుమ డబ్బు దాని విపరీతములున్



    ReplyDelete
  10. -

    కొత్త పుంతలు తొక్కుచు కొల్లగొట్టు
    చుండ్రి సైబరు దొంగలు చూచి వేడ్క
    గాంచు చుండ్రి పోలీసులు గట్టి తెలివి
    వారి దంచు నొప్పుకొనవె వారిజాక్షి


    ReplyDelete
  11. -
    రోగము జరముల నుండి పు
    రోగతి గాన వరమున్ కరుణయు వలయు రా
    మా! గంభీర! రఘువరా!
    మేఘశ్యామా! ప్రణతులు మేరుసమానా!



    ReplyDelete
  12. -

    ఆవిడ జనకుండే ప్రతి
    భావంతుడు చాచనెహ్రు! ప్రభువులు తలవం
    గా వరములకు కొదవగున్?
    సేవాతత్పరులకివిగొ జేజేలివిగో!


    ReplyDelete
  13. -
    తేజో రూప! పరాత్పర!
    శ్రీ జానకివల్లభా! సుశీలా! సులభా!
    నీ జాడనుకనుగొనను
    త్తేజమ్మునొసంగు దేవ దేవ! పరేశా!



    ReplyDelete
  14. -
    ఆరడుగుల శుభ మోహన
    శ్రీ రఘురామా! మనోజ్ఞ! సీతారమణా!
    వేరొక్కొండ్రుగలరయా
    నారాధింపంగ నినువినా దాశరథీ!



    ReplyDelete
  15. -

    సన్నాసులూ అదృష్టం‌వుంటే పరీక్షించుకొనండర్రా

    ఉండాలదృష్టమర్రా
    కొండాడుచు చదువనాదు పొత్తమునర్రా
    మెండగు జ్యోతిష్యవిషయ
    ఖండన మండనలుగలవు కాలగమనమై


    ReplyDelete
  16. -

    సొంటుశిఖామణులూ వె
    న్వెంట విజయ వాడ వెళ్లి నేర్వండీ క
    న్గంటగ పొత్తమ్మును కడ
    గంటా చదివి తరియించి కార్యోన్ముఖులై

    ReplyDelete
  17. -

    జంటగ వారిరువురు క్రీ
    గంటల చూచుకొనుచు తమకమ్మున మదియే
    మింటికెగయ ప్రేముడి యను
    మంటయు సరసమ్ములాడె మధురామృతమై




    ReplyDelete
  18. -
    మనసుకు మనసే శత్రువ
    నినాడు చెప్పిరి విదురులు నీవెన్నోజీ
    వనయానమ్ముల మేల్దా
    టిన తరువాయిన్ను దీనినేనమ్మదగున్ ?



    ReplyDelete
  19. -
    గత జన్మలపై వగచి వ
    నితామణీ యిప్పటి గతి నిసుమంతయుమా
    ర్చతరమగునోయి? శరణా
    గతిమార్గమె నీకు తగు వికాసమ్మునకోయ్


    ReplyDelete
  20. -
    భువనైక మోహనా రా
    ఘవా ! సుకరుణాంతరంగ! కపిరథ! జేజే
    లు! వినమ్రతతో మ్రొక్కెద
    ము విభీషణుశరణు దాత! మునిజన వరదా!

    ReplyDelete
  21. -

    మెలకువలో కనమనిరోయ్
    కలాము గారు కలను మన కార్యకలాపాల్
    కలలోనొక పాదంబీ
    యిల వైష్ణవ మాయరోయ్! మొయిళులే నభమోయ్


    ReplyDelete
  22. -

    అండగ నిలువుము రామా!
    మెండైన మధురపు పాటలెన్నియొ నీపై
    నిండుగ పోతన త్యాగ
    య్యాండవరులు పాడినారయా దాశరథీ!




    ReplyDelete
  23. -
    అది కాకూడదు పగటిక
    ల!దమ్ము పట్టినడిచి పనులన్ గావింపం
    గ ధవళ కాంతి ప్రకాశిం
    చు ధరణి తనదైన రీతి జూచును మనలన్



    ReplyDelete
  24. -
    నేనొక ప్రేమ పిపాసిని‌
    మానను ప్రేమించుటన్ సుమా రావె సఖీ
    మేను పులకరింపగ నా
    దైన విధముల నిను చేరెదన్ మదిరాక్షీ!



