Friday, December 21, 2012

మోడీ మస్తాన్ !


 
మోడీ మస్త్ 'ఆన్'!
 
మోడీ మస్తాన్ !
 
Modi Must On!
 
Jayaho Bhaarath!
 
cheers
zilebi.

Thursday, December 20, 2012

మీటింగ్ మిస్టర్ సుబ్బూ ఇన్ ముంబై (సుబ్బూస్ wisdom !)

మీటింగ్ మిస్టర్ సుబ్బూ ఇన్ ముంబై (సుబ్బూస్ wisdom !)

హలో మిస్టర్ సుబ్బూ, హాశ్చర్యం మీరెక్కడ ఇట్లా ముంబై లో దర్శనం ? ముంబై లో సుబ్బూ ని చూసి ఆశ్చర్య పోయా

'ఆ ప్రశ్నే నేనూ మిమ్మల్ని అడుగుదా మానుకున్నా, జిలేబమ్మా ! మీరెక్కడా ఇట్లా ముంబై లో ? తిరుగు ప్రశ్నా బాణం సంధించాడు సుబ్బు.

'అబ్బా, ప్రశ్న కి ప్రశ్న సమాధానం కాదోయ్ '  అన్నా.

'సర్లెండి, అట్లా గుజరాత్ వెళ్లి మోడి , మస్త్ ఆన్ గా ఉన్నాడో లేదో చూసి ఇట్లా తిరుగు ముఖం పట్టా, ' ఈ  మారు నేరుగా సమాధానం చెప్పాడు సుబ్బు.

అవునా, మరి గుజ్జూ భాయీ లె లా ఉన్నారోయ్? మోడీ ని మస్త్ ఆన్ లో పెట్టేరా ? Is he must on again? ' అడిగా.

మోడీ గురించి చాలా విని వున్నా, చదివి ఉన్నా గాని, నేరుగా ఇట్లా సుబ్బూ వెళ్లి చూసొస్తే ఆతని తో మాట్లాడిన జ్ఞానం పెంపొందించు కోవడం మరీ గొప్పే గా.

'జిలేబమ్మా , మోడీ మరో మారు  రాజ్యానికే అంకితం అయి పోయాడు, ప్చ్, పెదవి విరిచాడు సుబ్బూ.

అదేమిటి సుబ్బూ, మోడీ గుజరాత్ ఒకరికి ఒకరు సరి జోడు కాదా మరి ? అడిగా.

'అవుననుకోండీ , అయినా, తన మీద దేశానికి ఎన్నో ఆశలు ఉన్నాయి. తాను ప్రధాని అవుతాడని ' చెప్పాడు.

'అవుననుకో, దానికీ దీనికీ లంకె ఏమిటో ? గుజరాత్ తరువాయి దేశానికి కూడా అవ్వొచ్చు గా? ' చెప్పా.

జిలెబమ్మోయ్ , ప్రస్తుతం మోడీ 'ఫార్మ్ ' ఉన్నాడా ?

అవును కదా మరి ?

ఇట్లా, 'ఫార్మ్ ' ఉన్నప్పుడే కదా ట్వెంటీ ట్వెంటీ ఆడగలడు ఎవడైనా?

'అవుననుకో, అయితే?' అడిగా.

ప్చ్, మళ్ళీ ముఖ్య మంత్రి అయ్యాక రాజ్య భారాలు ఎక్కువవు తాయి కదా తనకి ?

అవుననుకో... ఈ మారు సంశయం గా అన్నా.

అటువంటప్పుడు తను రాజ్యం లో నే కదా తన శక్తి యుక్తులని కేంద్రీ కరిస్తాడు ?

తలూపా.

'ప్చ్, దేశానికి మరో ప్రధాని ని వెతుక్కోవలసిందే మరి' సుబ్బూ ఖరారు చేసేడు.

'సుబ్బూ... మన తిరపతయ్య ఉన్నాడు గా... ' చెప్పా.

