జిలేబి కి పెళ్ళి కళ వచ్చేసిందోచ్!
అప్పుతచ్చు. ఈ మధ్య చాలా అప్పు తచ్చు లు వచ్చేస్తున్నాయి. ఆ మధ్య భారారె గారికి ఏప్రిల్ ఒకటో తారీఖు లోగా సంక్రాంతి కి కొత్త గా ఓ ఫన్ ఆర్ట్ విత్ జేకె రాస్తానని చెప్పాను. ఏప్రిల్ లో సంక్రాంతి ఏమిటి మీకెమైనా మతి పోయిందా జిలేబి, లేక రమ్ము ఎక్కువ తాగారా అని చీవాట్లేసారు ఆ మహానుభావుడు.
అరే చాలా అప్పుతచ్చు లు జరుగుతున్నాయే సుమా అని సరే అప్పుతచ్చు మీదే ఒక టపా రాద్దామని నిదురలోకి జారుకుంటే, పిల్లి కలలో కొచ్చేసింది.
పెళ్లి కళ అన్నానా ? అప్పు తచ్చు.
పిల్లి కల (లోకి) వచ్చెసింది. అదీ విషయం.
పిల్లి ఈ వైపు నించి ఆ వైపు వెళితే శాస్త్రం చెబుతారు.
ఇలా పిల్లి కలలో వచ్చిన ఏమి అగును ? జీడిపప్పు ఉప్మా తినే యోగం కలుగునా ?
(దీనికి సమాధానం చెప్పగలవారు నాకు తెలిసి ఒక్కరే ఒక్కరు ఉన్నారు, కాని వారు ఇలాంటి చచ్చు ప్రశ్నలకి ఆస్కారం ఇవ్వరు - కాబట్టి ఏమి చెయ్యలేం. )
జీడిపప్పు యోగం అంటే జ్ఞాపకం వస్తోంది- నేను నవలలు గట్రా చదివే రోజులలో (అంటే నా చిన్నప్పుడన్నమాట) ఝాన్సీ రాణీ గారో, కాకుంటే మరొకరో ఎవరో నాకు సరిగ్గ గుర్తు లేదు, వారి నవలల్లొ టిఫిను మాట వస్తే , ప్రతిసారీ జీడిపప్పు ఉప్మాయే టిఫిను అయ్యేది నవల మొత్తం మీద.
ఝాన్సీ అంటే గుర్తుకొస్తోంది, హిందీ - నవలిక ఝాన్సీ కీ రాణీ లాంటి గొప్ప పుస్తకం వేరొకటి నేను చదివింది లేదు.
హిందీ అంటె గుర్తుకొచ్చేది దక్షిణ భారత హిందీ ప్రచార సభ.
మద్రాసు పట్టణం లో ఉండేది మేము చదివే రొజులలో. ఆ తరువాయి, జై ఆంధ్రా సమయం లో హైదరాబదు కి వచ్చిందనుకుంటాను. ఖచ్చితం గా తెలీదు. హైదరాబాదీలు చెప్పాలి.
జై అంధ్రా అంటే గుర్తుకొస్తొంది, జై ఆంధ్రా మూవ్మెంటు. (ఇప్పుడు తే నా లంగా మూవ్మెంటు అంటున్నారు- ఇది విడదీత, అప్పటిది కలబోత అనుకుంటాను)
జై ఆంధ్రా అంటే, , మా వీధి బడి వద్ద పెట్టిన వినాయక బొమ్మ జ్ఞాపకం వచ్చెస్తోందండోయ్. అప్పుడు వీధి బడి కాడి వినాయకుని బొమ్మ వద్ద కూర్చుని మేము 'ఉణ్ణావరిదం ' ఉన్నాము జై ఆంధ్రా మూవ్ మెంటు కోసం.
కడుపు మాడబెట్టటానికి అనగా ఉపవాస దీక్ష కు అరవం లో 'ఉణ్ణావరిదం' అన్న పేరు.
ఉపవాసం అంటే, అన్నా హజారే గారు యాద్గారోన్ మే ఆ రహెన్ హై !
యాద్గారే అంటే, చిన్నప్పటి మా పెళ్లి (జిలేబి వెడ్స్ జంబు నాధన్- అని పెద్ద అక్షరాలతో కలర్ చాక్ పీసు తో బ్లాకు బోర్డు మీద అప్పుడు రాసి పెట్టడం కూడా గుర్తుకొస్తోంది సుమా) గుర్తుకోచ్చేస్తోంది. (మా కాలం నో నియాన్ దీపాల కాలం మరి )
అబ్బో, పెళ్లి అంటే మళ్ళీ జిలేబి కి పెళ్లి కల, పెళ్లి కళ రెండూ వచ్చేస్తూన్నాయి.
హమ్మయ్య, back to square one!
ఇంతకీ నెనక్కడున్నాను ?
అంతా జిలేబి మయం గా ఉందే ఇక్కడ ?
ఇదేమి విష్ణు మాయయో? కలయో నిజమో తెలియని అయోమయములో ?!
చీర్స్
జిలేబి.