"ఏమోయ్ రాధా , మా బులుసు గారి, మరిన్ని బ్లాగువాళ్ళ కథల్ వేసుకున్నావ్ ! మరి నా టపా ఒక్కటి కూడా ప్రచురించ లేదే ?"
మా మనవడు రాధ ని నిలదీసి ఇవ్వాళ అడిగాను. అడగటమే కాదు కడిగేసాను కూడా.
"ఇదిగో , బామ్మ, ఆల్రెడీ ప్రాబ్లెం లో వున్నాను, మధ్య లో నీ సోదేమిటి ?" అన్నాడు మా రాధ.
"ఆయ్ అంత మంది బ్లాగర్ల లిస్టు ఇచ్చాను నీకు వాళ్లదంతా టపాలు సర్ప్రైస్ గ పబ్లిష్ చెయ్య వోయ్ అని - కొత్త సంవత్సరం లో వాళ్ళంతా సంతోష పడతారు అని . దాంతో బాటే నాదీ పబ్లిష్ చేస్తావనుకున్నానోయ్ మనవడా " అన్నా ఉన్న చనువుతో .
"అన్నావు, మరి ఆ లిస్టు లో నీ బ్లాగు ఎందుకు చేర్చ లేదు నువ్వు ?" చికాకుగా ముఖం పెట్టాడు వాడు, "తప్పు నాది కాదు, ఆ లిష్టు ది "
"చెప్పాగా, నీకు తెలిసిన ముసలవ్వనేగా నా టపా ప్రింటు చేస్తే నీ కేం పొయ్యేది ?" అడిగాను డిమాండు చేసి.
"ఇదిగో బామ్మా, అసలే ప్రాబ్లెం లో వున్నా, మరీ చీకాకు పెట్టకు " చెప్పాడు రాధ.
"ఏమిటోయ్ నీకొచ్చిన తంటా" ?
"వాళ్ళందరూ ధ్వజం ఎత్తారు నా మీద "
"ఎవరూ?"
"వాళ్ళే"
"ఏమని "
"ఇలా మాకంతా చెప్పా పెట్టకుండా ఎట్లా నువ్వు ప్రచురిస్తావోయ్ మా టపా లని అని "
"చెప్పొచ్చు గా జిలేబి చెప్పింది ఆవిడ భరోసాతోనే చేసానని "
"ఆ మాటా చెప్పా"
"ఏమన్నా రేమిటి ?"
"జిలేబి ఎం చెబ్తే అదే చేస్తా వా ? అయితే జిలేబి టపా ఎందుకు వెయ్యలేదు అని క్రాస్స్ ఎగ్జాం చేసారు "
"ఓహ్ మై గాడ్, మరి నువ్వేం చెప్పావ్"
"ఎం చెప్పమంటా వే, అసలు బుర్ర పనిచెయ్యడం లేదు "
"ఏదో ఒకటి చెప్పి నీ తంటాలు నువ్వు పడు. కాదూ, కూడదనుకుంటే , చెప్పేయి అందరకీ క్షమాపణలు "
"అంతే అంటావా ?"
"అంతే "
"నా తరపున నువ్వే చెప్పెయ్య రాదటే బామ్మా "
"ఎం నే నెందుకు చెప్పాలి అంట ?"
"నువ్వే కదా ఆ లిష్టు ఇచ్చింది - అందుకే "
"ఆశ దోస, అప్పలం వడ ! నేనెందుకు చెప్పాలోయ్, అధమ పక్షం నా టపా పెట్టి వుంటే, పోనీ లే మనవాడే కదా అని కొంత సిఫారిసు చేసే దాన్ని, కాకుంటే నీ తరపున క్షమాపణలు అడిగే దాన్ని"
"మళ్ళీ మొదటికే వచ్చావ్ ?"
"చెప్పు క్షమాపణలు దాని కి ముందు " అన్నా. "నా టపా ఎందుకు పెట్టలేదు ? "
"నీ టపా లో హెడింగ్ లో ఎం పెట్టావ్ ?"
"When its Hot its Really Cool "
"అది తెలిసిందే లే ఆ తరువాత ?"
"Copyright © 2008-2020. All rights reserved"
"సో, ?"
"సో , బామ్మా - నువ్వెంత హాట్ వైనా ట్వెంటీ ట్వెంటీ నీతో ఆడలేనే "
"ఓహ్ మై గాడ్, పోనీ వాళ్ళందరికీ పారితోషికం ఇస్తావా లేదా ? "
"తప్ప కుండా ఉంటుందే బామ్మా "
"మరి దాన్తోటే వాళ్ళు నీ మీద మా రాజీ అడ్వొకేటు గారిని కేసు పెట్టమంటే ?"
"ఓహ్ మై గాడ్ "
అడ్వొకేటు రాజీ గారు, మీకు కొత్త సంవత్సరం కి సరి కొత్త కేసు వచ్చేసింది. ఆల్ ది బెస్ట్!
చీర్స్
జిలేబి.