జిలేబమ్మోయ్ , మీరు ఇట్లా బ్లేడు జోకులు కూడా వేస్తారా అన్నాడు మిస్టర్ సుబ్బు సీరియస్ గా.

'బ్లేడు '
జిలేబి
ముంబై musings!

Wednesday, December 19, 2012

ఆవుకి మేత పెట్టండి, పుణ్యం మూట కట్టు కోండి (అనబడు నగదు బదిలీ కథ)!

ఆవుకి మేత పెట్టండి, పుణ్యం మూట కట్టు కోండి (అనబడు నగదు బదిలీ కథ)
 

మా అమ్మే, మా తల్లే, ఏమి బుర్ర రా బాబు ముంబై కర్ లకి అనుకోకుండా ఉండ లేక పోయా!

అయ్యరు గారు, నేనూ కలిసి మాటుంగా వెళితే, అక్కడో పెద్దావిడ , ముఖాన ఐదు రూపాయల బిళ్ళంత (పూర్వ కాలం లో 'రూపాయ బిళ్ళంత ' కుంకుం బొట్టు అనేవారు, ఇప్పుడు, ఇన్ ఫ్లేషన్ ఎక్కువై పోయింది కదండీ అందుకని అన్న మాట , ఐదు రూపాయలంత బొట్టు అనడం) కుంకుం బొట్టు పెట్టి, ముందర ఆవుకి కావలసినంత మేత, దాణా పెట్టు కుని ఉంది. ఆవిడ ఎదుట ఓ మాంచి  బొద్దైన ఆవు మేత మేస్తోంది.

మా అయ్యరు వేష కట్టు చూసి 'సామీ, మాడు కు సాప్పాడు పోడు , పుణ్యం వరుం' అంది వచ్చీ రాని అరవం లో.

ఇద్దరికీ అర్థం కాలే. చూస్తే ఆవిడ ఆవు లా ఉంది అక్కడ ఉన్న ఆవు. ఆవిడ మేత  పెట్టు కోవాలి గాని మేము పెట్టడం ఏమిటి అని హాశ్చర్య పోయా.

'అంబ దు  రూబా, ఒరు కట్టు, మస్తు పుణ్యం , ఐనూరు రూబా క్కూడ  పన్న ళాం , आप को माता जी पूर्ण आशीर्वाद देंगे '

ఔరా, ఈవిడ తెలివే తెలివి!. ఆవు తనది, దాణా తాను పెడితె అది ఆవిడ కర్తవ్యం. మనం పెడితే పుణ్యం ! కర్తవ్యానికీ పుణ్యానికీ  మధ్య వ్యత్యాసం సో, నగదు బదిలీ అన్న మాట అనుకున్నా.

సో, కొంత డబ్బు పెట్టి ఆవుకి మేత పెట్టి కూసింత మూట పుణ్యం కట్టు కున్నాం.

'మాతాజీ ఉంగలుక్కు భలా కరే ' అంది ఆవిడ.

నగదు బదిలీ కి ఇంత మహత్వం ఉన్నదన్న మాట !

మరి , దేశ మాతాజీ, నగదు బదిలీ కార్యక్రమం లో ఎంత పుణ్యం వస్తుందో మరి ! అబ్బా, ఊరికే అన్నారా, మేరా భారత్ మహాన్ అని, భారత దేశం కర్మ భూమి అని !

పుణ్యం సంపాదించు కోవడం మరింకా ఏ  దేశం లోనూ కుదరదు సుమీ భారత దేశం లో కుదిరి నంతగా !


చీర్స్ 
జిలేబి 
ముంబై musings!

