Wednesday, January 4, 2012

అద్దానికి బురఖా

అద్దం ముందు నిలబడ్డాను
నీవేనా అంది

ఎం నేను కానా ?
కొన్నేళ్ళ ముందు నా ముందు వున్నావ్
అప్పుడూ ఇదే ప్రశ్న అడిగావు
ఎందుకీ ప్రశ్న మళ్ళీ ఇప్పుడు ?

అద్దం నవ్వింది
నేనాలనే ఉన్నా
ఏమిటో నిన్ను చూపించేటప్పుడు
మారి పోతున్నా
ఎందుకో ?

నువ్వు నా ప్రతి బింబం అంతే
నాతొ వాదించకు
అద్దానికి బురఖా కప్పాను

.

చీర్స్ 
జిలేబి.

10 comments:

  1. అద్దానికెందుకు, మనంతొడుక్కుంటే పోలా

    ReplyDelete
  2. నేను:-> అద్దం ముందు నిలబడ్డాను

    అద్దం:-> నీవేనా అంది

    నేను:-> ఎం నేను కానా ?
    కొన్నేళ్ళ ముందు నా ముందు వున్నావ్
    అప్పుడూ ఇదే ప్రశ్న అడిగావు
    ఎందుకీ ప్రశ్న మళ్ళీ ఇప్పుడు ?

    అద్దం :-> :) నేనాలనే ఉన్నా
    ఏమిటో నిన్ను చూపించేటప్పుడు
    మారి పోతున్నా
    ఎందుకో ?

    నేను:-> నువ్వు నా ప్రతి బింబం అంతే
    నాతొ వాదించకు
    అద్దానికి బురఖా కప్పాను


    Please

    ముసుగు వేయొద్దు మనసు మీద ....

    ?!

    ReplyDelete
  3. A few days before

    http://teranaameksahara.blogspot.com


    Heart Touching & sad ending love story (Happend infront of the god)

    అది చదివి తన్మయమై,

    అది ఒక real time వేదంతిక్ గ్రంథం వలె కనిపించింది ఆ క్షణంలో
    (but it is not a spiritual book)
    మొత్తానికి చదివిన వెంటనే అనుబంధ చతుష్టయం రాసి రచయితకి mail చేసాను.

    తర్వాత maro copy కోసం వెళ్లి నప్పుడు కూడా ఇదే భావన (same feel )
    కరచాలనం తో congrats చెప్పాలా? లేక కనిపించని కన్నీటిని తుడవాల?


    ?!

    ReplyDelete
  4. @కఫే మాష్టారు,

    భళారే, బురకా 'మనం' తొడుక్కో కూడదండీ '!!


    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  5. @?! శివ గారు,

    ఇది అద్దం కథ. కాబట్టి మనసుకి ముసుగు వెయ్యాల్సిందే !

    Mirror, Mirror on the wall, who is the most beautiful woman in the world? కథ చదివుంటా రనుకుంటాను!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  6. @?! శివ గారు,

    నెనర్లు ఆ లింకుకి.

    तू ही सहारा,

    बिन तेरा जीवन निराला

    हो जावे जीवन तेरी चरणों में ,

    हे मालिक, तू हे मेरी सहारा!


    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  7. @భాస్కర్ గారు,

    అప్పుడప్పుడు సమీరం లా వచ్చే మీ అభినందలకి నెనర్లు!!

    హ్యాపీ న్యూ ఇయర్ టు యు సర్ !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  8. మా ఇంట్లో అద్దం కూడా ఇంతే, పదేళ్ళ క్రితం ఎంత అందంగా చూపించేదని...మారని అద్దాలు దొరికితే బావుణ్ణు...

    ReplyDelete
  9. @జ్యోత్హిర్మయీ వారు,

    ఇది 'ఆదాము' వేదము! 'ఈవ్' టైం అద్దము ఖబుర్లు !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete