Wednesday, December 11, 2024

ఏకాదశి మోక్షద!

 

ఏకాదశి! మోక్షద! కృ

ష్ణా! కరుణామూర్తి! నినువినా లేదోయీ

సాకల్యము జీవితమున

మా కన్నయ్యవును నీవె మాకన్నియునూ!



జిలేబి.

గుండు మామి 

సర్వం గుండు మయమే.




28 comments:

  1. -
    ఏకాదశి! మోక్షద! కృ

    ష్ణా! కరుణామూర్తి! నినువినా లేదోయీ

    సాకల్యము జీవితమున

    మా కన్నయ్యవును నీవె మాకన్నియునూ!





    జిలేబి.

    గుండు మామి

    సర్వం గుండు మయమే.

    ReplyDelete
  2. -
    మార్గము భక్తి, ప్రపత్తి! సు
    దీర్ఘంబగు దారి సన్మతిని సరళమగున్
    వర్గచతుష్టయములు స
    న్మార్గమున గడింప గొలువు నలమేనిదొరన్



    ReplyDelete
  3. -

    గీతా జయంతి నేడ
    న్నా! తరియింప చదువవలె నన్నా భగవ
    ద్గీతా! శ్రీకృష్ణుడు కపి
    కేతనునికి మార్గము తెలిపె యశస్సునకై

    ReplyDelete
  4. -
    అసలేముంది సెలబ్రీ
    టిసులందు ? కరిష్మ కలదు! ట్వీట్చేస్తే వే
    లసుమములు ఫాలొ అవుతాయ్
    కిసుక్కనన్ పాటలంటు కిక్కేస్తాయ్రోయ్


    ReplyDelete
  5. -

    రామ! కమలదళనేత్రా!
    నీమమ్మై తండ్రిమాట నీ పదునాల్గేం
    డ్లామెడదలనే మాళిగ
    గా మాని వసించినావు కపిరథ! ప్రణతుల్


    ReplyDelete
  6. -

    ఎన్నో క్లాసో తెలుపం
    డన్నా హెచ్చెస్సి? ప్రక్క రాష్ట్రము వాడన్
    తిన్నగ తెలియవు వివరము
    లెన్నో భండారువారు లెస్స! వడివడిన్


    ReplyDelete
  7. -
    సామాన్యుల ప్రాణమ్ముల
    కే మాత్రము విలువలేదు! కేకల్ జైల్ఖా
    నా మన సెలబ్రిటీస్ వె
    ళ్తే మాత్రము! సీ! మనుషుల మేనా సీ! సీ!





    ReplyDelete
  8. తగ్గేదే లే :)

    లెక్కల మేష్టారొచ్చిరి
    పక్కాకాదండి లెక్క భండారని యెం
    చక్క అమెరికా విద్యల
    లెక్కల వివరించిరమ్మి లెస్సగ నేర్వన్




    ReplyDelete
  9. సూర్యోదయాత్పశ్చిమపు జ్ఞానోదయం

    అంతా నటులే!జీవిత
    మంతయు నటనే! నటించి మటుమాయమయే
    నంతయు యిదియె జిలేబీ
    వింత! నడుమ డబ్బు దాని విపరీతములున్



    ReplyDelete
  10. -

    కొత్త పుంతలు తొక్కుచు కొల్లగొట్టు
    చుండ్రి సైబరు దొంగలు చూచి వేడ్క
    గాంచు చుండ్రి పోలీసులు గట్టి తెలివి
    వారి దంచు నొప్పుకొనవె వారిజాక్షి


    ReplyDelete
  11. -
    రోగము జరముల నుండి పు
    రోగతి గాన వరమున్ కరుణయు వలయు రా
    మా! గంభీర! రఘువరా!
    మేఘశ్యామా! ప్రణతులు మేరుసమానా!



    ReplyDelete
  12. -

    ఆవిడ జనకుండే ప్రతి
    భావంతుడు చాచనెహ్రు! ప్రభువులు తలవం
    గా వరములకు కొదవగున్?
    సేవాతత్పరులకివిగొ జేజేలివిగో!


    ReplyDelete
  13. -
    తేజో రూప! పరాత్పర!
    శ్రీ జానకివల్లభా! సుశీలా! సులభా!
    నీ జాడనుకనుగొనను
    త్తేజమ్మునొసంగు దేవ దేవ! పరేశా!