Tuesday, December 18, 2012

పారి పోయిన పరువం

 
పారి పోయిన పరువం - ఇది ఒక సామాజిక స్పృహ కలిగిన కవిత


ముందో వెనుకో కాదు, నన్ను నడిమధ్య కాల్చి 
భారమైన ఇసుక పాతర వేసి నాకు నువ్వు చేసిన ద్రోహం 

నా కనుల కన్నీళ్ళ లో ఈదులాడే భావాలని 
మది తెలిపే వ్యధ గా నీకు వినిపిస్తున్నా దుష్మన్,  నీ కోరిక పై 

వణికే పెదవులు చలికి కొరికే సు కుంటూ 
చెప్పనా వద్దా అన్న సంశయం లో నేను 

చిట్లిన పెదవుల పై కారప్పొడి అద్దాలని నువ్వు 
నడుమ నగ్న చలి దూరి కట్టని కరిచేస్తూం టే 

 నువ్వే నా దుష్మన్ అయినా వన్న ఎద రొదలు 
చెప్పకనే చెప్పిన పోలీసు జులూం లై చెవిని కోయగా 

అది ఎరిగిన నువ్వు హత్యావేశం తో  పెను మంటై రగిలి 
ఎల్ల లెరుగని కోపానికి హద్దులు ఏమీ లేవంటే 

ఒక వైపు నిరాకరించే మనసుకు 'కాముణిజాం ' వచ్చి 

సుదూర మృత్యు తీరాలకు నే పారి పోవాలంటే 
ఆలోచిం చంటూ  తీరని వ్యధలు వెనక్కు లాగ

తెర వెనుక నగ్న బోమికనై నేను బోరు మంటూంటే 

నా నిస్సహాయతను నువ్వు నడి రోడ్డున నిర్వీర్యం గావిస్తే 
సంఘం బట్ట బయలైన పరువం గా గుసగుసలాడగా

బంధించే ఈ భాధ్యతలేలని తెంచుకుని పారి పోనా 
తెగించి  కాదని కట్టుబాట్లచెరసాలలో పుప్పోడై పోనా ?

ఛ ,రాస,
ఛీ లే, బి.

Monday, December 17, 2012

పనిలేక ... కాలక్షేపం కబుర్లు ... డోంట్ 'బీలేజీ' !


పనిలేక ... కాలక్షేపం కబుర్లు ... డోంట్ 'బీలేజీ'
 

సుబ్బు హటాత్తు గా కాలక్షేపం కబుర్లు శర్మ గారిని రోడ్డు పై చూసి అచ్చెరు వొందేడు.!

పంతులు గారూ, మీరు ఇట్లా రోడ్డున పడ్డా రేమిటీ  ?

పంతులు గారు టోపీ పెట్టి భుజానికో బ్యాకు ప్యాకు జమాయించి, మంచి సోగ్గుడ్డ , ఉత్తరీయం పంచకక్షం కట్టి కాళ్ళకి ఆడిదాస్ షూస్  తో దర్శనం ఇవ్వడం తో ఈ మాడరన్ మానీషుని గమనించి 'दांतों तले उंगली दबाया'!

'ಅದು ಏನಂತ ರೆ, ನನಗೆ, ಒಂದು ಹೊಸವಾಗಿ ಉದ್ಯೋಗ ಸಿಕ್ಕಿದ್ದು'  చెప్పారు శర్మ గారు.

వామ్మో అదేమిటండీ మధ్యలో కన్నడం లో కి మారి పోయేరు ?

అదేమిటోయ్ సుబ్బూ, మన పక్క దేశమే కదా 'కర, నాటకం' ?

అంటే ?

చేతులు ఖాళీ గా ఉంచడ  మెందు  కానీ, ఓ కొత్త ఉద్యోగం లో చేరి పోయానోయ్, అదే, ఈ 'కర' నాటకం' !

శర్మ గారూ, ఈ వయసులో మీకిది తగునా ?

అదేమిటోయ్, ఆ జిలేబీ గారు ఈ వయసులో 'సబ్బాటికల్  నించి మారి మళ్ళీ ఉద్యోగం లో కి వెళ్ళ  గా  లేనిది, మరి మేము వెళ్ళ  కూడ దంటావా  ?

సుబ్బూ కి అసలు ఈ ఫండా అర్థం కాలేదు

సుడిగాలిలా మాయమై మళ్ళీ సుడిగాలిలా పనిలేక కాస్త తీరిగ్గా కూర్చుని ఉన్న డాటేరు  రమణ గారి ముందు ప్రత్యక్ష మయ్యెడు.

