మా అయ్యరు గారు దారి పోయారు ! కనబడ్డారా మీకేమైనా ?
పొద్దుటే లేచి భయభక్తుల తో అయ్యరు గారి కాళ్ళకు మ్రొక్కి ఆ పై గాని తన పద్య ప్రహసనం లో పడని జిలేబి,
నిదుర లేచి చూస్తే మంచం పై అయ్యరు గారు కన బళ్ళే
గుండె గొంతుకలో కొట్లాడింది జిలేబికి.
ఇంత పొద్దుటే అయ్యరు గారెక్కడ పోయేరబ్బా అనుకుని అటూ యిటూ చూసి జానాబెత్తెడు ఇంటి ని మొత్తం గాలించి గాలించి అలసి సొలసి కన్నుల్లో కన్నీళ్లు ఉబికేస్తోంటే ముక్కు చీదేసు కుంది !
హయ్యో !హయ్యో! నిన్న రేతిరి కూడా అయ్యవారు పక్కనే కదా ఉన్నారు !
వారిని ఓ మాటై నా అనలేదే ! ఇట్లా హఠాత్తుగా గాయబ్ అయిపోయారే రాత్రికి రాత్రి !
లైఫ్ లైన్ నూట పదహారు కి ఫోన్ చేద్దామా అనుకుని బెంబేలు పడి పోతూంటే దైవేచ్చ గా
"నా మొబైలు చార్జెరు ఎక్కడ పోనాది ; ప్రశ్న వేసి చూసా" కనిపిస్తే హా హా హా ! మా అయ్యరు గారు ఎక్కడ పోయేరనిప్రశ్నిస్తే చాలనుకుని
అయ్యరు అయ్యరు ఎక్కడ మీరు అని ప్రశ్న వేసుకుని సమయం చూసుకుంది - ప్రొద్దుట నాలుగు గంటల నాలుగు నిమిషాల నాలుగు సెకన్లు ! బ్రహ్మ ముహూర్తం !
ప్రశ్న వేసిన సమయానికి చార్టు లాగింది జూనియర్ జ్యోతిష్ నించి !
నోరు నొక్కేసు కుంది ఆ చార్టు అనాలిసిస్ చూసి !
హయ్యో హయ్యో ! ఇంత మోసమా ! ఇంత మోసమా !
ఏమండీ ! అయ్యరు గారు ఎక్కడ పోయారు మీరు ! ఇట్లా సన్యాసాశ్రమం మీకు సబబా ! హయ్యో హయ్యో !
దబ్బున మంచం మీది నించి క్రింద పడిన శబ్దం !
చెవుల దగ్గిర జిలేబి జిలేబి అన్న ఆతురత తో కలిసిన శబ్దం !
ఏమండీ ! అయ్యరు గారు మీరెక్కడ ! మీరెక్కడ ! హిమాలయాల్లో ఉన్నారా ! అంటూ వాగేస్తున్న జిలేబి ముఖం మీద కూసింత మంచి నీళ్ళు ప్రోక్షించి అయ్యరు గారు తట్టి లేపారు !
ఆ చల్లని జిల్లను నీటి కి నిదుర వీడి చూసింది జిలేబి
జానా బెత్తెడు ఇంటి లో జాన కన్న తక్కువ మంచం పక్కన తను క్రింద పడి ఉంది ! అయ్యరు గారు పరామర్శిస్తున్నారు !
హమ్మ ! ఇది నిద్రా ! కలా !
హా హా ! జిలేబి
ఏమాయెన్ బో లోకం !
అయ్యరు వాళ్ ! మీరు హిమాలయాల కెళ్ళి పోయేరని కల గన్నా ! చెప్పింది జిలేబి ఆందుకే ఈ ఆతురత!
ఓ నా పిచ్చి జిలేబి ! అట్లాంటి యోగం నాకీ జన్మలో లేదని నువ్వు నన్ను కట్టు కున్నప్పుడే తెలిసి పోయిందే ! అట్లా ఎట్లా కలగంటావు అని అయ్యరు గారు అంటే ,
హా హా మగడంటే మా అయ్యరే గా అని మురిసిపోయి జిలేబి మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చేసి 'అయ్యర్వాళ్ ఓ మంచి కాఫీ పట్టు కు రండి ఇవ్వాళ శంకరాభరణం లో దత్తపది వ్రాయాలి ; అతిరుచిరము తో ఓ జిలేబి వేస్తా అంటూ ఆర్డర్ వేసేసింది జిలేబి యథా ప్రకారము గా !
హా ! నా జ్యోతిష్య మా ! జిలేబి కతల కు కూడా పనికి రాకుండా పోయేవా !
చీర్స్
జిలేబి
నారాయణ నారాయణ !