    ReplyDelete
  25. -
    మదిరాక్షి! మృగాక్షీ! కౌ
    ముది! భామిని! మించుబోడి!ముగుదా! కొమరా
    ల!ధవళనేత్రా! నాతుక!
    ముదితా! మెరుగారుబోడి! ముద్దులగుమ్మా !



    ReplyDelete
  26. -
    రాగసుధాంబుధి పోతన
    భాగవతము సేదదీర్ప పఠనాసక్తిన్
    రాగాలవాలవినుతా!
    త్యాగయ్య గళమున మదియు తనివిపడెనుగా!




    ReplyDelete
  27. నిజాయితీ పరులు

    పులిని జూచి నాకు పోడిమి గలదంచు
    వాత బెట్టు కొనుట వల్ల కాదు
    పుస్తకపు ప్రచురణ భూరిగా ఖర్చులు
    చేసి వెలువ రించు చేవలేదు



    ReplyDelete
  28. -
    నా పేరు తారుమార్లా
    యే! పాన్ కార్డునకు మేచి యే కాలేదం
    చా పేమెంట్లకు ప్రాబ్లె
    మ్మే పెట్టిరి బ్యాంకువారు వేంకట రమణా!



    ReplyDelete
  29. -
    ఇక ముఖ పుస్తకమున నే
    ను కనబడెద నమెరికా మనుజులారా పొ
    ల్టికలార్టికల్సు వ్రాసెద
    నికమీదటనచట వాలునిగనుడి త్వరగా
    .

    ReplyDelete
  30. రేడగుపించుట లేదు :)
    నిస్తబ్ధత ఏలుచుండె :)

    అతడొక విభుండు పద్యము
    లతనికి సులభమ్ము వ్రాయ లావణ్యముగా
    సతతమతడల్లగ విదురు
    లతనికి ప్రోత్సాహమున భళాయందురుగా



    ReplyDelete
    Replies
    1. బధ్ధకముగ లేచి , గద్దించి కసిరిన
      సతికి , నెస్ కాఫీ యొసంగి , మరలి
      బూష్టిచ్చి పిల్లల , కష్టకష్టాల్ వడి ,
      స్నానాదికముల వేసట ముగించి ,
      వంట జేసి , పొసగ  వడ్డించి బాక్సులన్ ,
      పిల్లలన్ స్కూళ్ళకు వెళ్ళ దిగిచి ,
      సతికి దోసెలు వేసి , శాపనార్థాల్ దిని ,
      మధ్యాహ్న బాక్సు ప్రేమారనొసగి ,

      చచ్చి చెడుచు , ఆఫీసుకు వచ్చిపడగ ,
      అచటనూ తిట్లతో చంపు ' ఆడబాసు ' ,
      వద్దురా , మోడరన్ ' మగవాళ్ళ ' వెతలు ,
      మహిళ 'మహరాణి' ఇంటి రామాయణమున .

      Delete
  31. -
    అది నీ తెగులు జిలేబీ
    కుదురుగ మాటాడరాదు కుంపటి నెప్పుల్
    వెదజల్లుచుండుటయె పని
    పదపద తల బొప్పిగట్టు పనులిట వలదే!



    ReplyDelete
  32. -
    రేడు నిదుర లేచె రేగుపద్యమ్ముల
    శరము లింక చూడ చక్కగా జి
    లేబు లున్ను వేయ లెస్సగా పూబోడి
    రావె రంగమందు రయ్యిమనుచు



    ReplyDelete
  33. -

    ఎక్కువ చెప్పేనా ? కై
    పెక్కువ గాన కనకమును పెంచి బలికి నే
    తక్కువ జేసేనా తల
    తిక్కగ కాంతమును బోనగిరిగారండీ


    ReplyDelete
  34. -

    రామ రామ ! నేనన్లే రేడు గారి పలుకుల్

    చచ్చి చెడుచు నాఫీసుకు
    వచ్చిపడగ నాడబాసు వదలదు తూటాల్
    గ్రుచ్చుచు పనిభూతము పై
    పెచ్చు జిలేబులను జుట్టి పీకున్ క్లాసుల్




    ReplyDelete
  35. -
    కాదండి! నాకు తెలివిడి
    లేదండీ రవికుమారు డెవరో! పుష్పా
    బోధనలు మంచివని ప్రతి
    పాదించుమనుజుల చూడ బాధ కలిగెగా!




    ReplyDelete
  36. -
    ఎవరూ పట్టించుకొనుట
    లె! విదురు లేడ్వంగ బోనగిరి చట్టంచున్
    ప్రవచించిరి మీ కెడ లే
    రవంతయున్ మేటరంచు రాధనమిదియే !



    ReplyDelete
  37. -
    నువ్వేడుస్తో యెదుటో
    ళ్లవ్విధమేడ్వంగ కోరుతావె ఘృతాచీ!
    కొవ్వెక్కెనీకు దర్పము
    దవ్వుల్దాటెకదుటే విధవిధమ్ములుగా



    ReplyDelete
  38. -

    పనియేమి పరుల తోడుగ
    మనకున్ ? విబుధ! పరమాత్మ మనవైపుండెన్
    మన దారి రాజమార్గము
    మనమద్దారిని నడచెదమండీ విదురా



    ReplyDelete
  39. -

    నమో మాతా నమో నమ:!

    మాతే! నిర్మల! పాప్కార్న్
    జ్ఞాతే జీయెస్టి సూక్ష్మతాని కరాగ్రే!
    యేతాని శాత తాం ప్రతి
    శాతాం విజ్ఞానదాయి! శఠగోపమిదే!



    ReplyDelete
  40. -
    శంకరులు చెప్పినది ఆ
    వంకన మన తాతగారు సందేశముగా
    యింకను చెప్పినదియు బ్లా
    గాంకముగా నొక్కటే! సఖా బోనగిరీ!



    ReplyDelete
  41. -

    జాల్రా వేయవే జాంగ్రీ :)

    హరిపాదము పట్టుకొనగ
    మరెవ్వరిదవసరమేది ? మా రాజన్నా!
    సరిగా వేదాంతమ్మును
    గరిపిరి మాకందరికి సఖా ప్రణతులయా



    ReplyDelete
  42. -
    చలి రొంప దగ్గు జ్వరమా
    పులకరము పిలవక నే గబుక్కున వచ్చాయ్
    కలవరమూ ప్రేలాపన
    తలపై నెక్కుచు సవారి తాజేసెనయో!



    ReplyDelete
  43. -
    జరిగి తే జ్వరమంతటి సౌఖ్యమిద్ధ
    రణిని లేదు! విషమువలె రాధనమ్మొ
    సంగు భైషజమున్ లేదు! సక్క గోచి
    బక్కటి యుసురు పోవుట వంటి కష్ట
    మసలు లేదరయ పడిశ మది పది కడ
    గండ్ల పెట్టు బ్లాగ్విదురుల గట్టిమాట



    ReplyDelete
  44. -
    తలపు పరమాత్మ పై మీ
    కు లగ్న మయె తాతగారు కుడి యుమ్మలముల్
    కలలోనైనన్ వెతలను
    కలిగించునకొ తమకున్ సఖా శర్మాజీ



    ReplyDelete
  45. -
    వేదవిదులు! మీరరయని
    సాధ‌నలు గలవొ? రఘుపతి సన్నిధి‌ మీద
    య్యా! దమ్మున ప్రాణాయా
    మాది మదిని జపము నేమమైచేయదగు‌న్


    ReplyDelete
  46. -
    అసలే తుఫాను బాధిత
    మిసతేలని ఊరు ! జలుబు మించారక ముం
    దు సవరపు భిషజు కలవడ
    ము , సరియగున్ శర్మగారు ముందస్తుగనే



    ReplyDelete
  47. -
    దివికేగె సింహమొక్కటి
    సువిశాలపు దేశము విడచుచు మౌనముగా
    ద్రవియించె వైవి యారుడు
    నివాళి యర్పించుచున్ ప్రణితపాదముగా



    ReplyDelete
  48. -

    ఒక్కొక్కసారి సింహం
    బొక్కటిగా కాక మౌన మునిగా కూడా
    చక్కగ ముస్తాబై యెం
    చక్కగ తలనూపుచున్ ప్రధానిగ వచ్చున్

    ReplyDelete
  49. -.

    ఓ పాఠకులూ! సూచన!
    మా పంచవటి ప్రచురణలు మాకందంబై
    మా పొత్తమ్ములు బాగుం
    టే పదపడి సెక్రటరిని ట్వీటి కలువుడీ


    ReplyDelete