రమణ మావా కాఫీ , తల తిరిగి పోతోంది.

ఇదిగో, సుబ్బూ, తల తిరిగి పోయేంత పని నీ కేముందోయ్ ?

మావా,  ఈ మధ్య రీటైర్ అయిన వాళ్ళంతా బ్లాగ్ లోకాని కి వచ్చి టైం  పాస్, టీం  పాస్ చేసు కుంటున్నా రా ?

కాదా మరి  ఎంత మంది అట్లా లేరు ? అబ్బా , నా కు రీటై ర్ మెంటు దొరికి తేనా , నేను హాయిగా దుప్పటి లాగించి నిదుర పోయే వాణ్ణి

ఈ రీటైర్ మెంటు వాళ్ళంతా ఒక్కరొక్కరుగా మళ్ళీ ఉద్యోగం లోకి వెళ్లి పోతున్నారు మావా !

ఆ మధ్య జిలేబీ అట్లా చెప్పింది . మళ్ళీ ఇప్పుడేవరోయ్  ?

అదే, మన పంతులు గారు లేదూ... కాలక్షేపం వారు వారు కూడా రోడ్డు న పడ్డారు ! మావా ఇదేమి చోద్యం ? హాయిగా రీటైర్  మెంటు వయసులో 'రెస్టు' తీసు కో కుండా ఇట్లా వీళ్ళంతా మళ్ళీ ఉద్యోగం లో కి వెళ్ళటం ?

అదే బెటరోయ్ , డాక్టరు ఉవాచ !

ఎందుకో మరి ?

పని లేక ఉంటే బుర్రలు ఖాళీ అయితే, దాని పీత బాధ లు ఎక్కువోయ్ !

అబ్బా, మావోయ్, పనిలేక పొతే, బుర్రలు ఖాళీ అయి ఉంటే, అన్ని విధాల ప్రాబ్లెమ్స్ ఒస్తాయంటావా  ?

కాదా మరి ?  An idle man's brain is a devil's workshop!'

సింగపూరు మాజీ ప్రధాని, లీ క్వాన్ యూ ఏమన్నాడో తెలుసా ?

చచ్చేంత దాకా అసలు పని చెయ్యడం మాన కండి . ఎంతో కొంత పని చెయ్యండి, మీరు వయసులో ఉన్నప్పుడు చేసినంత గా కష్ట పడ  నక్కర లేదు. కానీ 'పార్ట్ టైం ' పని చెయ్యండి, చలాకీ గా ఉండండి' అన్నా డోయ్ ! అంతే గాక, మీరు చేసే పని వల్ల  మీ మానసిక ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుం దని  ఆయన ఉవాచ !

సో, కష్టే ఫలే ! డోంట్  బీలేజీ ! 'పని లేక' ఉండ కోయ్  సుబ్బూ.



చీర్స్
జిలేబి 

Friday, December 14, 2012

ఔను వాళ్ళిద్దరూ 'వాడి' పోలేదు ! (ఔను వాళ్ళిద్దరూ విడి పోయారు - భాగం రెండు )


"అయ్యరు  వాళ్  నాకు విడాకులు కావాలి" మా అయ్యరు  గారి చెవిలో పోరు పెట్టు కుని చెప్పా. చెప్పా అనడం కన్నా ఆర్డర్ వేసా అని అనడం సబబు.

'దానికేమోయ్ , విడి ఆకులే కదా మన పత్తి  శెట్టి గారి కొట్టు కెళ్ళి  పట్టు కొస్తా , ఈ మధ్య విడాకులు రావటం లేదట , మార్కెట్ లో, కుట్టిన విస్తరాకుల నించి పుల్లల్ని తీసి విడాకులు ఇవ్వమం టా '  అన్నారు మా అయ్యరు  గారు

నాకు భలే కోపమొచ్చింది.

'ఆయ్ , విడాకులు అంటే వేళా  కోళ మై పోయిందా మీకు ' ఇంతెత్తు కు ఎగిరా .