    ReplyDelete
  14. -
    ఆరడుగుల శుభ మోహన
    శ్రీ రఘురామా! మనోజ్ఞ! సీతారమణా!
    వేరొక్కొండ్రుగలరయా
    నారాధింపంగ నినువినా దాశరథీ!



    ReplyDelete
  15. -

    సన్నాసులూ అదృష్టం‌వుంటే పరీక్షించుకొనండర్రా

    ఉండాలదృష్టమర్రా
    కొండాడుచు చదువనాదు పొత్తమునర్రా
    మెండగు జ్యోతిష్యవిషయ
    ఖండన మండనలుగలవు కాలగమనమై


    ReplyDelete
  16. -

    సొంటుశిఖామణులూ వె
    న్వెంట విజయ వాడ వెళ్లి నేర్వండీ క
    న్గంటగ పొత్తమ్మును కడ
    గంటా చదివి తరియించి కార్యోన్ముఖులై

    ReplyDelete
  17. -

    జంటగ వారిరువురు క్రీ
    గంటల చూచుకొనుచు తమకమ్మున మదియే
    మింటికెగయ ప్రేముడి యను
    మంటయు సరసమ్ములాడె మధురామృతమై




    ReplyDelete
  18. -
    మనసుకు మనసే శత్రువ
    నినాడు చెప్పిరి విదురులు నీవెన్నోజీ
    వనయానమ్ముల మేల్దా
    టిన తరువాయిన్ను దీనినేనమ్మదగున్ ?



    ReplyDelete
  19. -
    గత జన్మలపై వగచి వ
    నితామణీ యిప్పటి గతి నిసుమంతయుమా
    ర్చతరమగునోయి? శరణా
    గతిమార్గమె నీకు తగు వికాసమ్మునకోయ్


    ReplyDelete
  20. -
    భువనైక మోహనా రా
    ఘవా ! సుకరుణాంతరంగ! కపిరథ! జేజే
    లు! వినమ్రతతో మ్రొక్కెద
    ము విభీషణుశరణు దాత! మునిజన వరదా!

    ReplyDelete
  21. -

    మెలకువలో కనమనిరోయ్
    కలాము గారు కలను మన కార్యకలాపాల్
    కలలోనొక పాదంబీ
    యిల వైష్ణవ మాయరోయ్! మొయిళులే నభమోయ్


    ReplyDelete
  22. -

    అండగ నిలువుము రామా!
    మెండైన మధురపు పాటలెన్నియొ నీపై
    నిండుగ పోతన త్యాగ
    య్యాండవరులు పాడినారయా దాశరథీ!




    ReplyDelete
  23. -
    అది కాకూడదు పగటిక
    ల!దమ్ము పట్టినడిచి పనులన్ గావింపం
    గ ధవళ కాంతి ప్రకాశిం
    చు ధరణి తనదైన రీతి జూచును మనలన్



    ReplyDelete
  24. -
    నేనొక ప్రేమ పిపాసిని‌
    మానను ప్రేమించుటన్ సుమా రావె సఖీ
    మేను పులకరింపగ నా
    దైన విధముల నిను చేరెదన్ మదిరాక్షీ!



    ReplyDelete
  25. -
    మదిరాక్షి! మృగాక్షీ! కౌ
    ముది! భామిని! మించుబోడి!ముగుదా! కొమరా
    ల!ధవళనేత్రా! నాతుక!
    ముదితా! మెరుగారుబోడి! ముద్దులగుమ్మా !



    ReplyDelete
  26. -
    రాగసుధాంబుధి పోతన
    భాగవతము సేదదీర్ప పఠనాసక్తిన్
    రాగాలవాలవినుతా!
    త్యాగయ్య గళమున మదియు తనివిపడెనుగా!




    ReplyDelete
  27. నిజాయితీ పరులు

    పులిని జూచి నాకు పోడిమి గలదంచు
    వాత బెట్టు కొనుట వల్ల కాదు
    పుస్తకపు ప్రచురణ భూరిగా ఖర్చులు
    చేసి వెలువ రించు చేవలేదు



    ReplyDelete
  28. -
    నా పేరు తారుమార్లా
    యే! పాన్ కార్డునకు మేచి యే కాలేదం
    చా పేమెంట్లకు ప్రాబ్లె
    మ్మే పెట్టిరి బ్యాంకువారు వేంకట రమణా!



    ReplyDelete