స్వామి వారడిగేరు - దేవీ పద్మావతీ టైమెంత ?
అమ్మవారు అలవోకగా చేతి గడియారం వైపు చూసింది.
రిస్ట్ వాచు లో స్వామి వారు జగజ్జేగీయ మానం గా కనబడ్డారు.
అబ్బా, వీరి సొబగే సొబగు! ప్చ్! స్వామి వారిని మాత్రం ఆ స్విస్సు వాడు గడియారం లో పెట్టేడు. తన్నో, మంగ తాయారు నో కూడా చేర్చి ఉండ వచ్చుగా ? ఊహూ !
'ఎందుకో' ఎప్పుడూ టైమెంత అనని అయ్యవారు ఇట్లా ఈ వాచీ వచ్చినప్పటి నించి గంట కో మారు టైమెంత అనడం మొదలెట్టేరు !
'ఊరికే నే లే . టైం ఎంతో తెలుసు కుందా మని . అంతే మరే ప్రత్యేకతా లేదు ' చెప్పేరు స్వామి వారు.
అబ్బబ్బా, ఏమి బడాయి ఈ స్వామీ వారిది ? ఆ గడియారం కంపెనీ వాడు, స్వామి వారికి ఓ గడియారం బహుమానం క్రింద ఇస్తే, స్వామీ వారు తన చేతికి కట్టి పద్మా బాగుందా అన్నాడు.
స్వామి వారి ముఖ వర్చస్సు అందులో చూసి 'ఆహా' అని అనుకో కుండా ఉండ లేక పోయింది పద్మావతీ దేవి.
చదువరీ, ఇంతకీ ఇట్లా స్వామి వారు ప్రతి గంట కీ అమ్మవారి ని టైమెంత అని ఎందుకు అడిగినట్టు ?
చీర్స్
జిలేబి.