వారి ముందు లాపు టాపు  పెట్టి, బులుసు వారి టపా చూపించా.

'అసలే నాకు కళ్ళు కనబడి చావడం లేదే ఇట్లా తెలుగు బ్లాగులు చదవటమంటే ఎట్లాగే ? అని మసక బడ్డ కళ్ళా ద్దల లోంచి చూసేరు.

చ, చ, ఈ సోడా బుడ్డి నా నే ప్రేమించింది అని నన్ను నేనే తిట్టు కున్నా.

'ఏమోయ్, జిలేబీ, ఏమన్నా నన్నన్నావా ఇప్పుడు ' ఓ చెవి నా వైపు పెట్టి కొంత ప్రశ్నా మార్కు పెట్టేరు అయ్యరు .

చ, చ, ఈ మానవుడికి చెవులు కూడా వినిపించడం లేదు మరీ పోను పోను.

'మళ్ళీ, చెవిలో గట్టిగా చెప్పా, 'నాకు విడాకులు కావాలి '

ఈ మారు కొంప మునిగేటట్టు ఉందని ఓపిగ్గా, టపా చదివేరు అయ్యరు .

'ప్రభావతీ ప్రద్యుమ్నుల్లా మనమూ విడి పోదామం టా వేమిటే  ? ' అడిగేరు .

హమ్మయ్య ఇప్పటికి ఈ మట్టి బుర్ర లో ట్యూబు లైటు వెలిగింది అని సంతోష పడి  పోయి, 'అవునని' తలూపా.

'అదేమిటే నువ్వట్లా, వెళ్లి పొతే నీకు వంటా వార్పూ చేసి పెట్టేదెవరే  మరి ? '

'అబ్బా, ఈయనికి హోటలు బిజినెస్సు, వంటా వార్పూ వచ్చని ఇన్నేళ్ళు గా వంట చెయ్యడం నేర్చుకోక పోవడం, ఎంత తప్పై  పోయింది సుమీ ' అని బిక్కు మని, కొంత, సేద తీరుకుని,' ఆ, ఏముందీ, ఆ ఓల్డ్ ఏజ్ హొమ్ లో వాళ్ళే, గంట కొట్టి భోజనం పెడతారులే ' అన్నా.

అన్నా గాని, మా అయ్యరు  గారిలా వంట చేస్తారేమో వారు తెలీలే. ఎంతైనా, ప్రభావతీ ఉంటుంది కదా కాస్త మాట తోడూ ఉంటుంది  అనుకుని, కొంత ఊరట పడ్డా.

'సర్లేవే, నువ్వడి గినది నేన్నెడైనా  కాదన్నా నా. అట్లాగే విడి పోయి ఉంటాం లే. ' అంటా  రని  కొంత ఆశ తో ఎదురు చూసా.

చెళ్ళు  మని, చెంపకాయ దెబ్బ పడింది.

'మీ ఆండోల్లకి చదువు నేర్పించట మంత  బుద్ధి తక్కువ పని వేరే ఏమీ లేదు ' సూటిగా చూసేరు అయ్యరు  గారు.

అవాక్కై పోయా.

ఈ మాట అయ్యరు  గారేనా, అదీ, జిలేబీ తోనే నా అన్నది ? హమ్మో, కొంత దడ  పుట్టింది.

జీవన వసంతం లో , తను చెప్పింది ఎప్పుడూ జవదాటని, రామచంద్రుడు, ఇవ్వాళ, సీతమ్మ తల్లికి ఎదురు చెబ్తాడా అని కుడి కన్ను అదిరింది

'ఇదిగో, చూడవోయ్ జిలేబీ, ఏదో బ్లాగులు, టపాలు రాసుకుంటూ టీం పాస్ టైం  పాస్ చేసుకుంటూ, ఏదో 'ఉద్యోగం 'ఇస్త్రీ' లక్షణం' అని చెబ్తే, పోనీ లే ఊరుకున్నా. ఇట్లా విడాకులూ, పెడాకులూ  అన్నా వంటే, నీ ఒళ్ళు పెట్రేగి పోతుంది' ఈ మారు కొంత సీరియస్ గా చెప్పేరు

అబ్బా, ఈ పురుషాహంకారం వీళ్ళకి తగ్గనే  తగ్గదు సుమీ ' అని ఉస్సూరు మన్నా.

అంతే  నంటారా ? విడాకులు ఇవ్వరా మరి ?

'జిలేబీ, నీకు విశ్రాంతే  కావా లను కుంటే, ఇంట్లో కూర్చుని వంటా వార్పూ చేసుకో. ఉద్యోగం మానేయ్ '

హమ్మో, వంటా వార్పే, వద్దే వద్దు సుమీ ! , ఈ ఉద్యోగమేదో చేసుకుని అయ్యరు  గారి మీద ఆజమాయిషీ చేసుకుంటూ ఉండటమే బెటరు ! ఏదో ఒక్క ముక్క 'విడాకు' కోసం ఇట్లాంటి సౌలభ్య మైన 'భరించు వాడు' భర్త
ని పోగుట్టు కోవ డమా ! వద్దే వద్దనుకుని'

అయ్యరు  వాళ్ , ఇవ్వాల్టి 'సమయల్ ' ఏమిటి ? మళ్ళీ ఆర్డర్ వేసా.

నీకిష్టమైనా జిలేబీ చేశా నోయ్ ~

అబ్బా, ఈ పెనిమిటి ప్రెభువులు  మన మూడ్ ని బట్టి తాజా మరీ చేస్తారు సుమీ అనుకుని, నోరు వెళ్ళ  బెట్టేసా.


చీర్స్
జిలేబి.

Thursday, December 13, 2012

చాగంటి జిలేబీయం - విశాఖా విశేషాలు

చాగంటి జిలేబీయం - విశాఖా విశేషాలు

ఈ మహానుభావుడు జిలేబీ  'కాలం' లో తప్పి పుట్టాడు సుమీ అనుకున్నా.

చాగంటి వారి ధర్మసోపానం ప్రవచనం విన్నాక జిలేబీ రాయక పొతే, అదీను అమావాస్య నాడు టపా ముట్టక పోతే తప్పే తప్పు అదీ కాకుండా, శ్రీ కష్టే ఫలీ బ్లాగ్ 'గారడీ' గాంధీ గారు , వనజ వనమాలీ గారు జిలేబీ ని తలచిన శుభ దినమాయే కూడాను ఇవ్వాళ ! మరి !

ఓ నాలుగు రోజులు పై బడి శ్రీ చాగంటీ వారి ప్రవచనాన్ని విన్న తరువాయి 'కర్ణములు ' హోరెత్తి పోయేయి.

భద్రం కర్ణే భి శృణు యామ దేవా అని ఊరికే చెప్పారా ఋగ్వేదం  లో  మరి ?

ఇంతకీ వీరికి ఈ వాక్పటిమ ఎట్లా అబ్బింది సుమీ అని అబ్బుర పడి పోయా !

మనకు ఒక్క వాక్యం రాయాలంటే నే అంత కష్టం గా ఉన్నదే మరి , ఈయన ఒక్క పదం తప్ప కుండా ఇట్లాంటి పొడుగాటి వాక్యాలు ధారాళంగా , అలవోకగా అల్లుకు పోతాడే సుమీ అని మా అయ్యరు  గారిని అడిగా

ఏమండీ ఇదెట్లా వీరు అనర్గళం గా అల్లుకు పోగలుగుతారు  ? అన్నా

'వాక్శుద్ది  మనో నైర్మల్యానికి సిద్ది ప్రతీక '  అని ఒక్క ముక్క లో చెప్పేసేరు నాకర్థం అయ్యే రీతిలో అయ్యరు  గారు.

సరే,ఏది ఏమైనా వీరు జిలేబీ సమకాలీకులు గా వడం  జిలేబీ చేసు కున్న పుణ్యం సుమీ అని సంతోష పడి పోయా !

అట్లాగే మన పంచ దశ లోకం లో అలవోకగా టపాలు రాసి గారడీ  చేసే శ్రీ కాలక్షేపం శర్మ గారు ఓ సంవత్సరం పై బడి దినం తప్పక టపాలు రాసేరు కూడాను !

అబ్బో, ఈ గోదావరి తీరం వాళ్ళని గురించి ఎంత రాసినా తక్కువే సుమండీ మరి !

చాగంటి వారు కూడా గోదావరీ తీరం వారేనా ?

ఇంతకీ , మాయన్ కాలెండరు ఇరవై ఒకటి రావడానికి ఇవ్వాళ అమావాస్య  సంసిద్ది పడు తోంది ! వేచి చూడాలి మరి .(ఆలోచనా తరంగాలు సత్య నారాయణ శర్మ గారు ఏమి చెబ్తారో మరి !)


స్వస్తినః  పూశాః విశ్వ వేదాః !


జిలేబి

Sunday, November 25, 2012

బోల్ జిలేబీ !


మీ పేరేమిటి ?

జిలేబి .

అదేమిటీ ముసల్మాను పేరా ?

జిలేబీ స్వచ్చమైన పేరు !

అట్లా కాదు లెండి, ఈ జిలేబీ అన్నది ముసల్మానులు మన దేశానికి వచ్చేక వారితో బాటు వచ్చిన చిరు తిండి గదా ఇట్లా మీరు జిలేబీ అంటే , కొంత సందేహం వచ్చింది

మాకో కజిన్ ఉన్నదండోయ్ , దాని పేరు....

దాని పేరు ?

జిల్లాలంగడి జాంగ్రి !

వాట్ !

వాట్ కాదు, జాంగ్రీ!

అదీ ముసల్మాను పేరే ?

అదేమిటండీ ఎ పేరన్నా ముసల్మానే అంటారు ? పోనీ బాదుషా పెట్టుకో మంటారా ?

బాదుషా ? నా !

పోనీ కోవా ? పాల కోవా ?

కోవా ?

వ్వా, వ్వా, ఏ  పేరు పెట్టుకున్నా ఎదో ఒక వంక పెడతారే !మరి


 సరే, తిరుపతి లడ్డు, పయణి పంచామృతం ఇట్లా ఏమన్నా పెట్టు కో మంటా రా ?

వద్దు లెండి!

సరే అఅయితే, మీరే ఏదో  ఒక పేరు తగలేట్టండీ మరి !


చీర్స్
జిలేబి

Friday, November 23, 2012

మిటాయి పొట్లం కాగితం వెర్సెస్ బిట్స్ అండ్ బైట్స్ !

మిటాయి పొట్లం కాగితం  వెర్సెస్ బిట్స్ అండ్ బైట్స్ !

'ఏమోయ్ జిలేబీ పూర్వాశ్రమం లో నీ కళా 'ఖండా లని' పత్రిక, జ్యోతీ లలో చూసు కోవాలని అహరహము కష్ట పడే దానివి. ఈ మధ్య ఆ వైపే వెళ్ళడం లేదేమిటి ?' అడిగారు మా అయ్యరు  గారు.

'మిటాయి పొట్లం' కాగితాలకి విలువ పొయిం దండీ అన్నా దర్జా గా.

ఏమిటోయ్  విషయం?

'కొన్నేళ్ళ క్రితం 'స్వాతి'  మార్కెట్ కొచ్చి పత్రిక జ్యోతీ లని ఎట్లా ఊడ బెరికిం దండీ ?'

'ఏముందీ వాడు మిటాయి పొట్లాన్ని 'మిర్చీ పొట్లం' గా, 'సాఫ్ట్' సయనాగారపు రసరమ్య వేణీ  గా 'దక్' దక్ దక్ నే లగా  మేరా దిల్ ... మోర్ నే లగా గా బాజీగర్ చేసేడు' చెప్పారు ఆలోచించి.

కాదా ? అంటే, హాల్ టేబుల్ టాప్ స్టేటస్ సింబల్ పత్రిక, ఒడిలో సయ్యాట లాడింది, కొంత కాలం దాక హాల్ టేబుల్ టాప్  పై పెడితే 'అబ్బే, వీరు ప్లే బాయ్ చదువు తారండో య్ అన్నట్లు అయ్యింది. ప్లే బాయ్ గొప్పదనం అప్పుడు ఏమిటి? స్వీప్ ది మార్కెట్ , కాదా మరి?

ఇప్పుడు భళీ బ్లాగులు, నా జిలేబీ లని వేసుకోవడానికి తీరిగ్గా నా సమయం లో రాసుకోవ డానికి  అసలు ప్రచురిస్తారా , లేదా అని 'చింత' లేకుండా మనకు మనమే రాసేసు కుంటూ ఆహ్ ఈ పాటి సౌలభ్యం ఇంకే మైనా ఉందం టారా  ? ' అడిగా.

కాదా మరి ?

కాబట్టి, మిర్చీ పొట్లం కాగితం హుష్ కాకీ !

మరి ఈ బిట్స్ అండ్ బైట్స్ చాన్నాళ్ళు ఉంటుం దంటావా ? ఆ అమెరికా వాడు దివాలా తీస్తే నీ గతేం గాను ?

'ఆ మనం రాసే రాతలకి ఏ 'గో' 'దారి' అయితే నేం ? అయితే మిటాయి పొట్లం కాగితం . కాకుంటే లాస్ అఫ్ బిట్స్ అండ్ అండ్ బైట్స్ అంతే గదా !' కాల గతిలో అన్నీ ఎనెర్జీ ఫార్మ్స్ మాత్రమె గదా ? 'energy can neither be created nor destroyed'!


(వనజ వనమాలీ గారి టపా చదివాక!)


చీర్స్
జిలేబి.

Wednesday, November 21, 2012

ధమాల్ ధమాల్ డబాల్ డబాల్ !

ధమాల్ ధమాల్ డబాల్ డబాల్ !

ఏమోయ్ మనవడా, అంత విచారం గా ఉన్నావ్ ? అడిగా మా వాణ్ని, ఇంటికి వస్తూనే ఉస్సురు మన్నాడు వాడు.

వచ్చింది అర్ధ రేతిరి దాటి.

చేసే పని 'పాడు' మాలిన (పని పాటా లేని అనాలా లేక పాడు మాలిన పని అనాలా?) ఐటీ ఉద్యోగం. దేశాన్ని  అభివృద్ధి కి తెచ్చిన 'సాఫ్ట్ 'వేరు' బ్యాక్ ప్యాకు మానవుడు!

'ప్చ్' అన్నాడు.

ఏమిరా అన్నా?

'నేను ప్రో ఏక్టివ్ కాదటే ' అన్నాడు వాడు.

అంటే ఏంట్రా మనవడా ? అడిగా.

' అంటే, నేనన్ని ట్లో నా అంతగా చొరవ గా దూసు కెళ్ళడం లేదటే ? '

అంటే ?

అంటే, తెల్ల మొగం పెట్టాడు వాడు.

పోనీ లేరా భోజనం చేసి పడుకో  అన్నా

ఆకలి లేదే అన్నాడు ' ఈ ఇయర్ నా బోనస్ ధమాల్ ధమాల్ డబాల్ డబాలే' విచారం గా ముఖం పెట్టేడు.

వాణ్ని గమనించా.

నిండా ఇరవై నాలుగు కూడా దాటలేదు. మానవుడికి ఇంకా పెళ్లి కూడా కాలేదు. నడి సంద్రం లో నావ లా, చుక్కాని లేని పడవలా తెల్ల ముఖం పెట్టి ఉన్నాడు. ప్రపంచం లో ని భారం మొత్తం వాడి తల మీదే ఉన్నట్టు ఉంది.!

ప్చ్..

"We had everything, twenty years go, but just little of everything and yet we were happy. Now, we have more of everything, but little is gratifying the soul"

జిలేబి.